Russian history గురించి నాకు తెలిసింది చెప్పాలనుకున్నప్పుడు Communism
గురించి నా జీవితంలో నేను ఏర్పరుచుకున్న అవగాహన కొంత చెప్పాలనిపించింది. Russian
history గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. 1983-1989 లో నేను చదివిన శ్రీశ్రీ, 1987 లో చదివిన dialectical
materialism మీద పుస్తకం, 1988 లో చదివిన
కార్ల్ మార్క్స్ వ్రాసిన capital తెలుగు అనువాదంలో కొంత భాగం, 1989 లో newspapers లో వచ్చిన perestroika మీద కొంత details, 1990 వరకు నేను చదివిన social
books లోని history ఇంతే నా knowhow. నాకు history మీద తిరిగి interest కలిగేలా ప్రపంచ చరిత్ర చెప్పిన నా స్నేహితుడు రామకృష్ణ కి సదా ఋణపడి
ఉంటాను. చరిత్ర అందరూ చెప్తారు. దాన్ని కొంతమందే అర్ధం అయ్యేలా మనసుకు హత్తుకునేలా
చెప్పగలరు. ఆ కొద్దిమందిలో నా స్నేహితుడు రామకృష్ణ మాస్టర్ ఒకడు అని సగర్వంగా
చెప్పగలను. నేను 7th
std లోనే దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షలు వ్రాయటం
మొదలెట్టాను. నేను 9th std కి వచ్చేసరికి ఈ హిందీ
ప్రచార్ సభ పరీక్షల్లో “రాష్ట్ర” level
లోనో, “విశారద” level లోనో ఉండేవాడిని. హిందీ తో పాటు అందులో తెలుగు పరీక్షలు
కూడా ఉండేవి. తెలుగు text book లో కవిత్వం ఉండేది. కుందుర్తి
ఆంజనేయులు వ్రాసిన “నగరంలో వాన”, తిలక్ “అమృతం కురిసిన
రాత్రి” , శ్రీశ్రీ వ్రాసిన “జగన్నాధ రధచక్రాలు” పద్యాలు
ఉండేవి. అందులో శ్రీశ్రీ వ్రాసిన జగన్నాధ రధచక్రాలు నాకు బాగా నచ్చింది. చదవడానికి
ఒక rhythm ఉండేది. నేను ఆ పద్యం బట్టి పట్టేశాను. 9th
std లో మాకు R.S.ప్రసాదరావుగారు సోషల్ టీచర్.
ఆయన నేను communist ని అంటుండేవాడు. వెంపటాపు సత్యం
చచ్చిపోయినప్పుడు మా class లో బుర్ర పట్టుకుని కూర్చున్నాడు.
ఆయన నాకు శ్రీశ్రీ పద్యం వచ్చు అంటే, class లో లేచి నిలబడి చెప్పమన్నారు. నేను జగన్నాధ రధచక్రాలు చెప్పిన తరువాత
నన్ను చాలా మెచ్చుకున్నాడు. ఆయన ప్రభావం నామీద చాలా ఉండేది. ఆ తరువాత Intermediate
కి వచ్చిన తరువాత ఏ కవిత్వం లేకుండా గడిచిపోయింది. మళ్ళీ ఆకలి
రాజ్యం cinema చూసే దాకా నాకు శ్రీశ్రీ గురించి మళ్ళీ flash
అవ్వలేదు. రాంబాబు కలిసిన తరువాత మేమిద్దరం కలిసి కొన్న మొదటి
పుస్తకం శ్రీశ్రీ మహాప్రస్థానం. ఆ తరువాత శ్రీశ్రీ, నగ్నముని, చెరబండరాజు లాటి కవులు వ్రాసిన విరసం ప్రచురణలు దాదాపు అన్నీ చదివాను.
నేను శ్రీశ్రీ ప్రభావంలో ఉండేటప్పుడు communism అంటే ఒక
స్వర్గాన్ని తయారుచేసే tool అనుకునే వాడిని. శ్రీశ్రీ ఏకంగా
“గర్జించు రష్యా గాండ్రించు రష్యా “, “లెనిన్ ధమని, లెనిన్
ద్యుమణి “, అని వ్రాస్తే నేను ఎప్పటికైనా ప్రపంచమంతా communism
వచ్చేస్తుంది అనే నమ్మకంలో ఉండేవాడిని. కాళీపట్నం రామారావు గారు
వ్రాసిన communist tint లో realistic base ఉన్న “యజ్ఞ్యమ్” & “కుట్ర” కథలు బాగా నచ్చాయి. 1988
లో Andhra university లో ఏదో radicals meeting అంటే ఈ పుస్తకాల ప్రభావం లోనే వెళ్ళాను. వాళ్ళు mess లో chicken పెట్టలేదు-warden పని
పట్టాలి, ఇంకెవడో తప్పు మాట్లాడాడు - వాడిని తన్నాలి ఇలాటి discussions
చేస్తుంటే విసుగెత్తి వచ్చేశాను. నా engineering friends కూడా నేను ఈ communism topics పెట్టి కుమ్ముతుంటే
వాళ్ళు కూడా భయపడి నా దగ్గిరకి వచ్చేవారు కారు. భారత దేశం లో ఈ communist
principles follow అయినవాళ్ళు naxalites అన్నప్పుడు, నాకు naxals మీద కూడా ఒక గౌరవం ఒక soft
corner ఉండేది వాళ్ళతో ఏ రకమైన link లేకపోయినా. Communism గురించి ఆంధ్ర
లో చేసే పోరాటాలలో communists తమ ఆస్థులు కూడా ధారపోసి ఒక
ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారంటే గౌరవం కలిగేది. మధ్యలో వాళ్ళకి ఉన్నది అంతా
ఉమ్మడి సోత్తే - భార్యలతో సైతంగా అన్నప్పుడు గాభరా అనిపించింది. Perestroika
తరువాత, Russia ముక్కలైపోయినప్పుడు
ఇదేమిటి ఇలా జరిగింది ఇలా జరగకూడదే అనుకున్నాను. అప్పుడు newspapers లో వచ్చినవి చదివి అసలు చరిత్రలో నిజం అంటూ ఏమైనా ఉందా? ఈ communism ఎంతవరకు ఆచరణయోగ్యం అనే సందేహం
కలిగింది. తరువాత నేను ఉద్యోగంలో పడ్డ తరువాత తదనంతరం పెళ్ళైన తరువాత అసలు communism
అన్నది నా memory లోంచి పూర్తిగా
తుడిచిపెట్టుకు పోయింది.
Showing posts with label Autobiography. Show all posts

Saturday, June 9, 2012
Sunday, July 10, 2011
Memories of my life - My baby class photo
Bottom row - sitting from right to left while facing photo
1. Gopalakrishna patro 2. EVSN Sharma 3. Don't remember 4. Myself(Kamesh) 5. Shyam Sundar patro 6. SDV Appalachari 7. R. Raghunadharao 8. KVS Prasad 9. Kolla Srinivas
Top row - Standing from right to left while facing photo
1. Don't remember 2. Prasad 3. Ramu 4. Laksmi Jayanti 5. V. Satyanarayana 6. Chinnayya 7. Ravikumar 8.Ratnakar 9. Don't remember 10. Hanwar Ali 11. S.Giridhar 12. V. Krishna Sagar 13. Don't remember
Middle row - Sitting from right to left while facing photo
1&2. dont remember 3. Anuradha 3. Vani Kumari 4. Sudha 5. Mary Cooper teacher 6. Vasanta Lakshmi 7. Ananta lakshmi 8.Don't remeber 9. Syamala 10. Baby rani 11. Don't remember
Even I am having this photo but thanks to SDV Appalachari for scanning and sending me this photo
Thursday, May 26, 2011
నేను వ్రాసిన మొదటి కథ
నేను degree 2nd year తరువాత సెలవల్లో ఒక కథ వ్రాశాను. ఇది నేను వ్రాసిన మొదటి చిన్న కథ . ఇప్పటి దాక ఇదెవరితోను పంచుకోలేదు. ఇప్పుడెందుకో చెప్పాలనిపించింది.
అది విశాఖపట్నం. వేసంకాలం వేడెక్కిస్తే అది తట్టుకోవడానికి సాయంకాలం జనాలు బీచ్ ఒడ్డుకి చేరుకున్నారు. ఎవడి గోల వాడిది. కెరటాలతో ఆడే వాళ్ళు కొందరైతే, ఇసుకలో గూళ్ళు కట్టే వాళ్ళు కొందరు. ఐస్ ఫ్రూట్లు , బజ్జీలు మావిడికాయ ముక్కలు అమ్మేవాళ్ళు, balloons అమ్మేవాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతా సందడిగా కోలాహలంగా ఉంది. ఆ గోలలో ఎవరికీ పట్టనట్టు కూర్చున్న ఆ 50 ఏళ్ళ ముసలతని పేరు విశ్వేశ్వరరావు. AVN కాలేజీ లో ప్రొఫెసర్. ఏదో పోగొట్టుకున్న వాడిలా ముఖం. ఏమి ఆలోచిస్తున్నాడో కాని చాల సేపటి నించి కూర్చున్న position నించి కదలటం లేదు. మెల్లిగా జనాలు పల్చబడటం మొదలెట్టారు. రాత్రి పదయ్యే వరకు అక్కడే అలాగే కూర్చుని ఉన్నాడు. అప్పుడు నెమ్మదిగా లేచి ఇంటి ముఖం పట్టాడు.
విశ్వేశ్వరరావు కి పెళ్లి కాలేదు. ఎందుకో అతను పెళ్లి చేసుకోలేదు. చిన్నతనం నించి అతని ధోరణి అతనిదే. తల్లితండ్రులు చెప్పేది వినేవాడు కాదు. వాళ్ళు ఏదైనా చెప్తే అది ఎందుకు, ఇది ఎలాగా అని ప్రశ్నించేవాడు. వాళ్ళు విసుగెత్తి వీడికి వితండ వాదన ఎక్కువ అనేవారు. అయినా అతను తన పద్ధతి మార్చుకోలేదు. అలాగే జీవితంలో ఎన్నో వసంతాలు. అతను జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అతను చదవని పుస్తకం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. ఇతని నలభయ్యో పడిలో తల్లీ, తండ్రీ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు కాలం చేసారు. ఆ తరువాత అతను ఇంటిని పూర్తి స్థాయి ప్రయోగశాల లాగ మార్చేశాడు. చేసిన ప్రయోగాలనీ, వాటి results నీ అన్నీ notes వ్రాసేవాడు. ఇలాగ మరో పది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అతనికి ఏభై ఏళ్ళు.
