అమ్మ
ఎన్ని బాధలొచ్చి ఎంత హింసించినా
ఖేద పడక వాటి తేట పర్చి
విజయ పథము పట్టు విజయమ్మ నా యమ్మ
మొసలికంటివారి బుచ్చి విజయ
ఖేద పడక వాటి తేట పర్చి
విజయ పథము పట్టు విజయమ్మ నా యమ్మ
మొసలికంటివారి బుచ్చి విజయ
ఎక్కడున్నను తన పిల్లలే ప్రాణమై
వారి సుఖము కోరి వారి కొరకు
ఉన్నదంతయుపంచి ఉన్న ఇరువురికీ
మురిసిన ఆ ప్రేమ బుచ్చి విజయ
ఏ వేళలోనైన ధైర్యమ్ము చెప్పగా
ఆమె పేరు తలచనదియె చాలు
ఇంత సంగతి ఏల విబుధబాంధవ రామ
ఎవరుకలరు నీకుఅమ్మ గాక
వారి సుఖము కోరి వారి కొరకు
ఉన్నదంతయుపంచి ఉన్న ఇరువురికీ
మురిసిన ఆ ప్రేమ బుచ్చి విజయ
ఏ వేళలోనైన ధైర్యమ్ము చెప్పగా
ఆమె పేరు తలచనదియె చాలు
ఇంత సంగతి ఏల విబుధబాంధవ రామ
ఎవరుకలరు నీకుఅమ్మ గాక
దయను కను విషయాన హృదయమును కరి
గించి , ననుగన్న నా తల్లి బుచ్చి విజయ
ఎవరి కైనను సాయము చేయు నెడల
నీది నాదను బేధము నియ్యదయ్య
గించి , ననుగన్న నా తల్లి బుచ్చి విజయ
ఎవరి కైనను సాయము చేయు నెడల
నీది నాదను బేధము నియ్యదయ్య
అమ్మను గురించి కొత్తగ
పమ్ముట కేమున్నదయ్య పలుకగ ఇలలో
అమ్మొక సత్యము నిత్యము
అమ్మే నీ జన్మ మూలమమ్మే నిజమౌ
అమ్మొక సత్యము నిత్యము
అమ్మే నీ జన్మ మూలమమ్మే నిజమౌ
ఇలనైన కలనైన ఎవరైన కూడ, ఇసుమంత సందియమించుకైనాను
కలగనే కలగదే తల్లి పేరును తలప, ఉన్న భయములు బాపునా తల్లి
తలపే, కనుగొనగ అదియెదో పేగు బంధము భువిన, విడగలేని గొప్ప
అలయైన అనురాగ మభిమాన మౌను, జన్మ జన్మల సంత సంబంధమౌను
తలపే, కనుగొనగ అదియెదో పేగు బంధము భువిన, విడగలేని గొప్ప
అలయైన అనురాగ మభిమాన మౌను, జన్మ జన్మల సంత సంబంధమౌను
కమ్మని ప్రేమను క్రమ్మున పంచు
అమ్మను మించిన దైవము లేదు
అమ్మను మించిన దైవము లేదు
ఎన్ని తప్పులు చేసినా నిను, కడుపు
లోపల దాచి కాచును, అమ్మ ఒకతె
పుడమినందున, తెలుసుకొనగను నిజ
మునిదియే, ఆమె దీవనభాగ్యమేర
లోపల దాచి కాచును, అమ్మ ఒకతె
పుడమినందున, తెలుసుకొనగను నిజ
మునిదియే, ఆమె దీవనభాగ్యమేర
ఏజన్మ పుణ్యమో ఎంత చేసితినోతెలీదాయె
ఈ జన్మలోన ఈతల్లి ఒడిలోన ఆటలాడేను
నా జన్మ జన్మల కర్మ నన్ను దీవించి కరుణన
ఈ జన్మలోఈప్సితమును ఈడేర్చు అమ్మ నొసగెను
ఈ జన్మలోన ఈతల్లి ఒడిలోన ఆటలాడేను
నా జన్మ జన్మల కర్మ నన్ను దీవించి కరుణన
ఈ జన్మలోఈప్సితమును ఈడేర్చు అమ్మ నొసగెను
అసువులీయగ యజ్ఞమే ఇల ఆచరించును ధారగా
కసుగునే నిజ జీవితం తన కన్న బిడ్డల సౌఖ్యమున్
విసిగి పోవక జీవితాంతము పీడ బాపుచు ఆమెతా
నసికిపోవక వంశమంతయు కాచి బ్రోచును అమ్మరా
కసుగునే నిజ జీవితం తన కన్న బిడ్డల సౌఖ్యమున్
విసిగి పోవక జీవితాంతము పీడ బాపుచు ఆమెతా
నసికిపోవక వంశమంతయు కాచి బ్రోచును అమ్మరా
ప్రేమావేశము కట్టతెంచగ నలై లేచేటి జీవామృతం
అమ్మాయంచు తలంచగా నవధులే దాటేటి ప్రేమామృతం
ఏమ్మాయో ఇదియా పరాత్పరుని అవ్యాజానురాగమ్ముయే
అమ్మా నీ నిలుపై మహిన్కదలగా ఆనందమై పొంగునే
అమ్మాయంచు తలంచగా నవధులే దాటేటి ప్రేమామృతం
ఏమ్మాయో ఇదియా పరాత్పరుని అవ్యాజానురాగమ్ముయే
అమ్మా నీ నిలుపై మహిన్కదలగా ఆనందమై పొంగునే
అమ్మను పోలినట్టి మరియింకొక జీవిని కానలేవురా
ఇమ్మహిలోపలన్ వెతుక నీవిక, ఏ రకమైన ప్రాణియై
నా, మదికందునే కనగ అమ్మను చేరిక ఉల్లసిల్లునే
కమ్మని అమ్మ మాటల సుధారసమందున సంతసించునే
ఇమ్మహిలోపలన్ వెతుక నీవిక, ఏ రకమైన ప్రాణియై
నా, మదికందునే కనగ అమ్మను చేరిక ఉల్లసిల్లునే
కమ్మని అమ్మ మాటల సుధారసమందున సంతసించునే
జగతిని అమ్మ ప్రేమకు సరైన మరొండు ప్రకర్ష యే కదా
మిగిలిన వన్ని జీవితము నీడ్చుటకున్ ఉపయోగమైనవే
దిగుముడి వంటివే ఎపుడు వీడి అధాటున పోవునో తెలీ
దు, కలిగి అమ్మనే తలచ నొక్కనిమేషము సంస్పృశించురా
మిగిలిన వన్ని జీవితము నీడ్చుటకున్ ఉపయోగమైనవే
దిగుముడి వంటివే ఎపుడు వీడి అధాటున పోవునో తెలీ
దు, కలిగి అమ్మనే తలచ నొక్కనిమేషము సంస్పృశించురా
No comments:
Post a Comment