Geography
గురించి గానీ, ద్వీపాల గురించి మాట్లాడుకునే
ముందు మనం అర్ధం చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే మన వేదాలు అవీ west
లో కూడా ప్రచారం చెయ్యబడ్డాయి. Exchange of Culture and
Philosophy ఎన్నో వేల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. అందుకే అక్కడ
గ్రీక్, రోమన్, పర్షియన్,ఈజిప్షన్ కథలకి మన పురాణాలకి చాలా links కనపడతాయి, links కాకపోయినా మన పురాణాల తాలూకు shades కనపడతాయి. మన పురాణాలు కూడా కాలం నించి కాలానికి మారుతూ ఎప్పటికప్పుడు
కొత్త విషయాలు add చెయ్యబడుతూ వచ్చాయి. నాకు తెలిసి ఋగ్వేదం
కూడా కొంత ప్రపంచ వర్ణన, మనిషి తాలూకు వర్ణన ముగిసిన తరువాత
మిగతాది history తాలూకు వర్ణన అని నా అభిప్రాయం. నా లేఖ్ఖ
ప్రకారం ఇక్కడి పురాణాలు పేర్లు మార్చి అక్కడ
కథల కింద మార్చబడ్డాయి. ఇంకా కొన్ని అక్కడి కథలు ఇక్కడ,
ఇక్కడి కథలు అక్కడ వాటి తాలూకు impact value ని బట్టి exchange
చేసుకోబడ్డాయి. Bluffing, updating అన్ని చోట్ల జరిగింది. కానీ అన్ని చోట్ల కంటే ఎక్కువగా ఒక రకమైన logic
& reasoning base చేసుకుని సిద్ధాంత
చర్చలు, scientific development జరిగింది
జంబుద్వీపం లోని భరత వర్షం లోని భరత ఖండంలోనే. నాకు తెలిసిన కొంత మంది, atomic theory గురించి కణదుడు, ayurvedic medicine
గురించి చెరకుడు, medicine, surgery and plastic surgery గురించి సుశ్రుతుడు, astronomy and
mathematics గురించి ఆర్యభట్టు, వరాహ మిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు, chemistry
and metallurgy గురించి నాగార్జునుడు అతని అనుయాయులు, advanced trigonometry, sine& cosine series గురించి మధ్వాచార్యులు, yoga గురించి
పతంజలి – ఇలాగే ఎంతోమంది ఈ పుణ్యభూమిని తమ విజ్ఞ్యానoతో
పరిపుష్టం చేశారు. అలాగే సంస్కృతం అతి ప్రాచీనమైన భాష. ఈ భాషల గురించి వేరొకసారి
చెప్పుకుందాం.
నా చిన్నప్పుడు 3rd std చదివేటప్పుడు మా తాతగారి ఊరిలో మాయల
ఫకీరు నాటకం చూశాను. అందులో “ఫకీరు నీ ప్రాణం ఎక్కడుంది” అంటే “సప్త సముద్రాలు, సప్త
ద్వీపాలు దాటి వెళితే అక్కడ ఒక ద్వీపంలో, మర్రి చెట్టు
తొర్రలో, చిలకలో ఉంది” అని. నా 7th
std geography లో oceans, continents గురించి చదువినప్పుడు దీని link దొరికింది. ఇక
విషయానికి వద్దాం.
