భౌతికమైన ఈ ప్రపంచంలో
అణగారే ఆర్ధిక వ్యవస్థ
తయారుచేసిన పరిస్థితులలో
బ్రతుకు బండి లాగడానికి
గాడిలో పడిన గానుగెద్దులా
ఉదయం నించి సాయంత్రం వరకు
ఊపిరి సలపని పనిలోంచి
ముంచేసే విరక్తి లోంచి
బయటపడే దారులు వెతికే
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు
ఉన్నవాటితో తృప్తి చెందక
రకరకాల ప్రయత్నాలతో
ఎగురుదామని కొందరు
ఎగరలేనివారు కొందరు
పాప భూయిష్టమైన
ఈ ప్రపంచాన్ని చూసి
మార్చేద్దామని కొందరు
మురిసిపోయేవారు కొందరు
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు
ఆవల ఈవల వెతుకులాటలో
అర్ధంకాని ఈ విశ్వాన్నితెరచి
సిద్ధాంతం చెప్పేవాళ్ళు
వేదాంతంలో మునిగేవాళ్ళు
వాళ్ళని పట్టుకు ఏడ్చేవాళ్ళు
వీళ్ళని చూసి నవ్వేవాళ్ళు
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు
నిరామయమైన జగతిలో
నిరంతర ప్రవాహాలలో
అద్వైత భావనలో
అద్యంతరహితమైన ఆలోచనలలో
నిత్యానంద ఝరిలో
నిర్వికల్ప సమాధిలో
తనువు మరచి వెలుగు పరిచే
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు
ఆనందపు భ్రమలో
ReplyDeleteసత్యానికి అసత్యానికి దూరంగా
సన్మార్గపు తలపులతో
రాజీ పడుతు పడక
నిత్యం సంఘర్షణతో
శాశ్వత శున్యతతో
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు
ఉన్నవాటితో తృప్తి చెందక
ReplyDeleteరకరకాల ప్రయత్నాలతో
ఎగురుదామని కొందరు
ఎగరలేనివారు కొందరు
పాప భూయిష్టమైన
ఈ ప్రపంచాన్ని చూసి
మార్చేద్దామని కొందరు
మురిసిపోయేవారు కొందరు
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు
fits indian political system accurately. great poem
గాడిలో పడిన గానుగెద్దులా ....
ReplyDeleteనిత్యానంద ఝరిలో
నిర్వికల్ప సమాధిలో ...
బ్రతుకు చట్రంలో ఇరికిన ఓ బాటసారీ ఆనందానికి నీ అర్ధం ఏమిటి? నిర్వికల్ప సమాధికి నీ నిర్వచనం ఏమిటి?
ఒకటి భౌతికం, రెండు మానసికం
ReplyDeleteఆనందం అంటే నీలో నీతో నువ్వు సమత్వం పొందడం
నిర్వికల్పసమాధికి నా నిర్వచనం జనకుడి నిర్వచనమే
this particular set of poems seems to be a universal set. perhaps every one fits at one line or other.
ReplyDeleteఅద్యంతరహితమైన ఆలోచనలలో
నిత్యానంద ఝరిలో
నిర్వికల్ప సమాధిలో
తనువు మరచి వెలుగు పరిచే
kamesh sir
do you think such state exists
yes it exists -there is a thin line between both the states - if it is uncontrolled you will end up in asylum - if it is controlled you will end up in delirium
ReplyDelete