Friday, May 25, 2012

ఆలోచనల స్రవంతి - 26

Duping History contd.....


వాల్మీకి రామాయణం నేను చదవలేదు. అలాగని కంబ రామాయణం కూడా చదవలేదు. కానీ వాటి మీద వ్యాసాలు చదివాను. నార్ల వెంకటేశ్వరరావు గారి జాబాలి నాటకం చదివాను. దాని ముందు మాటలో ఆయన ప్రక్షిప్తాలు గురించి చర్చ చేశారు. ఆయన చెప్పినడాని ప్రకారం ఆదికవి అనుస్టుప్ చందంలో వ్రాసిన అసలు రామాయణం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఆరు  కాండలలో శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. అందులో రాముడు సామాన్యుడు. అతనితో ఉండే వానరగణం కూడా ఖగోళ శాస్త్రం లాటి శాస్త్రాలలో ఆరితేరినవారు కారు. కానీ కాలక్రమేణా వేరు వేరు కాలాలలో వేరు వేరు కవులు వారికి తెలిసిన, అప్పటి పరిస్తితులలో discover చేసిన, కొత్త విషయాలనన్నిటిని చేర్చి దాన్నిఉద్గ్రంధం చేసేశారు. ఈ ప్రక్షిప్తాలు చేరిన తరువాత వానర ప్రముఖుడైన నీలుడు అప్పటి వరకు అయోమయంలో ఉండి sudden గా ఖగోళశాస్త్ర వర్ణన మొదలెడతాడు అని వ్రాసారు. దాదాపు 200 రామాయణాలు ఉన్నాయిట. కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని ఎవడికి తోచిన రామాయణం వాడు చెప్పడమే. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు సీతని, చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయిన తరువాత మోహిస్తాడు. పెళ్లాడమని అడుగుతాడు. రాముడు ఎన్నో ప్రయాసలతో చివరికి రావణున్ని చంపి తిరిగి సీతని తెచ్చుకుంటాడు. ఒక hero, ఒక heroine, ఒక villain,  love, emotion, revenge formula, సుఖాంతం. ఇప్పుడు కంబ రామాయణం చూస్తే అసలు సీత రావణాసురుడి కూతురట. అడవిలో సీత పడుతున్న కష్టాలు చూసి ఓర్వలేని తండ్రి కూతురుని తిరిగి తెచ్చుకుంటే, రాముడు ఇవ్వమని అడిగితే, ఇవ్వనన్న తండ్రిని చంపి భార్యని తెచ్చుకుంటాడు. ఇదెలా ఉంది. melodrama ఉంది కానీ, రాముడికి ఆపాదించిన పురుషోత్తమ లక్షణాలన్నీమాయమయిపోతాయి. అసలు రావణాసురుడు పంచభూతాలని control చెయ్యగల బలశాలి. అలాటిది రామ బాణం తో బొడ్డు క్రింద కొట్టి చంపేస్తాడు. అసలు యుధ్ధనీతి బాహ్యమైన పని. ఇదెలా ధర్మం. ఇంకా simple గా సూక్ష్మం ఏమిటంటే వాల్మీకిది ఆర్యులు వ్రాసిన కథ, కంబ రామాయణం ద్రావిడులు వ్రాసిన కథ. ఎవడి ఓపిక బట్టీ వాడు నమ్మడమే. మనమా కాలంలో లేము. పెద్దలు ఏది చెబితే అది నమ్మడమే. రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు, ఆనవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా ఏమి జరిగిందో ఎవడికీ clarity ఉండదు. ఎవడి ఓపిక,interest బట్టి వాడు రామాయణం twist చేసేయొచ్చు. మన సినిమా వాళ్ళకైతే ఇంకా liberty. మనమిలా వాదిస్తే వేదాలు చదివిన పెద్దలు నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవని రాముడు చేసిన ప్రతీ పనికి justification ఇస్తూ రాముడు భగవంతుడి అవతారం అని confirm చేసేస్తారు. ఇన్ని చెప్పిన నాకు చిన్నప్పటి నించి వింటున్న రామాయణం అంటే ఎంతో ఇష్టం. 


next post లో నాకు తెలిసిన క్రీస్తు చరిత్ర 


సశేషం 


1 comment:

  1. Even though the early parts of history were the work of british a lot of research has been taken up by eminent people regarding the historical evidences of ramayana.
    one line of thought is it was a work of imagination founded on vague traditions of the kingdom of kosala and its capital Ayodhya. It was also opined that the historical facts
    slowly disappeared with the inclusion of several attaches to the original.
    Another line of thought provides Ramayana as a evidence of penetration of Aryans from north to south and their depiction of themselves as "digvijay"(conquest of all quarters).It signifies the gradual consolidation of tribal kingdoms(more powerful at that time) into territorial; kingdoms controlled by samrat. There were many theories calling vanara a tribe.

    Either Ramayana or Mahabharata carry an underlying imperial tendency of the powerful.
    Rajasuya Ashwamedha were two cloaks of imperialism.

    Many were of the opinion that these two epics were composed between 400B.C. and 200A.D.. You have to understand the difference between the happening and writing.The historians have reached this time frame on the basis of evidences available in the book like ...established caste system a swayamvara...yagnas

    i take a break here.....
    i like too add one more...the jataka tales treat the ramayana in a different aspect..that is both rama and sita are brother and sister

    ReplyDelete