ఈ science and philosophy ఏంటో?
ఈ autobiography ఏంటో?
ఇంత బరువుగా ఈ భాష ఏంటో?
ఈ ఏడుపు గొట్టు కవిత్వం ఏంటో?
దీనికి మళ్ళీ ఈ హిందీ -ఉర్దూ mix ఏంటో?
కొంచం కూడా relief లేకుండా, friends అందరిని చదివారా లేదా అని అడిగి, ఈ చావబాదుడు ఏంటో?
అన్నీ కొంచం కొంచం మొదలు పెట్టి ఏది complete చెయ్యకుండా ఈ పద్ధతి ఏంటో?
ఒక్కొక్క సారి అనిపిస్తూ ఉంటుంది అసలు నేను ఎందుకు ఇలాగ అని. నా nature ఇదేనా అని?
అప్పుడప్పుడు సమాధానం తెలుసనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను మూర్ఖుడిని అని.
మళ్ళీ ఏదో పెద్ద అన్నీ తెలిసినట్టు ఒక గొప్ప మహర్షి లాగ ఫోజులు.
ఏమీ తెలియదని ఒప్పుకోవడానికి అహం లేదు కాని - నాకు కొంచం తెలిసినా వీరావేశం తో వాదిస్తాను.
ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు? ఆత్మా విమర్శా లేక స్వోత్కర్షా?
సరదాగా గడపాల్సిన కాలాన్ని ఇలా బరువుగా గడపడమెందుకో?
సరే సరదా అంటే ఏమిటో?
నా definition ఏమిటంటే friends తో కూర్చుని ఒక peg మందు, ఒక దమ్ము, కొంచం intellectual discussion లేదా family తో కూర్చుని సరదాగా ఒక సినిమా, పిల్లలతో ఆడుకోవడం.
ఇవి పెద్ద కోరికలు కావు కాని వీటికి కూడా time కుదరని ఒక ఉద్యోగం.
family అంటే నేనొక్కడినే కాదు కదా - నా తల్లి తండ్రుల ఆశలు - నా సగభాగం అమ్మలు ఇంకా నా పిల్లల సరదాలు ఇవన్నీ ఎలాగా? వీటికి డబ్బు కావాలి - కావాలంటే ఉద్యోగం చెయ్యాలి.
ఎంచుకున్న ఉద్యోగం లో కొంచం డబ్బుంటుంది - time అసలు ఉండదు. మరి బాగా డబ్బు వచ్చి time ఉండే ఉద్యోగం చెయ్యొచ్చు కదా - ఇలా అంటే తలవ్రాత అని ఊరుకోవడమే. ఎందుకంటె నాకు సమాధానం తెలిస్తే అదే చేస్తాను కదా.
అమ్మలు అంటుంది మీరు ప్రయత్నం చెయ్యరు, మీకు బద్ధకం ఎక్కువ.
బద్దకమే ఉంటె ఈ చావు చాకిరి ఎలా చెయ్యగలను? ఈ targets , ఈ union గొడవలు, ఈ threats , management warnings ఇవన్నీ భరిస్తూ ఎవడికో సంపద పెంచుతూ - నేనే national productivity కి gear అయిపోయానని భ్రమలో - ఇదో ప్రపంచం.
ఏంటో గురు - ఈ materialistic plane లో నా కన్నా భయంకరంగా బతికేవాడు నేను సుఖపడుతున్నాను అనుకుంటాడు. నా కన్నా సుఖంగా బతికేవాడు నన్ను చూసి జాలి పడతాడు.
సరే సుఖం అంటే ఏమిటో?
ఇదే సుత్తి discussion ఎన్ని సార్లు, ఇంకా చాలు అనిపించింది.
rk గాడు sine curve లాగ కష్టాలు - సుఖాల combinations తో వెళుతూ ఒక పది sms లు పంపించిన తరువాత అనిపించింది. ఆ ప్రవాహంలో పొంగిన తరువాత నాకు గుర్తొచ్చిన ఒకప్పటి నా ఆలోచనల స్రవంతి.
ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటే - పెద్ద మార్పు లేదుకాని - అలవాటు అయిపొయింది.