ఆనంద తాండవం
మనసున తోచు చిత్రములు మాటలలోకి కుదించు కార్యమే
ఘనముగ నిర్వహించుటకునై పరితప్త కవిత్వలాలసా
నెనరులయాతనే చినుకునే చిని భాషన భావసారమై
ననచిన కావ్యఘోష నను సంతత మాధురినందు ముంచెనే
సరము వీచగ ధ్యానమే సుమగంధమై పసరించగా
కరిగి మౌనము డోలలూగుచు భావమై కనిపించగా
మరుల లోపల భావమే సిరి మాటలై అలరించగా
అరులుపొంగుచు మాటలే ఇల కావ్యమై కుసుమించగా
అసలే తత్వమునేమహం
కదిలి యేశబ్దాన్వితాకాశమై
మసలే భోనభ స్పర్శయేప్రిదిలి గాలై రూపమైనంతలో
రసమే నీరముకాగనే కలుగు గంధాంశమ్మునాపృథ్వియై
వెసలోనావరణించినా సకలమై మేథో వికాసమ్మునై

ఆత్మరాగమొక లయన కదలంగనే
విశ్వమంత నర్తన విలయాన
హృదిన మొదలిడి తనువంత తాండవమునా
డేను ఈశ్వర ఇది నీ దయేర
విశ్వమంత నర్తన విలయాన
హృదిన మొదలిడి తనువంత తాండవమునా
డేను ఈశ్వర ఇది నీ దయేర
అక్షరములు స్వరమై తమ
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
ఆ క్షణముల ఆనంద ని
రీక్షణమున విరియు భావమే కావ్యమయే
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
ఆ క్షణముల ఆనంద ని
రీక్షణమున విరియు భావమే కావ్యమయే
స్వర సింజిని అనునాదపు టంకృతి మేథో
పరి వేదపు అలలై ఇలపై వెలయించే
సురపూజిత నవ భవ్య విశుద్ధ సరాగా
మర కావ్య విలసితమ్మున మంథనమౌనే
పరి వేదపు అలలై ఇలపై వెలయించే
సురపూజిత నవ భవ్య విశుద్ధ సరాగా
మర కావ్య విలసితమ్మున మంథనమౌనే
హరుడే హరి అడపొడలన, నడిచే
వరమే ఒసగిన, అజుడది పలికే
సిరివీణల అలల కదులు రచనై
మరి నాదపుసర అనురణనములై
వరమే ఒసగిన, అజుడది పలికే
సిరివీణల అలల కదులు రచనై
మరి నాదపుసర అనురణనములై
సర్వము లీలయే సరగు సర్వము నశ్వర
మీశ్వరాభవం
ఖర్వము యేటికిం గలుగు సత్వము విశ్వపు జాలినీడయే
పర్వములెల్ల సంహతిన పంచుచు పెంచును సృష్టికార్యమై
సర్వము అంతరించునిది సత్యము నిత్యము శాంతిభూషణా
ఖర్వము యేటికిం గలుగు సత్వము విశ్వపు జాలినీడయే
పర్వములెల్ల సంహతిన పంచుచు పెంచును సృష్టికార్యమై
సర్వము అంతరించునిది సత్యము నిత్యము శాంతిభూషణా
తన్మాత్రామయమై విలోలభరమై సంరంభమై భవ్యమై
చిన్మాత్రా పరిభాషలోననయు వైచిత్ర్యానుభావార్ధమై
పెన్మాయానెలవై జగానలయమై వేళాన్వితాపృష్టియై
జన్మానాంతరమై సుగోచరమునై ఉత్కృష్టమై సృష్టియై
చిన్మాత్రా పరిభాషలోననయు వైచిత్ర్యానుభావార్ధమై
పెన్మాయానెలవై జగానలయమై వేళాన్వితాపృష్టియై
జన్మానాంతరమై సుగోచరమునై ఉత్కృష్టమై సృష్టియై
ప్రశాంతం అజాండం విపాటేననంతం
ప్రసారం అనూనం ప్రవాహం అమోఘం
విశాలం ప్రకంపం విరించే దిగంతం
లసత్సంసుధాపూరయంతం ప్రపంచం
ప్రసారం అనూనం ప్రవాహం అమోఘం
విశాలం ప్రకంపం విరించే దిగంతం
లసత్సంసుధాపూరయంతం ప్రపంచం