Tuesday, April 12, 2011

Memories of my life - 3

2nd std అయిపోయిన తరువాత 3rd std  కోసం మమ్మల్ని VT కాలేజీ main branch నించి శివాలయం branch కి transfer చేశారు. అక్కడ నాకు ప్రసాద్ అని class mate ఉండేవాడు. మాకు 3rd std లో English Fay teacher చెప్పేవారు. ఆవిడ class లో  నేను ఈ ప్రసాద్ last bench లోకి చేరి ఆవిడ notes చెబుతుంటే class work లో సున్నాలు చుట్టడం మొదలెట్టాం. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం, నవ్వుకుంటూ చెలరేగి సున్నాలు చుట్టేయడం. ఆ frenzy ఏ స్థాయికి చేరిందంటే teacher వచ్చి పక్కన నించున్నాపట్టించుకోవడం మానేశాం. ఆవిడకి కోపం వచ్చి ఇద్దరినీ scale తో బాదింది. నేను ఏడవడం మొదలెట్టాను. వాడు ఏడ్చినట్టు ఏడ్చి నేను ఏడుస్తుంటే నన్ను చూసి నవ్వడం మొదలెట్టాడు. Fay teacher కి ఇంకా కోపం వచ్చి వాడి half pant విప్పేసింది. నేను భయపడిపోయాను. వాడు ఏడుస్తూ నవ్వుతూ, రకరకాల mixed expressions మొదలెట్టాడు.  ఆవిడకి  విసుగొచ్చి ఆవిడ క్లాసు అయిపోయే వరకు మా ఇద్దరినీ గోడ కుర్చీలు వేయించింది. 


మా ఇంట్లో క్రింద portion లో చట్టి సన్యాసిరావు doctor గారు అద్దెకి ఉండేవారు. వాళ్ళ పిల్లలు బుజ్జి, చిన్ని, రాము, శ్యాము. వాళ్లతో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. అందులో best game పేక మేడలు కట్టడం. వాళ్ళ families లో పండగలకి పేకాట ఆడేవారు. అలాగా ఆడి వదిలేసిన ఎన్నో పేక సెట్లు వాళ్ళ ఇంట్లో ఉండేవి. వాటితో మా ఓపిక కొద్దీ మేడలు కట్టడమే. ఒక్కొక్క సారి ఉదయం మొదలెడితే సాయంత్రం వరకు అదే పని. 3rd std half yearly సెలవలకి  బుజ్జి గాడి వాళ్ళ బావ చక్రి, shillong నించి వచ్చాడు.  వాడు మాకు towering inferno అనే సినిమా కథ చెప్పాడు. ఎంత బాగా expressive గా dramatize చేసి  చెప్పాడంటే వాడు వెళ్లి పోయిన కొన్ని నెలల వరకు మేము అదే మాట్లాడుకున్నాము. 


ఈ మధ్యలో నా తమ్ముడు మురళీవి కొన్ని పిల్ల episodes ఉండేవి. వాడు ఏదో జెర్రిని చూస్తూ మా ఇంటి ఎదురుకుండా  గ్రంధివారి అరుగు మీద నించి కుళ్ళు కాలవలో పడిపోయాడు. ఆ దెబ్బకి వాడి చెయ్యి విరిగింది. దానికి మా నాన్న గారి ఒకే ఒక్క vizag  friend , చింతకాయల లక్ష్మి నారాయణ( తాతాజీ అని పిలిచే వాళ్ళు) దగ్గిరకి పరిగెత్తి వెళితే వాడి చేతికి కట్టు వేసి ఇంటికి పంపించారు. ఇంకో సారి వీధి క్రాస్ చేస్తూ ఉంటె వీడిని ఒక సైకిల్ వాడొచ్చి గుద్దేశాడు. బుర్ర మీద బొప్పి కట్టింది. తరువాత అందులో నల్లగా blood చేరి ఆ బొడిపి పొంగడం మొదలెట్టింది. డాక్టర్ బుచ్చిరాజు దగ్గిరకి తీసుకు వెళితే వీడికి cyringe పెట్టి బుర్రలోంచి ఆ కుళ్ళు blood తీశారు. 
వాడి జీవిత చరిత్ర ఘట్టాలన్నీ ఎప్పటికప్పుడు climax లాగ ఉండేవి.

నేను అంత గొప్పగా కాకపోయినా బాగానే చదివే వాడిని. మామూలుగా క్లాసు లో second rank వచ్చేది. ఒక సారి వసంతరావు వారి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడు అక్కడ ఆడవాళ్ళు అందరు ఒక దగ్గిరకి చేరి ఎవరి పిల్లల గురించి వాళ్ళు గొప్పలు చెప్పడం మొదలెట్టారు. మా అమ్మ నా గురించి గొప్పలు చెబుతూ మా వాడికి క్లాసు లో 1st rank అని  చెప్పింది. నేను వెంటనే "అదేంటమ్మా నాకు 2nd కదా" అన్నాను. పాపం మా అమ్మకి ఎలా cover చేసుకోవాలో తెలియలేదు.  వీడికి ఏమి మాట్లాడాలో తెలియదు అనేసి నవ్వేసి ఊరుకుంది. 