బీచ్ నించి బయలుదేరిన అతను తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. తన diary లో last page open చేసి చూశాడు. అందులో ఉన్నది మరొక్కసారి చదువుకున్నాడు. తరువాత poison bottle తీసి మూత open చేసాడు. అది table మీద పెట్టి, diary మీద pen పెట్టి పట్టుకుని, ఆ poison bottle ఒక్క గుటకలో తాగేసాడు. విషం తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అప్పుడు diary లో ఏదో వ్రాద్దామని కొంత వ్రాసి ఆఖరి శ్వాస వదిలేసాడు. అతను ఆఖరి సారిగా diary లో వ్రాసినది -"నేను దేముణ్ణి చూ.........."- ఆ వాక్యం ముగియకుండానే అతని జీవితం ముగిసింది.
ఇంతకీ విషం తాగే ముందు అతను తన diary లో చదువుకున్న తన ఆఖరి పేజి.
" ఇన్ని చదివిన తరువాత , చూసిన తరువాత - ఎంత వెతికినా నాకు దేముడు కనిపించలేదు. ఆ దేముడిని చూడాలని, చూసింది పదిమందితో పంచుకోవాలని ఈ ప్రయోగం చేస్తున్నాను. నిజంగా చనిపోయే ముందు దేముడు కనపడితే నేను వ్రాసిన note చూసి దేముడిని నమ్మండి. లేదా నమ్మఖ్ఖరలేదు. నాకు ఈ జీవితంలో ఇంకా కావలిసింది ఏమి లేదు. నా చావుకి నేనే భాద్యుడిని."
ఇంతకీ విశ్వేశ్వరరావు దేముడిని చూశాడా, చూడలేదా అతనికే తెలుసు. చూ....తరువాత అతను ఏమి వ్రాయాలనుకున్నాడో కూడా అతనికే తెలుసు. దేముడు ఉన్నాడో లేడో ప్రపంచానికి ఇప్పటికీ, ఎప్పటికీ అది ఒక ప్రహేళికే.
నేను ఈ కథని ఆంధ్రభూమి కి single పేజి కధలకి పంపిద్దామనుకుని ఎందుకో పంపించలేదు.
Thursday, May 19, 2011
Status of my life
I am not a prophet to preach, but I presume that I am a human who can understand the reality of this materialistic world with my limited knowledge and who is in search of the ultimate truth.
I never thought that there is a requirement to think when I was novice and everything is going on smoothly without any disturbance. I was an enthusiastic observer of everything in this world and I am just living my life. Only failure is the reason in my life which gave me sorrow, frustration and forced me to think and after that my understanding of life changed subsequently so many meanings changed and ultimately duality of life vanished. I am grateful to that situation in my life which I thought as failure. It doesn’t mean situations changed, it is simply my perspective of life changed.
During this travel from when I started questioning life to understanding of life in its complexity there was a question which bothered me the most. It is “Why I am here and what is my destiny?”
After so much of logic and reasoning and understanding life scientifically to my knowledge’s best the answer I found was rather vague. It is like “It happened and I am here and whatever things I am doing I have least control of situations and maybe whatever I am doing have some impact on the surroundings in and out and the stream is continuing”. I am lost. I am afraid. There is nothing more to think or say. I stopped logic and reasoning and tried to focus to just have control on my nerves. It happened one night and I burst into tears. The experience that engulfed me has given me immense ecstasy. The feeling is beyond comprehension. I got my world back. Till that time what seemed to me as impossible has become trivial. From then onwards nothing bothered me anymore.
For me further there is nothing left to conquer or prove to anybody. I am subdued in my own world. Then I wondered are there any people who are having such experiences other than me. I read about so many people, their faiths, religions, history and at one point of time the things seemed like alliteration and I stopped further reading about anybody. I found that there are so many people around me floating with the same experience. I stopped asking the question which bothered me the most because it has lost its meaning.
Then I thought if I am having such an ecstasy sitting amidst all my surroundings and focussing then what immense pleasure those people sitting away from these surroundings and doing penance may be deriving. Whether to give up this family and other earthly pleasures to have that ecstasy continuously or to continue the same way as it is going. I tried to get aloof for some time and kick start that feel again. Then I found still there are some things in my life which I am still attached to and till that time I don’t detach myself completely whether I stay in it or out of it means same thing. Place has nothing to do with mental status but to some extent it affects till you get total grip of your internal things. This is the phase in life where I am now.
Why today I wanted to share this experience of mine is my friend RK said his student wants to donate all the ancestral property to some orphanage and he is trying to give clarity that instead of doing that he can do that charity works directly because may be the orphanage is properly run or not and after affects of not having money can be crucial and even I expressed the same idea.
My question to that student is whether he is ready after all introspection of himself or he simply wants to buy a feeling for a second and feeling bad taste for balance of his life. Because definitely money can’t buy happiness but it will give physical comforts. After so much of introspection, logic, reasoning and mystic experiences I am still struggling to leave this physical comfort zone, is he ready to be totally detached from this earthly pleasures. If he has gone through the phase through which RK Paramahamsa has gone through and reached pinnacle maybe he might have traversed a different path to reach there then it is up to him to do it his way or otherwise refrain.
Tuesday, April 12, 2011
Memories of my life - 3
2nd std అయిపోయిన తరువాత 3rd std కోసం మమ్మల్ని VT కాలేజీ main branch నించి శివాలయం branch కి transfer చేశారు. అక్కడ నాకు ప్రసాద్ అని class mate ఉండేవాడు. మాకు 3rd std లో English Fay teacher చెప్పేవారు. ఆవిడ class లో నేను ఈ ప్రసాద్ last bench లోకి చేరి ఆవిడ notes చెబుతుంటే class work లో సున్నాలు చుట్టడం మొదలెట్టాం. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం, నవ్వుకుంటూ చెలరేగి సున్నాలు చుట్టేయడం. ఆ frenzy ఏ స్థాయికి చేరిందంటే teacher వచ్చి పక్కన నించున్నాపట్టించుకోవడం మానేశాం. ఆవిడకి కోపం వచ్చి ఇద్దరినీ scale తో బాదింది. నేను ఏడవడం మొదలెట్టాను. వాడు ఏడ్చినట్టు ఏడ్చి నేను ఏడుస్తుంటే నన్ను చూసి నవ్వడం మొదలెట్టాడు. Fay teacher కి ఇంకా కోపం వచ్చి వాడి half pant విప్పేసింది. నేను భయపడిపోయాను. వాడు ఏడుస్తూ నవ్వుతూ, రకరకాల mixed expressions మొదలెట్టాడు. ఆవిడకి విసుగొచ్చి ఆవిడ క్లాసు అయిపోయే వరకు మా ఇద్దరినీ గోడ కుర్చీలు వేయించింది.
మా ఇంట్లో క్రింద portion లో చట్టి సన్యాసిరావు doctor గారు అద్దెకి ఉండేవారు. వాళ్ళ పిల్లలు బుజ్జి, చిన్ని, రాము, శ్యాము. వాళ్లతో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. అందులో best game పేక మేడలు కట్టడం. వాళ్ళ families లో పండగలకి పేకాట ఆడేవారు. అలాగా ఆడి వదిలేసిన ఎన్నో పేక సెట్లు వాళ్ళ ఇంట్లో ఉండేవి. వాటితో మా ఓపిక కొద్దీ మేడలు కట్టడమే. ఒక్కొక్క సారి ఉదయం మొదలెడితే సాయంత్రం వరకు అదే పని. 3rd std half yearly సెలవలకి బుజ్జి గాడి వాళ్ళ బావ చక్రి, shillong నించి వచ్చాడు. వాడు మాకు towering inferno అనే సినిమా కథ చెప్పాడు. ఎంత బాగా expressive గా dramatize చేసి చెప్పాడంటే వాడు వెళ్లి పోయిన కొన్ని నెలల వరకు మేము అదే మాట్లాడుకున్నాము.
ఈ మధ్యలో నా తమ్ముడు మురళీవి కొన్ని పిల్ల episodes ఉండేవి. వాడు ఏదో జెర్రిని చూస్తూ మా ఇంటి ఎదురుకుండా గ్రంధివారి అరుగు మీద నించి కుళ్ళు కాలవలో పడిపోయాడు. ఆ దెబ్బకి వాడి చెయ్యి విరిగింది. దానికి మా నాన్న గారి ఒకే ఒక్క vizag friend , చింతకాయల లక్ష్మి నారాయణ( తాతాజీ అని పిలిచే వాళ్ళు) దగ్గిరకి పరిగెత్తి వెళితే వాడి చేతికి కట్టు వేసి ఇంటికి పంపించారు. ఇంకో సారి వీధి క్రాస్ చేస్తూ ఉంటె వీడిని ఒక సైకిల్ వాడొచ్చి గుద్దేశాడు. బుర్ర మీద బొప్పి కట్టింది. తరువాత అందులో నల్లగా blood చేరి ఆ బొడిపి పొంగడం మొదలెట్టింది. డాక్టర్ బుచ్చిరాజు దగ్గిరకి తీసుకు వెళితే వీడికి cyringe పెట్టి బుర్రలోంచి ఆ కుళ్ళు blood తీశారు.
వాడి జీవిత చరిత్ర ఘట్టాలన్నీ ఎప్పటికప్పుడు climax లాగ ఉండేవి.
నేను అంత గొప్పగా కాకపోయినా బాగానే చదివే వాడిని. మామూలుగా క్లాసు లో second rank వచ్చేది. ఒక సారి వసంతరావు వారి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడు అక్కడ ఆడవాళ్ళు అందరు ఒక దగ్గిరకి చేరి ఎవరి పిల్లల గురించి వాళ్ళు గొప్పలు చెప్పడం మొదలెట్టారు. మా అమ్మ నా గురించి గొప్పలు చెబుతూ మా వాడికి క్లాసు లో 1st rank అని చెప్పింది. నేను వెంటనే "అదేంటమ్మా నాకు 2nd కదా" అన్నాను. పాపం మా అమ్మకి ఎలా cover చేసుకోవాలో తెలియలేదు. వీడికి ఏమి మాట్లాడాలో తెలియదు అనేసి నవ్వేసి ఊరుకుంది.
