Saturday, September 29, 2012

ఆలోచనల స్రవంతి -40


"వందేమాతరం, సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం
సస్య శ్యామలాం, మాతరం, వందేమాతరం"
వందేమాతర గీతం ఎందుకు నన్ను ఉద్వేగానికి గురిచేస్తుంది? నా భారతదేశపు జెండాకి నేను వందనం చేస్తున్నప్పుడు ఎందుకు నేను ఆనందంతో కంట తడి పెడతాను? నేను కేవలం నా ఆలోచనలలో నేను సృష్టించుకున్న ఒక భావాన్ని ప్రేమిస్తున్నానా?
సరే భారతదేశం గురించి emotions పెచ్చు మీరిపోయిన నా గోల వదిలేస్తే, భారతదేశాన్ని ద్వేషించడానికి అందరూ సవా లక్ష కారణాలు చెప్తున్నారు. ద్వేషించడానికి ఉన్న కారణాలు ఏమిటని అనుకోగానే నాకు శ్రీశ్రీ వ్రాసిన ఒక పాట గుర్తుకు వచ్చింది. ఆ పాట వింటే ఈ దేశం మీద ద్వేషానికి కావలసిన అన్నీ కారణాలు చెప్పినట్టనిపించింది.
“పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ...” ఇలా అంటూనే
“అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు”...
“పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి ఒకడు మరిఒకని దోచుకొనేవాడే
తన సౌఖ్యం తన స్వార్ధం చూసుకునేవాడే
స్వార్ధమే అనర్ధదాయకం
అది చంపుకొనుటే క్షేమదాయకం”
కారణాలు సరే, solution కూడా సరే, కానీ ఎవరైనా వాళ్ళ స్వార్ధం చంపుకోగలరా? తనకంటే ఎక్కువగా తన దేశాన్ని ప్రేమించగలరా ? స్వార్ధం మాట వదిలేస్తే ఈ దేశాన్ని ప్రేమించడానికి ఎవరి దగ్గిరా కారణం లేదా? ఈ దేశంలో బ్రతకడానికి గత్యంతరం లేకపోవడం తప్ప ఎవరి దగ్గిరా ఒక్క reason కూడా లేదా? అసలు ఇంత మంది తమ జీవితాలని త్యాగం చేసి తెచ్చిన స్వతంత్రం కి అర్ధం ఏమిటి అని ఎవరైనా ఈ రోజు ఆలోచిస్తున్నారా?

నాకు తెలిసి “స్వతంత్రం అంటే విచ్చలవిడితనం తో కూడిన స్వేచ్ఛ కాదు, అది ఒక భాద్యత. అందుకే అందరికీ అదంటే భయం.” 

హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ భాద్యత తీసుకోవాలంటే భయం. అవకాశాన్ని బట్టీ ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవడమే. అదే సులువు. స్వార్ధం కరడుగట్టిన ఇంతమంది వెధవలు ఈ దేశాన్ని దరిద్రంలోకి తోస్తుంటే వాళ్ళని ఆపలేక, నా చేతకానితనం ఒప్పుకుంటూ నేను కూడా స్వార్ధం తో పారిపోవాలా? ఆపలేకపోయినా ప్రయత్నం మానేయాలా? మన తల్లి తండ్రులకి ఎవరికైనా జబ్బు చేస్తే మనం వదిలేసి పారిపోతామా? ఇలా conflict తో కొట్టుకుంటుంటే నా భార్యతో ఒక discussion. ఆవిడ అంత analytical గా ఆలోచిస్తుందని నాకు ఇప్పటివరకు తెలియదు.
 నా భార్య, ఆవిడకి అర్ధమైన జీవితాన్ని ఆవిడకి తెలిసిన ఉదాహరణలతో అంది “ఇక్కడ hire & fire policy companies లో ఉద్యోగం చేస్తూ గుర్తింపు లేకుండా, ఇన్ని కష్టాలు పడుతూ, తక్కువ జీతం తీసుకుని ఇలాగ బ్రతికే బదులు abroad లో ఇదే పని చేస్తే కొంచం ఎక్కువ జీతం తీసుకుంటే జీవితంకి కొంత security ఉంటుంది కదా అని.”
నేను అన్నాను “ఈ దేశంలో ఉద్యోగం చేసి ఇక్కడ production ఇస్తే ఈ దేశానికి సేవ చేసినట్టు కాదా? నాకు ఇక్కడ సుఖం దొరకటంలేదని, సుఖం దొరికే చోటుకి వలస పోవాలా? పక్షులు, జంతువులు వలస ఎందుకు పోతాయి. జీవితానికి కావలిసిన తిండి నీరు దొరక్క. ఈ దేశం అంత కంటే దిగజారిపోయిందా?”
నేను ఇలా అంటే నా భార్య ఇంకో ఉదాహరణ ఇచ్చింది “బ్రతకడానికి తిండి చాలు. అది అవసరం. జిహ్వని మరపించడానికి తిండికి రుచి ఎంత అవసరమో ఆనందంగా ఉండడానికి జీవితానికి సుఖం కావాలి. ఒక physical comfort కావాలి, కొంత secured feeling కావాలి. అది డబ్బుతో వచ్చేదైతే, అది సంపాదించగలిగే అవకాశం ఉంటే దేశభక్తి అని వదులుకోవడం ఎందుకు? సంపాదించింది తీసుకుని ఈ దేశంలోనే బ్రతుకుదాం. “తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం” అంది.
Perfect logic; argue చెయ్యడానికి నా దగ్గిర logic లేకపోయింది. ఇన్నాళ్ళు ఎందుకు ఈ logic నాకు తట్టలేదు అనిపించింది. మళ్ళీ అనిపించింది నేను వెతుక్కున్నది ఆ క్షణం లో ఇది కాదు. అందుకే తట్టలేదేమో అని.
అప్పుడు అనిపించింది నేను విదేశాలు వెళ్లడానికి అవకాశాలు రాక, తెలివితేటలు సరిపోక ఇలాగ భారతదేశం అని చెప్పి నన్ను నేను మభ్యపెట్టుకుంటున్నానా? ఇంతకుముందు ఆ విదేశీ ప్రయత్నం ఆఖరి మజిలీలో వదిలేశాను దేశభక్తి అన్న భావనతో.ఇన్నాళ్ళకి నా భార్య కొట్టిన దెబ్బకి నాకు ఎవరో చెప్పిన quote గుర్తుకు వచ్చింది – “Patriotism is the last refuse of a scoundrel”. నేను నిజంగా వేరే దేశంలో ఇంతకంటే ఎక్కువ డబ్బు, సుఖం దొరికితే కొత్త పాట పాడతానా?
నేను నా భారతదేశాన్ని, నా సంస్కృతిని ఎందుకు ఇంతలా ప్రేమించాలి? ఎందుకు ఈ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటున్నాను? ఒక emotional middle class intellectual ని కాబట్టి, జీవితం లో నిత్యం సమరం చేస్తున్నాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నానా? నిజంగా నా దగ్గిర నేను secured గా బ్రతకడానికి. నా విలాసాలకి కావలిసినంత సంపత్తి ఉంటే ఇలా ఆలోచించనా?
అసలు మనం బ్రతుకుతున్న దేశాన్ని ప్రేమించడానికి ఏ కారణం కావాలి ? ఈ దేశాన్ని బాగు చెయ్యడమనే అవసరం ఏముంది? అసలు దీని కంటే ముందు అసలు ఏమిటీ “భారతదేశం” ? అసలు ఏది భారత దేశం?