ఈ geography గురించి అదీ physical geography గురించి ఈ సంకల్పంలో ఉన్న detail మినహా ఎవరూ
చెప్పినట్టు కనపడలేదు. అసలు మనవాళ్లు ఇంత ముఖ్యమైన subject ని
ఎలా neglect చేశారో చాలా రోజుల పాటు అర్ధం కాలేదు. ఒక సారి tv
లో భక్తి channel లో మల్లాది చంద్రశేఖర
శాస్త్రి గారు భారతం చెప్తూ “సప్త ద్వీపా వసుంధరా” అని మహాభారతంలో ఉంది అన్నారు. మహాభారతం
లో ఉన్న ఆ ద్వీపాల పేర్లు “ జంబూ, ప్లక్ష, గోమేధక, శల్మలి, కుశా, క్రౌంచ, శాక, పుష్కర” అని. ఆ
తరువాత విష్ణుపురాణం గురించి వేరెవరో వ్యాఖ్యానిస్తూ అందులో ఏడు ద్వీపాలు కాదు
పదమూడు ఉన్నాయి అన్నారు అవి “భద్రశ్వ, కేటుమళ్ళ, జంబూ, ఉత్తర కురవ, ఇంద్ర
ద్వీప, కశేరుమత్, తామ్రవర్ణ, గభస్తీమత్, నాగ ద్వీప, సౌమ్య, గంధర్వ, వరుణ, భరత” అని
చెప్పారు. ఇదేంటి ఎవడికి తోచింది వాడు వ్రాయడమేనా అని ముందు అనుకున్నా తరువాత నేను
Geography చదివేటప్పుడు continents, tectonic plates అన్నవి గుర్తుకు వచ్చాయి. ఈ భూమి తాలూకు lithosphere
యొక్క motions వల్ల ఏర్పడే భూకంపాలు, పర్వతాలు, లోయలూ తద్వారా కాలం తో పాటు మారుతున్న
భూమి ఉపరితలం. Alfred Wegener 1915 లో వ్రాసిన “The
Origin of Continents & Oceans “లో ఈ
భూభాగాల కదలికలకీ కారణమైన continental drift గురించి paleomagnetism గురించి చెప్పడం జరిగింది. ఆ తరువాత 1950 లో సముద్ర గర్భం లో ఉన్న భూమి
కదలికలు నించి magnetic striping
గురించి కనిపెట్టబడిన తరువాత ఇంకా నిర్ధిష్టంగా ఈ tectonic plates కదలికలు define చెయ్యబడ్డాయి. ఇప్పుడు current
plates ఏవంటే African, Antarctic, Eurasian, North American, South American, Pacific, Indo-Australian.
ఈ Indo Australian plate కొన్ని సార్లు Indian
plate, Australian plate గా separate గా refer చేయబడతాయి. ఇంకా చిన్న చిన్న plates
కూడా గుర్తించారు కానీ పెద్ద plates పైన
చెప్పినవే.
ఇప్పుడు మనవాళ్లు చెప్పిన description తీసుకుంటే జంబూ ద్వీపం అంటే
అవిభాజ్య Eurasian మరియు Indo-Australian ప్లేట్ అని అందులో భరతఖండం అంటే Asia భాగమని, భరతవర్షం అంటే India అని అనుకోవచ్చు.
మర్చిపోయాను, ఆ సంకల్పం చెప్పేటప్పుడు “జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖoడే, మేరో దక్షిణ దిగ్భాగే” అని కూడా ఉండేది. ఈ మేరు పర్వతం గురించి మార్కండేయ
పురాణం లో, బ్రహ్మండ
పురాణం లో వర్ణన ప్రకారం జంబూ ద్వీపం నాలుగు కమలం రెక్కలలా ఉండి ఈ మేరు పర్వతం
వాటి మధ్యలో ఉండేదని ఒక వర్ణన. సూర్య సిద్ధాంతం ప్రకారం మేరు పర్వతం భూగోళ మధ్యలో
ఉండేదని దాని చుట్టుపక్కల మంద్రాచల, సుపసర్వ, కుముద, కైలాస పర్వతాలు ఉండేవని వర్ణన. ఈ సూర్య
సిద్ధాంతం లో వివిధ గ్రహాల సంచారం తాలూకు details అలాగే
గ్రహాల positions , కాలం, దూరం, దిశ, సూర్య చంద్ర గ్రహణాలు,
వాటి తాలూకు ప్రభావాలు, వివిధ గ్రహాల conjunctions, సూర్య చంద్రుల చెడు ప్రభావాలు, ప్రపంచం తాలూకు
ఆవిర్భావం, భూగోళ వర్ణన, ఈ విశ్వం
తాలూకు కొలతలు, sundial లో ఉండే gnomon
తాలూకు వర్ణన, నక్షత్రాల కదలికలు మనిషి మీద
వాటి ప్రభావం అనీ చెప్పబడ్డాయి. మరి ఈ మేరు పర్వతం ఎక్కడుంది అన్నది పెద్ద question.
