Thursday, October 7, 2010

ఆలోచనల స్రవంతి - 4

నాకు KTC తో మాట్లాడుతుంటే ఇంకోటి అనిపించింది. అసలు ఎవడికి ఈ system తప్పు అనిపించటం లేదు ఏమో. అందుకే ఎవరు తీవ్రంగా దీన్ని మార్చాలి అనుకోవటం లేదు అనిపించింది. మార్చాలి అని అనుకున్నాడు అంటే, వాడు ఎంతో కొంత ఆలోచించే వాడే అవుతాడు. ఆలోచించగలిగే వాడు అయితే చచ్చే దాకా logic ఆలోచిస్తూ కూర్చోడు. ఏదో ఒకటి చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించాడు అంటే ఎంతో కొంత సంపాదిస్తాడు. జీవితం లో కొంత stability వచ్చిన తరువాత ఆలోచించాల్సిన అవసరం కనిపించదు. ఎవడి domestic life  లో వాడు పడిపోతాడు. ఉన్న జీవితమే చాల చిన్నది. ఆ మాత్రం ఈ మాత్రం సెటిల్ అవ్వగలిగిన వాడు, ప్రపంచం తీరు తెలిసిన వాడు, ఎందుకు తన లైఫ్ confuse చేసుకోవాలి అని అనుకున్నాను.
అప్పుడు Kameswararao the philosopher (Mr . KTP ) బయటికి వచ్చాడు. ముందు నా ధోరణిలో నేను గుర్తు పట్టలేదు.తరువాత KTC shape మార్చాడేమో  అనుకున్నాను. కానీ వాడు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది, వాడు ,వీడు వేరని.
వీడు "నాయనా" అన్నాడు. ఏమిటి చెప్పు. నీ చుట్టు పక్కల ఉన్న వాతావరణం ఆంతా భయంకరంగా ఉంటే నువ్వేమి సుఖపడతావు నాయనా.నేను సుఖపడక పొతే సుఖం ఉండే చోటు వెతుక్కుంటూ పోతాను అన్నాను. వాడు అలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి పోతావు నాయనా అన్నాడు. ఎక్కడికైనా నాకు నచ్చిన చోటికి అన్నాను. ముందు నీ సుఖం నువ్వు define చేసుకో బాబూ. KTP వెళిపోయాడు.
 నాకు భయం వేసింది. KTC మళ్ళీ నిద్ర లేస్తాడేమోనని. మళ్ళీ అనిపించింది  నేను KTC లా  మాట్లాడాను  కాబట్టి ఈ philosopher గాడి entry అనమాట. OK నిన్న మనిషికి ఆహార, నిద్రా, మైధునాలు basics అని మొదలెట్టి - -ఆహారం గురించి మాట్లాడే లోపు మనిషి గురించి మనిషి psychology గురించి ఆలోచించాల్సి వచ్చి  - మనిషి గురించి మొదలెట్టగానే నేను నా స్వార్ధాన్ని justify చేసుకోవడం మొదలు పెట్టాను.
 KTP తగలక  పొతే సంఘం గురించి  ఆలోచించాల్సి వచ్చేది కాదు - అసలు ఇంత చిన్న దానికి నేను నా స్వార్ధం చూసుకునేటట్టు అయితే  - నా కంటే తెలివైన వాడు వాడి చాకచక్యం తో సంపాదించినా డబ్బులు , సంపద అందరితోనూ కలిసి ఎందుకు పంచుకోవాలి. ఎందుకు వాడు అందరి బాగు కోసం పాటు పడాలి. అక్ఖర లేదు. ఆ cynic నువ్వు సుఖపడుతున్నావా అని అడుగుతాడు. philosopher సుఖం define చెయ్యమంటాడు. సరే సుఖం define చేస్తే మిగతావి line లో పడతాయన్న మాట అనిపించింది.
 సరే  start the list of సుఖం.
నాకు నేను ఏది సుఖమనుకుంటున్నాను.నాకు బోలెడు -
౧. కీర్తి - మనసుకి , అహానికి సుఖం   - -నిద్ర పట్టాలంటే మనసు సుఖంగా ఉండాలి కదా
౨.  కాంతా - - శరీరానికి సుఖం  - -మైధునం కి
౩.  కనకం.  - ఇంక మిగిలినవేమైన ఉంటే అవి కూడా పొందడానికి  - తరగని ఆహారం సమకూర్చుకోడానికి, నలుగురి మీద పట్టు, మళ్ళీ కీర్తి, కాంత  కూడా కనకాన్ని ఫాలో అవ్వడమే  - -అంటే కనకం ఉంటే సరిపోతుందా??
౪. మరి ఆరోగ్యం??? - -అవును ఇది కూడా కావాలి - ఎందుకు శారీరిక బాధ లేకుండా పై మూడు అనుభవించడానికి.
అనుభవం - -పై నాలుగుటివల్ల  వస్తుంది  - -అవి పుష్కలంగా ఉంటే అందమైన అనుభవం - -లేకపోతే ఏమిటో ???


కీర్తి -  సంఘం లో అందరూ కాకపోయినా కొందరు నిన్ను పోగడాలన్నమాట. అదేగా కీర్తి - అంటే సంఘం కావాలా???
కాంత - నీ సంఘం లో ఒక భాగం - -భార్య అయితే నీ జీవితంలో సగ భాగం. అన్య కాంతలు ??? - అంటే ఇక్కడ కూడా సంఘం కావాలా???
కనకం - బోలెడు డబ్బు సంపాదించు- దీని పరమార్ధం కూడా సంఘం లోంచి నీకు కావలిసిన వాటిని తీసుకోవడానికే.
ఆరోగ్యం - -ఈ pollution గురించి అందరికిచేప్పి ఆపమంటే కొంత ఆరోగ్యం బాగుపడుతుంది ఏమో  - అంటే సంఘాన్ని ఒప్పించాలి


