Monday, June 25, 2012

Kotta Bhetala kathalu – Tyagi the opportunist


శవం concept close అవ్వడం తో ఏమీ తోచని భేతాళుడు కాలక్షేపం కోసం కొండపూర్ లో ఉన్న విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ చాలా relaxing mood లో ఉండి “ఏంటి భేతాళా ఇలా వచ్చావు, టీ ఏమైనా తాగుతావా” అని అడిగాడు. భేతాళుడు సరే అనడంతో విక్రమ్ టీ, biscuits తెప్పించాడు. టీ తాగిన తరువాత విక్రమ్ “ఏంటి విషయాలు భేతాళా” అని అడిగాడు. “ఏముంటాయి, ఇంతకు ముందు నువ్వు శవం వెతుక్కుంటూ రావడంతో నాకు నిన్ను వెతికే అవసరం లేకపోయేది. ఇప్పుడు నువ్వు ఆ పధ్ధతి మార్చడంతో నేను నిన్ను వెతుక్కుంటూ రావలసి వస్తోంది. నా గురించి తెలిసింది నువ్వోక్కడివే. అందుకే ఇలా” అన్నాడు. దానికి విక్రమ్ “సరే బాధపడకు. అవసరం అన్నది ఎవడి చేతైనా, ఎంత పనైనా చేయిస్తుంది”. ఇప్పుడు నువ్వు కూడా exception కాదని తేలిపోయింది. సరే ఇంతకీ కథ ఏమైనా చెప్తావా, లేకపోతే మనం latest movie దేనికైనా వెళ్దామా. ఎందుకంటే ఇప్పటి సినిమాలు అన్నీ horror పుట్టిస్తున్నాయి. మనిద్దరికీ శ్మశానం feel కూడా వచ్చేస్తుంది” అన్నాడు. దానికి భేతాళుడు ”వద్దు నా మీద ఏమైనా కోపం ఉంటే, పొమ్మంటే పోతాను, శ్మశానం కంటే భయంకరమైన విషయాలు నాకు చెప్పకు”అన్నాడు.”అయితే దేని మీద కథ చెప్తావు” అని అడిగాడు విక్రమ్.” నువ్వు అవసరం అన్నావు కదా, అవసరం కోసం ఎవరినైనా వంచించగలిగే సూచిత్ త్యాగి కథ చెప్తాను విను”అని భేతాళుడు కథ చెప్పడం మొదలెట్టాడు.
Bus stop లో wait చేస్తున్న నీలమ్ కి తన boy friend వస్తున్న జాడ కనపడటం లేదు. ఎప్పుడూ late చెయ్యని అతను ఇవాళ ఎందుకు ఇంత late అవుతున్నాడో అంతు పట్టటంలేదు. నిన్న అతను ఏదో సరదా పడదాం అంటే పెళ్ళికి ముందు ఇవన్నీ తను వద్దంది. అందుకనేమో రాలేదు అనుకుంది. తనేమో bank ఉద్యోగి. మరి అతను ఇప్పుడు రికామీగా తిరుగుతున్నాడు. అతనికున్న time తనకి ఉండదు. ఇప్పటికే bank manager దృష్టిలోకి తను వెళ్లిపోయింది late comer అని. మరి ఇతనేమో అన్నీ easy గా తీసుకుంటాడు. సరే ఇంకొంతసేపు wait చేసి చూద్దాం అనుకుంది. ఆ తరవాత ఒక గంట గడిచింది. నీలమ్ కి ముందు వెనకా ఎవరూ లేరు. ఒంటరి జీవితం గడిపే ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుందో అన్నీ అనుభవించింది. కానీ ఎప్పుడూ తను గాడి తప్పలేదు. తన bank manager కూడా ఇన్నిసార్లు తనని క్షమిస్తున్నాడంటే కారణం అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్ల కాదు. కానీ ఇప్పుడున్న boy friend తన మాటలతో, చేతలతో తనని చాలా impress చేశాడు. సరే office hours అయిన తరువాత అతని ఇంటికి వెళ్ళి చూస్తే సరిపోతుందని అనుకుని auto తీసుకుని office కి బయలుదేరింది.
భర్త పోయినతరువాత కోమల్ త్యాగి తన కొడుకు మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాది. వాడు చదివినంత కాలం బాగానే ఉండేవాడు. Degree పూర్తి చేసిన తరువాత వాడు ఇంటికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో, ఏమి చేస్తున్నాడో, ఏమీ తెలియటం లేదు. ఏమైనా అడిగితే విసుక్కుంటున్నాడు. ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుండేది వీడు. భాద్యత తెలిస్తే కొంత కుదుట పడుతుంది.తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంటున్నది. వీడు వస్తే బాగుండును.  కోమల్ త్యాగి నిట్టూర్చింది
