Tuesday, October 5, 2010

old thought process - -13

08-07-2009
ప్రియ మిత్రులారా
నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కాని, మెప్పు పొందాలని కాని ఇవన్ని చెయ్యటం లేదు
ఇవన్ని చెయ్యటానికి కారణం ఏమిటంటే , ఏమిటో నాకు తెలీదు , ఏమీ లేదు 


నాకు బాగా నచ్చిన చెలం కవితలోని కొన్ని లైన్లు 
"ఈ మనసు మాడిందా
తెలుసుకునే మనసూ లేదు 
తెలుసుకోవడమనే పనీ లేదు 
తెలుసుకోవడానికేమీ  లేదు 

తెలుసుకునే మనసు 
తెలిసే లోకం 
తెలిపే ఈశ్వరుడు 
అన్నీ ఒక్కటే 

ఒకటే మౌనం
శబ్దాతీతమైన నిశ్శబ్దం 
సమస్తమూ నిండిన 
నిరామయం 

 
మూలసూత్రాన్నే
జ్ఞాన మూర్తి స్కందుడు 
కైలాసగిరి పై 
తండ్రికి ఉపదేశించాడు 


నిగూఢ సత్యాన్నే 
వట వృక్ష సమాశీనుడై
శ్రీ మద్దక్షిణామూర్తి 
తన్నర్ధించిన సిద్దులకి 
అనుభవైక్యం చేశాడు


వేదాంత రహస్యాన్నే 
శ్రీ రమణ భగవాన్ 
వాక్ దృక్ మౌనాలతో 
తననాశ్రయించిన ఆర్తుల
జ్ఞాన నేత్రాన్ని తెరిచాడు"

old thought process - -12

27-06-09
హలో బ్రదర్స్

ఉద్యోగపు రాపిడికి మధ్యలో ఆగిన ఊహల స్రవంతిని ఆగనియ్య కూడదని అనిపించి మళ్ళీ వ్రాస్తున్నాను 

చందమామ కథలు, ఇంద్రజాల్ కామిక్స్, మధుబాబు , యండమూరి, యెర్రంశెట్టి , చెలం , శ్రీ శ్రీ , తిలక్,etc చివరిగా వివేకానంద  - ఇంక ఏమి చదవాలనిపించడం లేదు 
జీవితం తన సుడిలోకి ఎలా లాగేస్తుందో చూస్తూ, అనుభవిస్తూ కొట్టుకు పోవడం తప్పిస్తే  - ప్రయత్న బలంతో బయటకి రావడం ఎలాగో తెలియడం లేదు

ఆలోచన, పరిణతి ఒకటి
పరిస్థితి, ఆచరణ ఇంకొకటి
వృత్తికి , ప్రవృత్తికి బాలన్స్ కుదరడం కష్టంగా ఉంది
"లైఫ్ ఈజ్ అ పారడాక్స్"  - ఇది నా ఒక్కడికే సంభందించినది కాదేమో 

ఆలోచన సరే అనుభవాల సారం, పరిణతి అనుభవాల పరిణామం, ఆచరణ మనం సమాధానపడిన జీవన విధానం , మరి పరిస్థితికి కారకులు ఎవరు ????
ఈ పరిస్థితి ఎవరి దయ ??? 
ఈ కబోదులు ఎవరి స్వార్ధం కోసం వాళ్ళు తయారుచేసిన ఒక జడ పదార్ధం  - ఈ పరిస్థితి 
వీళ్ళు మారాలి  - మారరు  - మారిపోతే వాళ్ళ ఉనికి పోతుంది 
కారా మాస్టర్ గారు అన్నట్టు - నాలుగు  పక్కలా మూసేసి ఉన్న ఒక్క కంతకీ మంచం అడ్డు పెట్టేస్తే మరి లోపలున్నోడికి గోడ కూల్చడం ఒక్కటే మార్గం - 
నేను విప్లవాన్ని సపోర్ట్ చేస్తున్నానా  - 

