Thursday, October 27, 2011

New poetry - 14

నేను దాటని నా జీవితం 


నేను అన్న అహం  - నేను చూసిన భవం
కలిస్తే, జ్ఞ్యాపకంలో నిలిస్తే - అనుభవం


అనుభవం స్మరిస్తే  - అంతరంగం తెరిస్తే
అర్ధమయ్యే పరమార్ధం  - నిజం


నాకెదురైన అనుభవాల
నేను నమ్మిన నిజాల
కనుసన్నలలో నడిచే నేను
కరిగి ప్రవహించే క్షణాల
చెలగి విరచించే పదాల
మెరిసి రవళించే గీత కావ్యం - నా జీవితం 


3 comments:

  1. అనుభవం *అంతరంగం *నిజం.
    Three interlinked elements. what i felt after reading this :

    అనుభవం లో నేర్చింది
    అంతరంగం ఒప్పక పొతే
    నిజం గ్రహింపుకు రాక పొతే
    అప్పుడు

    నాకెదురైన అనుభవాల
    నేను నమ్మని నిజాల
    కనుసన్నలలో నడిచే నేను
    అంతరంగంలో ప్రవహించే
    ఉద్రిక్త క్షణాల
    విరచించే ప్రహేలిలో
    కరిగి పోయే గీత కావ్యం - నా జీవితం

    ReplyDelete
  2. busy with work sir!no more serious posts

    ReplyDelete
  3. bogged down under heavy work - even to open my mail also i am finding difficult due to this - no regrets - happy to see you wished me

    ReplyDelete