Globalization తరువాత
ప్రతీ దేశం తమ ఉనికిని కాపాడుకోవడానికి imports & exports మీదే ఆధారపడుతుంది. అవి రెండు balanced గా
ఉన్నంత కాలం ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే imports exports కంటే పెరిగిపోతాయో ఆ దేశం
తాలూకు మారకం విలువ పడిపోతుంది. అంటే మనము అవతలవాడికి అమ్మే దాని కంటే కొనేవి
ఎక్కువ అయ్యాయి. ఆదాయం కంటే వ్యయం పెరిగితే అప్పుల పాలే.
ఇప్పుడే
కాదు భారత దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గిర నించి ఇదే పరిస్థితి. మనది Mixed economy. అంటే
కొన్ని పరిశ్రమలు government run చేస్తుంది, కొన్ని private parties run చేస్తాయి.
కారా మాస్టర్ కుట్ర లో చెప్పినట్టు మన దేశం భ్రష్టు
పట్టి పోవడానికి కారణం మన policies & decision making. Heavy industries అంటే భార పరిశ్రమలు అన్నీ government, Corporate Industries అంటే భారీ పరిశ్రమలు అన్నీ private. అంటే
ప్రజల సొమ్ముతో పెట్టిన పరిశ్రమలు అన్నీ private పరిశ్రమలుకి ముడి సరుకులు
అందించే పరిస్థితే గానీ మన దగ్గిర ఉన్న low technology తో తయారైన heavy industrial goods కి globalగా demand లేదు. తయారుచేసినవి బయట
అమ్ముకోలేక, అమ్ముకోవడానికి
మన దేశంలో ఉండే పెట్టుబడిదారులు ఎవరూ ముందుకి రాకపోతే వాళ్ళకి concessions ఇచ్చి, అప్పులు
ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చెయ్యడం తప్పితే ప్రజలకి ఒరిగిందేమీ లేదు. Liberalization పేరుతో Capitalist agenda ని
అద్భుతంగా అమలుపరచడం, దాన్ని ఏదో గొప్ప achievement అని
ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ప్రయత్నిస్తే రూపాయి విలువ పడిపోకుండా ఆపొచ్చు
అన్నది మన నాయకులకి తట్టదు, అనిపించదు. ఎందుకంటే వాళ్ళ agenda యే వేరు. ఇప్పటికీ మనం technology వేరే దేశాలపై ఆధారపదడమే కానీ indigenous technology కి
సంబంధించి ఏమీ positive steps తీసుకున్న
దాఖలాలు కనపడవు. అప్పుడప్పుడు పృథ్వీ, అగ్ని అనడమే అంతే. మన దేశంలో
పుట్టి, మన
దేశంలో చదువుకుని, విదేశాలకి లాభం చేకూర్చడమే కానీ, మన దేశపు
మేధావులు మన దేశానికి చేస్తున్నదేమీ లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళ తెలివితేటలకి
గౌరవం లేదు. వసతులు లేవు. పైపెచ్చు ఇక్కడ ఏమైనా చేద్దామనుకున్నవాడికి unnecessary harassment. పరిపాలిస్తున్న
నాయకులకి ఏమి చేస్తే దేశానికి మంచి జరుగుతుందో తెలియదా – తెలుసు – కానీ
వాళ్ళ గొడవలు వాళ్ళకి ఉన్నాయి. దీనికి తోడు 90% మనకి బుర్రలు లేని నాయకులు. బుర్ర
ఉండి commitment ఉన్నవాడిని
రానివ్వరు. బుర్ర ఉన్నా అది వాడే అవసరం ఉండదు. ఇంకా ఏమైనా చేద్దామనుకున్న కొందరు
మనకెందుకులే అని ఈ international power play politics లో నలిగి ఊరుకోవడం. Balance ఏమైనా
మిగిలిపోతే అవి regional, communal
politics లో నలిగి
నాశనం. ఇంక మిగిలినవి మన private పెట్టుబడిదారులు మూసేశారు. అదీ
పరిస్థితి.
ఇప్పటికీ
భారతదేశం produce చేసే
సరుకులకి demand లేదు. మన crudeoil imports రోజురోజుకీ
పెరిగిపోతున్నాయి. ఈ crude oil reserves ని control చేస్తున్న USA తాలూకు dollar కి పరువు, బరువు.
అమెరికా ఇరాక్ లో చేసిన యుధ్ధం అంతా దీని గురించే. కారణం ఏదైనా చెప్పొచ్చు. నిజంగా
ఈ petrol, diesel లేకపోతే పని నడవదా? నడుస్తుంది
కానీ competition పెరిగిన
ప్రపంచంలో ఎవడి ఉనికి వాడు నిలబెట్టుకోవడానికి scooter, ఇంకా status కూడా add అయితే car తప్పవు.