నాకు  బాగానే జరుగుతోంది కాబట్టి  - నేనొక కల్చర్డ్ రీడర్ని , రైటర్ని 
మరి జరగనివాడికి ????
విప్లవం - జరగనివాళ్ళ మూకుమ్మడి దాడి 
మొత్తం శిధిలం చేసినతరువాత విప్లవ యోధులకీ తెలియదు  - తరువాత ఏమి చెయ్యాలో 
కూల్చడానికి ఆలోచన ఎందుకు - 
కట్టడానికి  -ఒక మంచి ఆకృతిలో నిలబెట్టడానికి కావలి - ఆలోచన, దీక్ష, సహనం, సంస్కారం , దక్షత , etc

ఈ విషయాలలో ఏకం అవ్వడానికి కుదరనివ్వరు - ఎందుకూ కుదరదు 
మనిషి మూలాల్లోనే ఉందొ, మరి ఈ ప్రకృతి తీరే అంతో 
ఒకరిని ఒకరు ఒరుసుకుంటూ, తోసుకుంటూ, దొర్లుకుంటూ వలయాలలో, అంతం కనపడని ఒక దిక్కుకి, దిక్కులు లేని ఒక అనంతానికి 

ఇది వ్రాస్తుంటే నాకు ఎందుకో కళ్ళల్లో నీళ్ళు  - భయపడో , బాధపడో తెలియదు  

old thought process - -11

18-06-09
హలో బ్రదర్స్

ఎవరూ భేతాళ కథ కి ముగింపు పంపించ లేదు 

పోనీ ఇంకో పని చేద్దాం 
సమస్యా పూరణం అని వినే ఉంటారు  - నేనొక లైన్ చెప్తాను - దాన్ని ఒక కవితలో ఇరికించి పంపించండి 

నాకు తెలిసిన ఒక పాత సమస్యా పూరణం 

సమస్య: " ఈతాకుల గుడిసెలోన ఇనుడుదయించేన్ "

పూరణం 
"సీతాపతి పూదోటకు
ఎతామేత్తన్గవలయు వేకువ ఝామున్ 
తాతా తోన్గున్నావా 
ఈతాకుల గుడిసెలోన ఇనుడుదయించేన్ "

ఇప్పుడు నా సమస్య 

" రాంబాబు గాడి సమస్యకి సలహాలేంటి "

ఒక వేళ ఇది కూడా నచ్చకపోతే మీకు నచ్చినదేదైన పంపించండి

నాకు బోర్ కొడుతోంది ఏదో ఒకటి వ్రాయన్డిరా - - - - 

old thought process - -10

16-06-09
హలో బ్రదర్స్

నేను వ్రాసిన నా పాత కవితలు మీతో పంచుకోవాలనిపించింది 

నాకు బాగా గుర్తున్న నా మొదటి కవిత

"అందాన్ని ఆస్వాదించే కన్నులకి
అందాన్ని ఆరాధించే మనసుంటే అందం
అంది అందని అందాన్ని 
అందుకోవడంలోనే ఆనందం " 

తరువాత 
"చేర పిలిచానే 
చేరి వలచానే 
వలచి వగచానే 
వగచి విసిగానే 
విసిగి వేసారేనే  - నీ వలపు ముంగిట వేచి వేచి "

ఇంకొన్నాళ్ళకి
"విలయాల వలయాలు
నే కలయాడిన 
శార్వరీ తమో వీధులందు 
ఎగరేసిన విశాల విషమ పతాక "

