Sunday, November 7, 2010

ఆలోచనల స్రవంతి - 13

Reality shows
వీటి మీద ఏమి వ్రాయాలో అర్ధం కాలేదు. ముగింపు సంగతి తరువాత అసలు ఎలా మొదలు పెట్టాలో తెలియటంలేదు. వ్రాయమని request OK . ఎందుకంటే ఇవన్నీ కాలక్షేపం బఠానీలు. timepass programs .
పాటల, ఆటల,వంటలు, dance, sports competitions,  ఇవి కాక big boss type ప్రోగ్రామ్స్ - అంటే రక రకాల మనుషులని ఒక glass house లో బంధించేసి hidden cameras తో  వాళ్ల తాలూకు movements /moments ని క్యాచ్ చేసి presentations,splitsville లాటి  love / hate relationships in enclosed environments ఇంక వేరే వేరే  competitions వీటి మీద నిజంగా ఏమి వ్రాయాలో తెలియ లేదు. తీసే వాళ్ళు తీస్తారు, చూసే వాళ్ళు చూస్తారు. మన శిల్ప శెట్టి లాగ ఈ shows నించి celebrities అయిపోయేవాళ్ళు కొందరు.
అసలు ఈ idiot box ఒక cigarette , alcohol లాటి మత్తు. ఒక వ్యసనం. Life is a habit అన్నాడు ఒక మహానుభావుడు. మనం మన అలవాట్లని ఎలా shape చేసుకుంటే అలా ఉంటాయి. ఇంతకు ముందు పుస్తకాలు చదవడం ఒక universally accepted and good hobby .అలాటి పరిస్థితులలో నేను స్కూల్ పుస్తకాలు కాకుండా వేరే ఏమైనా చదువుతుంటే మా అమ్మ చదువు మానేసి ఈ చెత్తంతా ఎందుకు అని తిట్టేది. ఇప్పుడు మంచో, చెడో తెలియదు TV watch చెయ్యడం చాలా సహజం  అయిపొయింది. cheap అండ్ best . ఇంక ఏ ఏ programs watch చెయ్యాలో ఆ తల్లీ తండ్రుల వాళ్ల వాళ్ళ అభిరుచుల మీద ఆధార పడి వాళ్ళ పిల్లలకి అలవాట్లలోకి మారిపోతాయి. ఇన్ని రకాల reality shows వచ్చాయి అంటే జనాలు కావాలని అడిగినట్టే.


ప్రతీది ఇలాగే. variety కోసం ఎవడో ఏదో మొదలెడతాడు. జనాలకి నచ్చుతుంది. బోర్ కొట్టకుండా ఉండడానికి టీవీ వాళ్ళు ఆ shows కి రకరకాల మసాలాలు జోడిస్తారు. నచ్చుతున్న కొద్ది పెంచుకుంటూ పోవడమే. కొన్నాళ్ళకి వెగటు పుట్టినా TV వాళ్ళు మార్చరు. ఎందుకంటే అప్పటికి sponsors , vested interests అన్నీ చేరి program జనాలని హింసించే levels లో ఉన్న ఆపే పరిస్థితి ఉండదు. అవి కొన్నాళ్ళు నడిచి తరువాత వాటి చావు అవి చస్తాయి. తరువాత వీళ్ళు మంచివి చూపించటం లేదని జనాలు, జనాలు మేచ్చేవి చూపిస్తున్నామని టీవీ వాళ్ళు  - ఈ గొడవ మామూలే. TV అనే కాదు - -అంతకు ముందు సినిమాల గురించి కూడా ఇదే గొడవ.


మారుతున్న కాలానికి, అభిరుచులకి తగ్గట్టుగా ఈ వినోద సాధనాలు.
నేను నా ఫ్రెండ్ మొన్న దూరదర్శన్ లో starting లో వచ్చిన serials హమ్ లోగ్  , ఏ జో హాయ్ జిందగీ, show theme గురించి మాట్లాడుకుంటూ అప్పట్లో ఎంతో బాగుండేవి ఇప్పుడు ఎలా అయిపోయాయి అని తెగ feel అయిపోయాము.


నేను HBO , Star movies లోనో Truman show అని ఒక సినిమా చూశాను. అందులో హీరో Jim carrey అనుకుంటాను, వాడి  చిన్నప్పుడే ఒక camera ,mike ఏదో implant చేసేసి వాడి జీవితాన్నే ఒక live show  లాగ  మార్చేస్తారు. వాడు ఆఖరికి ఏడ్చుకుని చచ్చి చెడి ఒక emotional climax లో ఆ show close చేసేస్తారు. అందులో last లో  ఏదో ఒక argument కూడా ఉన్నట్టు గుర్తు. real life కంటే ఈ virtual fabricated life better అని. కానీ ఏదో జరిగి చివరికి వాడు real life లోకి అడుగు పెడతాడు
ఇంకొన్ని రోజులలో నిజ జీవితం తో విసుగెత్తి జనాలు ఈ virtual reality లో బతికేస్తారు అనిపిస్తుంది.


ఈ ఆకలికి కూడా ఏదైనా virtual భోజనం ఉండేటట్టు అయితే  బాగుండేది. ఇంకా కష్ట పడవలిసిన అవసరం ఉండదు.


కొన్ని ఇళ్ళల్లో ఇంకా వీలు కుదిరేటట్టయితే  computer with net connection  common అయిపొయింది. సరే అదో అల్లరి.


కానీ ఒకటి నిజం. ఈ science advancement  చాలా మంచిది. మనిషిని దేముడికి దగ్గరగా తీసుకు వెళ్ళేది అదే.
అది ఎలాగ అని నేను అనుకుంటున్నానో ఇంకో సారి.


సశేషం

No comments:

Post a Comment