Sunday, March 20, 2011

New poetry - 2

బుసకొడుతూ ఎలనాగిని
బుసబుసమని పొంగు మనము బుగులుకొనంగా
రుసరుసలాడుతు తీసెను
ఎసలిక, ఒక భావకవిత బయలుపడంగా 


విరించి సృష్టిది ఇంతే
వరించి బ్రతుకును కుడిచితి హోలహలమున్ 
భరించి నిజమును మనమున 
సరించి ఉరికితి సమరపు కొలహలమున్ 

గ్రాసము దొరకని బ్రతుకుకు 
త్రాసము తప్పదు నిజముగ జీవన శ్రుతిలో 
వీసము లేనీ మనిషికి 
మీసము ఏలా ముఖమున లోక రీతిలో 

సూడిద లివ్వదు లోకము
గాడిద వలె బ్రతుకునెల్ల ఈడ్చతలవగా
బూడిద మిగులును ఇహమున
ఊడును నీ బ్రతుకు సీల నిజము తెలియగా 


ఏమని సెలవివ్వగలవు
గామల దండుకి దారి తెలుపు విధంగా 
వేమన శతకము చాలును
కామనలను వీడి నిజము తెలుసుకొనంగా 


స్వైరిణి కొంపల తిరిగెడు
స్వైరుడు ఒక నిజము తెలిసి నీతులు చెప్పన్
స్వైరిత వదలదు వానిని
స్వైరాంతము ఎపుడు వచ్చు రీతులు దక్కన్ 


ఎక్కడ ఉన్నది సుఖమది 
దక్కదు ఆ తీపి తలపు మిగులును మొహం
ఎక్కడికక్కడ రాజీ 
నిక్కము ఈ నిజము తెలియ దొరకును జ్ఞ్యానం 

అందంగా వ్రాయాలని
కందం పట్టుకు చిలకగ నీతులు వచ్చెన్ 
అందం కథ దేముడెరుగు
మందంగా మారిన మది గనగన లాడెన్ 


హవణించును ఆలోచన 
రవళించును దాని నడక రాపాడంగా
తవళి సురిగి సుఖము కలిగి 
పవళించును హరి మదిలో కాపాడంగా

నుడికారపు  సుడిలో పడి 
వడివడిగా కవితలు పది వ్రాసుకుపోతే 
పడిపడి కొట్టుకు చచ్చెను 
విడివడి నా భావ కవిత పావన రామా 

3 comments:

  1. i am not able to understand meaning of some words :
    ఎసలిక
    త్రాసము
    గామల
    స్వైరిణి
    స్వైరుడు
    స్వైరిత
    స్వైరాంతము

    a fine piece of poetry straight from heart

    ReplyDelete
  2. ఎసలిక - తీరిక
    త్రాసము - కష్టము
    గామల - చీమల
    స్వైరిణి - జారిణి
    స్వైరుడు - యదేచ్చతో తిరుగువాడు
    స్వైరిత - యదేచ్చ , విచ్చలవిడితనము
    స్వైరాంతము - స్వైరిత అంతము

    ReplyDelete
  3. అందాల మా బావా అలిగి
    కందాలతో కన్డువకేలి ఆడగా
    కందిన చెంపలతో , ముదమొందిన మేము
    వందనాలతో విన్నవిన్చునది ......!

    ReplyDelete