సరితా మల్హోత్రా కి నిన్న రాత్రి జరిగింది తలుచుకుంటుంటే మంచి relaxing గా అనిపించింది. తన భర్త రాకేష్ ఎప్పుడూ business పనుల మీదే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. తనకేమో ఇక్కడ local office లో in charge కింద ఉంచాడు. నిన్న interview కి వచ్చిన కుర్రాళ్లలో ఒకడు బాగా impress చేశాడు. రాత్రి office hours అవ్వగానే hotel కి వెళ్ళి అక్కడ room లో అతను తనని escort చేసిన విధానం, శారీరకంగా, మానసికంగా అతను తనతో ప్రవర్తించిన విధానం, తనకి ఎంతో నచ్చింది. అతనిని office లో పెట్టుకుంటే తనకి అన్నీ రకాలుగా ఉపయోగపడతాడు.  ఇన్నాళ్ల బట్టీ life లో ఉన్న vacuum పోతుంది అనుకుంటూ కార్ start చేసి office వైపు పోనిచ్చింది.
రాజేష్ తన friend కోసం wait చేస్తున్నాడు. వాళ్ళ వీధి కోసన ఉండే ఇంట్లో ఉండే తన ఫ్రెండ్ చాలా కాలం నించి తన చెల్లెలితో చూపుల సందేశాలు నడపడం తన దృష్టిని దాటి పోలేదు. వాడు నిన్న నాకు ఉద్యోగానికి అవసరం రా అని కొంత డబ్బులు అడిగాడు. తన చెల్లెలి పెళ్లి కోసం ఉంచిన డబ్బుఉంది అని చెప్పడంతో నీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటాను నాకు ఇప్పుడు నువ్వు సాయం చెయ్యి, ఉద్యోగం రాగానే పెళ్లి అని confident గా చెప్పడంతో ఆ డబ్బు తీసి ఇచ్చాడు. ఇవాళ వాడు ఇంకా కనపడలేదు. ఏం జరిగుంటుందో, ఎప్పుడు వస్తాడో ఏంటో అని తన ఇంటి ఎదురుగా ఉండే బడ్డీ కొట్లో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు.
సోనాలీకి గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. తన తండ్రి పెద్ద business magnet. అయనకి తెలియకుండా తను పెళ్లి చేసుకోబోతుంది. ఇవాళే registrar  office లో పెళ్లి. ఇంట్లోంచి తన నగలు, కొంత డబ్బు pack చేసుకుని బయలుదేరింది. ఇంకొద్ది గంటలు అంతే. తరువాత సినిమా లో చూపించినట్టు అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళి daddy కి పరిచయం చేస్తుంది. అతను కూడా smart. ఇన్నాళ్ళు తను అడిగినదేదీ daddy కాదనలేదు. ఇది కూడా కాదనడని తనకి తెలుసు.
Registrar office దగ్గిర నిల్చున్న సూచిత్ త్యాగి ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. ముందు నీలమ్ తో జీవితం అనుకున్నాడు. కానీ సోనాలీ కలిసిన తరువాత life లో security ఉంటుందనిపించింది. నీలమ్ తో అయితే తను middle class కిందే settle అవ్వాల్సి వస్తుంది. అదే సోనాలీ అయితే ఒక్కతే కూతురు. పెళ్లి చేసుకుంటే సోనాలీ తండ్రి కూడా కాదనడు. ఇంక సరిత తో తన setup అలా సాగుతుంది. ఒకసారి పెళ్లైతే రాజేష్ డబ్బులు తీర్చేస్తే వాడు కూడా ఏమీ అనుకోడు. వాడి చెల్లితో చూపులే తప్పిస్తే commitment ఏమీ లేదు. అప్పుడు తన తల్లి గురించి ఆలోచించొచ్చు. ఇంకొద్ది గంటలు అంతే. తను ఎవరినీ మోసం చేయలేదు. ఇవన్నీ అవసరానికి ఏర్పడ్డ సంబంధాలు. నీలమ్ కూడా ఏముంది. తరువాత ఎవరినో చూసుకుని settle అయిపోతుంది.
ఇంతవరకు కథ చెప్పి భేతాళుడు ఆగాడు. విక్రమ్ ప్రశ్నార్ధకంగా చూశాడు కథ అయిపోయిందా ఏంటి అన్నట్టు. భేతాళుడు లేదు ఇంకా ఉంది అన్నట్టు సైగ చేసి కంటిన్యూ చేశాడు.
