పట్టువదలని విక్రమ్ తన laptop తీసి అందులో
భేతాళ శవం తాలూకు details కోసం surfing మొదలెట్టాడు. Google search లో భేతాళ శవం అని type
కొట్టగానే ఆంధ్ర communist వరవరరావు వ్రాసిన
కవిత open అయ్యింది.అది చదువుతూ కాసేపు కూర్చున్నాడు. ఆ
కవితలో అదేదో lockup శవం అనగానే విక్రమ్ కి అనుమానం వచ్చింది
తను police stations చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని. మళ్ళీ
తను శవాన్ని తీసుకుపోవడం, మళ్ళీ తనకి మౌనభంగం అవ్వగానే శవం ఏ
mortuary లోకో, చెట్టు మీదకో పోవడం తో
విసుగెత్తి, విక్రమ్ కి తెలియకుండా భేతాళుడు ఈ sequence
break చెయ్యడానికి శవాన్ని ఎక్కడో దాచేసి ఉంటాడనిపించింది. అసలు
ఇన్నాళ్ళు “ఈ శవాన్ని వెతకడం, మొయ్యడం , అది మళ్ళీ మాయమవ్వడం” ఈ confusion లో పడి అసలు తనకి
శవం అవసరం ఏమిటో మర్చిపోయాడు. ఎవడికి కావాలి ఈ శవం, అసలు ఈ
గొడవ అంతా ఎందుకూ? ఎంచక్కా ఏదైనా pub కి
వెళ్ళి ఒక chilled beer తాగి అప్పుడు ఆలోచిద్దామని తన Toyota
car తీసుకుని pub కి వెళ్ళాడు. అక్కడ beer
order చేసి కూర్చున్నాడు. “Yes విక్రమ్ ఏంటి
సంగతి –శవాన్ని వదిలేసి నువ్వే శవం అయిపోడానికి ఏదో తాగుతున్నట్టు ఉన్నావు –శవాల
వేట మానేశావా ఏంటి” అని ఒక గొంతు వినిపించింది. విక్రమ్ కి అర్ధం అయ్యింది అది
భేతాళుడి గొంతే అని. తను తాగుతున్న మందు glass మీద నుంచి
దృష్టి మరల్చకుండా “ఈ శవాన్ని మోసే అవసరం నాకు లేదు, నేను
ఎందుకు మోస్తున్నానో నాకే తెలియదు. నువ్వేదో కథ అంటావు, జవాబు
చెప్పగానే అది మాయమైపోవడం. నాకేమో శవాన్ని మోస్తూ కథ వినడం ఎందుకు, మోత దండగ. ఇప్పటి నించి నువ్వు కథలు చెప్పు నేను జవాబులు చెప్తాను. శవం
గోల వదిలేద్దాం , అవును నీకేమైనా కావాలా తాగడానికి అన్నాడు.
అప్పుడు భేతాళుడు “ok so be it –let me also have one
chilled” అని తన గ్లాస్ కూడా నిండగానే ఒక గుక్క తాగి కథ start
చేశాడు.
రామకృష్ణ నవ్వుకున్నాడు. అతని చేతిలో ఆనాటి దినపత్రిక
రెపరెపలాడింది. ప్రజలు మూర్ఖులు. వీళ్ళు ఎవరైతే తమని దోచేస్తారో వాళ్ళకే ఒట్లేసి
గెలిపిస్తారు. లేకపోతే ఈ జనాలు ఒక CM కోసం చావడం ఏమిటి. వాడి కొడుకు black
money మీద enquiry వేయించిన ఇంకో black
money party ని ఓడించి వాడి కొడుకుని గెలిపించడమేమిటి. ఈ పత్రికల
వాళ్ళు వాడిని ఆకాశానికి ఎత్తడమేమిటి. ఉన్న రాజకీయ పార్టీలన్నీ ex –CM కొడుకు party లాటివే. ఎవడిని గెలిపించాలి, గెలిపించకూడదు అని కూడా వదిలేస్తే అసలు “ఈ ప్రజలు” - వీళ్లకేమి కావాలో
వీళ్లకే తెలియదు. కానీ తనకి తెలుసు. అందుకే Orissa border దగ్గర
మొదలుపెట్టిన తన “ఆంధ్రా cycle యాత్ర” లో రకరకాల గ్రామాలు సందర్శించి, అక్కడి ప్రజలకి నిజాన్ని తెలియబరుస్తూ సాగుతున్నాడు. ఈ జనాలని
చైతన్యపరిచి ఈ క్షుద్ర రాజకీయాల నడ్డి విరవాలి. ఈ సమాజంలో ఒక విప్లవం రావాలి.
అందుకు ఈ cycle యాత్ర ఒక మైలురాయి కావాలి. దీనికి prologue
లో రామకృష్ణ “The motor cycle diaries” పుస్తకం
చదువుతున్నాడు. “Ernesto Che Guevara” అంటే అతనికి విపరీతమైన
అభిమానం ఏర్పడింది.
