కందం తో ఆగలేదు ఆవేశము .. మంచో .... చెడ్డో ...తప్పో...తడకో...ఇదొక flow ..మధ్యలో రామకృష్ణ శతకం వ్రాద్దామని అదో ప్రయత్నం.. వెరసి ఆటవెలది.
ఏది ఎంత నిజము ఏది అబధ్ధమ్ము
అవధరించు లోపు బతుకు ముగియు
మిథ్య పథ్య రథ్య మిగులు మీమాంసలో
మనసు పలికె నిటుల రామకృష్ణ
అవధరించు లోపు బతుకు ముగియు
మిథ్య పథ్య రథ్య మిగులు మీమాంసలో
మనసు పలికె నిటుల రామకృష్ణ
ఇహమునకు ఉపరిన ఇంకొకటి కలదా
ఎవరికెంత నరయు ఎంత తెలియు
ఉన్నఇహము ఒకటి ఉలికి పడవలదు
మనసు పలికె నిటుల రామకృష్ణ
ఎవరికెంత నరయు ఎంత తెలియు
ఉన్నఇహము ఒకటి ఉలికి పడవలదు
మనసు పలికె నిటుల రామకృష్ణ
వంపు సొంపు ముంపు వలవంత రొంపులో
చంపు కంపు రంపు ఇంపు నింపు
కంత లంత వింత లింతింత కాదయా
సంత ఎంత నాపు రామకృష్ణ
చంపు కంపు రంపు ఇంపు నింపు
కంత లంత వింత లింతింత కాదయా
సంత ఎంత నాపు రామకృష్ణ
ఆకలి ఒకటే నిజముర ఈ జగతిన
మిగిలి ఉన్నవన్ని దీన్ని అతుకు
ముక్కలే కనుగొన, ముక్కిమూల్గి బతికి
దాన్ని తీర్చుటేర రామకృష్ణ
మిగిలి ఉన్నవన్ని దీన్ని అతుకు
ముక్కలే కనుగొన, ముక్కిమూల్గి బతికి
దాన్ని తీర్చుటేర రామకృష్ణ
భాష ఎంత బరువుగా వేసినా, వీర
ఘోష లేక కంఠశోష లేర
కోష్ణ భావ రాగ లోలిత కవితలే
మనసుని మురిపించి మరులు తెఱలు
ఘోష లేక కంఠశోష లేర
కోష్ణ భావ రాగ లోలిత కవితలే
మనసుని మురిపించి మరులు తెఱలు
గురువు గారు ఏరి కుదిపేటి కవితతో
క్రాంతి కథల వెలుగు భ్రాంతి కలుగ
శాంతి నొంది సుంత శయనించ పూనిరా
మాడపాటి సామి పలక వేమి (mrv)
క్రాంతి కథల వెలుగు భ్రాంతి కలుగ
శాంతి నొంది సుంత శయనించ పూనిరా
మాడపాటి సామి పలక వేమి (mrv)
ఏది నీ అనుభవ మేదని వెతికిన
గుర్తు పెట్టుకున్న స్మృతియె మిగులు
గుర్తు పెట్టుకోని స్మృతులు ఏమాయెనో
కాలచక్రమహిమ రామకృష్ణ
అన్ని పద్యములను అలవోకగా వ్రాసి
నీతి తెలిపి మనకి మతిని కుదిపి
ఏమి మిగిలినదిర వేమన వ్రాయని
ఆ అపూర్వ నీతి రామకృష్ణ
నీతి తెలిపి మనకి మతిని కుదిపి
ఏమి మిగిలినదిర వేమన వ్రాయని
ఆ అపూర్వ నీతి రామకృష్ణ
ఎందుకని కవితని చెండాడి చీల్చుచు
ఛందమనుచు దాని అందమునకు
గండి కొట్టి, భావ ఝరినంత నిలుపుచు
చంపెదవుర బాధ పంచెదవుర
ఛందమనుచు దాని అందమునకు
గండి కొట్టి, భావ ఝరినంత నిలుపుచు
చంపెదవుర బాధ పంచెదవుర
No comments:
Post a Comment