Saturday, June 11, 2011

ఆలోచనల స్రవంతి -18

ఈ science and philosophy ఏంటో?
ఈ autobiography ఏంటో?
ఇంత బరువుగా ఈ భాష ఏంటో?
ఈ ఏడుపు గొట్టు కవిత్వం ఏంటో?
దీనికి మళ్ళీ ఈ హిందీ -ఉర్దూ mix ఏంటో?
కొంచం కూడా relief లేకుండా, friends అందరిని చదివారా లేదా అని అడిగి, ఈ చావబాదుడు ఏంటో?
అన్నీ కొంచం కొంచం మొదలు పెట్టి ఏది complete చెయ్యకుండా ఈ పద్ధతి ఏంటో?
ఒక్కొక్క సారి అనిపిస్తూ ఉంటుంది అసలు నేను ఎందుకు ఇలాగ అని. నా nature ఇదేనా అని?
అప్పుడప్పుడు సమాధానం తెలుసనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను మూర్ఖుడిని అని.
మళ్ళీ ఏదో పెద్ద అన్నీ తెలిసినట్టు ఒక గొప్ప మహర్షి లాగ ఫోజులు. 
ఏమీ తెలియదని ఒప్పుకోవడానికి అహం లేదు కాని - నాకు కొంచం తెలిసినా వీరావేశం తో వాదిస్తాను.
ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు? ఆత్మా విమర్శా లేక స్వోత్కర్షా?

సరదాగా గడపాల్సిన కాలాన్ని ఇలా బరువుగా గడపడమెందుకో?
సరే సరదా అంటే ఏమిటో?
నా definition ఏమిటంటే friends తో కూర్చుని ఒక peg మందు, ఒక దమ్ము, కొంచం intellectual discussion లేదా family తో కూర్చుని సరదాగా ఒక సినిమా,   పిల్లలతో ఆడుకోవడం. 
ఇవి పెద్ద కోరికలు కావు కాని వీటికి కూడా time కుదరని ఒక ఉద్యోగం.
family అంటే నేనొక్కడినే కాదు కదా  - నా తల్లి తండ్రుల ఆశలు  - నా సగభాగం అమ్మలు ఇంకా నా పిల్లల సరదాలు ఇవన్నీ ఎలాగా? వీటికి డబ్బు కావాలి - కావాలంటే ఉద్యోగం చెయ్యాలి. 
ఎంచుకున్న ఉద్యోగం లో కొంచం డబ్బుంటుంది - time అసలు ఉండదు. మరి బాగా డబ్బు వచ్చి time ఉండే ఉద్యోగం చెయ్యొచ్చు కదా - ఇలా అంటే తలవ్రాత అని ఊరుకోవడమే. ఎందుకంటె నాకు సమాధానం తెలిస్తే అదే చేస్తాను కదా.
అమ్మలు అంటుంది మీరు ప్రయత్నం చెయ్యరు, మీకు బద్ధకం ఎక్కువ. 
బద్దకమే ఉంటె ఈ చావు చాకిరి ఎలా చెయ్యగలను? ఈ targets , ఈ union గొడవలు, ఈ threats , management warnings ఇవన్నీ భరిస్తూ ఎవడికో సంపద పెంచుతూ  - నేనే national productivity కి gear అయిపోయానని భ్రమలో -  ఇదో ప్రపంచం.

ఏంటో గురు - ఈ materialistic plane లో నా కన్నా భయంకరంగా బతికేవాడు నేను సుఖపడుతున్నాను అనుకుంటాడు. నా కన్నా సుఖంగా బతికేవాడు నన్ను చూసి జాలి పడతాడు. 
సరే సుఖం అంటే ఏమిటో?
ఇదే సుత్తి discussion ఎన్ని సార్లు, ఇంకా చాలు అనిపించింది. 

rk గాడు sine curve లాగ కష్టాలు - సుఖాల combinations తో వెళుతూ ఒక పది sms లు పంపించిన తరువాత అనిపించింది. ఆ ప్రవాహంలో పొంగిన తరువాత నాకు గుర్తొచ్చిన ఒకప్పటి నా ఆలోచనల స్రవంతి.

ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటే - పెద్ద మార్పు లేదుకాని  - అలవాటు అయిపొయింది.

5 comments:

  1. take a break and go for outing with family and friends. will get refreshed.

    ReplyDelete
  2. dear clr
    i wonder still you are reading my blog sometimes

    ReplyDelete
  3. ore kameshu nee problem yenti ra.....to me life is short do wht ur heart says....then u will enjoy...pretendt cheyyaku for other sake.

    ReplyDelete
  4. alaage raa - pretend cheyyanu - whatever my heart says i will do it

    ReplyDelete
  5. i have three friends
    they influenced me in three different ways at different dimensions of life
    suryam kamesh rajagopal
    i have many more friends in my exciting life. but there were/are no influences as above.
    the difference between these three and others is simple.
    these three are aware of themselves whereas rest lead their life. say like constructing your own or following life's own terms.
    we less mortals introspect where as they increase their awareness.
    henceforth as sri j krishnamurthy concluded " awareness leads you to truth. introspection leads to self expansion.

    మనసు వెన్నెలే - కానీ అమావాస్య ఎందుకుంటుంది??
    ఇది ప్రకృతి గురూ -
    నీకు అనిపించింది నువ్వు చెప్తే - నా అనుభవం నేర్పింది నేను చెబుతా
    అసలు ముడే లేదు - చిక్కు ముడి ఎక్కడ గురూ
    రాళ్ళు లేవు - కానీ నెత్తురు ఉంది,చెమట ఉంది,కన్నీళ్ళు ఉన్నాయి - లేవా??
    గీతల సంగతి సరే - రాతల మాటేంటి గురూ??
    ఇది నిజం - కలలు కనడం భారం కాకూడదు - నీ ఆశని, ఊహని ఆపగలవా??
    చూపుల కన్నా ఎదురుచూపులే తియ్యన - ఏ మహాకవి అనుభవం లోంచి జాలువారిందో
    శాసించడానికి నువ్వు నేను ఎవరం - విడుదలైన రంగుల బొమ్మలం
    ఎన్ని శాసనాలో మట్టిలో కలిసిపోయాయి -
    పైవాడు చేసిన శాసనాన్ని తెలుసుకోక - మిద్యావరణ ఇచ్చాప్రయత్నబలం తో ఎగిరిపోదామనే అమాయకులం
    నిజానికి - నీకు తెలిసింది ఎంత నిజమో - నాకు తెలిసింది అంతే నిజం
    నీ అనుభవం లోకి రానంత వరకు నువ్వూ నమ్మలేవు - నేనూ చెప్పలేను
    ఇది నువ్వు నేను బ్రతికి, చూసి, అనుభవిస్తున్న ప్రపంచం - ఇదింతే
    ఇది ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా - ఇది కూడా ఇంతే

    ReplyDelete