Monday, May 21, 2012

ఆలోచనల స్రవంతి -25

నేను facebook లో post చేసిన కవిత blog లో పెట్టడానికి చాలా రోజుల తరువాత blog ఓపెన్ చేసి చూస్తే, ఎవరో ఒకరు, రోజుకో పది మంది చూస్తున్నారు అని తెలిసి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలిసి నాది చాలా చిన్న friends circle. ఈ మధ్యే facebook పుణ్యమా అని నా matriculation friends కలిశారు ఒక పదిహేను మంది. అందులో ఒకళ్ళిద్దరికి  తప్పితే మిగిలిన ఎవరికీ కనీసం ఇలాటి blogs interest ఉన్నట్టు కనపడలేదు. మిగిలింది rk &team. వాళ్ళకి నా కృతజ్ఞ్యతలు. కనీసం చదివే పదిమందికి ఏదో నా ఆలోచన పంచుకుంటే బాగుంటుందని అనిపించి at the same time వ్రాయాలనే weakness వదలక మళ్ళీ ఇదిగో ఇలా.
ఇంతకుముందు posts లో నేను మళ్ళీ మాట్లాడుకుందాం అని వదిలేసిన topics
1. Duping of history
2. Share markets
3. Human psychology గురించి నాకు తెలిసింది 
5. Hinduism, Islam , Christianity , Buddhism  వీటి పయనమెటు
6. How science advancement leads to God  -దీని మీద ఎంతో కొంత వ్రాసి Fritjof Capra చదువుకోమని వదిలేశాను.
7. Observations on the current global  affairs 
8. నేను ఇంతకు ముందు రాసిన నవల continue చెయ్యడం
9. ఏదో కవిత్వం మళ్ళీ వ్రాద్దామని ప్రయత్నం -అప్పుడప్పుడు ఏదో ప్రయత్నిస్తున్నాను 
10. Space
11. Premonition, ESP ,faith healing etc.,

Duping History అంత సులువైన పని ఇంకోటి లేదు. దీన్నిsubstantiate చెయ్యడానికి నాకు తెలిసిన ప్రపంచ చరిత్ర కి prologue లాగా నా జీవితం లో జరిగిన సంఘటనలు కొన్ని చెబుతాను. ఈ సంఘటనలతో నా memories of life లో కూడా కొన్ని pages నింపచ్చు. 
నేను 7th std లో సుందరి టీచర్ tuition join అయ్యాను. Intermediate 1st year వరకు బాగానే జరిగింది. తరువాత ఆవిడ మిగతా students కి నాకు చూపించిన indifference తో frustrate అయ్యి tuition కి సరిగ్గా వెళ్ళడం మానేసి శివకుమార్ అని ఒక degree friend ని పట్టుకున్నాను, కలిసి చదువుకోడానికి. వాడు చదువు తక్కువ sex కబుర్లు ఎక్కువ మొదలెట్టాడు. అలాగ track నించి deviate అయ్యి ఆ disturbance లో ఎలాగో Intermediate అయ్యింది అనిపించాను. Engineering seat రాలేదు మొదటి సారి. మళ్ళీ అదో frustration. అప్పుడు నాకు నా VT College friend కిశోర్ మళ్ళీ కలిశాడు. అప్పుడు వాడు చూపించిన ప్రపంచం, philosophy నా చిరాకు నించి నన్ను దూరం చేశాయి. వాడి Hindi tuition friend రాంబాబు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. మేము ముగ్గురం బాగా thick friends అయిన తరువాత మా మధ్య నడిచే ప్రధానమైన topic love. కిశోరన్న style కానీ, వాడి attitude కానీ, అమ్మాయిలతో మాట్లాడటానికి బెరుకు లేకపోవడం కానీ, ఏదైనా కానీ వాడికి చాలా మంది girl friends ఉండేవారు. రాంబాబు కి అప్పటికి వాడిని reject చేసిన ఒక case తో బాధపడేవాడు. నేను నా frustration నించి బయటపడటానికి వీళ్ళిద్దరి fancy catch చెయ్యడానికి నేనూ capable అని prove  చేసుకోవడానికి ఎలాగ అని మధనపడుతూ ఉండేవాడిని. అలాటి సందర్భంలో నేను ఒక మంచి కథ చెప్పాను. నాకు ఒక girlfriend ఉందని ఎన్నో సంఘటనలు జోడించి మంచి అద్భుతంగా చెప్పాను. వాళ్ళు నమ్మారో, నమ్మలేదో తెలియదు కానీ ఆ imaginary  love affair మీద చాలా discussions నడిచాయి, చివరికి ఆ మోత భరించలేక నేను రాంబాబు దగ్గిర confess అయ్యేవరకు. నిజంగా నేను confess అవ్వకపోయినట్టయితే వాళ్ళు నిజంగానే నా జీవితంలో జరిగాయి అనుకునేవారు. అదే కథ పిట్టకథలుగా మారి అవసరం వచ్చినప్పుడు వందమంది నోట్లో వందరకాలుగా వినపడుతుంది. ఇంతకీ అది ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ అఖ్ఖరలేదు. నలుగురు friends మధ్యన జరిగే history duping ఇంతలా ఉంటే media network లేని రోజుల్లో ఇంకెంత మార్చి రాయొచ్చు. History గెలిచినవాడు వ్రాసుకునే autobiography అన్నాడు ఒక జ్ఞ్యాని. 

నిజమో , అబధ్ధమో మనకు తెలియదు కానీ history duping లో నాకు నచ్చిన stories రామాయణం, క్రీస్తు చరిత్ర. ఇవే కాకుండా నాకు తెలిసిన History next post లో .

సశేషం 



1 comment: