Sunday, November 28, 2010

ఆలోచనల స్రవంతి - 14

గృహ హింస
Domestic violence - ప్రపంచమంతటా వ్యాపించి, iceberg  లాగ పైకి పూర్తిగా కనిపించనటువంటి ఒక జాడ్యం.
అహంకారాలతో life partners  పెట్టుకునే చిత్రహింస. ఒకరిని ఇంకొకరు dominate చెయ్యడానికి  చేసే ప్రయత్నంలో జరిగే ఒక బలి. పాతకాలం చాదస్తాలు పోని పితృస్వామ్య వ్యవస్థ లో పెరిగిన మగాడి అహంకారం ఫలితం. ఈ domination తరువాత emotional , physical , sexual abuse గా పరిణమిస్తుంది. పెరుగుతున్న కొద్దీ ఆ మనిషి పెరిగే సంఘం, వాతావరణం ఈ violence ని ప్రేరేపిస్తాయి.
పిల్లల మీద కూడా తల్లితండ్రుల గృహ హింస ప్రభావం చాలా ఉంటుంది. ఆడపిల్లలయితే ఇలాటి వాతావరణంలో పెరిగి ఈ violence కి soft targets అవుతారు.
తాగుడు లాటి వాటికి బానిసలైన వాళ్ళు అయితే తమ స్వేచ్చకి భంగం కలిగిందని ఈ రకమైన ప్రవృత్తికి అలవాటు పడతారు.
ఏది ఏమైనా ఈ రకమైన హింస సమాజానికి చాలా హానికరం.
ఇంతకీ ఇంత ఆవేశంగా ఎందుకు రాయలనిపించిందంటే రోజు రోజుకీ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ళ కారణంగా inter personal relations కూడా affect అవుతున్నాయి. ఒత్తిడిలో ఉన్న మనుషులు తయారు చేసే సంఘం, అలాటి సంఘంలో పెరిగే మనుషులు, వలయాలలో ఈ సమస్యని ద్విగుణీకృతం చేస్తున్నారు.
దీనికి solution ఏమిటంటే  చెడు  అలవాట్లు మాని  సంయమనం నేర్చుకుని,ఆడైనా,మగైనా ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని  సఫలం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఇంతకు ముందు ప్రపంచంలో ఉన్న దోపిడీ గురించి చెప్పడానికి try చేశాను. ఇప్పుడు ఆ దోపిడీ వ్యవస్థ కి మూల కారణమైన మనిషి ప్రవృత్తిని గురించి నా ఆలోచనలు పంచుకుందాం అనిపించి  చేస్తున్నప్రయత్నం ఇది.
ఇలాగే నాకు అనిపించిన మరికొన్ని ఆలోచనలు  దీని continuation లో.


సశేషం

No comments:

Post a Comment