Sunday, November 7, 2010

ఆలోచనల స్రవంతి - 12

మొన్నటి దాకా వ్రాసినవి చూసుకుంటే ఇంతకు ముందు ఒక సారి అనిపించింది మళ్ళీ నాకు అనిపించినదేమిటంటే నాలో ఎందుకనో చాలా ద్వేషం ఉందని. ఎవడి మీదో కోపం. ఎందుకో చిరాకు. ఒక పెచ్చు మీరిపోయిన స్వాతిశయం, ఒక restlessness .
అసలు నాలో ఒక positive side అనేది ఉందా అని నా మీద నాకే doubt వచ్చేసింది.
మళ్ళీ నాకు నేనే justification ఇచ్చుకున్నాను.  మంచి కోరుకునే కదా ఇవన్నీ వ్రాస్తున్నాను.
అవును ఏం మంచి నేను కోరుతున్నాను. ఒక ద్వేష రహిత సమ సమాజం. అందరూ సుఖంగా ఉండే ఒక స్వర్గం.
నిజంగా అన్ని అందరికి సుఖంగా అమరిపోతే ఇంక problems ఉండవా?
ఈ వ్యత్యాసాలు ఉండబట్టి ప్రపంచం ఇంత variety గా ఇన్ని రంగులతో ఉంది కానీ లేకపోతే   - ఆంతా బాగుండే మాటైతే  నిజంగా utopia అయితే మొదటి రోజు పండగ,  రెండో రోజుకి bore కొడుతుందేమో!
ఈ ప్రపంచం ఇలాగే correct ఏమో?
ఆంతా ఒకేలా ఉంటే తరువాత చెప్పుకోడానికేమీ ఉండదు.


అసలు అందరి బుద్ది ఒకేలా ఉండవలిసిన అవసరం ఏమిటి.
అందరూ ఏ ఏ points లో కలవాలి? దేనిలో differ అవ్వొచ్చు ?

మళ్ళీ అనిపించింది నేను మొత్తం bottom దాకా చూసి ఇంకా తెలుసుకోవడానికేమి లేవనిపించి, ఆచరించడానికి ఓపిక, interest లేక, మళ్ళీ ఇంకో logic తీసి కాలక్షేపం చేస్తున్నానేమో అని. 

ఎందుకంటే,  వివేకానంద పుస్తకాలు - రామకృష్ణ మఠం ప్రచురణలు  - జ్ఞ్యాన యోగం , కర్మ యోగం, భక్తి  యోగం, రాజ యోగం, అనుష్టాన వేదాంతం ఇలా కొన్ని  పుస్తకాలు చదివాను. చదివినంత  సేపు ఒక ఫీలింగ్ నేను గొప్ప జ్ఞ్యానం  పొందుతున్నాను అని. చదివిన తరువాత నేను అందరి  వేపు ఒక బాబాలా అర్ధ నిమీలిత నేత్రాలతో చూద్దామని  ఫీలింగ్.  అవి ఎంత వరకు ఆచరించాను అని ఎవరూ అడగలేదు. నేను ఆచరించినట్లు నాకు కూడా అనిపించలేదు. తరువాతఆ పుస్తకాల్లో  ఏమి వ్రాసి ఉందో గుర్తుకు   తెచ్చుకుందామన్న గుర్తుకు రాలేదు.  కొన్నాళ్ళు అది శంకరుడు వ్రాసిన వివేక చూడామణి చదివి "తితిక్ష" అని గెంతాను. ఈ "తితిక్ష" అంటే ఎలాటి పరిస్థితినైనా సంఘటనైనా నిర్వికారంగా గ్రహించగలిగే ఒక అవస్థ. సాధన ద్వారా కలిగే మానసిక స్థితి . మళ్ళీ ఏదో విషయంలో కొంచం చిరాకు  రాగానే వెర్రి కోపం వచ్చేసి  అరుపులు , గెంతులు.  
అప్పుడు అనిపించింది చదవడం వల్ల కలిగే ప్రయోజనం దారి తెలుసుకోవడం అయితే దాన్ని ఆచరించడం వల్ల పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని. 
సరే ఆచరిద్దామని కొన్నాళ్ళు ప్రయత్నించాను. కొంత బద్ధకం, కొంత పరిస్థితి -  నా డబ్బా logic నాకు కరెక్ట్ - అన్నీ వదిలేశాను.  అందుకే అలా కాలక్షేపం చేస్తున్నానేమో అనిపించింది. 

