Tuesday, September 27, 2011

New poetry -13

బరువైన తేలిక కవిత 

మనసుదేముంది మాస్టారూ 
ఎలాగైనా మడిచేయచ్చు
మాట వినకపోతేనే వస్తుంది తంటా అంతా

అవసరానిదేముంది అబ్బాయీ
ఏదో ఒకటి చేసేయచ్చు
నిర్వచనం మారిస్తేనే అయోమయం అంతా 

బ్రతుకుదేముంది బాబ్జి 
ఎలాగైనా బ్రతికేయచ్చు 
ఇలా ఉండాలి అంటేనే కష్టం అంతా 


కవిత్వానికేముంది కాముడూ
ఏదో ఒకటి వ్రాసేయచ్చు 
చదివేవాడి ఆంతర్యం మీదే అర్ధం అంతా 


ఇది వ్రాసిన తరువాత నాకు జంధ్యాల సినిమాలో జోక్ గుర్తుకు వచ్చింది
అదేంటంటే 
" నేను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా
నేను రచయితని కానన్నవాడిని రాయెత్తి కొడతా"

5 comments:

  1. నేను రచయితని కానన్నవాడిని రాయెత్తి కొడతా"

    "నేను రచయిత్రిని" అని నాకు గుర్తు ఎందుకంటె తను (శ్రీలక్ష్మికి) మగ ని కవి అంటారని ఆడని కవయిత్రి అంటారని తెలియదు అని జంధ్యాల ఉద్దేశ్యం అని నా ఉద్దేశ్యం .

    చదివేవాడి ఆంతర్యం మీదే అర్ధం అంతా
    అంతే మరి విద్వాంసుల విద్య నీటి కొలది తామర చందం కనుక !

    ఇలా ఉండాలి అంటేనే కష్టం అంతా
    అవును మరి .....!!! నిజమే మరి ...!!!

    నిర్వచనం మారిస్తేనే అయోమయం అంతా
    మన వచనమే నిర్వచనం కదా మరి ..!!

    ReplyDelete
  2. విమర్శదేముంది మాస్టారూ
    ఎలాగైనా చేయచ్చు
    హేతువుతొనే సమస్యంతా

    ReplyDelete
  3. యద్భావం తద్భావతి
    సృష్టి రమ్య మైనదే దృష్టి రమ్య మైతే

    ReplyDelete