Last
post లో చెప్పుకున్న “ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః .... భరత
వర్షే.... “ దాన్ని సంకల్పం చెప్పడం అంటారు. నిత్య పూజలలో కూడా ఇది నిత్య సంకల్పం
కింద చెప్పబడుతుంది. ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే “మనం ఏ కాలం లో ఉన్నాము, ఏ
ప్రదేశంలో ఉన్నాము, ఏమి చేద్దామనుకుంటున్నాము అంతే. ఇవి
చెప్పాలి అంటే ముందు తెలియాలి కదా. ఏ కాలం? అవును మనము ఏ
కాలం లో ఉన్నాము. 2012AD. అంటే ఇది Jesus Christ పుట్టి 2012 సంవత్సరాలు అయ్యింది. అంటే Christ కి
ముందు అంతా BC. అసలు ప్రపంచం పుట్టి ఎన్నాళ్లయింది అంటే ఈ BC, AD తో సంబంధం లేకుండా big bang
అని చెప్పుకుని 20 billion years క్రితం black
hole నించి అని చెప్పాలి. ఈ big bang ప్రతిపాదించి
ఎన్నాళ్లు అయ్యిందయ్యా అంటే అది Stephen hawking వయసంత కూడా
లేని theory.అంటే మొన్న మొన్న చెప్పబడింది. నేను ఆ theory
ని గానీ దాని గొప్పతనాన్ని కానీ తగ్గించటం లేదు. దాని ఉపయోగాలు
తరువాత చెప్పుకుందాం. కానీ ఈ సృష్టి తాలూకు ఆయుర్దాయం గురించి మన మహర్షులు ఏనాడో
చెప్పారు. ఖగోళ శాస్త్రనికి సంబంధించి
“సూర్య సిద్ధాంత గ్రంధం” ప్రపంచం లోనే అతి పురాతన గ్రంధం. ఈ సూర్య సిద్ధాంతాన్ని
లంక కి చెందిన మయాసురుడు అనే వాడు వ్రాసాడట. మన పంచాంగం చెప్పే వాళ్ళు దానినే follow
అవుతారుట. నేను శ్రీశైల సిద్ధాంతి గారు వ్రాసిన ఏదో పంచాంగం పుస్తకం
లోనే చదివాను. ఆ లేఖ్ఖలు ఈ క్రింది విధంగా ఇచ్చారు.
6 ప్రాణ కాలాలు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ (24 mins)
60 ఘడియలు = 1 అహోరాత్రము (24 hours) = 1 రోజు
15 రోజులు = 1 పక్షము
రెండు పక్షాలు ఉన్నాయి శుక్ల పక్షము, కృష్ణ పక్షము - అమావాస్య నించి పున్నమికి శుక్ల పక్షం, పౌర్ణమి నించి అమ్మవాస్యకి కృష్ణ పక్షం.
2 పక్షములు = 1 నెల (ఇవి చైత్రము, వైశాఖము, జ్యేష్టము
ఇలాగ 12 నెలలు).
12 నెలలు= 1 సంవత్సరం (ఈ సంవత్సరాలకి ప్రభవ,
విభవ అని అరవై పేర్లు ఉన్నాయి . ఇప్పుడు
మనం ఉన్నది నందన నామ సంవత్సరం.)
కృత యుగం = 17,28,000 సంIIలు
త్రేతా యుగం = 12,96,000 సంIIలు
ద్వాపర యుగం = 8,64,000 సంIIలు
కలియుగం = 4,32,000 సంIIలు
కృత, త్రేతా, ద్వాపర,
కలియుగాలని కలిపి 1 మహాయుగం అంటారు. అంటే ఒక మహాయుగానికి 43,20,000 సంIIలు
1 కల్పం = 1000 మహాయుగాలు = బ్రహ్మకు
ఒక పగలు = 432 కోట్ల సంIIలు
( ఈ బ్రహ్మ తాలూకు పగటి కాలాన్ని “ఉదయ కల్పం” అంటారు – ఆ తరువాత వచ్చే 432 కోట్ల
సంIIలు “క్షయ కల్పం” అంటారు. )
2000 మహా యుగాలు = బ్రహ్మకు 1 రోజు =
864 కోట్ల సంవత్సరాలు
30 బ్రహ్మ రోజులు = 30 కల్పాలు = 1 బ్రహ్మ నెల (ఈ కల్పాలు30 లో మొదటిది శ్వేత
వరాహ కల్పం )
12 బ్రహ్మ నెలలు =1 బ్రహ్మ సంవత్సరం
50 సంIIలు = 1 పరార్ధం
100 బ్రహ్మ సంవత్సరాలు = బ్రహ్మ ఆయుర్దాయం = సృష్టి ఆయుర్దాయం = 3,11,04,000 కోట్ల సంIIలు
3,11,04,000 కోట్ల సంIIలు నిండగానే బ్రహ్మ
తన బ్రహ్మాండముతో సహా లయమొందుతాడు.