ముందు వీటిని అమ్మితే వీటి ఇంధనం కోసం చచ్చినట్టు petrol, diesel కొనడమే. ఏ దేశమైతే resources control చేస్తుందో
దానిదే పైచెయ్యి. కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన జీవితాలలోకి
ప్రవేశపెట్టబడతాయి. ఉదాహరణకి toothpaste, brush లేకపోతే పళ్ళు తోముకోలేమా? నా చిన్నప్పుడు
మా తాతగారి ఊరిలో వేప పుల్లలు, లేదా ఉప్పు,కచ్చిక(కొబ్బరి డొక్కలు కాలిస్తే వచ్చేది) పెట్టి పళ్ళు
తోముకునే వారు. అప్పుడూ పళ్ళు శుభ్రం గానే ఉండేవి. ముందు status symbol గా అందరి
జీవితాలలోకి ప్రవేశించిన ఈ toothpaste ఇప్పుడు నిత్యావసరం లోకి మారింది.
ఇప్పుడు అది ఏ పల్లెటూరు అయిన brush, paste compulsory. ముందు అలవాటు చేసి, తరువాత ధర
పెంచడం, అవసరం లేని
వస్తువుని ప్రవేశపెట్టి అవసరంగా మార్చడం అదో marketing strategy. ఈ marketing గురించి
మాట్లాడుకుంటే అదో మహాసముద్రం. ఇప్పుడు industrialization దెబ్బకి చెట్లు కూడా లేవు వేప
పుల్లలు దొరకవు. రేపటి రోజున ఎవడో ఒకడు “nature in its
original form –herbal cure for teeth and gums – Neem stick” అని వేపపుల్లని toothpaste కంటే
ఎక్కువ rate కి
అమ్మేసినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు.
ఈ crude దెబ్బ
అక్కడితో ఆగదు. దీనివల్ల LPG ధర పెరుగుతుంది, రవాణా
ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధర
పెరుగుతుంది, చివరిగా
మనం తినే తిండి ధర మనం భరించలేనంతగా పెరుగుతుంది. ఏదో విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో
చదువులు అంటే మానేయొచ్చు కానీ తిండి మానడం కుదరదు కదా. ఇంతకుముందు చరిత్రలో
ఇలాటివి జరగలేదా అని question రావోచ్చు. నూటికి నూరు శాతం
వచ్చి ఉంటాయి. కానీ చరిత్రలో అవి రాసుకోరు. ఒకవేళ రాసుకున్నా దాని గురించి
మాట్లాడుకోరు. ఉదాహరణకి మన విజయనగర సామ్రాజ్యంలో అంగట్లో రత్నాలు అమ్మేవారుట. Persia నించి వచ్చిన అబ్దుర్ రజాక్ చెప్పాడు కాబట్టి కొంత
నమ్మోచ్చు. కానీ నాకు చిన్నప్పుడు మా class teacher విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలు, వజ్రాలు,రత్నాలు road పక్కన కుప్పలు పోసి అమ్మే వారని
చెప్పింది. నేను చిన్నప్పుడు నోరు వెళ్లబెట్టాను. ఇలా కూడా ఉంటుందా అని. ఆవిడ కూడా
ఏ ఉత్సాహంకల చరిత్రకారుడు చెప్పిన చరిత్ర విని ఉంటుంది. ఆ తరువాత రాయల సామ్రాజ్య పతనం, విజయనగర
దుస్థితి, అది ఎంత
హీనదశ చూసింది, ఎవడో
రాసే ఉంటాడు కానీ మనకి అఖ్ఖరలేదు. ఎందుకంటే మొదటి విషయం ఇచ్చిన kick రెండో
విషయం ఇవ్వదు. ఇది బాబు చరిత్ర.
మన
రూపాయి విలువ inflation వల్ల
పడిపోయింది.
మళ్ళీ history duping కి
వెళ్ళేముందు next post లో inflation అంటే
ఏంటి, ఏమి
చేస్తే రూపాయి విలువ పెంచొచ్చు, American economy/ current history తాలూకు
అసలు స్వరూపం ఏమిటి కొంత తెలుసుకుని Russian history లోకి గెంతుదాం.
ఒక రాజును గెలిపించుటలో
ReplyDeleteఒరిగిన నరకంఠా లెన్నో?
శ్రమజీవుల పచ్చినెత్తురులు
త్రాగని ధనవంతులెందరో?