తెలిసిన మేధతో జగతి మేల్కొలుపన్దల పోసి పోరగా
సెలయును వేదనాభరిత రేగిన కాలము జీవితాన, నే
అలసిన జీవ నాడులు దిగంబడు భీకర తోలు ఖైదులో
దులి విలపించినాను దయనుంచి సుఖంబును నించు రామయా
సెలయును వేదనాభరిత రేగిన కాలము జీవితాన, నే
అలసిన జీవ నాడులు దిగంబడు భీకర తోలు ఖైదులో
దులి విలపించినాను దయనుంచి సుఖంబును నించు రామయా
అలసిన భర్తజీవుడికి అర్ధముకానదు రొంపుముంపులో
మలకల భార్య మోహరము మధ్యవయస్సున వెంటవెంటనే
తిలకిని సద్దు ,చంపు నిను భీకరఘాత విఘాత పంతమన్
తెలిసిన మోక్ష మొచ్చును కథే ఇక మారును వింత సంతతో
మలకల భార్య మోహరము మధ్యవయస్సున వెంటవెంటనే
తిలకిని సద్దు ,చంపు నిను భీకరఘాత విఘాత పంతమన్
తెలిసిన మోక్ష మొచ్చును కథే ఇక మారును వింత సంతతో
గిరగిరమని సుడులుతిరిగి బిరబిర చనునే వయసు
చురచురమని కనలుకలచు పెరిగి తరుగు ఈ మనసు
విరవిరలాడును మనసు విరిగిపడును ఈ తలపుల
తెరలేవని తెరిపిలేని తెలవారని విసుగు బతుకు
విరవిరలాడును మనసు విరిగిపడును ఈ తలపుల
తెరలేవని తెరిపిలేని తెలవారని విసుగు బతుకు
విరివికాడెవ్వడు ఇలను విన్యాసములు సలుపంగ
పరిధి దాటని అనుభవము భవము, ఇది ఋతము స్వామి
పరిపరి విధముల పోవు పరికించి తెలుసుకొనంగ
సరియని విడవగలేరు కథ విధివిధములే స్వామి
పరిధి దాటని అనుభవము భవము, ఇది ఋతము స్వామి
పరిపరి విధముల పోవు పరికించి తెలుసుకొనంగ
సరియని విడవగలేరు కథ విధివిధములే స్వామి
గయ్యాళి పెళ్ళాము కోరి గందరగోళము సలిపి
సయ్యాటలాడుచు రేగి సమరము సేయగా, ఇంటి
అయ్యగారి పరువుపగిలి అరుగెక్కగా విసిగేను
బయ్యగారి అపరిచితుడి బతుకట్టె ఆవిరైపోయె
సయ్యాటలాడుచు రేగి సమరము సేయగా, ఇంటి
అయ్యగారి పరువుపగిలి అరుగెక్కగా విసిగేను
బయ్యగారి అపరిచితుడి బతుకట్టె ఆవిరైపోయె
లేదుర గమ్యం బతుకున, లేదు దీని ముగింపు వెతుక
ఏదో ఒకటి తేలితే మరేదో ఒకటి మొదలయ్యి
ఆద్యంతము వెతుకులాట ఆనందమొకనాటి మాట
వేదం మనకొక సాధనము వేదనలను పాపగలదు
ఏదో ఒకటి తేలితే మరేదో ఒకటి మొదలయ్యి
ఆద్యంతము వెతుకులాట ఆనందమొకనాటి మాట
వేదం మనకొక సాధనము వేదనలను పాపగలదు
సుమతీ అంగన అంచయాన రమణీ సుప్రీత సీమంతినీ
కమలా కోమలి సారసాక్షి సుదతీ కర్పూరగంధీ రమా
విమలా వారిజలోచనా సుజఘనా బింబాధరీ సుందరీ
కొమరాలా మగువా లతాంగి లలనా కోమా సుధామంజరీ
విమలా వారిజలోచనా సుజఘనా బింబాధరీ సుందరీ
కొమరాలా మగువా లతాంగి లలనా కోమా సుధామంజరీ
స్వర్గ నరకము లెక్కడున్నవి