ఇప్పుడు మనం ద్వితీయ పరార్ధం లో ఉన్నాము అంటే మొదటి 50 బ్రహ్మ సంIIలు గతించి రెండవ పరార్ధంలో ఉన్నాము.
తరవాత అన్నది “వైవస్వత మన్వంతరే” -
71 మహాయుగములు = 1 మన్వంతరం = 30,67,20,000 సంIIలు
ఈ మన్వంతరాలు 14 – స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవస్వత (ఇప్పుడు మనం ఉన్నది) ఇలాగ భౌత్య సావర్ణి వరకు 14 మన్వంతరాలు. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నమో చూద్దాం.
ప్రధమ పరార్ధం = మొదటి 50 బ్రహ్మ సంIIలు = 1,55,52,000 సంIIలు ముగిశాయి రెండవ 50 సంIIలు లో ఉన్నాము.
అలాగే 14 మన్వంతరాలలో 6 ముగిశాయి =
184,03,20,000 సంIIలు ఇప్పుడు మనం ఏడో
మన్వంతరం లో ఉన్నాము. ఈ ఏడో మన్వంతరం లో 27 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం లో కృత, త్రేతా, ద్వాపర యుగాలు ముగిసి కలియుగం లో 5112 సంవత్సరంలో
ఉన్నాము. అంటే ఇప్పుడు సృష్టి వయస్సు = 155521972949112 సంవత్సరంలో ఉన్నాము. ఇంకా మొత్తం బ్రహ్మ కాలం పూర్తి
అవ్వడానికి 155518027050888 సంIIలు మిగిలి ఉంది.
సృష్టి లో ప్రళయాలు గురించి కూడా మనవాళ్లు చెప్పారు. అవి నాలుగు రకాలు
1.యుగ ప్రళయము 2.మను ప్రళయము 3.కల్ప ప్రళయము 4. అవాంతర
ప్రళయము.
యుగం పూర్తి అయినప్పుడు యుగ ప్రళయము, మన్వంతరం పూర్తి అయినప్పుడు మను ప్రళయము, కల్పం పూర్తి అయినప్పుడు కల్ప ప్రళయము – ఇవి కాకుండా మధ్య మధ్య లో వచ్చే
ప్రళయాలని అవాంతర ప్రళయాలు అంటారు. యుగ, మను ప్రళయాలలో
ప్రపంచం తాలూకు స్థితి గతులలో మార్పులు వస్తాయి కానీ కల్ప ప్రళయాంతములో మొత్తం
సృష్టి వినాశనం జరిగి బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభిస్తాడు.
ఇంతకు ముందు 2012AD లో ప్రపంచం ముగుస్తుంది అన్న వాదనలో, mayan calendar తాలూకు లేఖ్ఖల్లో నిజం లేదని
తెలుస్తోంది. ప్రపంచం లో ఎన్నో calendars ఉన్నాయి.
అన్నిటికన్నా మనం సూర్య సిద్ధాంతం ప్రకారం లేఖ్ఖ కట్టి చెప్పిన ఈ calculations
కాలానికి, సిద్ధాంతానికి నిలుస్తాయి. అలాగే ఈ ప్రపంచాన్ని,
మనిషిని అర్ధం చేసుకోవడానికి చెప్పిన శ్లోకాలలో “మంత్ర పుష్పం” చాలా ఉపకరిస్తుంది.
మన మహర్షులు లేఖ్ఖలు వేసి ఇంత ఖచ్చితంగా చెప్పిన ఈ కాల మానాన్ని ఇప్పుడు NASA కూడా నిజమేనని ధృవీకరించింది అట. అంటే మనం చెప్పుకున్న లేఖ్ఖలనే వేరు వేరు
పధ్ధతుల ద్వారా తిరిగి కనుక్కోవడం జరుగుతున్నది.
మనవాళ్లు నిత్యం ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం ఏ కాలం లో ఉన్నామో చెబుతారు.
ఇదొక ఆలవాటు క్రింద మార్చేశారు. ఆ సంకల్పం మళ్ళీ చెప్పుకుందాం “ ప్రవర్తమానస్య
ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే,
ప్రధమపాదే - (ఇంత వరకు కాలమానం
అయ్యింది) - జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే –(ఇది geography
related) మనం ఈ భూమ్మీద ఎక్కడ ఉన్నాము అన్నది.దీని
గురించి next post లో మాట్లాడుకుందాం.
wonderful.
ReplyDeletevery much informative. very much enlightening.
translate the same into english .it will benefit a lot
బావా!
ReplyDeleteనీ రచనలో చాలా information వుందిరా. మల్లాది నవలలా, నువ్వు నాకు నచ్హవు సినిమా లో ప్రకాష్ రాజ్ కవిత లా
రామద్వయానికి
ReplyDeleteధన్యుడనైతిని ఓ రామా