ఆ తరువాత సంఘటనలు చాలా తొందరగా జరిగాయి. సోనాలీ ని పెళ్లి చేసుకున్న త్యాగి ని సోనాలీ తండ్రి ఇంట్లోకి రానిచ్చాడు ఇల్లరికం రావాలనే ఒక షరతుతో. కొన్ని రోజుల తరువాత ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతని ఇంటికి చేరిన నీలమ్ కి ఆ ఇంటికి తాళం వేసుండడంతో enquiry చేసుకుంటూ రాజేష్ చెల్లెలి విషయం రాజేష్ ద్వారా తెలిసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. నీలమ్ వ్యవహారంతో అనుమానం వచ్చిన రాజేష్ ఆరా తీస్తే త్యాగి వేరే పెళ్లి చేసుకున్నవిషయం తెలిసి, అతనింటికి వెళ్తే, అక్కడ సోనాలీ రాజేష్ ద్వారా త్యాగి విషయం తెలుసుకుని అతనితో తెగ తెంపులు చేసుకుంది. సోనాలీ తండ్రి త్యాగిని ఇంట్లోంచి బయటకి గెంటేశాడు. ఉన్న డబ్బులు కూడా పోయాయి అని తెలుసుకున్న రాజేష్ తన చెల్లెలికి వేరే సంబంధాలు వెతకడం మొదలెట్టాడు. తరువాత కొన్నాళ్లు సరిత దగ్గిర పనిచేసిన త్యాగిని, తన సరదా తీరడంతో, సరిత కూడా తన security ఆలోచించుకుని త్యాగిని ఉద్యోగంలోంచి తీసేసింది. ఇంటికి తిరిగి చేరిన త్యాగికి తన తల్లి కనపడకపోవటంతో ఇరుగుపొరుగు వాళ్ళని కనుక్కుని ఎట్టకేలకు తన తల్లి చేరిన old age  home చేరేసరికి తల్లి మరణించిన వార్త విని బాధపడ్డాడు. నీలమ్ ఎప్పటికప్పుడు త్యాగి గురించి కనుక్కుంటూనే ఉంది. ఇలా ఆరు నెలలు గడిచిన తరువాత తిరిగి ఉద్యోగాల వేటలో bus stop కి చేరిన త్యాగికి నీలమ్ కనపడింది. త్యాగి తననే సమీపిస్తుండడంతో అతని వైపు భావరహితంగా చూసింది.
మళ్ళీ భేతాళుడు ఆగాడు. విక్రమ్ ఇప్పుడేంటి అన్నట్టు చూశాడు. భేతాళుడు అడిగాడు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”.  విక్రమ్ నవ్వాడు – “నువ్వు త్యాగి జీవితం మీద question వేస్తావు అనుకున్నాను. నీలమ్ గురించి అడుగుతున్నావు” అన్నాడు. సరే ఏదో ఒకటి చెప్పు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”. విక్రమ్ అన్నాడు” అసలు కథలో stuff లేదు భేతాళా, ఇలాటి delusions నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నావు. నీలమ్ ఏది తోస్తే అది, ఏదైనా చెయ్యొచ్చు.ఇందులో controversy ఉన్న point ఏమీ లేదే.” అన్నాడు. భేతాళుడు సర్దుకున్నాడు. “ పోనీ త్యాగి లాటి మనుషులు ఈ society కి అవసరమా”. విక్రమ్ అన్నాడు” నేనెవడిని అది finalize చెయ్యడానికి. ఈ society నించి వచ్చిన product త్యాగి. అంటే అలాటి వాడిని తయారు చేస్తున్న ఈ society కి వాడి అవసరం ఉండే ఉంటుంది. ఇందులో నన్నేమిటి చెప్పమంటావు. ఆస్థులు పంచుకుని బాధ్యత వదిలేసే కొడుకులు,కూతుళ్ళు, చిన్న చిన్న కోరికల కోసం జీవిత భాగస్వాములని మోసం చేసే సంసారులు, జీతాలు తీసుకుని పైరాబడి కోసం ఆశపడే ఉద్యోగులు, స్వంత లాభం కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టగలిగే entrepreneurs, రాజకీయ నాయకులు, అవసరం కోసం స్నేహాలు చేసే friends, అసలు ఎవడు opportunist కాదు. అందరూ అంతే. చిన్న శృతి భేదాలు. Opportunist అనేవాడు ఎవడూ లేని కాలం అంటూ ఏమైనా ఉందా. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందన్న త్రేతా యుగంలో, రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడు నవ్వితే, అక్కడ ఉన్న విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, రాముడు మిగతా పరివార జనాలే కాదు ఆఖరికి సీత కూడా తల వంచుకుందిట. వాళ్ళల్లోని opportunist ని చూసి లక్ష్మణుడు నవ్వాడని. ఏ కాలంలో opportunist లు లేరు భేతాళా? ” “అయితే నువ్వు opportunist ని సమర్ధిస్తావా” అని అడుగుదామనుకున్న భేతాళుడు  ఆవేశంగా సాగుతున్న విక్రమ్ ఉపన్యాసం తో గాభరాపడి conclusion తీసుకోకుండా, చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు.  