అసలు నేను ఈ మనుషుల మధ్యన ఉన్నాను కాబట్టి ఇవన్నీ అవసరం - -అదే ఈ అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే - వీటి గొడవే లేదు కదా - ఇది నిజమే బాబూ - మరి అడవులన్నీ మనుషులు నరుక్కుంటూ పోతున్నారు కదా - -
మరి నీ తపస్సుకి  అడవి ఎక్కడనింది వస్తుంది????
మరి అడవులు కాపాడాలంటే - -అడవులు నరికే  వాడిని ఆపాలి - -వాడిని ఆపాలంటే వాడు నీ మాట వినాలి - -నీ మాట వినే పరిస్థితులలో వాడు ఉండాలంటే - నీకు మళ్ళీ కీర్తి,కనకం etc .,., - -విసుగేసింది - వలయాలలో తిరిగి, తిరిగి  - -తిరిగి అదే - ఇంకేదో ఉదాహరణ తీసుకున్న మళ్ళీ  అక్కడికే వస్తున్నాను -
అంటే నా సుఖం సంఘం లోనే ఉందా?? - మరి సంఘాన్ని నాకు నచ్చినట్టు మార్చుకునేదేలా - అందరినీ ఒక త్రాటిపై తీసుకు వచ్చి - తీసుకు రావాలంటే - వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో చెప్పాలి  -వాళ్ళని ఆలోచింప చెయ్యాలి-


ఆలోచనా??? - అసలు సుఖాన్ని define చేసేది ఇదే అనుకుంటా


ఈ విశ్వం లో కొన్ని standards ఉన్నటున్నాయి. లేకపోతే అందరికి పంచదార తియ్యగాను, చింతపండు పుల్లగాను etc .,,ఎలా ఉంటాయి. సరే ఈ common principles ఉన్న మనుషులకి ఒక కామన్ way of living నేర్పితే  - KTP sudden entry కొట్టాడు. అదే నాయనా మతం చేసే పని - అది మనుషులకి ఒక క్రమ పద్ధతిని నేర్పుతుంది.
 డిషుం,  డిషుం,డిషుం భీబత్సంగా sounds వినపడ్డాయి. నాలోనించి బయటకు వచ్చిన  KTC గాడు KTP ని చితక్కోడుతున్నాడు. "బుద్ది ఉందిరా నీకు  - మతం పేరు చెప్పుకుని చచ్చి పోతున్నారు తెలుసా - ఇది సరిపోదన్నట్టు కులాలు కూడాను - -ఏ మతం ఫాలో అవ్వమంటావురా - ఏంట్రా నీ తొక్క వేదాంతం. ఏ మతాన్ని  follow అవ్వమంటావురా???
KTP నిజంగానే తొణక లేదు. నువ్వు అసలు ఎందుకు ఆవేశ పడుతున్నావు. నేను ఈ మతం  అని పేరు చెప్పలేదే - "మనుషులందరికీ ఏది హితమో అదే మతం" అన్నాడు.
మళ్ళీ  డిషుం,  డిషుం,డిషుం - ఈ ప్రపంచంలో రకరకాల భౌగోళిక పరిస్థితులు, రకరకాల మనుషులు, రకరకాల అలవాట్లు - అందరూ ఒకేలా ఎలా అలోచిస్తారురా అన్నాడు KTC .ఇంకా అసలు నీకు చరిత్ర తెలుసా ?? తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని కూడా అన్నాడు.
నాకు చిరాకేసింది - ముందు మీరిద్దరూ పొండి ఇక్కడినించి - మీరిద్దరూ తన్నుకుని నన్ను అలిసి పోయేలా చేస్తున్నారు. ఇందాక నాకు, ఆలోచన basics ని పట్టుకుంటే  సుఖం - సుఖం definition పట్టుకుంటే - మనిషి, సంఘం అందరూ పద్ధతి లోకి వస్తారు అనిపించింది. నా ఆలోచనలేవో నేను ఆలోచించుకుంటాను. మళ్ళీ రమ్మనే దాకా మీరిద్దరూ రావద్దు. నాకు నిద్ర వస్తుంది. నేను రేపు చూసుకుంటాను - -మీరు మాత్రం రావద్దు అని నిద్రకి ఉపక్రమించాను.
సశేషం