3rd class సెలవలకి అనుకుంటాను మా అమ్మ బిళ్ళకుర్రు ముందే వెళ్ళిపోయింది. నన్ను మా చంటి మావ ఆ సెలవలకి తాతగారింటికి తీసుకు వెళ్ళాడు. మా చంటి మావ అప్పట్లో AU లో MSc చేసేవాడు. సామర్లకోట వరకు train లో ప్రయాణం చేశాము. అక్కడినించి bus లో రాకూర్తివారిపాలెం (రావులపాలెం ముందు stop ) వరకు. రాకూర్తివారిపాలెం లో బల్లకట్టు ఎక్కి పాయని క్రాస్ చేసి అక్కడ నించి నడకతో బిళ్ళకుర్రు. ఈ train ప్రయాణంలో మా ఎదురు సీట్లో ఒకాయన కూర్చున్నాడు. కాసేపు పోయిన తరువాత నాతొ సరదాగా discussion start చేశాడు. నీ పేరేంటని అడిగాడు. M . కామేశ్వర రావు అని చెప్పాను. కానీ నేను ఈశ్వరరావు M .Com అని పిలుస్తాను అని ఆట పట్టించటం మొదలుపెట్టాడు. నేను బుర్ర అడ్డంగా ఊపాను. కానీ అతను ఎందుకు అలా పిలవకూడదు అన్నాడు. నేను కాసేపు బుర్ర అడ్డంగా ఊపుతూ "మీరన్నది ఏమీ సబబుగా లేదు " అన్నాను. అతను కొంతసేపు తేరుకోలేదు. నేను అంత పెద్ద మాట వాడతానని అతను అనుకోలేదు. నేనన్నది అర్ధం అయిన తరువాత అతను పెద్దగా చాల సేపు నవ్వి దిగిపోయేటప్పుడు టాటా చెప్పాడు. మా చంటి మావ మా తాతగారి ఊళ్ళో నా ప్రతాపం కథలు కథలుగా చెప్పాడు.
ఇలాటి సెలవల్లో ఆ బిళ్ళకుర్రులో పెద్ద పిల్లల ముఠా ఒకటి తయారయ్యేది. మా పెద్ద తాతగారికి ఏడుగురు పిల్లలు ఇరవై మంది మనవలు. చిన్న తాతగారికి ఇంచుమించు అంటే పటాలం. ఇది కాక ఆ ఊళ్ళో ఒక పదిహేను ఇళ్ళు మా చుట్టాలు లేకపోతె బాగా closely knitted families ఆ ఊరి పెద్దలు.మా నాన్నగారి families కూడా దగ్గిర బంధువులే అవ్వడంతో Jamshedpur నించి ఇంకొన్ని families with పిల్లలు దిగేవారు. ఆటలాడేటప్పుడు అందరూ పోగైపోయే వారు. ఒక నలభై, ఏభై మంది పిల్లలం ఉండేవాళ్ళం ఆ పండగలకి. సత్రం భోజనం మఠం నిద్రలా ఉండేది. సాయంకాలం వరకు ఏవో ఆటలు, సాయంతం పెరట్లో ఒక ఏభై మడత మంచాలు వేసేవారు. ఎవరి convenience కి వారు adjust అయిపోయి వాటి మీద పడుకోవడం. ఆ సెలవల్లోనే మా తాతగారి ఇంట్లో మా ప్రసాద్ మావ "మాయల ఫకీర్" వేషం వేశాడు. మొత్తం ఒళ్ళంతా బొగ్గు రాసేసుకుని ఒక పంచె కట్టుకుని చేతిలో ఒక ఇనప రోడ్ పట్టుకున్నాడు. ఈ పిల్లల పటాలాన్ని radio గదిలో కూర్చో బెట్టి lights ఆర్పేశారు. చిన్నరాంబాబు బావ ఆ lights ఆర్పుతూ వెయ్యడం. " మాయల ఫకీరుకి తిరుగులేదు కదూ" అని మా ప్రసాద్ మావ గట్టిగా నవ్వుతూ మా మీద పడిపోయినంత పని చేసే సరికి, నేను గట్టిగా అరిచి " నేను వెళ్ళిపోతాను" అని అరవడం మొదలెట్టాను. వెంటనే వాళ్ళు అసలు ఇంత భయమైతే ఎందుకు వచ్చావు అని అని బయటికి పంపించేశారు.
Friday, April 1, 2011
Memories of my life - 2
నేను V.T. College లో Matriculation వరకు చదివాను. నన్ను మూడేళ్లకే school కి పంపించింది మా అమ్మ. అప్పట్లో LKG , UKG అని ఉండేవి కావు. మొదటిసారి 1st std కంటే ముందు baby class అని introduce చేశారు. అందులో join చేసింది. Mary Cooper మా class teacher . ఆవిడ photo film roll (అప్పట్లో agfa film roll అది, బెత్తెడు వెడల్పు లో ఒక పక్క red గా రెండో పక్క black గా ఉండేది) ని పొడుగ్గా సాగదీసి నిన్ను పొడిచేస్తాను అని నన్ను భయ పెట్టింది. నేను భోరు మని ఒకటే ఏడుపు. ఇంటికి వచ్చి school కి వెళ్లనని గోల. మర్నాడు మా అమ్మ school కి వచ్చి ఆ టీచర్ ని దెబ్బలాడి నన్ను కూర్చోపెట్టింది. ఆ తరువాత Mary teacher నాకు chocolates ఇచ్చేది. కొంచం ఊహ వచ్చిన తరువాత నాకు అనిపించింది ఆవిడ సరదాకి అలా చేసిందని.
1std లో మాకు ఆదిలక్ష్మి teacher తెలుగు చెప్పేది, సరోజినీ teacher లెఖ్ఖలు చెప్పేది. ఆదిలక్ష్మి గారు పిక్క పాయసాలు పెడితే, సరోజినీ గారు duster తో కొట్టేది. ఒక రోజు ఎందుకో సరోజినీ teacher కి నా మీద కోపం వచ్చి duster తో బుర్ర మీద కొట్టింది. బుర్ర కన్నం పడి రక్తం కారడం మొదలైంది. ఆ సాయంత్రం అమ్మ అడిగింది ఏమైంది అని. సరోజినీ teacher కొట్టింది అని చెప్పాను. మళ్ళీ మర్నాడు అమ్మ school కి హాజరు. సరోజినీ teacher ని నిలదీసింది. ఆవిడ నా వైపు గుడ్లు ఉరిమి చూసి " ఏరా నేను నిన్ను కొట్టానా" అని అడిగింది. మీరే అంటే మళ్ళీ కొడుతుందేమో అని భయం వేసింది. అమ్మకి "ఈవిడ కాదు ఆదిలక్ష్మి teacher" అని చెప్పాను. వెంటనే అమ్మ ఆదిలక్ష్మి teacher దగ్గిరకి తీసుకెళ్ళింది. ఆవిడ కూడా గట్టిగా అడిగే సరికి మళ్ళీ భయపడి "ఈవిడ కూడా కాదు" అని చెప్పాను. మా అమ్మ నా మీద విసుక్కుని ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఎందుకు అలా చేసాను అని చాలా సార్లు అనుకున్నాను.
నాకు 2nd క్లాసు లో రవికుమార్ అని ఒక friend ఉండేవాడు. వాడి ఇద్దరు అక్కలు మా class లోనే చదివేవారు. వాళ్ళ పేర్లు బేబీ రాణి, వాణీ కుమారి. వీడు వాళ్ళ చెడ్డీలు వెనకనించి లాగి చూపిస్తూ ఉండేవాడు. చిన్న పిల్లడినని మా అమ్మ వీళ్ళతో tie up , నన్ను ఇంటి దగ్గిర దింపడానికి. నన్ను వాళ్ళందరూ "పొట్టీ" అని పిలిచేవారు. ఒక రోజు నేను కూడా ఉత్సాహం ఎక్కవ అయిపోయి వెనక నించి బేబీ రాణి చెడ్డీ లాగేను. వెంటనే బేబీ రాణి నన్ను "పొట్టీ మీ అమ్మకి చెప్తాను ఉండు" అని భయ పెట్టింది. ఇంటి వరకు ఒకటే tension బేబీ రాణి చెప్పెస్తుందేమోనని. కానీ ఎందుకో ఆ అమ్మాయి చెప్పలేదు. బతుకు జీవుడా అనే feeling అప్పుడు తెలిసింది.
సెలవలకి అమ్మ బిళ్ళకుర్రు మా తాతగారి ఇంటికి తీసుకు వెళ్ళేది. మా తాతగారు అక్కడ మూడు ఊళ్ళకి కరణం. 2nd class సెలవలలో అక్కడికి వెళ్ళినప్పుడు మా తాతగారి ఊళ్ళో సానిమేళం పెట్టారు. ఊళ్ళో మగాళ్ళందరూ ఆ మేళం చూడొచ్చు. ఆడవాళ్ళు, పిల్లలు చూడకూడదు. మా బావ పెద్ద నర్సింగుని అడిగాను "నేను చూడచ్చా?" అని. వాడు చిన్న పిల్లలు చూడకూడదు అన్నాడు. వాడు అప్పట్లో half pants వేసుకునేవాడు. నేను అడిగాను "నువ్వు పెద్దవాడివా?" అని. వాడేదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. సరే ఎలాగైనా అదేంటో తెల్సుకోవాలనుకున్నాను. మా చిన్న తాతగారి ఇంటి డాబా పైనించి ఆ program కనపడుతుంది. వీళ్ళందరూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తరువాత ఎవరికీ కనపడకుండా మేడెక్కి చూడ్డం మొదలెట్టాను. ఆ మేళంలో ఆడవాళ్ళు తాగేసి సినిమా పాటలు పాడుతూ డాన్సులు.ఒక అమ్మాయి ఒక కర్ర ముక్కని ముందు పెట్టుకుని, ఒక సినిమా పాట parody, "లేగిసేస్తుంది లేగిసేస్తుంది మావయో" అని డాన్సు చేసింది.ఈ లోగా మా సుందర దొడ్డమ్మ వాళ్ళు వచ్చి "ఎవర్రా అది" అని అరవడంతో silent గా కిందకి దిగి వచ్చేశాను. మర్నాడు మా చంటి మావా వాళ్ళు తాతగారి గది పక్కనే ఉండే నడవలో ఆ మేళం గురించి మాట్లాడుకుంటుంటే ఊరుకోలేక "నేను చూశాను" అని చెప్పాను. "ఏం చూశావురా" అని అడిగారు వాళ్ళు. నేను వెంటనే ఒక చీపురు పుల్ల ముందు పెట్టుకుని నేను చూసిన sequence పాట పాడుతూ repeat చేసాను.వాళ్ళందరూ నవ్వులు. "మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి " అన్నారు. నేను మళ్ళీ మొదలెట్టాను. ఈ లోగా మా అమ్మ radio గదిలోంచి ఆ నడవలోకి వచ్చి నా విన్యాసాలు చూసింది. నన్ను రెండు తిట్టి, నా రెక్క పట్టుకు లాక్కు పోతూ, మా చంటి మావకి రెండు అక్షింతలు వేసింది.