సశేషం 

3 comments:

  1. Doing a job and feeling you are contributing to the country --- Then every one is contributing.

    What do we meany by contributing to the country?

    what is the measure of happiness? i don't agree with your wife. satisfaction is a variable. and the domain is infinite

    why are you linking up ,your problems with the country?
    Your way to earn your daily bread is never a contribution. In fact its a vocation offered to us by the country because you are its citizen, atleast in my view.you are paid for your service. iam paid for mine. and fortunately we are sheltered here in safety and comfort(in my view). beyond that we dont bother.

    without expectation if we can provide relief in the affected areas of this country, then call it contribution.

    i dont know what you do? but what i feel is we can serve country better in different capabilities only after we keep our families in good comfort zone.

    until then if you feel you are serving your country by doing a job, change your opinion. Its the country which offered you a job to survive.

    ReplyDelete
  2. Got it shyam -thanks for the opinion - great and well said
    I just wanted to know what you mean by "The country" -Even at the end of my post that is the question what I also raised -If you give me clarity on this the rest of the questions raised by you I can answer.

    ReplyDelete
  3. As you have not replied to my query I think I should give up waiting. And now regarding the queries you posed

    Q. Doing a job and feeling you are contributing to the country --- Then everyone is contributing.
    Ans. Yes everybody living in this country is contributing for its good or bad.

    Q. What do we mean by contributing to the country?
    Ans. Working in this country increases its productivity. Whatever earnings I am having from that I am paying tax which is to be used for the country. The other things what I am doing I need not disclose but I think this is enough for the query.

    Q. What is the measure of happiness? I don't agree with your wife. Satisfaction is a variable and the domain is infinite
    Ans. Yes you definitely need not agree with my wife and can have your own definitions. Satisfaction is definitely a variable but materialistic definitions are same for everybody. Domain is infinite but it is in everybody’s nature to go for more comfort. Otherwise if you are comfortable with what you have, you never strive. You become lazy or on the contrary a saint.

    Q. Why are you linking up your problems with the country?
    Ans. Then where can I link my problems. I am integral part of this country where we are affecting each other mutually. It is the country and its economic situation, policies, vision which are creating problems. After this if you feel the thinking of the government is the cause then you have the right to change the government. If the people living here are the problem then you need to change their ideology so that good government can be formed. If you think the Constitution is the culprit, then try to change the constitution. For doing all this we need to understand where we are and what we need. I think I am trying to create the awareness. If you feel it otherwise I request your opinion.

    Q. Your way to earn your daily bread is never a contribution. In fact it’s a vocation offered to us by the country because you are its citizen, at least in my view. You are paid for your service. I am paid for mine and fortunately we are sheltered here in safety and comfort (in my view). Beyond that we don’t bother.
    Ans. I have already answered this. Yes it’s a vocation offered to me by the country and I am grateful to it, but you need to bother beyond that because whatever comfort you are having today may be will become a far off dream tomorrow if we don’t act reasonably. History is an example for this.

    Q. Without expectation if we can provide relief in the affected areas of this country, then call it contribution.
    Ans. Contribution doesn’t categorically mean leaving your job and running after affected areas. There is a government elected for this duty. If the government is not performing we need to unite and think of the right direction how the government/ system can be changed. This is the toughest part. As you raised this I will answer in forthcoming posts about how we can change the system.

    Q. I don’t know what you do? But what I feel is we can serve country better in different capabilities only after we keep our families in good comfort zone.
    Ans. You don’t need to know about my job. But definitely I need your definition of family.

    Q. Until then if you feel you are serving your country by doing a job, change your opinion. It’s the country which offered you a job to survive.
    Ans. I have already answered this.

    Now my request is please read my next post –and I need more critical comment then what you have written now so that it opens a healthy discussion/debate for all to understand.

    ReplyDelete