Monday, June 11, 2012

ఆలోచనల స్రవంతి -34


Communism కి కంచుకోటలా ఉన్న Russia ముక్కలు ముక్కలు అయిపోయింది. అయితే నిజంగా communism ఈ ప్రపంచానికి పనికిరాదా అని అనుమానం కలగక మానదు. Communism ప్రపంచానికి పనికివస్తుందా, పనికిరాదా అని తేల్చుకునే ముందు అసలు అదంటే ఏమిటి అని తెలియాలి.ఏ ఏ కాలాలలో ఏ రకమైన definitions ఉన్నప్పటికీ Communism అంటే మార్క్స్ ప్రకారం “తరతమ భేదాలు లేని వ్యక్తులు అవసరమైన దాని కంటే కూడా ఎక్కువ సరుకులు తయారుచేయగలిగే శక్తి కలిగి తయారు చేయబడిన వస్తువులు ప్రతి ఒక్కరికీ అవసరానికి తగ్గట్టుగా పంచేటటువంటి ఒక దశ”.  “Socialism అన్నది communism సాధించే దారిలో ఒక దశ”. తరతమ బేధాలు లేకపోవడమంటే  ప్రతీ వ్యక్తి కుల, మత, జాతి బేధాలు లేకుండా, తనదంటూ వేరే ఆస్థిపాస్తులు ఉంచుకోకుండా, తనకంటే ముందు తను బతుకుతున్న సమాజం కోసం శ్రమించడం. వినడానికి ఎంత బాగుంది. మరి ఈ పధ్ధతిలో గొడవేలేదు. పైన చెప్పిన definition follow అవ్వగలిగితే అద్భుతమే. మరి ఇప్పుడు communism అంటే communist parties పరిపాలనలో ఉన్న దేశాలలో, వాళ్ళు అవలంబించిన విధానం. ఇది మార్క్స్ విధానాలతో సంబంధం లేదు.
సరే ఇందులో తెలుసుకోవలసినదేమిటంటే అసలు మార్క్స్ ప్రకారం communism స్థాపనకి కావలిసినది ఏమిటి? ప్రతి ఒక్క వ్యక్తి ఒక మహర్షి లాగా ప్రవర్తించగలగాలి. అది కుదిరే పనేనా? ఇక్కడ అసలు పునాది లోనే తేడా ఉంటే భవంతి ఎలా నిలబడుతుంది. ఏ వ్యక్తి అయినా సరే తనకంటే ఎక్కువగా తను ఉన్న ప్రపంచాన్ని ప్రేమించగలడా? మిగతా Das Kapital definitions అన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం అయ్యి ఉండొచ్చు. కానీ ఏదైతే implementation కావలిసిన ముఖ్య వనరు -  “మనిషి” -  వాడి definition తప్పుగా తీసుకుంటే అసలు ఎలా కుదురుతుంది. నా చిన్నప్పుడు మా master “స్పర్ధయా వర్ధతే విద్యా” అని చెప్పారు. విద్య అనే కాదు దేనిలోనైనా స్పర్ధ అన్నది లేకపోతే ఎదుగుదలే లేదు. మరి ఏ స్పర్ధ లేకుండా మనుషులు ఉండగలరా. ఉన్నా మరమనుషులలాగా బ్రతికితే ఏమైనా సంతోషం ఉంటుందా. తెలివిలేనివాడు పైన చెప్పిన communism definition తో సుఖపడతాడు. కానీ తేలితేటలు ఉండి ఎక్కువ సాధించగలిగినవాడు ఎందుకు తన సుఖాన్ని త్యజించి వేరే వాడి కోసం తన సుఖాన్ని పంచుకోవాలి? అలా చెయ్యాలంటే వాడు మహర్షి కావాలి. పోనీ చంపో, చచ్చో మనిషిని తొక్కి పెట్టి బలవంత పెట్టి అందరినీ ఒక common goal వైపు తీసుకు వెళ్లగలమా? ఒకవేళ తీసుకువెళ్లేటట్టు అయితే అదెంతకాలం? ఎవడికీ తెలియదు. అలాగని తెలివైన వాడిని ఎంతకాలం ఆపగలం. తొక్కిపెట్టబడిన తెలివైనవాడు తన స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి అని ఇంకో పదిమందిని వెంట వేసుకుని తిరగబడితే మళ్ళీ ఒక revolution.   