మరోసారి
' ఏటవాలు చీకటి గదుల్లో
బాధల పాటవాలు 
మనసు మెలితిప్పితే
మెదడు మరలు గతి తప్పి
ఎటు పోతాను అమ్మలూ 
ఈ కటిలో
ఏం పాపం చేసానని అమ్మలూ
నాకీ వేదన 
నవ్వేమిటో ఒక్కసారి చెప్పవూ 
నన్ను నీతో ఉండనివ్వవూ 
నాకు ఆ రహస్యం తెలియదనేగా
నీకింత చులకన ............
.............
సాహసం , ప్రయత్నం, కర్తవ్యం, భాద్యత 
అన్నీ పొరలే
ఒప్పుకుంటాను నన్ను నీతో తీసుకుపోతావా
నీ పక్కనే ఎంతో కొంత చోటిస్తావా ...
............
నాకు గెలుపు వద్దు
నా విజయానికి 
నీ కళ్ళల్లో మెరుపు వద్దు
నాకు శాంతి కావాలి "

ఇంకొన్నాళ్ళకి
"ఈ చిరు చీకట్లో నీ మువ్వల సడి
ఆనందం దాచలేని నయనాన్చలాల తడి "

"వెన్నెల వేళల్లో
చలి తిన్నెలు చేరి కులక వలచితి
చెలి నీ చిన్నెల అన్నులు మరచితి
కన్నుల కాంక్షాంబరాలు వీక్షించితినే "

ఓ కవితా
...........
.....నీ అవ్యాజ కరుణా రసామృత ధారలలో నన్ను పునీతుని చేస్తావు
తృణీకరించినా  తరగని దయ ప్రసరిస్తావు
ఈ వచస్సుదా సుమనస్కుని పూలవనంలో కుసుమిస్తావు

old thought process - -9

15-06-09
హలో బ్రదర్స్ 

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా
నిజం మరిచి నిదుర పోకుమా"

సరే దీన్ని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే  - నిజం ఎలాగా మరిచిపోలేం కాబట్టి  - మనకి నిద్ర పట్టదని, అవసరం లేదని 

"నిన్న రేపు అను మాటలు మరవాలి
నేటి స్వర్గ కవాటాలు తెరవాలి
మధు పాత్రిక ఒక చేత, వధూ మణిని  ఒక చేత
కవన సుధా వర్షాలు కురవాలి "

చాల సంత్సరాల క్రితం ఆళ్ళ  వాస్తులు నాకు ఈ కవిత చెప్పారు - కవన సుధ కురుస్తోందో లేదో ఆయనే చెప్పాలి - మిగతావి మనం కన్ఫర్మ్  చెయ్యొచ్చు 

చాల సంత్సరాల క్రితం ఆళ్ళ  వాస్తులు నాకు ఇంకో  కవిత  కూడా చెప్పారు  - కవిత కన్నా ఇది జావళి అని నాకు అనిపించింది 
" కళ్ళ వాకిళ్ళు మూసి మూసి మూసి 
స్వప్న ప్రపంచ ద్వారాలు తెరిచి 
వినీల భావాకాశం లో 
వినూత్న దృక్పథం తో 
సాగుతూ సాగుతూ సాగుతూనే ఉంటాను "

మరి వారి దృక్పథం ఇప్పుడెలా ఉందో????

చాలా కాలం  క్రితం ఒకానొక  బలహీన క్షణం లో "చారు  పెట్టడం వచ్చా" అని అడిగాను  - పర్యవసానం 
సెవెన్ స్టెప్స్ వాక్  - థెన్ ఓన్లీ ఫాల్స్  - సెవెన్ లైఫ్స్ నెక్ టై 

"ప్రాణావసానవేళా జనితం 
నానాగానానూనస్వానావళితం
అమోఘమగాధమచిన్త్యమమేయం" - ఇదేమిటో తెలుసా ????

मेरा तो जो भी कदम है 
ओ तेरी राह में है 
के तू कही भी रहे तू 
मेरी निगाह में है 

old thought process - -8

13-06-2009
హలో బ్రదర్స్ 
ఒక మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకోవచ్చు????