Wednesday, October 6, 2010

ఆలోచనల స్రవంతి - 3

List చెయ్యడం  మొదలు పెట్టాను .
అసలు మనిషికి ఏమి కావాలి??
నా స్నేహితుడు రాంబాబు నాకు జ్ఞ్యానోపదేశం చేస్తూ "ఆహార, నిద్రా, భయ, మైధునాలు సహజాతాలు" అన్నాడు. అది గుర్తుకు వచ్చింది. Yes దొరికాయి మనకి list లో points. కాగితం తీసుకుని వ్రాయడం మొదలుపెట్టాను.
1 . ఆహారం
2 . నిద్ర
3 . మైధునం
భయం పెద్ద అవసరం కాదు కదా. దాని నించి ఎలా బయట పడాలన్నదే అవసరం. సరే దాని గురించి తరువాత మాట్లాడదాం. ముందు ఆహారం గురించి ఏమి points వ్రాయాలి. ఈ KTC మళ్లీ మొదలెట్టే లోపలే ఏదో ఒకటి ready చేసుకోవాలి. ఈ సారి నోరెత్తితే చంపేయాలి అనుకుని ఆలోచించడం మొదలు పెట్టాను.
దాన వీర శూర కర్ణ లో ఒక NTR లా  టాగోర్ సినిమా లో  చిరంజీవి లా " అసలు మనము ఇక్కడ ఏమి తింటాము- బియ్యం , గోధుమ - -అక్కడ వాళ్ళేమి తింటారు bread butter  - - మన production xxxx tons  - మన జనాభా xxx nos - - ఒక మనిషి ఒక రోజుకి ఇంత తింటే - -నెలకి ఎంత - -demand vs supply - -అసలు మ్యాచ్ అవుతామా లేదా - -ఎలా పండించాలి - -పంటలు పండించడానికి అన్నదాత పద్ధతులేమిటి  - -bread దేంతో చేస్తారు - -butter ఎలా తయారవుతుంది  -వాళ్ళ production vs consumption xxx - - వాళ్ళు అంత గొప్ప దేశం అయితే - -అన్నపూర్ణ లాటి నా దేశం ఇంకెంత గొప్పది - -ఆహారం - -హ హ హ " అని సింహం లాగ గాండ్రించాలి అనిపించింది. తరువాత చదువు కుంటే ఇందులో  emotion ఎక్కువ సరుకు తక్కువ అనిపించింది. సరే అసలు list చేద్దామనుకుని ఈ డైలాగ్స్ ఏమిటి?? సరే ఆహారంకి check list ఏమిటి.
A . ఎందుకంటే అక్కడ ఏమేమి పండుతాయి decide చెయ్యడానికి  - -ఎంత పంట పండుతుంది అంచనా వెయ్యడానికి
1 . భూమి ఎలాటిది కావాలి ?
2 . వాతావరణం ఎలా ఉండాలి?
3 . నీళ్ళు ఎంత కావాలి  - ఎక్కడినించి వస్తాయి?
4 . ఎన్ని ఎకరాలు సాగు పొలం ఉంది? - -
5 . విత్తనాలు మంచివి కావాలి - -ఇది compulsory - -ఎక్కడి నించి వస్తాయి
B . రైతుల దగ్గిర పండిన పంట కొనడానికి rates ఎలా decide చెయ్యాలి - -ఎవడు చేస్తాడు? - ప్రభుత్వం అయితే basis ఏమిటి ?
C.పంట ప్రజల దగ్గరికి చేరడం ఎలా
1 . ఎక్కడ stock చేస్తారు? - -
2 . ration  shops కి ఎలా చేరుతుంది -
3 . ration cards ఎలా జారీ చేస్తారు - system ఏమిటి ?
4 . card మీద ఇష్యూ చెయ్యాలి అంటే basis ఏమిటి?
5 . rates పెరగడానికి కారణం ఏమిటి ? ఎందుకు పెంచాలి?
D . corrective measures తీసుకోవాలంటే ఎలా - -preventive measures ఏమిటి?
E .  అసలు ప్రజల దగ్గిర ఇవన్నీ minimum అయినా కొనుక్కోడానికి డబ్బు ఉందా? per capita income ఎంత ఉండాలి
F . GDP or GDI అంటే ఏమిటి ? అసలు ఈ system ఆంతా సరిగ్గా జరుగుతుందో లేదో check చెయ్యడానికి ఏమైనా పద్ధతి ఉందా ?  ఉంటే ఎవరు చేస్తారు ?
G. ఇంకా management  basics లోకి వెళ్ళిపోతే
1 . అసలు ఏ Economy best ? ఎందుకలాగ?
2 . governance system  - ఎలా ఉండాలి?
ఒక్కొక్క point ని   తీసుకుని ఒకో గ్రంధం రాసేయచ్చు అనిపించింది. ఈ పైన చెప్పిన points మన దేశం లో implement అయ్యే పద్ధతి, మన సహజ వనరుల్ని మనవాళ్ళు వాడుకునే పద్ధతి, వాతావరణ పరిస్థితి తలుచుకుంటే భయం వేసింది. అసలు మిగతా దేశాలలో ఎలా implement  అవుతాయా  అని doubt వచ్చింది. మధ్యలో ఈ KTC గాడొకడు.
సరే ఇవన్నిటికీ notes prepare చేస్తే ఈ జన్మకి నేను ముగింపు చెప్పలేను. ఇవన్నీ ఇప్పుడు నేనేదో చిన్న పిల్లాడిలా ఆలోచిస్తున్నాను. ఎంతో మంది గొప్ప economists , scientists , leaders , politicians , అందరూ అలోచించి నడిపిస్తున్న ప్రపంచం ఇది. నేను ఇప్పుడు ఒక్కొక్కటి అడిగి- అవన్నీ సరి లేవని చెప్పి, ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యలేమని ఎంతో బాధ పడిపోతూ, గొప్ప intellectual లా నిద్ర వచ్చే వరకు ఫీల్ అయిపోతు - -ఏమి చెయ్యకుండా - -ఏ contribution లేకుండా - తెల్లవారు లేవగానే మళ్లీ మొదలు పెట్టి - -ఏమిటి ఇదంతా?
భయం భయం గా చూశాను, మళ్ళీ KTC కనపడతాడు ఏమో అని. కానీ నాకు అనిపించింది నేనే cynic లా ఆలోచిస్తుంటే మళ్ళీ వాడు ఎందుకని.ఏది బాగులేదో చెప్పే  బదులు ఏది చేస్తే బాగుంటుందో చెప్పచ్చు కదా అనిపించింది. అన్నిటికీ నా definitions ఇచ్చేస్తే ఎలాగా ఉంటుంది అనిపించింది. సరే ఇదేదో positive thinking లా ఉంది. ఇలాగ చేద్దాం అనుకున్నాను.
 కొంత idea దొరికింది కదా KTC గాడిని పిలిచి నా idea చెప్దాం. ఏమంటాడో చూద్దాం అనిపించింది. హాయ్ Mr . KTC నేను చెప్పేది వినడానికి రా బాబూ అన్నాను.
 వాడు ఆవలించుకుంటూ వచ్చాడు. ఏంటి నిద్ర పోలేదా అని అడిగాను. అప్పుడు వాడు నువ్వేమో పెద్ద positive thinker వి. మరి నేనేమో total negative . నీకు నిద్ర పడుతుందేమో కానీ నాకు ఎలా పడుతుంది అన్నాడు . సరే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు నేను చెప్పేది విను అన్నాను. వాడు చెప్పేది వినేవాడిలా ముఖం పెట్టాడు. నేను చెప్పాను.
 వాడు ఇది సరే, process , definitions అన్నీ చెబుతావు. మరి implementation ఈ మనుషులతో చేయించాలి కదా. చేయించగలవా అని అడిగాడు. Yes నేను చేయించగలను  అన్నాను. మరి అంత చేసే వాళ్ళే అయితే, ఈ system వల్ల మంచి జరగకపోతే system మార్చాలి అనేనా అనిపించాలి, లేదా సరిగ్గా చెయ్యలేదనేనా  ఒప్పుకోవాలి. మరి రెండిటిలో ఏది కరెక్ట్ అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ పెట్టాడురా వీడు. అనవసరంగా పిలిచాను వీడిని. లేకపోతె ఏదో కొంత పని చేశాను అనిపించేది. ఇప్పుడు మనుషుల psychology మీద points వ్రాయాలన్నమాట  అని తల పట్టుకున్నాను.
సశేషం

