Thursday, June 23, 2011

Novel


నేను 16 /07 /2009  ఒక నవల వ్రాద్దామని మొదలెట్టి ఆపేసాను - స్రవంతి ఆగిపోతే నవల రాద్దామని - మరి నా బ్లాగ్ చదివే ఫ్రెండ్స్ నాకు ఏమీ సలహా ఇస్తారో?? 

నవలా ప్రారంభం 
"అర్జున్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియలేదు
ఏదో ఒకటి చెయ్యమని మనసు, ఆలోచన చెప్తున్నాయి
ఏదో ఒకటి అద్భుతం చెయ్యాలి లేదా జరగాలి
ఏమి జరగాలి
అతనికి ఆ క్షణం తెలియదు - ఆ సాయంత్రమే ఊహ కి అందని అద్భుతం జరుగుతుందని "

1st episode  
మై డియర్ ఫ్రెండ్స్
"నేను అనుకుంటున్నది చెప్తాను.  మనుషులు  అందరూ ఆనందం కోసమే బతకాలి  - ఎవరి ఆనందం ఎందులో ఉందో అదే చెయ్యాలి.
క్లాసు రూంలో గోల - ఈలలు  - చప్పట్లు. అర్జున్ గోల సద్దు మణిగే వరకు ఆగాడు.
ఇంతలొ పుల్లారెడ్డి లేచాడు " ఏందీ భాయ్ పోరీలతో మస్తు మజా చేయల్నైతే చెయ్యడమేనా "
అర్జున్ ఏమి మాట్లాడ లేదు.క్లాసు రూంలో మళ్ళీ గోల
ఏంటి అర్జున్ నువ్వేమి చేద్దామని అనుకుంటున్నావు అడిగింది రమ
" ఇది అని చెప్పలేను కాని నేను మాత్రం నా మనసుకి నచ్చిందే చేస్తాను అన్నాడు అర్జున్
ఇంక చాలు బాబు, ఇది చెప్పడానికి డయాస్ మీదనించి ఎందుకు, అందరూ అదే చేస్తారు, నువ్వు ఇంక దిగచ్చు అన్నాడు వివేక్
అది బీ కాం సెకండ్ ఇయర్ క్లాసు.  ఎల్. బీ కాలేజీ , విశాఖపట్నం. డిబేట్ కాంపిటీషన్ కి కాలేజీ తరఫున ఎవరో ఒకరిని  ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ కి పంపించడానికి సెలక్షన్స్ . టాపిక్ "చదువైన తరువాత మీరు ఏమి చేస్తారు "
**********
అందరి అరుపులు, కేకలు, గుసగుసలు అయ్యిం తరువాత కాలేజీ బెల్ మోగింది. అందరూ క్లాసు రూమ్స్ లోంచి గుంపులు గుంపులుగా బయటకి రావడం మొదలెట్టారు
వివేక్ అడిగాడు" ఏరా మనం సినిమా కి పోదామా"
ఎ సినిమాకి బ్రదర్ అడిగాడు పుల్లారెడ్డి
ఏదైనా మంచి స్టంట్ మూవీ కి పోదాం బ్రదర్ , ఈ లవ్ గివ్ మనకి పడవు అన్నాడు వివేక్
నాకు వేరే పనుందిరా నేను వెళ్ళాలి అన్నాడు అర్జున్
ఇంకెక్కడికి, మనవాడు సుభద్ర దగ్గిరికే అన్నాడు పుల్లారెడ్డి
రమ నవ్వి "ఎవరా సుభద్ర ఏమా కథ. మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాము" అంది
టైం వచ్చినప్పుడు తెలుస్తుందిలే , బై ఫ్రెండ్స్ అని అర్జున్ బయలుదేరాడు

***********

No comments:

Post a Comment