Sunday, March 6, 2011

New poetry - 1

చాలా రోజుల తరువాత కవిత్వం పొంగి ఈ రకంగా వచ్చింది - అది చదివిన నాకు నేను భక్తి తత్వంలో పడిపోయానేమో అనిపించింది. ఇంకా దీని తరువాత మజిలీ తెలియదు.

పరిణతి పొందిన అనుభవ 
స్మ్రుతి సారముతో సకలము కాంచి తలకగా
మది విడి పరి పరి విధముల
ధృతిగొని శివపాదము కని  పావనమయ్యేన్

ఇదే ఇంకో రకంగా వ్రాద్దామనిపించి చూస్తె

అనుభవ అనుభావ భవము
విలసిత వివధము కనుగొను జ్ఞ్యానము కాగా
మది విడి పరి పరి విధముల
వికసిత శివపాదము కని  పావనమయ్యేన్




ముసాఫిర్ అఫ్ ఇండియా 

7 comments:

  1. గురూ!
    మైదానంలో మహాప్రస్థానం

    ReplyDelete
  2. రామా
    నిజంగా నా కందంలో అన్ని తప్పుల తడకలు ఉన్నాయని నాకు తట్టలేదు -
    అలవాటు పోయింది - ఆలోచనా, కొంత భాష మిగిలింది
    మరికొంత సాధనతో మళ్ళీ ఇంకొన్ని వ్రాస్తాను
    ఈ సారి తప్పు లేకుండా వ్రాయగలననుకుంటున్నాను
    నీ విమర్శ చదివి చాలా సేపు నవ్వుకున్నాను - చాలా నెలల తరువాత
    ధన్యుడను

    ReplyDelete
  3. బావా ! అపర భగిరదా ఏమిటి నీ కదంలో తప్పులెనుటకు నే తగునా !

    ReplyDelete
  4. బావా ! అపర భగిరదా ఏమిటి నీ కదంలో తప్పులెనుటకు నే తగునా !
    కదం తొక్కిన కలం, ముందు వెనుకలు చూడదు, ఛందస్సు సంకెళ్ళు దానిని ఆపలేవు
    నీ మైదానంలో మహాప్రస్తానం మాత్రమూ ప్రశంసనియము

    ReplyDelete
  5. రాజరుషి !

    పదానికి పదం తోడై కావ్యంగా, శ్రావ్యంగా
    కందానికి చందో అందం కూడి, ద్వీపద రూపుమార్చి
    మేధోమధనంలో , వేల్చి కూర్చిన గానం
    రామగాన అమృతం, భక్తి మాత్రం కాదు ......!

    ReplyDelete
  6. ఆడు సామీ ఆడు
    నిప్పుకి చలిపుట్టాల
    వర్షం వేడెక్కాల
    ఆడు సామీ ఆడు.....

    ReplyDelete
  7. people may say since its your mother tongue you are generous in praise but i cant keep saying this
    telugu is the sweetest language.

    ReplyDelete