విక్రమ్ కి విసుగొచ్చింది, భేతాళుడితో” నువ్వు
కూర్చున్న place కి, తాగుతున్న మందుకి, ఇప్పుడు చెప్తున్న కథకి ఏమైనా match అయ్యిందా. ఉన్న
mood పాడు చెయ్యడం కాకపోతే” అన్నాడు. అప్పుడు భేతాళుడు “ఏం
బాబు విప్లవం కథలు bar లో వినకూడదని ఏమైనా rule ఉందా” “కథ చెప్తున్నాను కదా –cool గా మందు కొడుతూ విను –లేకపోతే మళ్ళీ శవం మోస్తూ వింటావా -అది నీ ఇష్టం” అన్నాడు . విక్రమ్ అయిష్టంగానే వినడం
మొదలెట్టాడు.
ఎలాగైతే Che Guevara motorcycle మీద తిరుగుతూ జీవితానికి
ఒక అర్ధం కనుక్కున్నాడో అలాగే తను cycle మీద తిరుగుతూ జీవితాన్ని
సార్ధకం చేసుకోవాలని బయలుదేరాడు. ఎంత వరకు సాధిస్తాడో కాలం నిర్ణయిస్తుంది. ముందుగా
సోంపేట లో చిన్న బడ్డీకొట్టు meeting పెట్టాడు. అప్పుడు అక్కడ 2640 MW coal based power plant పెట్టకూడదని జనాలు ఆందోళన జరుగుతున్నది.
కాకరాపల్లి, సోంపేట power plants కి environmental
clearance ఎవరు ఇచ్చారు. ఆ factory లు అక్కడ పెడితే
అక్కడి నీటిలో arsenic, lead లాటి విష పదార్ధాలు
పెరిగిపోయి జనజీవితాలు అస్తవ్యస్తమైపోతాయని జనవాక్యం. ఆ బడ్డీకొట్టు meeting లో రామకృష్ణ government ని దాని policies ని తూర్పార బట్టాడు. జనాలు మౌనంగా విని టీ తాగడం అవ్వగానే “బాగా చెప్పావు బాబు”
అని రామకృష్ణ తో అని వెళ్ళిపోయారు. రామకృష్ణ కి బోలెడంత ఉత్సాహం వచ్చింది. Yes
ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అని అలా ముందుకి సాగాడు. విజయనగరం చేరగానే
అక్కడ పరిస్థితి ఆరా తీశాడు. అక్కడ Centre లో ఉన్న ruling
party తాలూకు ఆంధ్ర local party chief , CM
ఇద్దరు liquor scam అని ఒకళ్ల మీద ఒకళ్లు బురద
చల్లుకుంటూ పత్రికల ద్వారా బండబూతులు తిట్టుకుంటూ కనపడ్డారు. వెంటనే రామకృష్ణ అక్కడ
cinema hall బయట ఉండే వెరుశెనగబడ్డీ దగ్గిర తన వాక్ప్రవాహంతో
జనాల్ని కట్టి పడేశాడు. అసలే NTR భీష్మ సినిమా ఆడుతోంది. మంచి
ఓపిక మిగిలిపోయిన ముసిలివాళ్ళందరూ చూడటానికి వచ్చారు. అంతా విన్న ఇద్దరు మూసిలాళ్ళు
మాకు వినబడటంలేదు,కొంచెం గట్టిగా చెప్పమన్నారు. రామకృష్ణ వాళ్ళ
స్వార్ధరహిత కుతూహలాన్ని గమనించి మరింత ఉత్సాహంతో గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టాడు.
ఇంకొక మూసిలాయన “గొంతెడిపోద్ది బాబూ, సోడా తాగు“ అని సోడా కూడా
ఇప్పించాడు. అలాగ అక్కడినించి విశాఖపట్నం చేరే సరికి అక్కడ ఒక super land scam
గురించిన వార్త చదివాడు. VUDA వాళ్ళు అప్పుడే ప్రపంచాన్ని
చూసినట్టు” ఏమిటి ఋషికొండ, మధురవాడ, ఎండాడ, పరదేశిపాలెం, కూర్మన్నపాలెం, పేదవాల్టేర్
ఇన్ని చోట్ల భూ కబ్జానా” అని ఆశ్చర్యపోవడం –VUDA vice chairman, మినిస్టర్ అందరూ enquiry జరిపిస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ చదివి రామకృష్ణ ఉడికిపోయాడు. ఎవరి సొమ్ముని ఎవరు తినేస్తారు. ప్రజల
సొమ్ము ప్రజలకే చెందాలి అని VUDA ఆఫీసు బయట బజ్జీ తయారు చేసేవాళ్లకి, xerox shop వాళ్ళకీ హోరాహోరీ వివరించాడు. వాళ్ళు కూడా RTO office shift చెయ్యడం నించి కలిగిన సాధకబాధకాలు అవి చెప్పుకుని బాధపడ్డారు. ఇలాగే గోదావరి జిల్లాల్లో liquor scam లు,bank fraud లు వీటి మీద ఉపన్యసించి గుంటూరు చేరేసరికి
అక్కడ ఇందిరమ్మ housing scam లు, దేవాదాయ
భూముల scam, ఆఖరికి నీళ్ళలో కలిపే Alum కూడా scam చేసేస్తుంటే బాధ భరించలేకపోయాడు. నెల్లూరు,చిత్తూర్, కడప లో జరుగుతున్న భూ కబ్జా, money circulation & laundering, micro financing scam లు, మహబూబునగర్ లో counterfeit currency, mining scam
లు ఇవన్నిటి మీద వేరు వేరు ప్రదేశాలలో మాట్లాడి హైదరాబాద్ చేరేసరికి
ex – CM కొడుకు ఓదార్పు యాత్ర ముగించి black money scam ని handle చేస్తున్నాడు.