ఆలోచనల స్రవంతి - 2

Mr . KTC అప్పుడు అడిగాడు. ఏ రకంగా నీళ్ళు free నాయనా.  నువ్వు తాగే నీళ్ళకి water tax కట్టవా. ఇంక మునిసిపల్ వాటర్ కాకుండా మిగిలినా నీళ్ళు అంటావా అవి ఎప్పుడో contaminate అయిపోయాయి. Ground water table తగ్గిపోతోంది. వర్షాలా పడవు ఎందుకంటే చెట్లు ఉంచం కాబట్టి.  మిగిలిన జీవ నదులన్నిటికీ ఏదైతే మూలమో ఆ మంచు global warming అని కరిగి సముద్రంలో కలిసిపోవడం మొదలెట్టింది. ఇంకా sceintific గా మాట్లాడితే peak water , water resources , water crisis , contamination అని ఏదో మాట్లాడుకోవాలి. ఇప్పటికే నీళ్ళని bottles లో, packets లో పట్టేసి అమ్ముతున్నారు. ఇంకోన్నాళ్ళలో  అవీ ఉండవు.
 నాకు వాడు అంత గట్టిగా మాట్లాడడము కోపం వచ్చింది.
సరే మరి గాలి free కదా అన్నాను. KTC నవ్వి ప్రస్తుతం కొంచం గ్యాప్ ఉన్నది దానికే. ఈ pollution  కి అది కూడా కరువైపోతుంది. ఇంకోన్నాళ్ళలో oxygen కరువై అది కూడా కొనుక్కోవాలి. ఇప్పటికే కొన్ని చోట్ల oxygen booths పెడుతున్నారుట, నీకు తెలుసో తెలియదో అన్నాడు.
నేను ఏది చెపితే అది వాడు ఖండిస్తుంటే నాకు బాగా కాలింది. సరే మరి వెన్నెల గురించి ఏమి చెప్తావు అన్నాను..ఇప్పటికే మనకి ఈ pollution తో చంద్రుడు  brown గా కనపడ్డం  మొదలెట్టాడు. అయినా ఈ ఆర్ధిక  పరిస్థితులలో  చంద్రుడు, వెన్నెల ఎవడికి కావాలి. చూసే తీరిక ఉందా. ప్రతీ వాడికీ  insecurity . రేపెమైపోతుందో అని. ఇంకేవడికి కావాలయ్యా అన్నాడు.
 ఇంక పళ్ళు, కూరలు అంటావా. పెరట్లో పళ్ళు, కూరలు పండించుకునే వారు. ఇప్పుడు పెరళ్ళూ లేవు, కొనటానికి కూరగాయల  ధరలు అందుబాటులో లేవు. ఇంత జాగా కనపడితే real estate చేసేసి కోటీశ్వరులు అయిపోదామనే ప్రతీవాడి కోరిక.
వాడి విసురు చూసి నాకు మంట లేచింది. వీడికి గట్టిగా defence ఇద్దామనిపించింది.
అప్పుడు నేను చూడు బాబూ చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారము మన పూర్వీకులు కోతులు అట. వాటికి తోకలు ఉండేవి. ఇప్పుడు మనకి ఉన్నాయా. కాలం తో పాటు అలవాట్లు మారతాయి. అవసరమైనవే ఉంటాయి. అక్కరలేనివి తోకలు పోయినట్టే  మాయమైపోతాయి. మారే పరిస్థితిని బట్టి అన్నీ సర్దుకుంటాయి.ఇప్పుడు బియ్యం, కూరలూ లేకపోతె tablets తిని బతుకుతాం. అవీ లేకపోతె మాంసం తింటాం, పురుగులు తింటాం. అవీ కరువైతే ఒకడిని ఒకడు పీక్కుని తింటాం. ఏదో ఒకటి జరుగుతుంది లే. ప్రతీ దానికి pessimistic గా  ఆలోచిస్తే ఈ సైన్సు అవీ ముందుకు వెళతాయా అన్నాను. వాడు ఇంకా వదలలేదు.కొంచం నెమ్మదిగా అన్నాడు. కొద్దిగా ఆలోచించు. ఇవన్నీ ఇలా కావడం అవసరమా. మనుషులు కొంచం స్వార్ధం తగ్గించుకుంటే ఈ పరిస్థితి చక్కబడుతుంది కదా అన్నాడు.
 నేను తగ్గలేదు. ఇంతకు ముందు  ఎన్నో species ఇలాగే  అంతరించిపోయాయి. పొతే మనమూ పోతాము. దానికోసం ఈ సైన్సు పురోగతి అన్నీ ఆపేసి కూర్చోరు. అసలు నీకు నిప్పు, చక్రం ఇవేమీ కనిపెట్టకపోతే ఇలా ఉండే వాడివా. వాళ్ళు ఎంతో కస్టపడి కనిపెడితే మనం ఇప్పుడు సుఖపడుతున్నాము, తెలుసా. అప్పుడు KTC అవునా, మనము సుఖపడుతున్నమా అని, సరే కొంచం టైం తీసుకుని ఆలోచించు - -నేను మళ్ళీ వస్తాను అన్నాడు. నేను వీడిని ఇలా వదిలేస్తే ఏమైనా మాట్లాడతాడు. వీడి పని  పట్టాలి అని లిస్టు వ్రాయడం మొదలెట్టాను.
సశేషం