ఫారెన్ లో ఒక నడివయస్సు స్త్రీ  - వాళ్ళాయన సంత్సరాల తరబడి గెడ్డం చేసుకోమంటే చేసుకోలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది
మనకి ఇంత చిన్న కారణమా అని అనిపించచ్చు  - కాని ఆవిడకి అది సరిపోయింది చావడానికి

నాకేమనిపిస్తుందంటే
 లైఫ్ లో సరైనంత కాలక్షేపం లేక
ఉన్న కాలక్షేపం సరిపోక
లేకపోతె ఉన్న కాలక్షేపం నచ్చక 
కొత్త కాలక్షేపం కావాలనిపించి,  పొందలేక
మనకి నచ్చేవి జరగక డిప్రెషన్ అని బాధపడుతూ , బెంగపడుతూ
విసిగిపోయి  - ఒక బలహీన క్షణం లో బుద్ధి కి తోచిన ఒక సులువు దారి  - ఆత్మహత్య 

అసలు మాట్లాడుకోవడానికి ఎన్నో విషయలుండగా అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలి 

ఎవడికైనా జీవితంలో రెండే బలమైన సంఘటనలు ఉంటాయి
ఒకటి పుట్టుక రెండు చావు
మిగతా అనుభవాల , సంఘటనల తాలూకు బలం నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది

" నీ అనుమతి లేకుండా నిన్ను ఎవరు అవమానించలేరు " - Jaqualine Kennedy Onasis 

నాకు బాగా నచ్చిన వాళ్ళలో ఒకరు  చావు కోసం ప్రయత్నించాడు అని తెలిసిన తరువాత, దాని గురించి, నాకు అనిపించింది చెప్పాలనిపించింది 
ఇలాటి చిన్న విషయాలకి వాడు చావకూడదు అనిపించింది 

old thought process - -7

10-06-2009
హలో బ్రదర్స్

"గ్రాంధికమా , వ్యావహరికమా అన్న చోట శిష్ట వ్యావహారికమే సర్వత్రా శ్రేష్టంబు" అన్న కారా మాస్టర్ డైలాగు గుర్తుకు వచ్చింది
వయా మీడియా అన్నది ప్రతివాది జీవితం లోను ఒక పార్ట్ 
పెళ్లంకి కులుమనాలి ట్రిప్ కావాలి - మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదు
అప్పుడు భద్రాచలం , యాదగిరి గుట్ట లాటి ట్రిప్స్ వెయ్యాలి
ఇలా కంప్రోమైస్ అయ్యి బడ్జెట్  పద్మనాభం టైపు లో జీవితం గడపడమే
ఈ కంప్రోమైస్ అలవాటు అయిపోయి ఏ రేంజ్ లో ఉంటుందంటే 
మనని మనమే నమ్మించేసుకుని  - అదన్నమాట 
ఎందుకు ఎదగలేదు అంటే కర్మ , ప్రారబ్ధం లాటి కథలు చెప్పేస్తాము 
ఇంకా గట్టిగా పరిస్థితి ఇబ్బందిగా ఉంటే - డైరెక్ట్ గ కలల్లోకి, కళలోకి  గెంతెయడమే
ఊహా ప్రపంచం దర్వాజా ఓపెన్ చేస్తే - మనంతవాడు ఉండడు - ఎవరక్కడ  - 

మై డియర్ బ్రదర్స్
" మతం నల్ల మందు
గతం ముదిమికి మందు " - 
చదువు మాయ 
బ్రతుకు ఛాయ
కవిత కరక్కాయ సుమీ 

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - Conclusion

20-06-2009
హలో బ్రదర్స్
మీరింకేం ముగింపు చెప్పరు - ఆ విషయం నాకర్ధం అయ్యింది
ఆళ్ళ వాస్తులు ఏదో ముగింపు చెప్పారు - నాకు అర్ధం కాలేదు
సుత్తి ఎందుకు - రచయిత అనుకున్న ముగింపు చెప్తాను 