ఇవే కాకుండా national level లో Raja spectrum
scam, Laloo fodder scam, Harshad Mehta share market scam, Telgi stamp
papers, Bofors, Common wealth games scam etc., ఇవీ చాలావన్నట్టు question
paper కొనేసి పరీక్షలు రాయించే schools, colleges
వల్ల చదువుల్లో కూడా scam అయిపోయి భావి తరాలు నాశనమౌతుంటే
రగిలిపోయిన రామకృష్ణ టాంక్ బండ్ మీద నిలబడి
తనలోని ఆవేశాన్ని, విప్లవాన్ని కలగలిపి చెప్తూ ఉంటే, ఆ ప్రవాహానికి ప్రజలు మా leader నువ్వే అని హారతి పడుతుంటే, ఇంతలో police van వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి దిగిన
పోలీసులు జనాలని చెదరగొట్టి రామకృష్ణ ని jail లో పడేశారు. అప్పుడు
అతని లోని Che Guevara విజృంభించి ధనమదాంధులైన బూర్జువా పాలక
వర్గం కీళ్ళు విరిచే విధంగా guerilla warfare start చేశాడు.
“రామకృష్ణా” అన్న పిలుపుతో తనున్న upper primary school
8th std లో ఈ లోకం లోకి వచ్చిన రామకృష్ణ మాస్టర్ class వైపు నిర్వేదంగా చూశాడు. Principal తన వైపు తీక్షణంగా
చూస్తుండడంతో, తడబడుతూ “చెప్పండి సార్ “అన్నాడు. అప్పుడు Principal
“చూడు రామకృష్ణా, మీ నాన్న మంచి దేశభక్తుడు, నాకు close friend. అందుకే నువ్వేన్ని సార్లు class
room లో నిద్రపోతున్నా నిన్ను క్షమిస్తున్నాను. నీ emotion నాకు తెలుసు. Class room లో నిద్రపోయి కొన్ని సార్లు
నువ్వు పిచ్చి పిచ్చిగా కలవరించావు. అప్పుడు నాకు అర్ధం అయ్యింది. ప్రపంచం గోల మనకెందుకయ్యా.
ముందు class ముగించి ఇంటికి నడు. ఇంట్లో కూడా రాత్రుళ్లు నిద్రలో
పెద్ద పెట్టున అరుస్తున్నావట. ఎవరైనా మంచి doctor కి చూపించుకో”
అని ఒక ఉచిత సలహా పారేశాడు. రామకృష్ణ తన చూపులతోనే “మనం బ్రతుకుతున్నది ఈ ప్రపంచం లో
కాదా, ప్రపంచం గోల మనకెందుకంటావు, నీకు
అసలు social awareness ఉందా” అన్నట్టు చూశాడు. Principal” చూసింది చాలు, నేను చెప్పింది చెయ్యి ”అని వెళ్లిపోయాడు.
ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమ్ వైపు చూశాడు. అప్పుడు విక్రమ్
“కథ బాగుంది ఇంతకీ నీ question ఏంటి అది చెప్పి తగలడు” అన్నాడు. భేతాళుడు “రామకృష్ణ ఏమి చేస్తే correct” అని అడిగాడు. దానికి విక్రమ్ “ఏడ్చినట్టే ఉంది నీ question. రామకృష్ణ దేశభక్తుడి కొడుకు, బడిపంతులు కాబట్టి కలలు
కంటున్నాడు. అదే businessman అయితే ఇలాటి కలలు కంటాడా. వాడికి
పని తప్పితే ఆలోచించడానికి కూడా తీరిక ఉండదు. కలలు కనే outlet కూడా లేకపోతే రామకృష్ణ కి పిచ్చి ఎక్కుతుంది. మనిషి ఆశాజీవి కాబట్టి రామకృష్ణ
కలలు కనడమే ఉత్తమం. ఇప్పుడున్న ప్రపంచంలో విప్లవాలు రావాలంటే ఇంకా పాకం బాగా ముదరాలి.
అప్పుడు రామకృష్ణ కి జీవితం నిత్యసమరమైపోయి కలలు కనే అలవాటు,
ఆలోచించే ఓపిక రెండూ పోతాయి. ఇంతేనా ఇంకేమైనా ఉందా” అన్నాడు. విక్రమ్ మందు పూర్తి చేసేలోపల
భేతాళుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు.
No comments:
Post a Comment