Catharsis
ఒకసారి ప్రపంచమంటావు ఒకసారి మనుష్యులంటావు
వేదాంతం ఒకసారైతే ఒకసారి సంగతులంటావు
కనపడేది, వినపడేది కనపడకుండా కదిలించేది
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు
అంతరంగాన్ని అంతరిక్షాన్ని కలిపి శోధించానంటావు
విడదీసి పెనవేసి రెండిటిపై పట్టు సాధించేనంటావు
ఎందుకీ ఎగురుడు సామీ నీకేమి రహస్యం తెలుసని
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు
ఇంతమంది, ఇంత మేధ, ఇంత క్రాంతి, ఇన్ని వెలుగులు
అంత సులువుగా తేలేదైతే ఇన్నాళ్ళు ఎందుకాగిందంటావు
ప్రపంచ పరిణాహంలో ప్రస్థానమెటో తెలియని జీవుల కథ
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు
ఎందుకయ్యా అంత తపన అందరూ గుర్తించాలనా
కవ్వించి ఊరించే ఘనకీర్తికాంత నిన్నే వరించాలనా
No comments:
Post a Comment