తిరిగి మొదలైన నా ఆలోచనల స్రవంతి

అసలు నా ఫ్రెండ్ రామకృష్ణ  నువ్వు బ్లాగ్ ఓపెన్ చెయ్యి అనగానే నాకు పెద్ద interest కలగలేదు. 
 ఇంతకూ ముందు నా ఫ్రెండ్ రాంబాబు చెప్పినప్పుడు అర్ధం కాలేదు అసలు బ్లాగ్ అంటే ఏమిటో. 
తరువాత సుబోద్ కొంత బ్లాగ్స్ గురించి explain చేశాడు. ఏదో కొంత అర్ధం అయ్యింది. మళ్లీ doubt వచ్చింది.
ఎందుకంటే ఇప్పటికే కొన్ని లక్షల/ కోట్ల బ్లాగ్స్ open అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను బ్లాగ్ open చేసి నాకు తెలిసిన మెట్ట వేదాంతం చెబుతూ కూర్చుంటే ఎవడు వింటాడు అని.
 కానీ రామకృష్ణ  ఇచ్చిన హామీ - ఒక పాతిక మంది  అయినా చదువుతారు నువ్వు వ్రాయి అన్నాడు.
 ఇంక ఉత్సాహం వచ్చింది. 
 townhall గట్ల మీద పొగ పీలుస్తూ ఉపన్యాసం దంచుతుంటే ఉంటుంది నా సామిరంగా - 
అలాటిది ఓపెన్ వెబ్ లో నాకు తోచింది తోచినట్టు వ్రాసేస్తూ - -అది చదివేవాళ్ళూ   ఉంటారు అని తెలిసిన తరువాత -
ఇక చూసుకో.  అసలు ఎలా చెప్పాలి అనిపించిందంటే  - -గుండెల్లో గునపం దింపేసి - -bomb  పెట్టేసి  - చీల్చేసి , చంపేసి,
ఆ తరువాత ఇంకేంటో అయిపోయి - -నాకే తెలియదు. 
చిన్నప్పుడు  మా అమ్మ కొత్త పుస్తకం ఇవ్వగానే దేముడికో page ఇచ్చి -తరువాత నా page లో  నా పేరు వ్రాసుకున్నప్పుడు కలిగిన feeling .
"Best things in life are free "  ఎవరో మహానుభావుడు ఈ మాట అన్నాడు. 
ఈ బ్లాగ్ free గానే ఓపెన్ చేసాను. ఓహో correct గానే చెప్పాడు అనుకున్నాను -
వెంటనే Mr .Kameswararao the cynic నిద్ర లేచాడు. 
వాడు వేసిన మొదటి ప్రశ్న అసలు best things అంటే ఏమిటి??
నా సమాధానం - నీరూ, గాలీ, వెన్నెల, ప్రకృతి,పళ్ళూ, కాయ గూరలు, ఈ బ్లాగ్  ఇంకా ఏవేవో చెప్పడానికి ప్రయత్నించాను. 
కానీ Mr . KTC  (Kameswararao the cynic )నవ్వి ఆపాడు - -brother దూకుడోద్దు, కొంచం ఆగు అన్నాడు.
ఆగి చూశాను. ఏమిటి సంగతి అని అడిగాను. నువ్వు చెప్పిన వాటిలో ఏదైనా ఫ్రీ ఉందా అన్నాడు - ఉంది అన్నాను.
మళ్ళీ చెప్పు అన్నాడు. "నీరు" అని మొదలెట్టానో లేదో ఆపేశాడు. అమ్మ చంపీశాడురా అనుకున్నాను. 
సశేషం 



Tuesday, October 5, 2010

manchi sanskruta padyaalu - -compiled by sandeep





17-05-2009
విద్యా దదాతి వినయం!
వినయాద్యాతి పాత్రతాం!
పాత్రత్వా ద్ధన మాప్నోతి!
ధనా ద్ధర్మం తత స్సుఖం!!


విద్యాతురాణాం న సుఖం న నిద్ర

అర్థాతురాణాం నగురుర్ న బంధు:
క్షుధాతురాణాం నరుచిర్న పక్వం
నిద్రాతురాణాం న సుఖం న శయ్యా
కామాతురాణాం నభయంనలజ్జ


కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా!
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః!
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే!
క్షీయన్తే2ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్!!


వేదమూల మిదం బ్రాహ్మంభార్యామూల మిదం గృహం,
కృషిమూల మిదం ధాన్యంధనమూల మిదం జగత్

old thought process - -14

27-09-2009
ఆదిశంకర విరచిత వివేక చూడామణి అవతారిక 

జన్తూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రతా 
తస్మాద్వైదిక ధర్మ మార్గపరతా విద్వత్వ మస్మాత్పరం 
ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి 
ర్ముక్తిర్నో శత కోటి జన్మ సుక్రుతైహ్ పుణ్యైర్వినా లభ్యతే

తా|| సకల స్థావర జంగమ రూప భూతములలో మనుష్య జన్మ దుర్లభము. ఆ నరజన్మ నందు పురుష శరీర ప్రాప్తి దుర్లభము. పురుష శరీరము కలిగినను  వేద ప్రతిపాద్యాధ్యయనాధ్యాపనాది షట్కర్మ మార్గ సనాతన ధర్మ పరాయణత కలుగుత దుర్లభము. వైదిక ధర్మాచరణము కలిగియున్ననూ విద్వత్వము కలుగుట దుర్ఘటము. పరోక్షజ్ఞ్యానము కలిగిననూ ఆత్మానాత్మ వివేచనము కలుగుట కష్టము. అట్టి వివేకము కలిగినను ఆత్మ యొక్క యదార్ధ జ్ఞ్యానము కలుగుట దుర్ఘటము. ఆత్మానుభవమును పొంది  నిరంతరమూ నిరంతరాయముగా ఆత్మ స్థితుడై సంపూర్ణ జీవన్ముక్త్యవస్థ నుండుట అత్యంత దుర్లభము. నూరు కోట్ల జన్మములందు చేసికొనిన పుణ్య పరిపాక వశమున కానీ మోక్షము లభించదు.