సశేషం
Thursday, March 24, 2011
Memories of my life
ప్రతీ వాడి జీవితంలోను వాడికి మంచి అనిపించేవి , చెడు అనిపించేవి రెండూ ఉంటాయి. General గా అందరు మంచి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. చెడ్డవి పెద్ద ప్రయత్నం లేకుండానే గుర్తు ఉండిపోతాయి. నా జీవితం దీనికి పెద్ద exception ఏమీ కాదు. Memories వ్రాద్దామని మొదలుపెట్టగానే నాకు నచ్చనివన్నీ గుర్తుకు వచ్చాయి ముందు.
ఎన్నో హృదయ భేదకాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో నిస్పృహలు, కొన్ని ఆనందకరమైన సంఘటనలు అంతే. ఒక middle class ఆంధ్ర కుర్రాడి జీవితంలో ఎన్ని విషయాలు ఉండచ్చో అన్నీ. ఇవన్నీ ఎందుకు వ్రాద్దామనిపించిందంటే నాలాటి ఆలోచనలతో ఒక జీవి ఎలా తయారవుతాడు, వాడి వెనక ఏ బలమైన సంఘటనలు, సంతులేముంటాయి అని నాకు నేనే చూసుకోవాలని వ్రాసుకుంటున్న ఆత్మకథ.
కొన్ని తల్లి తండ్రులతో పంచుకోగలం. కొన్ని స్నేహితులతో, మరికొన్ని జీవన సహచరులతో. కాని కొన్ని ఎవరితోనూ పంచుకోలేము. అవి నీలోనే ఒక చీకటి కోణంలో దాగుండి నిన్ను బాధపెడుతో నీతోనే అంతం అయిపోతాయి. నీకు నువ్వు మాత్రమే justify చేసుకోవాలి. నీ మనసుకి, ఆలోచనకి, ఆచరణకి ఎంత దగ్గరతనం తీసుకురాగలిగితే అంత స్వచ్చమైన నవ్వు నీ ముఖం లో కనిపిస్తుంది.
ఒక sex పుస్తకం చదువుతూ తల్లి తండ్రులకి దొరికిపోవడం, నువ్వు ఇచ్చే మొదటి ప్రేమలేఖ నీకు నచ్చిన అమ్మాయి చింపి అసహ్యించుకోవడం, తల్లి తండ్రులు frustations లో కొట్టుకోవడం, తల్లో/ తండ్రో లేని జీవితాలు,వాళ్ళ extra marital affairs ,incest , exams fail అవ్వడం, స్నేహితుల egos ,వాళ్ళ వెన్నుపోట్లు, బంధువుల వెటకారాలు, బాగా బ్రతికిన పరిస్థితులలోంచి ఒక సారి కటిక బీదరికం లోకి వెళ్ళిపోవడం, నిన్ను seduce చేసే పొరుగువాడి పెళ్ళాం/పక్కింటి అమ్మాయి, ఉమ్మడి కుటుంబాల తగువులు,ఆస్తుల కోసం కాట్లాడుకొనే రక్త సంబంధాలు, ఏదో అయిపోదామని ఎలాగో ప్రయత్నిస్తే ఇంకేదో తయారవడం, ఇలాటివే ఎన్నో - ఇందులో ఏదో ఒకటైన లేని middle class ఆంధ్ర కుర్రాడు నా generation లో నాకు కనపడలేదు. నాకు అమ్మాయిల జీవితాలతో, వాళ్ళ ఆలోచనలతో పెద్ద పరిచయం లేదు. నేను కిశోరన్న, రాంబాబు కళ్ళతోనే అమ్మాయిల ప్రపంచాన్ని చూశాను.సరే ఇందులో నీ జీవితంలో ఏమున్నాయని మాత్రం నన్ను అడగద్దు.
నాకు బాగా గుర్తుండిపోయిన నా చిన్నప్పటి మొదటి జ్ఞ్యాపకం. నాకు రెండేళ్లో, మూడేళ్లో, అప్పుడే నడక వచ్చింది. మా అమ్మతో పాటు మా తాతగారి స్వస్థలమైన అమలాపురం దగ్గిర బిళ్ళకుర్రు అనే పల్లెటూరు లో ఉన్నాము. మా పట్టాభిమామ కొడుకు పెద్ద నర్సింగు "ఒరే మీ నాన్నగారు వచ్చారు తెలుసా" అన్నాడు. నాకు ఎందుకో బోలెడంత సిగ్గు, భయం వచ్చేసింది. వంటింట్లో తలుపు వెనక్కాల దాక్కున్నాను. మా నాన్నగారు పెరట్లో అరుగు మీద కూర్చుంటే వీడు నన్ను తీసుకు వచ్చి మా నాన్నగారి ముందు నిలబెట్టాడు. ఆయన రెండు చేతులూ సాచి నన్ను దగ్గిరకి తీసుకున్నారు. చాలా comfort అనిపించింది. నేను ఎంత intensity feel అయ్యానంటే అది తలుచుకుంటే ఇప్పటికీ ఆ feeling నాలో తంతుంది. అంతవరకే గుర్తు. తరవాత మళ్ళీ గుర్తు లేదు. ఆ తరువాత మా నాన్నగారి దగ్గిర ఆ feeling కోసం ఎంతో వెతికే వాడిని. మళ్ళీ కనపడలేదు. ఆయన ఎప్పుడూ ముభావంగా ఉండేవారు. కష్టానికైన, సుఖానికైనా మా అమ్మ దగ్గిరే చనువు ఎక్కువ.
సశేషం
Wednesday, February 23, 2011
Movies in my life - 5
Matrix
Matrix is an illusory simulated reality of the world developed by Machines in order to keep the humans manageable and submissive in their captivity.
I haven't watched this movie in theaters which later I felt, I missed.This is a wonderful movie and the conversations in this movie give you the choice to discuss so many things and interpret in so many ways regarding Philosophy.
When in the last episode I wrote something on the Cosmos and touched the point of virtual reality I just remembered the movie for it has touched me not only in this aspect but multifariously.
Many might have written regarding this movie and better explained the detail than me. I do not want to write regarding the actors, technical extravaganza specially the bullet time effect etc.,, box office collections -nothing -Just parts of some conversations I remember and those may not be the exact conversations because I am writing this long after I saw the movie and I still remembered those lines in their sense.
Oracle's conversation (Prophetic lady in the Matrix) in Matrix-1
Oracle: You know why Morpheus brought you to see me
Neo: I think so
Oracle: So you think you are the One
Neo: I don't know
Oracle: You know what that means - It means "Know thyself". I am going to let you in on a little secret. Being the One is just like being in love. No one can tell you, you are in love, you just know it.
Architect (The creator of Matrix) says to Neo in Matrix reloaded
The first Matrix failed because it was too perfect. It was a virtual paradise, a utopia for humanity. Unfortunately, humans are not accustomed to living in a perfect world.
The second Matrix was designed more closely resembling the 'real world' - it was hard, it was dirty, it had death, violence, war, atrocities, and everything else a flawed species would likely create for itself. This one also failed because of lack of choice. If humans were offered a choice then over 99% would accept the Matrix and live in the virtual world, unknowingly powering the machines. The remaining percentage would choose the other option, becoming a 'free mind' destined to become part of the human resistance.
And in the final movie Matrix revolutions he stands in front of some "Ex machina" which is like a floating head of Energy
Neo says "Peace"

One more thing I remembered is Agent Smith and Neo's conversation
Smith: Why do you persist
Neo: Because I chose to
Architect (The creator of Matrix) says to Neo in Matrix reloaded
The first Matrix failed because it was too perfect. It was a virtual paradise, a utopia for humanity. Unfortunately, humans are not accustomed to living in a perfect world.
The second Matrix was designed more closely resembling the 'real world' - it was hard, it was dirty, it had death, violence, war, atrocities, and everything else a flawed species would likely create for itself. This one also failed because of lack of choice. If humans were offered a choice then over 99% would accept the Matrix and live in the virtual world, unknowingly powering the machines. The remaining percentage would choose the other option, becoming a 'free mind' destined to become part of the human resistance.
And in the final movie Matrix revolutions he stands in front of some "Ex machina" which is like a floating head of Energy
It asks Neo "What do you want"
Neo says "Peace"
If you look at these conversations you can see the movie categorically drives your thought to the points what a human needs basically and how simply the humans deviate from the real requirement and opt for petty things of temporary satisfaction and how choice and will can turn the tables in their favor if they really wish to.
Moreover what I liked is the struggle of an individual from just feeling the thing to understanding the thing, believing in himself, taking greater challenges, raising to the occasion without any fear and with his will and sacrifice he fights alone and sometimes accompanied by his team and tries to see some good happens to humanity.
There are so many other conversations with Merovingian, Seraph, Sati, Morpheus and Agent Smith the other characters of the movie and if I start telling all this it will be narrating the movie on paper except some scenes.
Saturday, January 22, 2011
Friends and Friends Association - 2
f&f వారి ఆఖరి హంగామా
Dec 31st in townhall
మొదటిగా రాంబాబు గాడి మేడ మీద ఇచ్చిన ప్రదర్శనతో ఉత్సాహం చెంది రెండో సంవత్సరానికి తెర తీసాము. రాంబాబుకి వాడెక్కడ చూస్తాడో తెలియదు కానీ presentation విషయంలో ఒక funda ఉంది. తాటాకుల మీద invitation card అని మొదలెట్టాడు. వాడి fancy range చెప్పడానికి తాటాకుల కంటే ముందు జరిగిన సంఘటన. నా చేత రాత్రి పూట నా రక్తం తో love letter వ్రాయించాడు. దానికి నెమలి పించం ఒకటి sharp చేశాడు వ్రాయడానికి. blade sterilize చేశాడు నా చెయ్యి నేను కోసుకోడానికి.రాత్రి ముహూర్తం. అయితే ఆ పించం తో వ్రాయడం అవ్వకపోతే దానితో ఒక love symbol వేసి ఊరుకున్నాము. మిగతాది మామూలుగానే వ్రాసాము. అయితే అప్పటి నా ఫ్రెండ్ "నీకిదేమి పిచ్చి" అని అడిగింది. నాకు వెర్రెక్కి అ letter కాలవలో పడేసి, వీడి collar పట్టుకుని లేపి ఒక గట్టు మీద పడేసాను. తరువాత వీడు నాకు మోచేతి వరకు పెద్ద bandage వేయించాడు. అది వేరే విషయం. ఈ ఆవేశంలో కిశోరన్న వాడి special friend కోసం వేరే letter ఒకటి రాసి వాడి రక్తం తోనే - last లో సంతకానికి ముందు వాడికి doubt వచ్చింది. balance రక్తం ఏమి చెయ్యాలి అని. డేవిడ్ గాడు, రాంబాబు కూడా ఉన్నాడు అనుకుంటా, కిశోరన్నకి సలహా ఇచ్చారు. "ఇది నా రక్తం" అని వ్రాయమని. అది వ్రాసినా ఇంకా రక్తం మిగిలిపోతే మళ్ళీ అన్నగారికి doubt ఇదేమి చెయ్యాలి అని. అప్పుడు వీళ్ళ సలహా తాగేమని ఒకడు, అది ఆ letter లో జల్లీ మని ఇంకొకడు. అన్నగారి రక్తం ఆ తరువాత ఏమైందో నాకు గుర్తు లేదు. అంతకు ముందు ఏమైనా సినిమాల్లో ఈ రక్త పిపాస love letters ఉన్నాయేమో తెలియదు, కానీ తరువాత చాలా సినిమాల్లో ఈ రక్త పిపాస love letters ని వెటకారం చేస్తూ చాలా scenes ఉన్నాయి. రాంబాబు గాడి fancy thoughts చెప్దామని ఇంకేదో చెబుతున్నాను. ఇదనే కాదు వాడికి ఇలాటివే ఎన్నో ఆలోచనలు. ఎప్పుడూ ఏదైనా ఏదో variety చేద్దామనే వాడి తాపత్రయం. వాటి గురించి వాడి blog లో వాడే రాస్తాడు.