వరాహమిహిరుడి “పంచ సిద్ధాంతిక” లో ఈ మేరు పర్వతం ఉత్తర ధ్రువం (North
pole” దగ్గిర ఉంది అని description ఉన్నా, కొంత correlation తరువాత ఈ మేరు పర్వతాలు Central
Asia లోని Tajikistan దగ్గిర ఉండే Pamir
mountains గురించి వర్ణన అనిపిస్తుంది. Mount Everest ఎత్తు define చెయ్యక ముందు ఈ మేరు పర్వతాలని (Pamir
mountains) “Roof of the world” అనుకునేవారు.
Francis
Wilford అనే అతను 1761 లో East India Co.,
తరఫున వచ్చిన Lieutenant Colonel. అతను
తరువాత అతను 1786 నించి 1790 వరకు military maps తయారుచేసే Asst
Surveyor క్రింద పని చేసి తరువాత Asiatic Society of Bengal లో fellow member క్రింద ఉండేవాడు. అతను ఒక దశలో ఈ European mythological కథలన్నిటి మూలం హిందూ పురాణాలే అని తేల్చాడు.
అతను Jesus Christ జీవితాన్ని శాలివాహనుడి తోను Noah ని సత్యవ్రతుడి తోను, Mt. Ararat
అంటే ఆర్యావర్తం అని correlate చేశాడు. Bible
మూలాలు, ఇస్లాం మూలాలు, Egypt
నాగరికతకి మూలాలు అన్నీ ఇక్కడి నించి వ్యాప్తి చెందినవేనని, అసలు ఇక్కడి విజ్ఞ్యానమే ప్రపంచం నలుమూలలకీ వ్యాప్తి చెందిందని అభిప్రాయపడ్డాడు.
ఈ mythological connections, వాటి మీద research చెయ్యడానికి బెనారస్ లోని పండితులని నియోగించి అతను papers తయారు చేసేవాడు. అతను ఇచ్చిన description ప్రకారం ఈ పురాణాల్లో
చెప్పిన జంబూ ద్వీపం అంటే India అని, మిగతా
ఆరు- కుశా అంటే Persian gulf మరియు Caspian
sea మధ్య భాగమని, ప్లక్ష అంటే Asia minor, Armenia మొదలైనవి అని , శల్మలి అంటే Baltic, Adriatic seas మధ్య ఉండే Eastern Europe అని , క్రౌంచ అంటే Germany, France,
Italy కొంత భాగం అని , శాక అంటే British
isles అని, గోమేధక అంటే లంక అని , పుష్కర అంటే Iceland అని correlate చేసి చెప్పాడు. తరువాత అతను ఒక paper లో తను నియోగించిన
పండితుల చేత మోసగింపబడ్డానని ప్రకటించాడు. ఆ తదనంతరం కృష్ణుడు, వేదవ్యాసుడు కూడా British internationals అని చెప్పి, విసుగెత్తి retirement లోకి వెళ్లిపోయాడు. దీని మీద
ఎవడి inferences వాడు తీసుకోవచ్చు.
దీని వలన మనకి అర్ధం అయ్యేదేంటంటే మన నిత్య సంకల్పంలో మనం ఏ సమయంలో,
ఏ ప్రదేశంలో ఉన్నమో చెప్పుకుని తరువాత మనం ఏది కోరి ఆ పూజలు చేస్తున్నామో చెప్పుకోవడం.
మనం చేసే పనులలో ఒక clarity, ఒక focus తీసుకురావడం.
ఇంకా ఆ సంకల్పం లో శుభ యోగే, శుభ కరణే,
శుభ వాసరే, శుభ తిథౌ, శుభ నక్షత్రౌ ...
అన్న వాటి గురించి తరువాత చెప్పుకుందాం.
ఇదే కాదు నా అభిప్రాయం ప్రకారం దశావతారాలు అని మనం చెప్పుకునే “మత్స్య,
కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ,రామ, కృష్ణ,బుధ్ధ,కల్కి” భగవంతుని
అవతారాలు up to వామన అవతారం వరకు theory
of evolution గురించి చెప్పడమే అని. దీని గురించి next post లో.
thoroughly researched and well documented this presentation definitely stands as one of the best from this blog.learned a lot about our own. thk you
ReplyDelete