దీని మీద మీ అభిప్రాయాలూ చెప్పండిరా - - ఇంత కష్టపడి ఆ ఆనందాన్ని పొందడమా లేక ????

old thought process - -13

08-07-2009
ప్రియ మిత్రులారా
నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కాని, మెప్పు పొందాలని కాని ఇవన్ని చెయ్యటం లేదు
ఇవన్ని చెయ్యటానికి కారణం ఏమిటంటే , ఏమిటో నాకు తెలీదు , ఏమీ లేదు 


నాకు బాగా నచ్చిన చెలం కవితలోని కొన్ని లైన్లు 
"ఈ మనసు మాడిందా
తెలుసుకునే మనసూ లేదు 
తెలుసుకోవడమనే పనీ లేదు 
తెలుసుకోవడానికేమీ  లేదు 

తెలుసుకునే మనసు 
తెలిసే లోకం 
తెలిపే ఈశ్వరుడు 
అన్నీ ఒక్కటే 

ఒకటే మౌనం
శబ్దాతీతమైన నిశ్శబ్దం 
సమస్తమూ నిండిన 
నిరామయం 

 
మూలసూత్రాన్నే
జ్ఞాన మూర్తి స్కందుడు 
కైలాసగిరి పై 
తండ్రికి ఉపదేశించాడు 


నిగూఢ సత్యాన్నే 
వట వృక్ష సమాశీనుడై
శ్రీ మద్దక్షిణామూర్తి 
తన్నర్ధించిన సిద్దులకి 
అనుభవైక్యం చేశాడు


వేదాంత రహస్యాన్నే 
శ్రీ రమణ భగవాన్ 
వాక్ దృక్ మౌనాలతో 
తననాశ్రయించిన ఆర్తుల
జ్ఞాన నేత్రాన్ని తెరిచాడు"

old thought process - -12

27-06-09
హలో బ్రదర్స్

ఉద్యోగపు రాపిడికి మధ్యలో ఆగిన ఊహల స్రవంతిని ఆగనియ్య కూడదని అనిపించి మళ్ళీ వ్రాస్తున్నాను 

చందమామ కథలు, ఇంద్రజాల్ కామిక్స్, మధుబాబు , యండమూరి, యెర్రంశెట్టి , చెలం , శ్రీ శ్రీ , తిలక్,etc చివరిగా వివేకానంద  - ఇంక ఏమి చదవాలనిపించడం లేదు 
జీవితం తన సుడిలోకి ఎలా లాగేస్తుందో చూస్తూ, అనుభవిస్తూ కొట్టుకు పోవడం తప్పిస్తే  - ప్రయత్న బలంతో బయటకి రావడం ఎలాగో తెలియడం లేదు

ఆలోచన, పరిణతి ఒకటి
పరిస్థితి, ఆచరణ ఇంకొకటి
వృత్తికి , ప్రవృత్తికి బాలన్స్ కుదరడం కష్టంగా ఉంది
"లైఫ్ ఈజ్ అ పారడాక్స్"  - ఇది నా ఒక్కడికే సంభందించినది కాదేమో 

ఆలోచన సరే అనుభవాల సారం, పరిణతి అనుభవాల పరిణామం, ఆచరణ మనం సమాధానపడిన జీవన విధానం , మరి పరిస్థితికి కారకులు ఎవరు ????
ఈ పరిస్థితి ఎవరి దయ ??? 
ఈ కబోదులు ఎవరి స్వార్ధం కోసం వాళ్ళు తయారుచేసిన ఒక జడ పదార్ధం  - ఈ పరిస్థితి 
వీళ్ళు మారాలి  - మారరు  - మారిపోతే వాళ్ళ ఉనికి పోతుంది 
కారా మాస్టర్ గారు అన్నట్టు - నాలుగు  పక్కలా మూసేసి ఉన్న ఒక్క కంతకీ మంచం అడ్డు పెట్టేస్తే మరి లోపలున్నోడికి గోడ కూల్చడం ఒక్కటే మార్గం - 
నేను విప్లవాన్ని సపోర్ట్ చేస్తున్నానా  - 

నాకు  బాగానే జరుగుతోంది కాబట్టి  - నేనొక కల్చర్డ్ రీడర్ని , రైటర్ని 
మరి జరగనివాడికి ????
విప్లవం - జరగనివాళ్ళ మూకుమ్మడి దాడి 
మొత్తం శిధిలం చేసినతరువాత విప్లవ యోధులకీ తెలియదు  - తరువాత ఏమి చెయ్యాలో 
కూల్చడానికి ఆలోచన ఎందుకు - 
కట్టడానికి  -ఒక మంచి ఆకృతిలో నిలబెట్టడానికి కావలి - ఆలోచన, దీక్ష, సహనం, సంస్కారం , దక్షత , etc

ఈ విషయాలలో ఏకం అవ్వడానికి కుదరనివ్వరు - ఎందుకూ కుదరదు 
మనిషి మూలాల్లోనే ఉందొ, మరి ఈ ప్రకృతి తీరే అంతో 
ఒకరిని ఒకరు ఒరుసుకుంటూ, తోసుకుంటూ, దొర్లుకుంటూ వలయాలలో, అంతం కనపడని ఒక దిక్కుకి, దిక్కులు లేని ఒక అనంతానికి 

ఇది వ్రాస్తుంటే నాకు ఎందుకో కళ్ళల్లో నీళ్ళు  - భయపడో , బాధపడో తెలియదు  

old thought process - -11

18-06-09
హలో బ్రదర్స్

ఎవరూ భేతాళ కథ కి ముగింపు పంపించ లేదు 

పోనీ ఇంకో పని చేద్దాం 
సమస్యా పూరణం అని వినే ఉంటారు  - నేనొక లైన్ చెప్తాను - దాన్ని ఒక కవితలో ఇరికించి పంపించండి 

నాకు తెలిసిన ఒక పాత సమస్యా పూరణం 

సమస్య: " ఈతాకుల గుడిసెలోన ఇనుడుదయించేన్ "

పూరణం 
"సీతాపతి పూదోటకు
ఎతామేత్తన్గవలయు వేకువ ఝామున్ 
తాతా తోన్గున్నావా 
ఈతాకుల గుడిసెలోన ఇనుడుదయించేన్ "

ఇప్పుడు నా సమస్య 

" రాంబాబు గాడి సమస్యకి సలహాలేంటి "

ఒక వేళ ఇది కూడా నచ్చకపోతే మీకు నచ్చినదేదైన పంపించండి

నాకు బోర్ కొడుతోంది ఏదో ఒకటి వ్రాయన్డిరా - - - - 

old thought process - -10

16-06-09
హలో బ్రదర్స్

నేను వ్రాసిన నా పాత కవితలు మీతో పంచుకోవాలనిపించింది 

నాకు బాగా గుర్తున్న నా మొదటి కవిత

"అందాన్ని ఆస్వాదించే కన్నులకి
అందాన్ని ఆరాధించే మనసుంటే అందం
అంది అందని అందాన్ని 
అందుకోవడంలోనే ఆనందం " 