ఈ వెరైటీ లోంచి పుట్టుకొచ్చిందే ఈ తాటాకు మీద ప్రింట్. దీనికి డేవిడ్ గాడు ఏరాడలో తాటాకులు నరికి తెస్తే వాటిని ఎండబెట్టి "ప్రకాష్ బుక్ స్టోర్స్" లో printing అనుకుంటా. మళ్ళీ వీటికి ముఖమల్ cover వాటికి మెరుపుల తాళ్ళు, పూసలు. కార్డు వరకు ఆదరగోట్టాము. ఇంకెవరో నాకు తెలిసిన "నాట్యమయూరి" group వాళ్ల చేత భరతనాట్య ప్రదర్శన. వాళ్లకి memento లు ఇచ్చాము. ఏవో ఒకటి రెండు డ్రామాలు వేసాము. అవి కూడా బాగానే నడిచాయి.
ఆ తరువాత orchestra . ఇక్కడ farce మొదలైంది. ఈ orchestra కి prologue . నేను అప్పట్లో రెండు నెలలు ఏదో guitar నేర్చుకున్నాను. పూర్తిగా రాదు. ఏదో వానాకాలం చదువు లాటి guitar . మాకు lead singer అప్పలరాజు అని ఇంకో friend. voice బాగానే ఉండేది, చిన్న ఉచ్చారణ దోషం. ప్రతి line వెనకాల "అం" అని మింగేవాడు. female voice కోసం మా ఇంటి పక్కనే ఉండే అమ్మాయి ప్రవీణ అని మాకేక్కడో దూరపు చుట్టాలు, ఆ అమ్మాయికి చిన్న నత్తి - "ప్రేమ పావురాలు" సినిమాలో ఒక పాట లో" న్యా మనసేమో, న్యా మాటే వినదంటా" అని పాడేది.ఆ అమ్మాయిని పట్టుకున్నాము. ఇంకో female singer సునీత ( నవనీతం - ఆ అమ్మాయికి nick name ) అని మా friend ఓ మోస్తరుగా బాగానే పాడేది.ఈ అమ్మాయి కిశోరన్న లిస్టు లోనే. కానీ డేవిడ్ గాడికి special friend. తబలా వాయించడానికి పైడిరాజు అని అప్పల రాజు friend . వీళ్ళతో లింక్ లేని బాబీ అని నాకు flute ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడి tuition సెంటర్ లో నేను classes కూడా చెప్పేవాడిని. వాడి ఫ్రెండ్ జోసెఫ్ అని violin వాయించే వాడొకడుమధ్యలో. వాడు ఏమైనా అంటే నేను jumping run వాయిస్తాను అనేవాడు. ఈ f & f వారి orcheshtra మినీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్, రాజమండ్రి లాటిది.
నాకూ ఏమి చెయ్యాలో తెలియదు. ఎవడికి తెలియదు. మా ఇల్లు "లక్ష్మి విలాస్- రాతి మేడ " లో orchestra rehearsals . ఈ మధ్యలో ఇంకెవరో reference లో ఒకతను casio వాయిస్తాను అని వచ్చాడు. ఆయనకి తెలిసిన అమ్మాయిలు, వాళ్ల చేత కూడా పాడిద్దామని అతని ప్రయత్నం. వాళ్ళు గీతాంజలి సినిమాలో "ఓ పాప లాలీ" పాటలో chorus ఉంటుంది. ఓ పాప లాలీ అనగానే " హా" అని - వాళ్ళు అది అంటారు అన్నాడు. మేము సరే అన్నాము. practice ఏమి చేసామో గుర్తు లేదు. లక్ష్మి విలాస్ ఆంతా సందడి. కలగా పులగం. Dec25th christmas రోజున మా పెద్ద మామ్మగారు చనిపోయారు. ఈ rehearsals మధ్యలో. ఆవిడ చనిపోయే ముందు మా singer అప్పలరాజు తో "పయనించే ఓ చిలుక " అనే పాట పాడించుకుని విన్నారు. చచ్చే ముందు ఆవిడ మనశాంతి పాడు చేసానేమోనని నాకు ఎప్పుడూ ఒక guilty feeling . దాని నించి rehearsals కి break పడింది .
సరే అలాగే stage ఎక్కేసాము. ఇక్కడ సుబ్బడి గురించి కొంత చెప్పాలి. వాడు almost opposition leader నించి ruling party leader అయిపోయాడు . నేను, కిషోర్, రాము ఒక పార్టీ అని, మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ అని తేల్చారు. అందుకనే వాడి participation ఈ ఫంక్షన్ కి ఏమి పెద్దగా లేదు. ఏదో last moment లో వచ్చి వాడి range హంగామా వాడు చేశాడు. సుబ్బడి emotions కానీ, వాడి ఆవేశం కానీ extremes లో ఉండేవి. మా friends కి almost అందరికీ వాడి style నచ్చేది. ఇప్పుడు వాడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఆశ్చర్యపోయే అంతలా. ఆ projection ఎలా వచ్చింది అంటే కిషోర్ గాడి opponent సుబోద్ అనేలా. డేవిడ్ గాడు కూడా loyalties change చేశాడు. అలాగని కిశోరన్న ని బాధ పెట్టలేదు. అలాగ చిన్న split . కానీ ఎవడిని ఎవడూ వదలలేదు. ఎన్ని తన్నుకున్నా కలిపే తన్నుకున్నాం.
ఇంకో పిట్ట కథ ఉంది. రాంబాబు గాడు dec31st కి అందరి దగ్గిరా collections అని మొదలెట్టాడు. ఎవడు డబ్బులిస్తే వాడికే కార్డు, పాస్. అందరూ collections చేశాము. చాలా మంది friends మేమేమి చేస్తామో చూద్దామని, డబ్బులు కట్టేరు. ఈ లోపల vizagapatnam క్లబ్ వాళ్ళు, మందు party with heavy music బయట పెట్టారు. ఆ sound భరించలేక మేము తలుపులు మూసేసాము. సరే జనాలు orchestra ఎలా ఉంటుందా అని కూర్చున్నారు. మొదటి దెబ్బ, mikes పని చెయ్యడం మానేశాయి. ఎవడైనా కెలికాడో కావాలని, లేదా అవే చచ్చాయో తెలియదు. అవి సెట్ చేసేసరికి screen లేవ లేదు. secretary రాంబాబు screen లాగ డానికి try చెయ్యడం. ఆ తతంగం అయ్యింది. మళ్ళీ mikes పని చెయ్యలేదు. ఈ లోపుల మా orchestra ట్రూప్ ఏమి చెయ్యాలో తెలియక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలెట్టారు. మిగతా friends , families తో వచ్చిన వాళ్ళు గోల. తలుపులు మూసేసి ఈ తతంగం ఏమిట్రా అని. నేను బాధ భరించలేక బయటకి వెళ్లి కూర్చుని ఏడవడం మొదలెట్టాను. నేను అంత ఏడుపుగొట్టుగాడినని నాకే తెలిసిన క్షణం అది. అప్పుడు నా friends అందరూ నన్ను ఓదార్చడానికి బయటకి వచ్చారు. hall లో ఎవడు చచ్చాడో , ఎలా చచ్చాడో తెలియదు.
ఈ సందట్లో నా సిగేరేట్ ప్యాకెట్ కొట్టేసిన వాడొకడు. ఆఖరికి ఆ casio వాయిద్దామని వచ్చిన అయన ఏవో రెండు పాటలు పాడి జనాలకి అయ్యింది అనిపించాడు . ఆ తరువాత సమోసాలు దొరకలేదని ఒకడు, గులాబ్ జామూన్ దొరకలేదని ఒకడు. డబ్బులు కట్టాం మాకేవీ అని ఒకడు. అదో రసాభాస. మొదటి సంవత్సరం function కి ఎంత సంతోషించానో ఈ రెండో సంవత్సరం అంత బాధ పడ్డాను.
నాకు గుర్తున్నంత మటుకు ఆ function details అవి. మిగిలిన నా friends ఎవడి view point వాడికి ఉంటుంది. వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళ అనుభవం ఆ రోజుది ఉండొచ్చు. ఇంకేమైనా విశేషాలు ఉంటే మళ్ళీ తరువాత గుర్తుకు వస్తే రాస్తాను.

Thursday, January 20, 2011
Friends and Friends Association - 1
నా సినిమా blog posts అందరికీ నచ్చి వాళ్ళ పాత జ్ఞ్యాపకాలు చెప్పడంతో - నేను నా పాత జ్ఞ్యాపకాలకి వెళిపోయాను. అందులో కొన్ని అందరితోను పంచుకుందాం అనిపించి ఈ ప్రయత్నం.
