భువిలో, బూడిదలో రాసుకునే
పేరుని, నిర్వచించే సదాశయంతో
అంతులేని తీరాల జ్వలించే
ఆలోచనలలో ప్రవహించే
అనంతంలో పరిభ్రమిస్తూ
నాదపు తీవల ప్రతిధ్వనిస్తూ
పరిక్రమిస్తూ, పరిప్లవిస్తూ
కలలోనూ, కలలాంటి మెలకువలోనూ,
అంతరంగాల అగాథంలోనూ
ప్రకటింపబడే విచిత్ర చిత్రాల వెనక
సంచలించే అనంత విశ్వంలో
సంచరించే పరివ్రాజకుడిని... హరిని
గేలానికి చిక్కిన చేప కవిత
ReplyDeleteహరినొ హరుడినొ మాయనో తెలియదు కాని, అనంత విష్వంలొ అలుముకున్న అణువును, ప్రవహ్ల్లికలతొ జీవం పొసుకుని పరిష్కార ప్రవాసంలొ సేద దీరే అతిదిని,అనంత కాల గమనాన్ని వీక్షించలనే జిగ్Yయాసువుని అంత లొనే మాయ అయోమయంలొ పది కొట్టుకుని పొయే నిమిత్త మాత్రుడిని, ....మనిషిని విష్వాన్ని రుచి చూసిన మనిషిని
ReplyDelete