కాబట్టి ఈ communism అన్నది concept బాగుంటుంది కానీ ఆచరణయోగ్యం కాదు. మరి ఇన్నాళ్ళు ఈ communism flourish అయ్యింది. చాలా సంవత్సరాల పాటు ఎంతో మంది intellectuals ని కుదిపేసింది. ఒక philosopher’s utopia ని చూపించింది. ఇప్పుడంటే ఎవరో కుట్ర చేసి కూల్చేశారు అని నువ్వే అంటున్నావు అని నన్ను అడిగితే – history duping జరిగింది అక్కడే అని నేను అంటాను. లెనిన్, స్టాలిన్ అసలు నిజంగానే communism తాలూకు నిజమైన definition follow అయ్యారా అన్నది పెద్ద అనుమానం. ఎందుకంటే ఒక రకమైన నిరాశలో, నిస్పృహలో ఉన్న సామాన్య ప్రజలు ఎవరు తమ కష్టాలు తీరుస్తారు అని wait చేస్తూ, ఆ కలల సాకారం వైపు తీసుకెళ్తానన్నవాడిని మార్గదర్శకుడు అనడం సహజం. వాడి వెంట నడుస్తారు కూడా. ఎంతవరకు అంటే తమ నమ్మకం సదలనంత వరకు. మరి ఆ మార్గదర్శకుడికి  తెలుస్తుంది సాకారం దిశగా పయనించడానికి, system ని implement చెయ్యడానికి ఉండే నొప్పి ఏంటో, నొప్పి ఎంతో. అలాటి మార్గదర్శకులైన లెనిన్, స్టాలిన్ మార్క్స్ తాలూకు communism’s definition ఎంతవరకు implement చేసుంటారో మనకు తెలియదు. Result ని బట్టి inference తియ్యడం తప్పిస్తే. అంతవరకు ఎలాగో నెట్టుకువచ్చిన Russia ఎప్పుడైతే perestroika అని ప్రజల మాటకి విలువ ఇవ్వడం ప్రారంభించిందో ఇంక అంతవరకు ఆ ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఆపడానికి అడ్డుకట్ట లేకపోయింది. సరే అంతవరకు ఒక ఇనప పిడికిలితో communism ని implement చేసిన Russian government అసలు ఈ perestroika అని ఎందుకనాలి అన్నప్పుడు, అందులో విదేశీ హస్తం తాలూకు ఛాయలు కనపడతాయి. ఇప్పటి దాకా నేను చెప్తున్న History అంతా అలాగట, ఇలాగట, అలా అయ్యి ఉండొచ్చు, ఇలాగ జరిగి ఉండొచ్చు అనే ఎందుకు నడుస్తున్నదంటే, నాకు నిజంగా నిజం తెలియదు, simple గా నేను చదివిందానికి, విన్నదానికి, నా analysis జోడించి, నేను అనుకుంటున్నది చెప్పడం వల్ల. ఈ Russian అనే కాదు, French revolution, Chinese history, Japanese history ఏదైనా తీసుకుంటే నిజం వేరు, చదివేది వేరు.
అందుకే శ్రీశ్రీ వ్రాసిన దేశచరిత్రలు పద్యం నాకు చాలా ఇష్టం. అంత సునిశితంగా ప్రపంచ చరిత్ర గురించి వ్రాసిన శ్రీశ్రీ “లెనిన్ ద్యుమణి” అంటే నిజమనుకున్నాను. కానీ ఇక్కడ చూడాల్సింది శ్రీశ్రీ కూడా ఒక మనిషే. కవిత్వం పక్కన పెట్టేస్తే అందరిలాటివాడే. కానీ నేను నా ఆలోచనలలో ఆయనకి ఇచ్చిన స్థానం అది నా ఊహ. నిజం ఏంటంటే మనం ఎప్పుడు ప్రస్తుతంలో బ్రతకాలి. History - నిజమో, అబఢ్ధమో ఏదైతే అది. దాన్ని ఒక నీతి పాఠంలాగ తీసుకుని ఇప్పటి పరిస్థితికి ఏది మంచి అనిపిస్తే అది చెయ్యడం ఉత్తమం.
History outline గురించి అభిప్రాయాలు చెప్పుకున్న మనం -current affairs గురించి మాట్లాడుకుందాం next posts లో
సశేషం 

1 comment:

  1. Disobedience, in the eyes of anyone who has read history, is man's original virtue. It is through disobedience that progress has been made, through disobedience and through rebellion.--oscar wilde

    ReplyDelete