తరువాత 
"చేర పిలిచానే 
చేరి వలచానే 
వలచి వగచానే 
వగచి విసిగానే 
విసిగి వేసారేనే  - నీ వలపు ముంగిట వేచి వేచి "

ఇంకొన్నాళ్ళకి
"విలయాల వలయాలు
నే కలయాడిన 
శార్వరీ తమో వీధులందు 
ఎగరేసిన విశాల విషమ పతాక "

మరోసారి
' ఏటవాలు చీకటి గదుల్లో
బాధల పాటవాలు 
మనసు మెలితిప్పితే
మెదడు మరలు గతి తప్పి
ఎటు పోతాను అమ్మలూ 
ఈ కటిలో
ఏం పాపం చేసానని అమ్మలూ
నాకీ వేదన 
నవ్వేమిటో ఒక్కసారి చెప్పవూ 
నన్ను నీతో ఉండనివ్వవూ 
నాకు ఆ రహస్యం తెలియదనేగా
నీకింత చులకన ............
.............
సాహసం , ప్రయత్నం, కర్తవ్యం, భాద్యత 
అన్నీ పొరలే
ఒప్పుకుంటాను నన్ను నీతో తీసుకుపోతావా
నీ పక్కనే ఎంతో కొంత చోటిస్తావా ...
............
నాకు గెలుపు వద్దు
నా విజయానికి 
నీ కళ్ళల్లో మెరుపు వద్దు
నాకు శాంతి కావాలి "

ఇంకొన్నాళ్ళకి
"ఈ చిరు చీకట్లో నీ మువ్వల సడి
ఆనందం దాచలేని నయనాన్చలాల తడి "

"వెన్నెల వేళల్లో
చలి తిన్నెలు చేరి కులక వలచితి
చెలి నీ చిన్నెల అన్నులు మరచితి
కన్నుల కాంక్షాంబరాలు వీక్షించితినే "

ఓ కవితా
...........
.....నీ అవ్యాజ కరుణా రసామృత ధారలలో నన్ను పునీతుని చేస్తావు
తృణీకరించినా  తరగని దయ ప్రసరిస్తావు
ఈ వచస్సుదా సుమనస్కుని పూలవనంలో కుసుమిస్తావు

old thought process - -9

15-06-09
హలో బ్రదర్స్ 

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా
నిజం మరిచి నిదుర పోకుమా"

సరే దీన్ని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే  - నిజం ఎలాగా మరిచిపోలేం కాబట్టి  - మనకి నిద్ర పట్టదని, అవసరం లేదని 

"నిన్న రేపు అను మాటలు మరవాలి
నేటి స్వర్గ కవాటాలు తెరవాలి
మధు పాత్రిక ఒక చేత, వధూ మణిని  ఒక చేత
కవన సుధా వర్షాలు కురవాలి "

చాల సంత్సరాల క్రితం ఆళ్ళ  వాస్తులు నాకు ఈ కవిత చెప్పారు - కవన సుధ కురుస్తోందో లేదో ఆయనే చెప్పాలి - మిగతావి మనం కన్ఫర్మ్  చెయ్యొచ్చు 

చాల సంత్సరాల క్రితం ఆళ్ళ  వాస్తులు నాకు ఇంకో  కవిత  కూడా చెప్పారు  - కవిత కన్నా ఇది జావళి అని నాకు అనిపించింది 
" కళ్ళ వాకిళ్ళు మూసి మూసి మూసి 
స్వప్న ప్రపంచ ద్వారాలు తెరిచి 
వినీల భావాకాశం లో 
వినూత్న దృక్పథం తో 
సాగుతూ సాగుతూ సాగుతూనే ఉంటాను "

మరి వారి దృక్పథం ఇప్పుడెలా ఉందో????

చాలా కాలం  క్రితం ఒకానొక  బలహీన క్షణం లో "చారు  పెట్టడం వచ్చా" అని అడిగాను  - పర్యవసానం 
సెవెన్ స్టెప్స్ వాక్  - థెన్ ఓన్లీ ఫాల్స్  - సెవెన్ లైఫ్స్ నెక్ టై 

"ప్రాణావసానవేళా జనితం 
నానాగానానూనస్వానావళితం
అమోఘమగాధమచిన్త్యమమేయం" - ఇదేమిటో తెలుసా ????

मेरा तो जो भी कदम है 
ओ तेरी राह में है 
के तू कही भी रहे तू 
मेरी निगाह में है 

old thought process - -8

13-06-2009
హలో బ్రదర్స్ 
ఒక మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకోవచ్చు????

ఫారెన్ లో ఒక నడివయస్సు స్త్రీ  - వాళ్ళాయన సంత్సరాల తరబడి గెడ్డం చేసుకోమంటే చేసుకోలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది
మనకి ఇంత చిన్న కారణమా అని అనిపించచ్చు  - కాని ఆవిడకి అది సరిపోయింది చావడానికి

నాకేమనిపిస్తుందంటే
 లైఫ్ లో సరైనంత కాలక్షేపం లేక
ఉన్న కాలక్షేపం సరిపోక
లేకపోతె ఉన్న కాలక్షేపం నచ్చక 
కొత్త కాలక్షేపం కావాలనిపించి,  పొందలేక
మనకి నచ్చేవి జరగక డిప్రెషన్ అని బాధపడుతూ , బెంగపడుతూ
విసిగిపోయి  - ఒక బలహీన క్షణం లో బుద్ధి కి తోచిన ఒక సులువు దారి  - ఆత్మహత్య 

అసలు మాట్లాడుకోవడానికి ఎన్నో విషయలుండగా అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలి 

ఎవడికైనా జీవితంలో రెండే బలమైన సంఘటనలు ఉంటాయి
ఒకటి పుట్టుక రెండు చావు
మిగతా అనుభవాల , సంఘటనల తాలూకు బలం నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది

