నేను last post లో చెప్పిన దానిలో చిక్కుంది.
అదేంటంటే higher energy source లో కలిసిపోవడం ముక్తి, నిర్వాణం అయితే మరి దానికి శరీరాన్నిఆధీనంలోనికి తెచ్చుకుని, బుధ్ధిని ఇంతలా వికసింపచేసి ముక్తి పొందడం ఎందుకు? నువ్వు
చెప్పేది ఒక పధ్ధతి. నేను ఆ పధ్ధతిలో ముక్తి పొందను. ఈ science ఇంకొంచం అభివృధ్ధి చెందిన తరువాత ఎవడో ఏదో machine కనిపెడతాడు.
ఆ machine సహాయంతో ముక్తి పొందుతాను.
నిజమే పొందొచ్చు. కానీ అది సంసారం చేస్తే పిల్లలు పుట్టడానికి,
test tube baby ని పుట్టించడానికి ఉన్న difference లాటిది. రెండు పధ్ధతులలోను పిల్లలు పుడతారు. మొదటి పధ్ధతిలో పుట్టిన పిల్లలతో
తల్లితండ్రులకి ఒక రకమైన emotional bonding ఉంటుంది. రెండో దాంట్లో
ఒక scientist కి తన ప్రయోగం success అయిన
feeling ఉంటుంది. మరి ఆ test tube
పిల్లలకి ఎవరితో attachment ఉంటుంది?
ఆ ఏముంది పిల్లలు పుట్టక,
దత్తతకి తీసుకున్న పిల్లలకి తల్లితండ్రులు ప్రేమ పంచటంలేదా అంటే – అవును నిజమే పంచుతున్నారు.
మరి నీ దేముడు/భగవంతుడి concept ఎక్కడ నిలుస్తుంది? అంటే సమాధానం ఉండదు.
ప్రపంచం మారుతూ ఉంటుంది అని నువ్వే అన్నావు. మారుతున్న ప్రపంచంకి
తగ్గట్టుగా మనిషి adjust అవుతూ వెళ్తున్నాడన్నావు - అవును అన్నాను.
మరి మారనీ. మధ్యలో భగవంతుడు అదీ ఇదీ అని ఎందుకు confuse చేస్తావు?
నేననేది ఏమిటంటే ఈ భగవంతుడి concept ఇప్పటి సమాజాన్ని
ఒక equilibrium లో ఉంచుతున్నది. అది లేకపోతే?
లేకపోనీ - భగవంతుడు
మనిషి తాలూకు సృష్టి అని అన్నప్పుడు వాడికి
అది అవసరం లేనప్పుడు వాడు వాడుకోడు. మొత్తం బలం ఉన్నవాళ్ళు ,
తెలివి ఉన్నవాళ్ళు నీలాటి concepts, contradictions మానేసి సమాజాన్ని వాళ్ళకి నచ్చినట్టు నడిపిస్తారు. దీనివల్ల గొడవలు వస్తే రానీ, యుధ్ధాలు వస్తే రానీ. దేముడు ఉన్నాడనుకున్నప్పుడు కూడా తన్నుకు చచ్చారు కదా.
ఇప్పుడు లేడు అనుకుని తన్నుకు చస్తాం. ఏదో ఉన్నాడు, లేడు అనే
ఒక feeling తప్ప ఇంక ఆలోచించేది ఏదీ లేనప్పుడు, మారేది ఏదీ లేనప్పుడు argument ఎందుకు? మళ్ళీ అవసరం వస్తే వాడుకుంటాం.
వలయాలు మనిషిని నడిపిస్తాయి అన్నాను. ఒక చిన్న వలయం చూద్దాం.
ఇప్పటి ప్రపంచంలో మనిషి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సరి అయిన
ఆలోచన రాదు. సరి అయిన ఆలోచనలేని మనుషులు నడిపించే
సమాజం సరిగ్గా ఉండదు. మరి ఈ ఆరోగ్యం ఎందుకు పాడు అవుతుంది. ఒకటి మనం చెట్లుచేమలు కొట్టేసి
industrialization
కి వంత పాడుతున్నాం. దీని వల్ల ozone పొర దెబ్బ
తిని cosmic rays వల్ల మనిషి శరీరం పాడు అవుతున్నది. భూమి తాలూకు
ఉష్ణోగ్రత పెరిగి మంచు కరిగిపోతున్నది. జలప్రళయం వచ్చి తాగడానికి నీరు దొరక్క మొత్తం
ఉప్పు నీటి మయం కావొచ్చు. ఇప్పటిలా పంటలు అవీ ఉండవు. ఉన్న పంటలు కూడా నాశనం అవుతాయి.
ఈ జీవాలన్నీ నాశనమవుతాయి. Science advancement నించి Industrialization
నించి greenhouse affect నించి వాతావరణం కలుషితమై
దాన్నించి ఇప్పుడున్న species ఇబ్బంది పడి extinction
దిశగా అడుగులు వేస్తే అది సరైనదేనా? ఈ ప్రకృతిని
ఇలా మనం పాడుచేస్తే దాని వల్ల వచ్చే విపరీతానికి ఈ ప్రపంచం నాశనమైపోతే మంచిదా?
అవ్వనీ. నీకు optimistic view లేదు. మనమేమీ చేయకుండా కూర్చున్నా
మార్పు వస్తూనే ఉంది కదా. మారుతున్న ప్రతీ మార్పు మంచికని ఎవడన్నాడు. మరి ఆ మార్పు
మీద మనిషికి control లేనప్పుడు అదేమిటో తెలుసుకోడానికి ప్రయత్నించడం, అది control చెయ్యాలనుకోవడం తప్పులేదు కదా. మరింకేంటి
నస? మార్పుని control చెయ్యగలిగితే మంచి
జరుగుతుంది. Experiments జరుగుతాయి. ఒకవేళ అవి తిరగబెట్టి మొత్తం
నాశనం అయిపోతే అయిపోనీ. ఎప్పుడో నాశనం అయ్యేది ఇప్పుడే నాశనం అయిపోదాం.
ఇలాగ మాట్లాడటం మొదలెడితే చెప్పడానికి ఏమీ లేదు. దేముడు ఉన్నాడు
లేడు అన్నది పక్కన పెడితే, ఎన్నో జీవితాలు, ఎన్నో
తరాలు, ఎన్నో సమాజాలు, ఎన్నో నాగరికతలు, లెఖ్ఖ లేనన్ని ఎన్నోలు కాల గర్భంలో కలిసిపోయాయి. కనీసం ప్రస్తుతం ఉన్న మనకి
తెలిసిన ఈ చిన్ని ప్రపంచం సుఖంగా బ్రతకడానికి యోగ్యంగా ఉండేలా చూసుకోవడం తప్పో ఒప్పో
మనమే దిశానిర్దేశం చేసుకోవాలి అని మాత్రమే అనగలను.
Next post లో నాకు తెలిసిన ఇప్పటిదాకా మనవాళ్లు
ప్రపంచం గురించి ఇచ్చిన analysis, latest science advancement
స్టేటస్ చెప్పుకుందాం.
i browse a very few times in a month. In those few moments of net surfing this blog is one area where my life becomes meaningful and introspective. I gain few pounds of worthful life. My grandfather remarked " higher matter channeled into simpler format".
ReplyDeletedear mohan
ReplyDeletethanks for the comment -recently i was under the impression that except rk nobody else was reading my blog and this comment renewed my energy -thanks once again