నేను blog ఎందుకు వ్రాస్తున్నాను
1 . పనీ పాట లేక
2 . ఏమీ తోచక
3 . నా లోని depression కి ఒక outlet కోసం
4. నేను ఇంత రాయగలను అని feeling కోసం
5. నా స్నేహితులు నన్ను పొగుడుతారని
6. Adsense ఏవో నాలుగు డబ్బులు సంపాదిద్దామని
7. ఈ blog తో జనాల్ని కూడేసి ధనికదేశాల నడ్డి విరుద్దామని
8 . నేనొక బాబా లాగ అవతారం ఎత్తుదామని etc ., etc
8 . నేనొక బాబా లాగ అవతారం ఎత్తుదామని etc ., etc
ఇందులో అన్నీ నిజం కావొచ్చు. ఏదీ నిజం కాకపోవచ్చు. కొన్ని నిజాలు ఉండొచ్చు. ఎవడికి నచ్చినట్టు, అర్ధమైనట్టు వాళ్ళు తీసుకోవచ్చు. దీనికి అంతం లేదు.
ఇదెందుకు చెప్తున్నాను అంటే దీని ముందు post లో అన్నాహజారే గురించి చెప్తూ నేను ఇది అతని అహాన్ని సంతృప్తి పరుచుకోడానికి అని అన్నాను. rk గాడు దీనికో twist ఇచ్చాడు. ఈ idea వాడిది కూడా కాదు ఇంకెవరో అన్నారో, వ్రాశారో అని, అదేంటంటే "ఇంతకుముందు ఇంకెవరో ఇలాగే corruption కి against గా నిరాహార దీక్ష చేసి చచ్చిపోయాడు -వాడి గురించి అసలు ఎవడూ పట్టించుకోలేదు - ఇప్పుడు ఈ అన్నాహజారే ని ఇంతలాగ elevate చేస్తున్నారంటే వాడి వెనక ఉన్నది ఎవరు? ఏ విదేశీ హస్తం? వాడి ఆంతర్యం ఏమిటి?
అందుకన్నమాట.
నిజంగానే భారత దేశ సమైక్యతని అస్థిరం చెయ్యడానికి ఇది కుట్ర అయ్యి ఉండొచ్చు. అన్నా హజారే ఆ కుట్ర తాలూకు tool అయ్యి ఉండొచ్చు. నిజం గానే అతను తెలిసి చేస్తూ ఉండొచ్చు. తెలియకుండా పావులా వాడబడుతూ ఉండొచ్చు.
ఏది ఏమైనా అతని ఆంతర్యం ఏదైనా చేసే పని తాలూకు result ముఖ్యం. మొత్తానికి Governament ఒప్పుకుంది. అది శుభం. Governament దీని ఆచరణ ఎంత clarity తో చేస్తుందో అందరికీ తెలుసు. కానీ ఇప్పటి ఈ result నా లాటి cynics కి ఒక చెంప పెట్టు. ఇప్పుడు అన్నా హజారే hospital ఖర్చులకి డబ్బులు ఎవడు కడతాడో చూడాలి.
ఇంతకు ముందు posts లో నేను share markets గురించి తరవాత చర్చిద్దామన్నాను. next post లో దాని గురించి నాకు తెలిసింది నాకు వచ్చిన భాషలో.
No comments:
Post a Comment