" నీ అనుమతి లేకుండా నిన్ను ఎవరు అవమానించలేరు " - Jaqualine Kennedy Onasis 

నాకు బాగా నచ్చిన వాళ్ళలో ఒకరు  చావు కోసం ప్రయత్నించాడు అని తెలిసిన తరువాత, దాని గురించి, నాకు అనిపించింది చెప్పాలనిపించింది 
ఇలాటి చిన్న విషయాలకి వాడు చావకూడదు అనిపించింది 

old thought process - -7

10-06-2009
హలో బ్రదర్స్

"గ్రాంధికమా , వ్యావహరికమా అన్న చోట శిష్ట వ్యావహారికమే సర్వత్రా శ్రేష్టంబు" అన్న కారా మాస్టర్ డైలాగు గుర్తుకు వచ్చింది
వయా మీడియా అన్నది ప్రతివాది జీవితం లోను ఒక పార్ట్ 
పెళ్లంకి కులుమనాలి ట్రిప్ కావాలి - మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదు
అప్పుడు భద్రాచలం , యాదగిరి గుట్ట లాటి ట్రిప్స్ వెయ్యాలి
ఇలా కంప్రోమైస్ అయ్యి బడ్జెట్  పద్మనాభం టైపు లో జీవితం గడపడమే
ఈ కంప్రోమైస్ అలవాటు అయిపోయి ఏ రేంజ్ లో ఉంటుందంటే 
మనని మనమే నమ్మించేసుకుని  - అదన్నమాట 
ఎందుకు ఎదగలేదు అంటే కర్మ , ప్రారబ్ధం లాటి కథలు చెప్పేస్తాము 
ఇంకా గట్టిగా పరిస్థితి ఇబ్బందిగా ఉంటే - డైరెక్ట్ గ కలల్లోకి, కళలోకి  గెంతెయడమే
ఊహా ప్రపంచం దర్వాజా ఓపెన్ చేస్తే - మనంతవాడు ఉండడు - ఎవరక్కడ  - 

మై డియర్ బ్రదర్స్
" మతం నల్ల మందు
గతం ముదిమికి మందు " - 
చదువు మాయ 
బ్రతుకు ఛాయ
కవిత కరక్కాయ సుమీ 

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - Conclusion

20-06-2009
హలో బ్రదర్స్
మీరింకేం ముగింపు చెప్పరు - ఆ విషయం నాకర్ధం అయ్యింది
ఆళ్ళ వాస్తులు ఏదో ముగింపు చెప్పారు - నాకు అర్ధం కాలేదు
సుత్తి ఎందుకు - రచయిత అనుకున్న ముగింపు చెప్తాను 

విక్రమార్కుడు ఇలా చెప్పాడు 
అప్పారావు దేశాలు పట్టి పోయిన తరువాత ఎన్నో రకాల మనుషులని, ఎన్నో విచిత్ర పరిస్థితులని చూసాడు 
అతనికి ఈ ప్రపంచం లో అర్ధం కనపడలేదు  - 
అతనికి ఎందుకు బ్రతకాలో కూడా తెలియలేదు - 
చస్తే ఏంటో కూడా తెలియలేదు - 
కష్టం అతని శరీరానికి పడదు - 
ఐహిక సుఖం  పొందడానికి పోరాడే ఓపిక లేదు  - ఏమి చెయ్యాలి 
అప్పారావు బుర్రలో ఒక మెరుపు మెరిసింది 
మనుష్యుల బలహీనతలలో భయం పునాది 
ఎవడైనా పరిస్థితి, వాడి ఆలోచనలని, బుద్ధిని దాటి వస్తే, దాన్ని ఎలా పోరాడాలో తెలియక పొతే  - చివరిగా వాడికి తెలియని శక్తి, భగవంతుని, శరణు లోకి పోతాడు  - 
స్వామీజీలా మారిపోతే ????
కష్ట పడక్కరలేదు  - అందరూ గౌరవం ఇస్తారు - కానుకలకి కరువు ఉండదు  - తిండికి లోటు ఉండదు  - శిష్య గణం ఎలాగా ఉంటారు , సేవలకి - బయటకి ఎలా కనపడినా - లోపాయకారీగా మనకి నచ్చినవన్ని చేసుకోవచ్చు  - భగవద్గీత లో రెండు శ్లోకాలు , మధ్య మధ్యలో ఉపనిషత్తులు అంటూ  - పంచతంత్రం కథలు రెండు చెప్పేస్తే సరిపోతుంది 
ఇంకా చావాల్సిన అవసరం ఏముంది 
ఇలా అలోచించిన అప్పారావు బాబా లా మారిపోయాడు 

ఈ సమాధానం తో బేతాళుడు చేట్టేక్కేదమనుకున్నాడు  - కాని కుదర లేదు  - ఎందుకంటే విక్రమార్కుడు సమాధానం ఆపలేదు 
విక్రమార్కుడు కి అనుమానం వచ్చింది - 
అప్పుడు భేతాళుడు ని  అడిగాడు 
"ఔను భేతాళ , ఒకవేళ నిజంగానే అప్పారావుకి భగవంతుడు కనిపించి ఉంటాడేమో?? ఏమంటావు??? అన్నాడు 
భేతాళుడు ముఖం చిన్న బుచ్చుకుని " ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు  - అంతే కాని నువ్వు ప్రశ్న అడిగితే నేనేం చెప్పలేను - అన్నాడు 

దానికి విక్రమార్కుడు " ఓరి వెర్రి  భేతాళ సంత్సరాల తరబడి నువ్వు అడగడము, నేను చెప్పడము  - కొంచం ఆలోచించు  - చిరాకు అనిపించటం లేదూ  - అందుకనే మార్పు కోసం నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అన్నాడు 

భేతాళుడు బిక్క చచ్చి పోయి " నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను , నన్ను మాత్రం ప్రశ్నలు అడగకు అన్నాడు"

ఇంతకీ ఈ భేతాళ కథకి పరస్పర విరుద్ధమైన ముగింపు సూక్తి

"అడిగేవాడికి చెప్పేవాడు లోకువ"
"చెప్పేవాడికి వినేవాడు లోకువ "