7 comments:

  1. opportunists i think hide their real self and present their sale-able side to the world.
    In that context tyagi appears more criminal than an opportunist. His side is not effectively presented. The rest of the characters have better exposure than the main character. I dont think an opportunist plans something that puts him in jail.

    ReplyDelete
  2. In one way this story is absolute truth.In a other way it is completely a mans relations with different women on selfish plains. True because everything finally comes down to where you begin. A circle. The intentions of the protagonist are covert. The write left Tyagi to our imagination. Where as the other characters are more overt. We have to understand Tyagi from other characters. And here the writer had a great chance of an experimentation which he lost to an irrelevant vikram and bhethal

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Most of the times this blog writer tried to define human behavior through different situations. Almost all the times the fictional requirement disappeared and a documentary approach is pursued. One of the basic problem is the writer's understanding of society is not being converted to the basic platform of the commoners. The agony (feeling) of the writer always is always missing in the fictional accounts.Where as his non fictional accounts of science, his memories, and in particular poetry come with an elegance suffering and happiness. Perhaps the high standards of his literary domain is influencing his short story approach. His themes are on par with tilak or any other socially conscious writer. How ever his presentation differs from them on the grounds of "shaking" the reader.
    Here there is an attempt to deviate from his style and definitely there is a element of interest that makes the reader run through the lines. A sudden run in the pre climax paras killed the entire spirit of the story .
    How ever its in this school i learnt true literature and life. I dont think i have evolved to write a critical account on some one whom i consider my ideal he. This is only my observation. A little pep a little salt a little drama and a little twist added to this " genius " writer will change the literature

    ReplyDelete
  5. బావా నీ కధని, నువ్వు ఒక రచయిత గా అనుకొని నా కామెంట్
    అన్ని తీరాల/సమస్యల గమ్యం సూచిత్ త్యాగి అని మెలిక బాగున్నా కధ కధనం శైలి లో ఇంకా బాగా చేయగలవు, ప్లీజ్ రెఫెరె "రచన - వసుందర
    ఎలనాగ

    ReplyDelete
  6. కధకు అవసరమైన బిగువు లేదు. ఇక విషయము విక్రమబేతాళుల వల్ల గతి తప్పింది. రచయతకు అవకాశవాది అని వాడుటకు సంకోచము ఎందుకో? కధకు వివరణకు తేడా వుంది. రచయత ఈ విషయము గ్రహిస్తే మేలు.

    ReplyDelete
  7. అందరి commentsకి కృతజ్ఞ్యతలు. ఏదో వ్రాస్తాను కానీ basicగా నేను అంత మంచి రచయితని,కవిని కాను. నాకు ఎలా తోస్తే అలా వ్రాయడమే అలవాటు.ఆ విషయం ఒప్పుకోవడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు. నా ఆలోచనలకి ఒక vent ని ఇవ్వడమే ఇప్పటివరకు నా ముఖ్య ఉద్దేశ్యం.కథనం,దానిలో బిగువు,పాత్రల చిత్రణ వీటి మీద ఎక్కువ ఎప్పుడూ దృష్టి పెట్టింది లేదు.ఈ కథలో మొదటిసారి ఏదో ప్రయత్నించాను. నాకు నా బ్లాగ్ రామకృష్ణ, వాడి ఇద్దరు ముగ్గురు students, రాంబాబు తప్పితే ఎవరూ చదవరని ఒక అపోహ ఉంది.అందులో రామకృష్ణ తప్పితే ఎవరూ comments పెట్టకపోవడం తో నేను కూడా చాలా light గా తీసుకున్నాను.ఇప్పుడు నాకు తెలియని వాళ్ళు కూడా చదువుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది.అన్ని comments చదివి చాలా ఉత్సాహం వచ్చింది. ఈసారి నేను వ్రాసే కథ నేనే పాఠకుడిగా చదివి correct చేసి తరువాత publish చేస్తాను.చూస్తాను ఎంత వరకు నేను సఫలం అవ్వగలనో.

    ReplyDelete