మా స్నేహ బృందం ఇంతకు ముందు friends & friends association అని ఒకటి పెట్టాము. దానికి మా బాబన్న president , రాంబాబు secretary , నేను treasurer. ఈ association కి నాకు గుర్తున్నంత మటుకు agenda అంటూ ఏమి లేదు. Just కాలక్షేపం. దీనికో prologue ఉంది. నేను రాంబాబు ముందు ఏదో చేద్దామనే తాపత్రయం తో మాకు తెలిసిన lawyer దూర్వాసుల దక్షిణామూర్తి గారి దగ్గిరకి వెళ్లి," sir మేము ఒక trade union పెడదాము అనుకుంటున్నాము" అన్నాము. అతను మా వైపు జాలిగా చూసిన చూపు నాకు ఇంకా గుర్తే. అతను సరే ఐతే మీరు trade union పెట్టలేరు. ఒక సాంస్కృతిక సంస్థ పెట్టగలరు అన్నాడు. వెంటనే registrar office కి వెళ్లి application తెచ్చి fillup చేసి register చేసాము. ఈ prologue కి ఒక prologue ఉంది. నాకు గుర్తున్నంత మటుకు ఇది వినాయక చవితికి వైజాగ్, గంగాబత్తుల వారి వీధిలో bobby (సింగరాచారి)గాడి ఇంటిముందు మొదలైంది. వినాయక చవితి ముందు రోజు మేము చిన్న పెండల్ వేసి అక్కడ విగ్రహం పెట్టి దాని decoration కి friends అందరమూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేశాము. అందరిలోనూ ఒక చిన్న spark - ఆ సరదా ని కొనసాగించడానికి ఏమి చేస్తే బాగుంటుంది, ఇంకా big scale లో అని ఆలోచిస్తే వచ్చిన idea ఈ association మొదలెట్టడం. ఈ f &f వారి మొదటి సాంస్కృతిక కార్యక్రమం -- రాంబాబు గాడి డాబా మీద.
దీనికో interlude కూడా ఉంది. మా ఫ్రెండ్స్ అందరిలోనూ కిశోరన్న girl friends విషయంలో యువకిశోరం - వాడి పుణ్యమా అని రాంబాబుగాడు ఎప్పుడూ ఒక fascination లో ఉండేవాడు. వాడికి అప్పటికే ఒక fail sequence ఉండేది. వాడి దృష్టిలో కిశోరన్న hero .నేను కూడా వాడి fancy ని క్యాచ్ చెయ్యడానికి రెండు మూడు, అబద్ధం ప్రేమకథలు కల్పించి నా జీవితంలో జరిగినట్టు చెప్పాను. ఈ అబద్ధాలు చాలా రోజులు continue చేసిన తరువాత, నాకు ఆ అబద్ధాల బరువు ఎక్కువైపోయి townhall లో రాంబాబుకి confess అయిపోయాను ఏడుస్తూ. వాడు కూడా నన్ను ఓదార్చాడు. తరువాత కిశోరన్న మాకందరికీ ఎవరో ఒక girl friends ని తగిలించాడు. అప్పట్లో మాకు girl friends ఉండేవారంటే అది వాడి పుణ్యమే. వాడు వాడి సామ్రాజ్యం, దాని నిండా అమ్మాయిలు. కిశోరన్న వెనక వందమంది పడితే, వీడో అమ్మాయి వెనక పరిగేట్టేవాడు. అదో పిట్ట కథ. డేవిడ్ గాడు మాకు VTcollege class mate . వాడు, కిశోరన్న కరాటే నేర్చుకుంటూ ఉండేవారు. కిశోరన్న అప్పట్లో break dance కూడా నేర్చుకునే వాడు. సరే ఈ girl friends అందరిని రాంబాబు గాడి డాబా మీదకి పిలిచాము. మా ప్రతాపాలు చూపించడానికి.
సుబ్బడి entry మా స్నేహ బృండంలోకి ఎలా జరిగిందో నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ function time కి వాడు కూడా ఉన్నాడు. వాడి రూటే సెపరేటు. కిశోరన్న ruling party అయితే వీడు opposition లీడర్. కానీ అందరిని కలిపే ఒక మిడిల్ క్లాసు, ఇంకా చదువు, love failure links చాలా ఉండేవి. ఎంత కొట్టుకున్నా ఒకళ్ళని ఒకళ్ళు ఒదులుకోలేకపోయాము . ఎన్ని భీబత్సాలు జరిగినా సరే.
ఇంకా రాంబాబు గాడి డాబా మీద f &f వారి కార్యక్రమాలు.
1. నేను, రాంబాబు script వ్రాసి తయారు చేసిన డ్రామా, ఇంకొకటి - రెండు ప్రదర్శన ఇచ్చాము.
ఒక దాంట్లో యువత కి సందేశం. చెడు అలవాట్లు నేర్చుకోవద్దని. ఇందులో మధ్యలో సుబ్బడు ఏదో టేబుల్ మీద కూర్చోవాలి. sudden గా అది పడిపోయింది. వెంటనే సుబ్బడు, రాంబాబు అప్పటికప్పుడు కొన్ని dialogues mix చేసి interrruption లేకుండా డ్రామాలో కలిపేసారు. next minute లో current పోయింది. మళ్ళీ current వచ్చిన తరువాత అదే scene start చేశాము. అందులో టేబుల్ పడిపోయే dialogues లేకుండా వెళ్ళిపోయింది . నీలిమ అని మా friend కి doubt వచ్చింది. ఇదేంటి ఇలా మారిపోయింది అని. సుబ్బడు అప్పుడు వాడి skill గురించి చిన్న చిరునవ్వుతో explain చేశాడు.
రెండు భరాగో వారి ఏదో డ్రామాలో ఒక పోర్షన్ తీసుకుని - అందులో almost నేను ఏక పాత్రాభినయం. మీసాల వెంకటసామి పోర్షన్. మధ్యలో dialogues మర్చిపోయాను. వెనకనించి రాంబాబుగాడి prompting . అందరూ నవ్వులు.
2. నీలిమ తమ్ముడు నవీన్ భరతనాట్య ప్రదర్శన. అదివో అల్లదివో అని. అది బాగా జరిగింది.
3. రాంబాబు magic show - వాడికి మేజిక్ ఏమి రాదు. ఏదో పెద్ద suspence లో పెట్టి సరదాకి చేశాడు.
4 . నేను ఇది సరిపోదన్నట్టు పాటలు పాడటం.
కిశోరన్న తమ్ముడు బుజ్జి తో "we are the world " ఇంగ్లీష్ సాంగ్-
ఇంకెవరిదో పాట నాదని చెప్పి రాంబాబు గాడిని నమ్మించేసాను-అది "ఏ కోనలో విరబూసినావో కదా" అదొకటి -
ఇంకో సాంగ్ హిందీ" ఎహసాన్ మేరె దిల్ పే".
నిజంగానే మిగతా వాళ్లకి ఆ రోజు ఎలా గడిచిందో తెలియదు. నాకు మాత్రం fantastic evening . ఈ కింద లింక్ లో అ హిందీ పాటని చూడొచ్చు.
http://www.youtube.com/watch?v=AqZjKe8p1gI
ఇది నిజంగా, మనస్పూర్తిగా నా friends కోసమే ఈ song
ఆ తరువాత సంవత్సరం ఇంకా హంగామా చేశాము. అదే f &f వారి ఆఖరి హంగామా . దాని గురించి next post లో.

Monday, January 17, 2011
Movies in my life - 4
సినిమా........contd
నా శ్రీమతి తో సహా అందరూ నచ్చింది అన్నందుకు one more round of సినిమా
నా జీవితంలో నాకు బాగా నచ్చిన నన్ను ప్రభావితం చేసిన ఇంకొక సినిమా "కొడయాట్టం" అనే మలయాళం సినిమా. అందులో గోపి హీరో. director అదూర్ గోపాలక్రిష్ణన్ అనుకుంటాను. ఈ సినిమా నేను దూరదర్శన్ లో ఆదివారం చూశాను.regional film category లో మధ్యాహ్నం వచ్చింది. నేను అప్పుడు 9th std అనుకుంటాను. ఆ సినిమాలో ముందు హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితం గడుపుతాడు.అక్క చాటున బ్రతుకుతూ ఉంటాడు. వీడికి పెళ్లి చేస్తుంది. హీరో పెళ్ళాం వీడి బాధ్యతలేని తిరుగుళ్ళు భరించలేక వదిలేసి వెళిపోతుంది. అప్పుడు హీరో భార్య గర్భవతి. అయినా హీరో (వాడి పేరు శంకర్ అని గుర్తు) ఏమి పట్టించుకోడు. వాడికి తిండి పెట్టే అక్క పెళ్లి చేసుకుంటుంది. వీడంటే అభిమానం చూపించే ఒక విధవ ఎవరిచేతో మోసగించబడి ఆత్మహత్య చేసుకు చచ్చి పోతుంది.ఒంటరివాడు అయిపోతాడు.తరువాత హీరో ఒక lorry cleaner కింద జాయిన్ అవుతాడు. అష్ట కష్టాలు పడి ఎలాగో నిలదొక్కుకొని మొదట సంపాదించినా డబ్బులతో పెళ్ళానికి మల్లె పూలు కొని తీసుకు వెళతాడు. అప్పుడు వాడి అత్తవారింట్లో హీరో తన కొడుకుని ఎత్తుకుని ముద్దాడతాడు. ఇంతవరకే గుర్తుంది. ఇదే climax అనుకుంటాను. దీని తరువాత గుర్తులేదు. నిజంగా భర్త బాధ్యత తీసుకోవడం లో ఒక life partner పడే సంతోషం, వాడు నిజంగా వాడి కొడుకుని ఎత్తుకునే క్షణంలో వాడి feeling నాకు ఎప్పటికి చెరగని memory . ఈ సినిమాలో గోపి peformance fantastic. subtitles తో సినిమా follow అవ్వడం ఈ సినిమాతోనే నేను మొదలెట్టాను. ఇదే నేను చూసిన మొదటి పరభాషా చిత్రం. ఇంటర్మీడియట్ నించి ఇంక భాష తో సంబంధం లేకుండా సినిమాలు చూడటానికి ఈ సినిమాయే పునాది. కొంచం ఓపిక ఉన్నవాళ్ళు చూడతగ్గ సినిమా.
నవ్వంటే ఇప్పటికి ఎప్పటికి నేను మర్చిపోలేని సినిమా "శ్రీవారికి ప్రేమలేఖ". దీని గురించి నేను ఏమి చెప్పినా తక్కువే. ఇంత నవ్వించగలిగే సినిమా తియ్యడం ఒక్క జంధ్యాలకే చెల్లింది. ఇందులో మనం enjoy చెయ్యలేని సీన్ అంటూ ఉండదు. ఈ సినిమాలో ఎవడైనా నవ్వలేకపోతే నా అభిప్రాయం ప్రకారం వాడి జీవితంలో ఏదో భయంకరమైన లోపం ఉన్నట్టే. అన్నీ నాకు నచ్చిన సీన్లే. అన్ని dailogues నాకు కంథతా నే. అందులో లాస్ట్ పావుగంట సీన్ లో పెళ్ళిలో జరిగే అన్ని రకాల farce లు ఉంటాయి.ఒకావిడ పట్టు చీరతో సతమతమైపోతూ ఉంటుంది. పెళ్లి ఉంది అన్నప్పుడు పట్టు చీర కట్టడం. లేదు అనగానే చీర మార్చి మామూలు చీర కట్టడం. ఆఖరికి ఈ తతంగం నాలుగు సార్లు జరిగిన తరువాత మళ్ళీ పెళ్లి cancel అని తెలుస్తుంది. ఆవిడ ఎంతో నిస్పృహతో "మళ్ళీ పట్టు చీర విప్పేయాలా " అని అడుగుతుంది. అప్పటికే వెర్రెక్కిపోయి హీరో తండ్రి (వీరభద్రరావు) అక్కడ ఉన్న ధాన్యం మూటల మీద అయ్యప్ప pose లో కూర్చొని ఉంటాడు. ఈ మాట వినగానే ఒక్కసారి కిందకి గెంతి "నువ్వు విప్పి నాకు కట్టవే" అంటాడు.
