నేను V.T. College లో Matriculation వరకు చదివాను. నన్ను మూడేళ్లకే school కి పంపించింది మా అమ్మ. అప్పట్లో LKG , UKG అని ఉండేవి కావు. మొదటిసారి 1st std కంటే ముందు baby class అని introduce చేశారు. అందులో join చేసింది. Mary Cooper మా class teacher . ఆవిడ photo film roll (అప్పట్లో agfa film roll అది, బెత్తెడు వెడల్పు లో ఒక పక్క red గా రెండో పక్క black గా ఉండేది) ని పొడుగ్గా సాగదీసి నిన్ను పొడిచేస్తాను అని నన్ను భయ పెట్టింది. నేను భోరు మని ఒకటే ఏడుపు. ఇంటికి వచ్చి school కి వెళ్లనని గోల. మర్నాడు మా అమ్మ school కి వచ్చి ఆ టీచర్ ని దెబ్బలాడి నన్ను కూర్చోపెట్టింది. ఆ తరువాత Mary teacher నాకు chocolates ఇచ్చేది. కొంచం ఊహ వచ్చిన తరువాత నాకు అనిపించింది ఆవిడ సరదాకి అలా చేసిందని.
1std లో మాకు ఆదిలక్ష్మి teacher తెలుగు చెప్పేది, సరోజినీ teacher లెఖ్ఖలు చెప్పేది. ఆదిలక్ష్మి గారు పిక్క పాయసాలు పెడితే, సరోజినీ గారు duster తో కొట్టేది. ఒక రోజు ఎందుకో సరోజినీ teacher కి నా మీద కోపం వచ్చి duster తో బుర్ర మీద కొట్టింది. బుర్ర కన్నం పడి రక్తం కారడం మొదలైంది. ఆ సాయంత్రం అమ్మ అడిగింది ఏమైంది అని. సరోజినీ teacher కొట్టింది అని చెప్పాను. మళ్ళీ మర్నాడు అమ్మ school కి హాజరు. సరోజినీ teacher ని నిలదీసింది. ఆవిడ నా వైపు గుడ్లు ఉరిమి చూసి " ఏరా నేను నిన్ను కొట్టానా" అని అడిగింది. మీరే అంటే మళ్ళీ కొడుతుందేమో అని భయం వేసింది. అమ్మకి "ఈవిడ కాదు ఆదిలక్ష్మి teacher" అని చెప్పాను. వెంటనే అమ్మ ఆదిలక్ష్మి teacher దగ్గిరకి తీసుకెళ్ళింది. ఆవిడ కూడా గట్టిగా అడిగే సరికి మళ్ళీ భయపడి "ఈవిడ కూడా కాదు" అని చెప్పాను. మా అమ్మ నా మీద విసుక్కుని ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఎందుకు అలా చేసాను అని చాలా సార్లు అనుకున్నాను.
నాకు 2nd క్లాసు లో రవికుమార్ అని ఒక friend ఉండేవాడు. వాడి ఇద్దరు అక్కలు మా class లోనే చదివేవారు. వాళ్ళ పేర్లు బేబీ రాణి, వాణీ కుమారి. వీడు వాళ్ళ చెడ్డీలు వెనకనించి లాగి చూపిస్తూ ఉండేవాడు. చిన్న పిల్లడినని మా అమ్మ వీళ్ళతో tie up , నన్ను ఇంటి దగ్గిర దింపడానికి. నన్ను వాళ్ళందరూ "పొట్టీ" అని పిలిచేవారు. ఒక రోజు నేను కూడా ఉత్సాహం ఎక్కవ అయిపోయి వెనక నించి బేబీ రాణి చెడ్డీ లాగేను. వెంటనే బేబీ రాణి నన్ను "పొట్టీ మీ అమ్మకి చెప్తాను ఉండు" అని భయ పెట్టింది. ఇంటి వరకు ఒకటే tension బేబీ రాణి చెప్పెస్తుందేమోనని. కానీ ఎందుకో ఆ అమ్మాయి చెప్పలేదు. బతుకు జీవుడా అనే feeling అప్పుడు తెలిసింది.
సెలవలకి అమ్మ బిళ్ళకుర్రు మా తాతగారి ఇంటికి తీసుకు వెళ్ళేది. మా తాతగారు అక్కడ మూడు ఊళ్ళకి కరణం. 2nd class సెలవలలో అక్కడికి వెళ్ళినప్పుడు మా తాతగారి ఊళ్ళో సానిమేళం పెట్టారు. ఊళ్ళో మగాళ్ళందరూ ఆ మేళం చూడొచ్చు. ఆడవాళ్ళు, పిల్లలు చూడకూడదు. మా బావ పెద్ద నర్సింగుని అడిగాను "నేను చూడచ్చా?" అని. వాడు చిన్న పిల్లలు చూడకూడదు అన్నాడు. వాడు అప్పట్లో half pants వేసుకునేవాడు. నేను అడిగాను "నువ్వు పెద్దవాడివా?" అని. వాడేదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. సరే ఎలాగైనా అదేంటో తెల్సుకోవాలనుకున్నాను. మా చిన్న తాతగారి ఇంటి డాబా పైనించి ఆ program కనపడుతుంది. వీళ్ళందరూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తరువాత ఎవరికీ కనపడకుండా మేడెక్కి చూడ్డం మొదలెట్టాను. ఆ మేళంలో ఆడవాళ్ళు తాగేసి సినిమా పాటలు పాడుతూ డాన్సులు.ఒక అమ్మాయి ఒక కర్ర ముక్కని ముందు పెట్టుకుని, ఒక సినిమా పాట parody, "లేగిసేస్తుంది లేగిసేస్తుంది మావయో" అని డాన్సు చేసింది.ఈ లోగా మా సుందర దొడ్డమ్మ వాళ్ళు వచ్చి "ఎవర్రా అది" అని అరవడంతో silent గా కిందకి దిగి వచ్చేశాను. మర్నాడు మా చంటి మావా వాళ్ళు తాతగారి గది పక్కనే ఉండే నడవలో ఆ మేళం గురించి మాట్లాడుకుంటుంటే ఊరుకోలేక "నేను చూశాను" అని చెప్పాను. "ఏం చూశావురా" అని అడిగారు వాళ్ళు. నేను వెంటనే ఒక చీపురు పుల్ల ముందు పెట్టుకుని నేను చూసిన sequence పాట పాడుతూ repeat చేసాను.వాళ్ళందరూ నవ్వులు. "మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి " అన్నారు. నేను మళ్ళీ మొదలెట్టాను. ఈ లోగా మా అమ్మ radio గదిలోంచి ఆ నడవలోకి వచ్చి నా విన్యాసాలు చూసింది. నన్ను రెండు తిట్టి, నా రెక్క పట్టుకు లాక్కు పోతూ, మా చంటి మావకి రెండు అక్షింతలు వేసింది.
సశేషం
one thing is pretty interesting. your memory traces back to the years where kids even dont form a line of thought. And perhaps this observation, analysis and exploration formed kamesh.
ReplyDeletethis also leads to another interesting observation. you are emotionally more inclined towards your mother. Eric berne observes that such a child in his adulthhood and later suffers as he cannot confide everything to mother as he did in childhood and suffers internally. This may be a curse if a replacement is not found for mothers place.
And as thomas harris stated" what ever the first five years experience, feel and do is the next course for a life time."
And i hope you should have observed surrounding and nature a lot those year( with sea forming a back ground). I wish to see a kid kamesh's perspective of nature.