భగ్గుమను నీ మెదడు లోనే
నిగ్గు తేల్చుట నీకు కుదరదు
ఉగ్గడించుమురా
భగ్గుమను నీ మెదడు లోనే
నిగ్గు తేల్చుట నీకు కుదరదు
ఉగ్గడించుమురా
మంచిమాటలు ఇంచుకైనను
చించినా నీ మతిని కానను
ముంచినా నీ ధిషణ పాలను
పెంచునా నీ తెలివి తేటలనూ
ముంచినా నీ ధిషణ పాలను
పెంచునా నీ తెలివి తేటలనూ
ఎంతో కొంత కవిత్వ మాధురిన మోహంతో అనాయాసమున్
అంతా వ్రాయగనింకనూ మిగిలి పోయిందయ్య విన్నావుగా
ఛందో బధ్ధముగా లిఖించుటకు మోహం ఒక్కటే చాలదే
ఇంతింతై ఎదగంగ కావలెను భావం భాష ఒక్కంతగా
అంతా వ్రాయగనింకనూ మిగిలి పోయిందయ్య విన్నావుగా
ఛందో బధ్ధముగా లిఖించుటకు మోహం ఒక్కటే చాలదే
ఇంతింతై ఎదగంగ కావలెను భావం భాష ఒక్కంతగా
భారీగా మన భాష ఉండటము కాదయ్యా అవశ్యమ్ముగా
భారమ్మే కనినంత కావ్యమున వాడా భాష, భావమ్ముతో
నారంభించి, సరాగ మాత్మ కుహరమ్మాచిందు లీలావిలా
సారంభమ్మున తేలు భాష, మనసంతా నిండు ఓ నాదొరా
భారమ్మే కనినంత కావ్యమున వాడా భాష, భావమ్ముతో
నారంభించి, సరాగ మాత్మ కుహరమ్మాచిందు లీలావిలా
సారంభమ్మున తేలు భాష, మనసంతా నిండు ఓ నాదొరా
ఆనందం తన సౌరు విప్పి అలలా నాలోన రేగంగనే
గానావేశము గీతమై మనము ఆలాపింపగా వీడెనే
శానా రోజుల నిస్పృహా జనిత మాంద్యం విభ్రమాలోలయై
శ్రీ నా లోగిలి క్రమ్మి మంగళ యశోశ్రీగంగలవ్వంగనే
గానావేశము గీతమై మనము ఆలాపింపగా వీడెనే
శానా రోజుల నిస్పృహా జనిత మాంద్యం విభ్రమాలోలయై
శ్రీ నా లోగిలి క్రమ్మి మంగళ యశోశ్రీగంగలవ్వంగనే
కవనము అందరికి అనువు కాదులే
వ్యుత్పత్తి లేక ఉత్పత్తి కాదు
మునిగినవారల మోదము పరికింప
అవగత మౌనులే ఎవరికైన
కనుగొన మనసార ఘనసాంద్ర మేధో వి
తానమ లరగా పదములు పలుకు
వేయిమా టలు ఏల విబుధ విన్యాసలీ
లావినో దము వివరింప వేమి
వ్యుత్పత్తి లేక ఉత్పత్తి కాదు
మునిగినవారల మోదము పరికింప
అవగత మౌనులే ఎవరికైన
కనుగొన మనసార ఘనసాంద్ర మేధో వి
తానమ లరగా పదములు పలుకు
వేయిమా టలు ఏల విబుధ విన్యాసలీ
లావినో దము వివరింప వేమి
గురువు గారు మీకు గురుతు చేయుట ఇది
బరువు మోయ లేక పగులు కొనుచు
మీకు విద్య నేర్ప మేమేంతవారము
కనికరించి మమ్ము కాచు కొనుడి
బరువు మోయ లేక పగులు కొనుచు
మీకు విద్య నేర్ప మేమేంతవారము
కనికరించి మమ్ము కాచు కొనుడి
సంగమమై ప్రవాహపు శక్తులు, కలిసి
కాంతి వాయు జల ప్రకంపనములు
నేనై, విభాసమై నేను నావెలుపల
నాలోపల అహానికి అనువైన
అణువై, అలరుల సరముల కలతిరుగి