విక్రమార్కుడు ఇలా చెప్పాడు 
అప్పారావు దేశాలు పట్టి పోయిన తరువాత ఎన్నో రకాల మనుషులని, ఎన్నో విచిత్ర పరిస్థితులని చూసాడు 
అతనికి ఈ ప్రపంచం లో అర్ధం కనపడలేదు  - 
అతనికి ఎందుకు బ్రతకాలో కూడా తెలియలేదు - 
చస్తే ఏంటో కూడా తెలియలేదు - 
కష్టం అతని శరీరానికి పడదు - 
ఐహిక సుఖం  పొందడానికి పోరాడే ఓపిక లేదు  - ఏమి చెయ్యాలి 
అప్పారావు బుర్రలో ఒక మెరుపు మెరిసింది 
మనుష్యుల బలహీనతలలో భయం పునాది 
ఎవడైనా పరిస్థితి, వాడి ఆలోచనలని, బుద్ధిని దాటి వస్తే, దాన్ని ఎలా పోరాడాలో తెలియక పొతే  - చివరిగా వాడికి తెలియని శక్తి, భగవంతుని, శరణు లోకి పోతాడు  - 
స్వామీజీలా మారిపోతే ????
కష్ట పడక్కరలేదు  - అందరూ గౌరవం ఇస్తారు - కానుకలకి కరువు ఉండదు  - తిండికి లోటు ఉండదు  - శిష్య గణం ఎలాగా ఉంటారు , సేవలకి - బయటకి ఎలా కనపడినా - లోపాయకారీగా మనకి నచ్చినవన్ని చేసుకోవచ్చు  - భగవద్గీత లో రెండు శ్లోకాలు , మధ్య మధ్యలో ఉపనిషత్తులు అంటూ  - పంచతంత్రం కథలు రెండు చెప్పేస్తే సరిపోతుంది 
ఇంకా చావాల్సిన అవసరం ఏముంది 
ఇలా అలోచించిన అప్పారావు బాబా లా మారిపోయాడు 

ఈ సమాధానం తో బేతాళుడు చేట్టేక్కేదమనుకున్నాడు  - కాని కుదర లేదు  - ఎందుకంటే విక్రమార్కుడు సమాధానం ఆపలేదు 
విక్రమార్కుడు కి అనుమానం వచ్చింది - 
అప్పుడు భేతాళుడు ని  అడిగాడు 
"ఔను భేతాళ , ఒకవేళ నిజంగానే అప్పారావుకి భగవంతుడు కనిపించి ఉంటాడేమో?? ఏమంటావు??? అన్నాడు 
భేతాళుడు ముఖం చిన్న బుచ్చుకుని " ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు  - అంతే కాని నువ్వు ప్రశ్న అడిగితే నేనేం చెప్పలేను - అన్నాడు 

దానికి విక్రమార్కుడు " ఓరి వెర్రి  భేతాళ సంత్సరాల తరబడి నువ్వు అడగడము, నేను చెప్పడము  - కొంచం ఆలోచించు  - చిరాకు అనిపించటం లేదూ  - అందుకనే మార్పు కోసం నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అన్నాడు 

భేతాళుడు బిక్క చచ్చి పోయి " నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను , నన్ను మాత్రం ప్రశ్నలు అడగకు అన్నాడు"

ఇంతకీ ఈ భేతాళ కథకి పరస్పర విరుద్ధమైన ముగింపు సూక్తి

"అడిగేవాడికి చెప్పేవాడు లోకువ"
"చెప్పేవాడికి వినేవాడు లోకువ "