నవ్వుని తెలుగు సినిమా లో define చేసిన జంధ్యాల కిదే నా నీరాజనం.
regional films flow లో నేను చూసిన నాకు బాగా నచ్చిన ఇంకో రెండు సినిమాలు. సత్యజిత్ రే తీసిన "జన అరణ్య " and రిత్విక్ ఘటక్ తీసిన "మేఘే డాక తార". వీటి గురించి మరోసారి.

Sunday, January 16, 2011
Movies in my life - 3
సినిమా......contd
"పంచేద్రియాలనే కాదు
ప్రపంచాన్ని కూడా
రాయిలా నిలిపేవాడు రుషి
రాయిలా పడివున్న ప్రపంచాన్ని
అహల్యలా మలిచేవాడు మనిషి"
సాగర సంగమం లో ఈ dialogue నిజంగా నన్ను కదిలించింది. వ్రాసినవారెవరో నాకు తెలియదు. కానీ ఒక మనిషి మీద తనకున్న అపారమైన నమ్మకం ప్రకటించాడు కవి.
ఈ మధ్యే రిలీజ్ అయినా మహేష్ ఖలేజా లో నాకు నచ్చిన డైలాగ్
మహేష్: దేముడి definition అర్ధం అయిపొయింది భయ్యా. ఆడేక్కడో పైన ఉండదు. నీలోను నాలోనూ ఇక్కడే ఉంటాడు. అవతలోడి సాయం కోసం అడిగినప్పుడు టప్పని బయటికి వస్తాడు........ఒరేయ్ సిద్ధా, ఇందాక నీకు విత్తనం లో చెట్టు కనపడింది, ఇప్పుడు నాలో నాకు దేముడు కనిపిస్తున్నాడు.
నాకు బాగా నచ్చిన సినిమాలలో వేదం కూడా ఒకటి. క్రిష్ తీసిన వేదం సినిమా లో గుండెను కదిలించే situations చాలా ఉన్నాయి. అవన్నీ చెపితే సినిమా script రాసినట్టే అవుతుంది. అందులో ఒక situation అండ్ దాని continuation లో పాట. అదేంటంటే కేబుల్ రాజు(అల్లు అర్జున్) తన ప్రియురాలికి హోటల్ దగ్గిర నిజం చెప్తాడు. తను దొంగిలించిన డబ్బులు తిరిగి మూట కట్టి అందులో తన pocket లో ఉన్నవి కూడా కలిపేస్తాడు. అప్పుడు back ground song
" ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశా
కొడిగట్టిన దీపంలా
మినుకు మినుకు మంటుంది
మనిషిగా బ్రతకాలనే ఆశా
గుండెల్లో ఊపిరి
కళ్ళల్లో జీవమై , ప్రాణంలో ప్రాణమై
మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ"
" Shawshank redemption "అన్న సినిమాని నా మరదలు kiranmayee sandeep recommend చేసింది. నా hard disk లో load కూడా చేసింది. కానీ ఎందుకో నాకు ఆ పేరు నచ్చ లేదు. అందుకనే చూడలేదు తిరిగి rk చెప్పేదాకా. ఆ సినిమా చూసిన తరువాత అర్ధం అయ్యింది పేరుబట్టి సినిమా చూడడం మానేయకూడదని. Shawshank అన్నది ఒక prison . జీవిత ఖైదీలని అక్కడ ఉంచుతారు.నిజమైన ప్రపంచానికి దూరంగా అదో ప్రపంచం. అక్కడ ఖైదీలకి జైలర్, వార్డెన్లు చెప్పినవి చెయ్యడమే తప్పితే వేరే ఆలోచించడానికి కూడా time ఉండదు, ఇవ్వరు. పొరపాటున తన భార్య హత్య కేసులో ఇరుక్కుపోయి హీరో అక్కడికి చేరుకుంటాడు. తప్పు చేసిన వాళ్ళని చీకటి కొట్లో పడేస్తారు. ఒకసారి అక్కడ music play చేసి హీరో వారం రోజులు చీకటి కొట్లో ఉండి వస్తాడు. తరువాత అక్కడ mess లో red అని hero close firend in prison ఇంక తోటి ఖైదీలతో dining table దగ్గిర జరిగే coversation ఆ సినిమాలో నాకు నచ్చిన conversation.
Red : a week in the hole is like a year
Dufrence (హీరో): I had Mr . Mozart to keep me company
mate: So they let you tote that record player down there
Duf : తన తల చూపిస్తూ -It is in here - గుండె చూపిస్తూ - and here - It is the beauty of music , they cant get that from you - Haven 't ever you felt that way before
Red : Well I played harmonica as a younger man , lost interest in it though -doesnt make much sense in here
Duf : here is where it makes most sense , so that you dont forget
Red : forget ??
Duf : dont forget that there are places which are not made of stone and there is something they cant get to , they cant touch , its yours
Red : what are you talking about
Duf : Hope
ఇప్పుడు నేను చెప్పేవన్నీ నా మీద ఎలాటి ప్రభావం చూపించి ఉంటాయో మీకు అర్ధమయ్యే ఉంటుంది.

Wednesday, January 12, 2011
Movies in my life - 2
సినిమా........contd .
గురుదత్ " ప్యాసా" సినిమా 1991 వరకు చూడలేదు . రాంబాబు పరిచయమైన తరువాత వాడితో కలిసి "లమ్హే " అనే హిందీ సినిమా చూశాను . అందులో అనుపంఖేర్ , శ్రీదేవి ఒక parody song పాడతారు . ఆ parody song లో, అది mixture of all songs , "जाने वो कैसे लोग थे जिनके प्यार को प्यार मिला" అని పాడతాడు అనుపం ఖేర్. నాకు ఆ lyric బాగా నచ్చింది. అప్పుడు మొదలెట్టాను ఈ సాంగ్ ఎందులోదని వెతకడం. అప్పుడు తెలిసింది నాకు "ప్యాసా" గురించి. అప్పుడు cassette తెచ్చుకుని చూశాను. ఒక highly talented introvert ఎలా తనలో తనతో, తనుండే ప్రపంచంతో సమాధానపడటానికి ప్రయత్నిస్తాడో ఆ సినిమా.అందులో నాకు బాగా నచ్చిన సీన్, auditorium లో హీరో వర్ధంతి సమావేశం, అతను రాసిన కవితల పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. అతను బ్రతికుండగానే చచ్చిపోయాడని చెప్పి publicity ఇస్తారు. అతని అన్నలు, అతని మొదటి ప్రియురాలు, ఆమె భర్త , వృత్తి రీత్యా వేశ్య అయినా ఇతని కవిత్వం విని inspire అయ్యి అన్నీ మానేసి ఇతన్ని ప్రేమించే అమ్మాయి,జన సందోహం అందరూ అక్కడ ఉంటారు. అప్పుడు ఆ చీకటి గా ఉన్న auditorium లోకి doors ,with bright light , ఓపెన్ అవుతాయి. back ground లో ఉన్న light లో హీరో, హీరో తాలూకు silhouette - అతను మెల్లిగా పాడటం మొదలెడతాడు. "ये महलों ये तख्तों ये ताजों की दुनिया - ये इंसान के दुश्मन समाजों की दुनिया........ये दुनिया अगर मिल भी जाए तो क्या है" అని. ఆ బ్లాకు అండ్ వైట్ imagery ,ఆ representation of sequence , నిజంగా గురుదత్ కి hats off . ఆఖరికి హీరో విసుగెత్తి అన్నిటినీ వదిలేసి, he simply walks into the horizon for a better world .
1993 లో "Manichihrathazhu "అనే మలయాళం movie release అయింది. ఫాజిల్ దాని director . తెలుగు లో దాని dubbed version "ఆత్మ రాగం" అని రిలీజ్ అయింది. పూర్ణా theathre లో only morning shows. నేను college అయిపోయి on and off ఉద్యోగాలు చేస్తూ,పని లేకుండా తిరిగే రోజులలో ఈ సినిమా చూశాను. mind blowing . ఆ సినిమా theme , concept , డైరెక్టర్ కి medium మీద ఉండే పట్టు, అది చూపించిన తీరు fantastic . This is one of the best rated film in my personal diary . అందులో నాకు నచ్చిన సీన్ అందరికీ నచ్చినదే, శోభనకి national best actress award తెచ్చింది. హీరోయిన్ లోని split personality బయటికి వచ్చే time లో sudden గా తమిళ్ లో మాట్లాడుతూ" విడమాట్టే , నా ఇప్పపో ....నీ విడమాట్టే ..... " అని మంచం ఎత్తి పడేస్తుంది.
నేను thrill అయ్యి నా friends అందరిని పోరు పెట్టి తీసుకు పోయాను. ఎవడికి నచ్చిందో నచ్చలేదో తెలియదు. నేను దాని మళయాళ మాతృక CD నా personal ఆల్బం లో పెట్టేసుకున్నాను.
ఆ సినిమా తెలుగులో ఎక్కువ ఎవడూ చూడలేదు, కానీ "చంద్రముఖి" రజనీకాంత్ సినిమా మాత్రం సూపర్ హిట్. may be మాస్ ని ఇది బాగా entertain చేసినట్టుంది. రెండిటినీ compare చేస్తే నాకు ఆత్మరాగమే నచ్చింది.
1996 లో నా శ్రీమతి తో నేను చూసిన మొదటి సినిమా "గులాబి". ఆ సినిమా కంటే సినిమా హాల్లో నా శ్రిమతినే నేను ఎక్కువ చూశాను. కొత్త పెళ్లి కదా. అదీ మొదటిసారి సినిమా. అందుకే ఆ సినిమా గురించి నా observation కంటే నా శ్రీమతి ఎలా feel అవుతున్నాది, ఎలా react అవుతున్నాది అన్నదాని మీద focus ఎక్కువై సినిమా సరిగ్గా చూడలేదు.