3rd class సెలవలకి అనుకుంటాను మా అమ్మ బిళ్ళకుర్రు ముందే వెళ్ళిపోయింది. నన్ను మా చంటి మావ ఆ సెలవలకి తాతగారింటికి తీసుకు వెళ్ళాడు. మా చంటి మావ అప్పట్లో AU లో MSc చేసేవాడు. సామర్లకోట వరకు train లో ప్రయాణం చేశాము. అక్కడినించి bus లో రాకూర్తివారిపాలెం (రావులపాలెం ముందు stop ) వరకు. రాకూర్తివారిపాలెం లో బల్లకట్టు ఎక్కి పాయని క్రాస్ చేసి అక్కడ నించి నడకతో బిళ్ళకుర్రు. ఈ train ప్రయాణంలో మా ఎదురు సీట్లో ఒకాయన కూర్చున్నాడు. కాసేపు పోయిన తరువాత నాతొ సరదాగా discussion start చేశాడు. నీ పేరేంటని అడిగాడు.  M . కామేశ్వర రావు అని చెప్పాను. కానీ నేను ఈశ్వరరావు M .Com అని పిలుస్తాను అని ఆట పట్టించటం మొదలుపెట్టాడు. నేను బుర్ర అడ్డంగా ఊపాను. కానీ అతను ఎందుకు అలా పిలవకూడదు అన్నాడు. నేను కాసేపు బుర్ర అడ్డంగా ఊపుతూ "మీరన్నది ఏమీ సబబుగా లేదు " అన్నాను. అతను కొంతసేపు తేరుకోలేదు. నేను అంత పెద్ద మాట వాడతానని అతను అనుకోలేదు. నేనన్నది అర్ధం అయిన తరువాత అతను పెద్దగా చాల సేపు నవ్వి దిగిపోయేటప్పుడు టాటా చెప్పాడు. మా చంటి మావ మా తాతగారి ఊళ్ళో నా ప్రతాపం కథలు కథలుగా చెప్పాడు.

ఇలాటి సెలవల్లో ఆ బిళ్ళకుర్రులో పెద్ద పిల్లల ముఠా ఒకటి తయారయ్యేది. మా పెద్ద తాతగారికి ఏడుగురు పిల్లలు ఇరవై మంది మనవలు. చిన్న తాతగారికి ఇంచుమించు అంటే పటాలం. ఇది కాక ఆ ఊళ్ళో ఒక పదిహేను ఇళ్ళు మా చుట్టాలు లేకపోతె బాగా closely knitted families ఆ ఊరి పెద్దలు.మా నాన్నగారి  families కూడా దగ్గిర బంధువులే అవ్వడంతో Jamshedpur నించి ఇంకొన్ని families with పిల్లలు దిగేవారు. ఆటలాడేటప్పుడు అందరూ పోగైపోయే వారు. ఒక నలభై, ఏభై మంది పిల్లలం ఉండేవాళ్ళం ఆ పండగలకి. సత్రం భోజనం మఠం నిద్రలా ఉండేది. సాయంకాలం వరకు ఏవో ఆటలు, సాయంతం పెరట్లో ఒక ఏభై మడత మంచాలు వేసేవారు. ఎవరి convenience కి వారు adjust అయిపోయి వాటి మీద పడుకోవడం. ఆ సెలవల్లోనే మా తాతగారి ఇంట్లో మా ప్రసాద్ మావ "మాయల ఫకీర్" వేషం వేశాడు. మొత్తం ఒళ్ళంతా బొగ్గు రాసేసుకుని ఒక పంచె కట్టుకుని చేతిలో ఒక ఇనప రోడ్ పట్టుకున్నాడు. ఈ పిల్లల పటాలాన్ని radio గదిలో కూర్చో బెట్టి lights ఆర్పేశారు. చిన్నరాంబాబు బావ ఆ lights ఆర్పుతూ వెయ్యడం. " మాయల ఫకీరుకి  తిరుగులేదు కదూ" అని మా ప్రసాద్ మావ గట్టిగా నవ్వుతూ మా మీద పడిపోయినంత పని చేసే సరికి, నేను గట్టిగా అరిచి " నేను వెళ్ళిపోతాను" అని అరవడం మొదలెట్టాను. వెంటనే వాళ్ళు అసలు ఇంత భయమైతే ఎందుకు వచ్చావు అని అని బయటికి పంపించేశారు. 




No comments:

Post a Comment