"అర్ధం లేని ఈ జీవితంలో కాలక్షేపమే కదా  పరమార్ధం" - మరి నేను ఎంచుకున్న కాలక్షేపం మంచిదే కదా - అందరికీ ఏదో చెప్దామని - మళ్ళీ అనిపించింది - ఆచరించని దానిని అవతలి వాడికి నీతి బోధలా చెప్తే conviction ఉండదు - నాకే తెలియదు దాని అర్ధం ఏమిటో - ఇంక చెప్పడం ఎందుకు అని 
గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధి వీళ్ళ వ్యక్తిత్వం అందుకే అంత ఉన్నతం ఏమో?  ఆచరించి తరువాత చెప్పడానికి ప్రయత్నించారు. 



మొన్న ఒక బిచ్చగాడి మీద నా friend చిరాకు పడడం చూశాను. వీడి మీద ఇంకొంత మంది నా friends చెడ్డగా అనుకుంటుంటే విన్నాను.  పోనీ ఆ ఫ్రెండ్స్ జీవితాలు ఏమైనా correct గా ఉన్నాయా అంటే అదీ కనపడలేదు. పోనీ correct  గా  లేవు అనడానికి నాకున్న తెలివితేటలూ సరిపోలేదు.
అయినా ఎవడి జీవితాన్ని define చెయ్యడానికి ఎవడికి అర్హత ఉంది. ప్రతీవాడి జీవితం లోను రకరకాల కోణాలు. ఎవడి జీవితాన్ని వాడు బాగు చేసుకోగలిగీ, బాగుచేసుకోని బలహీనతలు.  ఆలోచిస్తూ పొతే అన్నీ నిజం, సరైనవే అనిపించే కారణాలు.
ఇవన్నీ మిధ్య అనుకుంటే  problem లేదు. మిధ్య అనుకుంటే అసలు ఇంక ఆలోచించవలసిన అవసరమే లేదు.
ఇవన్నీ మిద్యా? ఏమో ఎవడికి తెలుసు.


ఇంతకు ముందు ఈ పరలోకం concept తో ప్రజలు కొంత భయం తో పక్కవాడికి ఇబ్బంది పెట్టకుండా బతికే వారు.సాయం చేస్తూ బతికే వారు. పుణ్యం వస్తే స్వర్గం వెళ్ళొచ్చు అని.  ఇప్పుడు ఆ నమ్మకం తగ్గి బతికున్నప్పుడే సుఖపడాలి అని తెగించి ప్రయత్నాలు.
చచ్చిన తరువాత ఏమి జరుగుతుందో తెలియదు, నమ్మకం లేనప్పుడు - -తెగించినప్పుడు ఇదింతే.


అసలు విషయమేమిటంటే ఎవడికైనా ఇప్పటి పరిస్థితులలో డబ్బు అవసరం. అది ఉంటే 95 % problems solve అయిపోతాయి. balance 5 %  కోసం ఈ  Abraham నుండి pope వరకు   - శంకరుడి  నుండి latest స్వామీజీ వరకు 
ఒక రేంజ్ దాటితే నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ, ఆచరించడానికి పనికిరావు. 




అసలు chemical locha నాలోనే అనుకుంటాను. ఈ అశాంతి నుంచి ఎలా బయట పడాలి. తెలియదు.
ఇంతకు ముందు కొంత శాంతి ఉండేది. ఏదో కావాలని పని కల్పించుకుని పనిలో పడి ఈ ఆలోచనలన్నీ మరిచిపోఎవాడిని. అంటే escapist పద్ధతి అన్నమాట.
ఈ బ్లాగ్ నించి అది కుదరటం లేదు.దీంట్లో  వ్రాసినవన్నీ ఎప్పటికప్పుడు మళ్ళీ చూడటం. ఏదో కొత్తవి వ్రాద్దామని ప్రయత్నాలు.

In the lighter vein ఈ సారి న ఫ్రెండ్ RK గాడిని ని కుమ్మేయ్యాలి. నా weakness వాడు పట్టేసాడు. నా ఈ literary interest -  అది నాకు ఎందుకుందో తెలియదు  - అక్కడ కొట్టాడు - ఈ blog ఒకటి అంటించాడు. 


నా శ్రీమతి నా  blog మీద ఒక మంచి satire కొట్టింది. retirement తరువాత చెయ్యాల్సిన పనులు మీరు ముందే ఎందుకు చేస్తున్నారు అని.


సశేషం

No comments:

Post a Comment