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - 4

08-06-09
హలో బ్రదర్స్
భేతాళుడు కథ కొనసాగించాడు

అప్పారావు విలాసాలకి విరక్తి చెంది అప్పారావు పెళ్ళాం అతనితో దేబ్బలాటలకి  దిగేది
నన్ను నా పిల్లలని చంపేయ్ అన్నంతగా
ఇంట్లో పోరు పెరిగే సరికి అప్పారావు మరింతగా ఇంటితో విరక్తి చెందాడు
అలవాట్లు మానలేదు కానీ ఇంటికి రావడం తగ్గించాడు
దాంతో అలవాట్లు అవసరాలుగా మారిపోయాయి
మళ్లీ మొదటికి వచ్చింది అప్పారావు జీవితం
దీనికి తగ్గట్టు అతని వ్యసనాలు కొత్త స్నేహితులని చేర్చాయి
కొత్త స్నేహితులు అతనికెంతో ఆప్తులుగా కనపడ్డారు
ఆ స్నేహితులలో రెడ్డి ముఖ్యుడు
రెడ్డి కి వాళ్ళ నాన్న వంద ఎకరాల మాగాణి వదిలి వెళ్ళాడు
దాంతో రెడ్డికి కష్టం తెలిసేది కాదు - అప్పారావుకి కరువు ఉండేది కాదు 
కాని పరిస్థితులు ఎల్ల కాలం ఒకేలా ఉండవు 
రెడ్డికి కొత్త స్నేహితులు కలిశారు
దాంతో అప్పారావు తో స్నేహం తగ్గించాడు 
ఈలోగా అప్పారావు భార్య పిల్లలు అతనిని వదిలేసి వెళ్ళిపోయారు 
అప్పారావు ఒంటరివాడైపోయాడు
ఇప్పుడు అప్పారావుకి కావలిసినంత స్వేచ్చ 
అతనిని ఆపేవారు అడిగేవారు లేరు
అలాగే అతని అలవాట్లకి సాయం చేసేవారు లేరు
ఉద్యోగంలో లంచాలు పడుతున్నాడని అప్పారావుని ఉద్యోగంలోంచి తీసేసారు
అప్పారావు గురించి తెలిసిన వాళ్ళు అతనికి ఉద్యోగాలివ్వలేదు
వ్యసనాలకి ముందు స్నేహితులు, వ్యసనాలలో స్నేహితులు  అందరు ప్పారావుని దూరంగా ఉంచేవారు 
అప్పారావు దీన్ని భరించలేకపోయాడు 
అప్పారావు ఆ ఊరు వదిలి వెళ్లి పోయాడు
ఎటో వెళ్ళిపోయాడు - దేశ దిమ్మరిలా తిరిగాడు  - 
కొన్నాళ్ళకి జ్ఞ్యానోదయం కలిగింది - అది ఏ రకమైన జ్ఞ్యానమో ఎవరికీ తెలియదు   
తన ఊరి లోనే బాబా అవతారంలో ప్రత్యక్షమయ్యాడు 

ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమర్కుడితో 
"ఓ విక్రమార్క ఇంతకీ అప్పారావుకి ఏమి జ్ఞ్యానం కలిగిఉంటుంది, దీనికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల వెయ్యి  ముక్కలవుతుంది అన్నాడు "

హలో బ్రదర్స్
ఈ కథ లో భేతాళ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి  - 
మీ ముగింపు కోసం వెయ్యి  కన్నులతో


భేతాళ కథ ముగిసింది  - నా థాట్ ప్రాసెస్ (ఊహల స్రవంతి ) వేరే రకాలుగా కంటిన్యూ అవుతుంది  - 