అనృతమే ఋతమై, ఋతమొక ఇరుసు
బిగిసి విలయమై విహితమై మతమున, స
మ్మతమై, వలయ కవన మనువయ్యె
కాంతి వాయు జల ప్రకంపనములు
నేనై, విభాసమై నేను నావెలుపల
నాలోపల అహానికి అనువైన
అణువై, అలరుల సరముల కలతిరుగి
అనృతమే ఋతమై, ఋతమొక ఇరుసు
బిగిసి విలయమై విహితమై మతమున, స
మ్మతమై, వలయ కవన మనువయ్యె
బాధ లేదు మనసుకి ఆరాటమసలు
లేదు, తెలుసుకోవాలన్న ఇచ్ఛ లేదు
తెలిసినా అది ఏ మార్పు లేదని తెలి
సి బడసితిని నిశ్చింత ఇదియె నిజముగ
లేదు, తెలుసుకోవాలన్న ఇచ్ఛ లేదు
తెలిసినా అది ఏ మార్పు లేదని తెలి
సి బడసితిని నిశ్చింత ఇదియె నిజముగ
వయసునున్నపుడు తెలివి వఱలలేదు
మనసు ఏరీతి నుడివెనో అటుల, తీపి
తినుచు మధుమేహము తగిలి తీటతీర
జిహ్వికకు పంచదారయె చేదు గాదె
తినుచు మధుమేహము తగిలి తీటతీర
జిహ్వికకు పంచదారయె చేదు గాదె
సకల శాస్త్రముల్ పిండి చెండాడి తెరచి
లోని మర్మములన్నిటి నొప్పగించి
మోడి సర్కారు అనగనే మిర్రి చూచు
మేటి వీరు డెమ్మార్వి ఏ మేలమాడు
లోని మర్మములన్నిటి నొప్పగించి
మోడి సర్కారు అనగనే మిర్రి చూచు
మేటి వీరు డెమ్మార్వి ఏ మేలమాడు
కాయము మారదే మనము కాగిన వేగిన ఏమిటో ప్రభూ
మాయల లోయలో తనువు మాపుల పాయల ఊయలూ గెనే
ప్రాయము లాగగా ,బతుకు పాడెను సాయల ఏమిటో విభూ
ఆయము తేలదే, నిజము ఆశల శ్వాసల గానమా యనే
మాయల లోయలో తనువు మాపుల పాయల ఊయలూ గెనే
ప్రాయము లాగగా ,బతుకు పాడెను సాయల ఏమిటో విభూ
ఆయము తేలదే, నిజము ఆశల శ్వాసల గానమా యనే
భావము నిండుగా పలకజాలక భాషను చీల్చి వేయచూ
రావము మెండుగా సలిపి, రాగము లేని అయోమయం నగా
రా వణకంగ మోది ఇదిరా కవితాఝరి యంచు చించగా
ఈ వధనోపజాల నను నీ క్షమతో దయకానరా హరా
రావము మెండుగా సలిపి, రాగము లేని అయోమయం నగా
రా వణకంగ మోది ఇదిరా కవితాఝరి యంచు చించగా
ఈ వధనోపజాల నను నీ క్షమతో దయకానరా హరా
తెలియగనే
కలకలమే
అలకలలో
విలయములే
అలకలలో
విలయములే
సలిలములే
మిళితములై
లలితములై
అరవిరిసే
మిళితములై
లలితములై
అరవిరిసే
కలల అలౌ
అలల కలౌ
విలసితమౌ
తలపులవే
అలల కలౌ
విలసితమౌ
తలపులవే
అరవిరిసే
తలపులతో
మురియగనే
సరియగునే
మురియగనే
సరియగునే
పవనములే
దవనములై
జవనములే
కవనములై
దవనములై
జవనములే
కవనములై
అనలముయే
కనలెనొహో
అణువులలో
రణరవమై
కనలెనొహో
అణువులలో
రణరవమై
యుగములలో
భగభగలే
మిగిలినవీ
నిగమములే
భగభగలే
మిగిలినవీ
నిగమములే
కవనఝరీ
రవణములే
శ్రవణములో
మవురియయే
రవణములే
శ్రవణములో
మవురియయే
No comments:
Post a Comment