నేను 2008 లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సుబోద్ "గమ్యం" సినిమా గురించి చెప్పాడు. వాడు ఈ సినిమా గురించి చాలా చెప్పాడు. నేను వాడి వెంట పడితే ఇంక విసుగెత్తి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ సినిమాలో హీరో హీరోయిన్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో తనని తనే తెలుసుకుంటాడు. life అంటే ఏమిటి అని తెలుసుకుంటాడు. దాని montage point ఈ సినిమా లో నాకు నచ్చిన సీన్. కొడుకు, అతని ఫ్రెండ్ ఒక దొంగని తండ్రి దగ్గిరకి పోలీసులు తీసుకువస్తారు.
తండ్రి: జానకి దొరికిందా
కొడుకు: లేదు
తండ్రి: ఒక దొంగ దొరికాడు
కొడుకు: వీడు దొంగని నాకు తెలుసు, కానీ నీకు తెలియదు వీడు మనిషేనని.........
తండ్రి: నీకు life గురించి తెలియదు అంటాడు.
కొడుకు: నేను పుట్టినప్పుడే అమ్మ చచ్చిపోయింది. I am living her life too. 25 years చదువుకుని నాకు లైఫ్ గురించి ఏమి తెలియదు. జానకి కోసం వెతికే నాకు నేనే దొరికాను. " life అంటే నేనొక్కడినే బతకడమనుకున్నాను. నా చుట్టూ ఉండే నలుగురితో share చేసుకుని బతకడమని ఇప్పుడే తెలుసుకున్నాను"
ఇవి కాకుండా ఎన్నో సినిమాలు ఉన్నాయి నాకు నచ్చినవి.
మాయా బజార్ , enter the dragon , షోలే, god father (ఇంగ్లీష్), back to the future , matrix and the list is endless . ప్రస్తుతానికి ఇవి. మళ్ళీ ఇంకోసారి నా బ్లాగ్ మరీ బరువెక్కినప్పుడు సినిమాల గురించి ఇలాగే రాస్తాను.
నా స్నేహితులు వాళ్ళకి ఈ cinema post ఎలా అనిపించిందో చెప్తే సంతోషిస్తాను.

Tuesday, January 11, 2011
Movies in my life - 1
సినిమా
దీని గురించి తెలిసిన వాడు, తెలియని వాడు, నాలాటి వాడు అందరూ ఉద్గ్రంధాలు వ్రాసేశారు.Drama శకం నించి మూకీలు ఎలా మొదలయ్యాయి, ఎవడు కనిపెట్టాడు,మొదటి టాకీ, ఆర్వో కలర్, గేవా కలర్, eastman కలర్,scope, 70MM,stereo , dtx , sfx etc.,
అందరూ చెప్పేశారు. నేను చెప్పడానికి ఏమీ లేదు. కానీ నా జీవితంలో నేను చూసిన సినిమాలు, అప్పటి సంఘటనలు, వాటిలో నేను మరిచిపోలేనివి, నన్ను కదిలించినవి నేను మాత్రమే చెప్పగలను. అవే అందరితో పంచుకుందాం అనిపించి ఈ ప్రయత్నం.
నాకు నచ్చినవి చాలా సినిమాలే ఉన్నాయి. నన్ను ప్రభావితం చేసినవి కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే సినిమాల తో నా జీవితంలో సంఘటనలు కూడా ముడిపడి ఉన్నాయి.
నాకు బాగా గుర్తుండి పోయిన మొదటి సినిమా సీన్ - మా టాటా శ్రీనివాస్ అన్న నేను 3rd std లో ఉన్నప్పుడు నన్ను, నా తమ్ముడు మురళి వచ్చాడో లేదో గుర్తుకు లేదు, తీసుకు వెళ్ళాడు. 1977 అనుకుంటా విశాఖపట్నం, అలంకార్ ధియేటర్ లో push back సీట్స్ వైజాగ్ లో 1st time introduce చేసారు . అడవి రాముడు సినిమాలో NTR మొదటి డైలాగు - ఎవడో అమ్మయిని chase చేస్తూ ఉంటాడు - వాడిని ఒక తన్ను తన్ని ( NTR face చూపించరు - NTR కాళ్ళు మాత్రం కనపడతాయి-చేతిలో belt ) ........... ఈ అడవికి రాముడ్ని అంటాడు. అందులో పులితో fight , ఏనుగులు circus లో చూపించే feats బాగా enjoy చేశాను..
ఆ తరువాత VT college ,శివాలయం branch లో నా class leader గిరిధర్ నన్ను అడిగాడు, "నువ్వు ఎవరి favourite " అని,
"అంటే" అన్నాను -
"నీకు ఎవరంటే ఇష్టం" అని అడిగాడు -
" ఏమో తెలియదు" అన్నాను -
మళ్ళీ అడిగాడు "NTR లేదా ANR ఎవరు" అని అడిగాడు -
obvious choice NTR - అలా నేను NTR అభిమానిగా మారాను.
1979 లో శంకరాభరణం సినిమా రిలీజ్ సంగం-శరత్ లో అయ్యింది. మా నాన్నగారు అసలు నాకు ఊహ తెలిసిన తరువాత ఎప్పుడూ సినిమాకి వెళ్ళడం చూడలేదు. మా బలవంతం మీద రెండో మూడో సినిమాలు చూసారు. అలాటి మనిషి 30 times చూసిన ఏకైక సినిమా. నా ఫ్యామిలీ మొత్తం including మా పెద్ద మామ్మగారు కూడా చూసిన సినిమా. మూడు టికెట్స్ 1st క్లాసు, రెండు టికెట్స్ balcony అది మా నాన్నగారు బ్లాక్లో కొని తీసికెళ్ళిన సినిమా. మా పెద్ద మామ్మగారు మా బాల్కనీ లో మడత మంచం మీద పడుకుని నా చేత ఆ సినిమా పాటలన్నీ పాడించుకుని వింటూ ఉండేవారు. అప్పట్లో ఆ సినిమా అర్ధం కాలేదు. పాటలు పాడేవాడిని అంతే . మా పట్టాభి మావ దగ్గిరకి Bhilai వెళ్ళినప్పుడు, శివాజీ అని అతని ఫ్రెండ్ " హలో శంకర శాస్త్రి" పాట నా చేత పాడించుకుని రికార్డు కూడా చేశారు. ఆ తరువాత చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ చూశాను. విశ్వనాధ్ గారికి ఇదే నా సవినయ నమస్సు. అందులో నన్ను బాగా ప్రభావితం చేసిన dialogue - శంకర శాస్త్రి తులసిని ఇంటికి తీసుకువస్తాడు - ఆమె తరఫున అతని ఫ్రెండ్ మాధవ, advocate ని కేసు వాదించమంటాడు . అప్పుడు మాధవ శంకర శాస్త్రితో అంటాడు"లోకమంటూ ఒకటి ఏడ్చింది కదా అని" - దానికి శంకర శాస్త్రి " లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడనురా మాధవా" అంటాడు. ఆ ఒక్క డైలాగ్ లో శంకర శాస్త్రి character అతను నమ్మిన దానిమీద అతని conviction నాకు బాగా నచ్చింది.
1981 లో ఆకలి రాజ్యం సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లో అది గొప్ప craze . "సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్" అనే పాటని నేను 7th చదువుతున్నప్పుడు ఏదో పెళ్లి భోజనాలలో మా చుట్టాలతను పాట పాడాడు. చాలా నచ్చింది. కానీ ఆ సినిమా నేను 1985 లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చూశాను. అందులో గుర్తుండిపోయిన scene - కమలహాసన్ శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముతాడు. శ్రీదేవి అడిగితే చాలా దుఖంతో చెబుతాడు. "ఆకలి ఊదే నాద స్వరానికి మనిషి ఆడక తప్పదు" అని. శ్రీశ్రీ అభిమాని క్రింద మారింది ఆ సినిమా చూసే. ఆ సినిమా అప్పటికి ఇప్పటికీ నా favourite movie . ఎందుకంటే అందులో hero నాలాగ జీవితంలో compromise అవ్వలేదు. అనుకున్న దానికి నిలబడ్డాడు. నచ్చిందే చేశాడు. నా ఫ్రెండ్ రాంబాబు, సుబోద్ చాలా సంవత్సరాల తరువాత ఏదో ఒక సందర్భంలో అన్నారు - ఇంకా ఏంట్రా ఆ movie అంటే fascination అని. అదేంటో అదంతే . ఇంకా నా తమ్ముడు మురళి లెఖ్ఖ ప్రకారం నేను ఇంజనీరింగ్ 2nd year -1988 లో ఇంట్లోంచి అలిగి పారిపోయాను - తినడానికి ఏమి లేక diamond పార్క్ లో కళ్ళు తిరిగి పడిపోయాను.ఏదో హోటల్ లో కప్పులు కడిగాను, వాడు పెట్టే టిఫిన్ కోసం. ఏదో సంఘం వాళ్ళు పెట్టిన చలివేంద్రం లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నాను. అందుకే వాడు అది ఆ సినిమా ప్రభావమే అంటాడు. ఎందుకంటే నేను పారిపోయేటప్పుడు నా దగ్గరున్న శ్రీశ్రీ, చెలం పుస్తకాలు తీసుకుని పారిపోయాను. అందుకు.
తరువాత 1983 లో నేను Pre -matric చదువుతున్నాను. ఎందుకో గుర్తు లేదు మధ్యాహ్నం స్కూల్ నించి ఇంటికి వచ్చేసాను. మా అమ్మ ని "డబ్బులు కావాలి" అడిగాను. "దేనికి" అని అడిగింది. "సినిమా కి వెళ్తాను" అన్నాను. అప్పుడు శ్రీ కృష్ణ పిక్చర్ ప్యాలస్ లో అభిలాష, చిరంజీవి సినిమా ఆడుతోంది. Rs2.25 balcony ticket . ఆశ్చర్యంగా ఒక్కడివే వెళ్తావా అని కూడా అడగలేదు. మూడు రూపాయలు ఇచ్చేసింది. అది పట్టుకుని స్కూల్ uniform లోనే పరిగెట్టాను. ఒక్కడినే చూసిన 1st సినిమా. interval లో బఠానీలు కొనుక్కున్నాను. చిరంజీవి యురేకా సకమికా అనే పాటలో handle వదిలేసి motor cycle నడపడం చూసి thrill అయిపోయాను.
మరికొన్ని నా జీవితంలో జరిగిన సంఘటనలు, సినిమాలు next post లో

Subscribe to:
Posts (Atom)