Kotta Bhetala Kathalu -AppaRao the Monk -3

08-06-09
హలో బ్రదర్స్

భేతాళుడు కథ కొనసాగించాడు

ఆ తీవ్రమైన పరిస్థితులలో అప్పరావుకి ఏమి చెయ్యాలో తోచలేదు
ఉన్న ఊరు వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పటంలేదు
అలవాటైపోయినవి వదలవు - కానీ కుదరవు
దేనికైనా దేముడి మీద భారం వేసి వదిలే తత్త్వం కాదు
సాయం చెయ్యాలంటే మిగత వాళ్ళు కూడా తానున్న పరిస్థితులలోనే ఉన్నారు
పెళ్ళాం పిల్లల ఆకలి బాధను తీర్చడానికే అప్పారావు తన శక్తి యుక్తులన్నీ ప్రయోగించాడు 
ఇలా దిన దిన గండం లా కొంత కాలం  నడిచింది
కాలచక్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కాని జీవిత చక్రం అలా కాదుగా
తిరిగి కొంత కాలానికి పరిస్తితులు చక్కబడ్డాయి
కరువు కాటకాలు తగ్గాయి 
అప్పారావు కి కొంత వెసులుబాటు దొరికింది
తిరిగి సలహా ఇచ్చే స్నేహితులు , అవసరానికి  అదుకోమనే ఆర్తులు మొదలయ్యారు
అప్పారావు మళ్లీ నా అంతటి వాడు లేడు - నేను ప్రపంచాన్ని చూశాను , అందుకే మళ్లీ నా సొంత ప్రతిభ తో సాధించాను అని అనుకోసాగాడు
ఈ సారి మునుపటి కంటే ఎక్కువగా విలాసాలకి ఖర్చు చెయ్యడం మొదలెట్టాడు
(సశేషం) 

 

 
 

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - 2

06-06-09
హలో బ్రదర్స్
అప్పుడు భేతాళుడు కథ ఇలా కొనసాగించాడు
అప్పారావు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఏ రకంగాను అతనికి పరిస్థితి సహకరించలేదు
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచెను అని సరిపెట్టుకోలేక సతమతమవసాగాడు
ఈ పరిస్థితులలో విశ్వనాధ్ అని ఒక పాత మిత్రుడు ఒకడు కలిశాడు
అప్పారావు అంతకు మునుపు అతనికి ఎన్నో రకాలుగా సాయ పడ్డాడు
అతనేమైన సాయపడగలడు ఏమో అని అప్పారావు ప్రయత్నించాడు
విశ్వనాధ్ అప్పారావు కి విపరీతమైన జ్ఞాన బోధ చేసి ఎలా బ్రతకాలి , ఏమి చేస్తే మంచిది , ప్రపంచం ఏమిటి అని పంచతంత్రం కథలు అన్ని చెప్పి అసలు అవసరానికి సాయం ఏమి చేయకుండానే వెళ్ళిపోయాడు
ఇంకో మిత్రుడు సాయినాథ్ కలిశాడు
సాయినాథ్ ఏమి చెయ్యకూడదు, ఎందుకు చెయ్యకూడదు, ఏమి చేస్తే ఏమి హాని కలుగుతుందో చెప్పి వెళ్ళిపోయాడు


ఈ లోగా ఆ ఊరిలో విపరీతమైన కరువు కాటకాలు  వచ్చాయి
ప్రజలందరూ తినడానికి తిండి లేక, తాగడానికి సరైన నీరు లేక  ఉండడానికి సరైన వసతి లేక వలస పోయే పరిస్థితి
(సశేషం)

Kotta Bhetala Kathalu - AppaRao the Monk -1

05-06-2009
హలో బ్రదర్స్
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నించి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా స్మశానం దారి పట్టాడు
అప్పుడు శవంలోని  భేతాళుడు ఓ రాజా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది
నీకు మార్గాయాసం లేకుండా అప్పారావు కథ చెబుతాను విను అన్నాడు
అప్పుడు భేతాళుడు ఇలా చెప్పా సాగాడు

అప్పారావు గొప్ప వేదాంతి  - అని అనుకునేవాడు 
పెళ్లి కాకముందే ఎన్నో కష్టాలు, బాధలు,ఆనందాలు,సుఖాలు, ఎత్తులు, పల్లాలు చూసాడు  - ఇది కొంత వరకు నిజం 
ప్రపంచాన్ని, జీవితాన్ని ముందునించి, వెనకనించి, కింద నించి, మీదనించి, పక్కనించి కూడా చదివేసాడు - అని తనకు తనే అనుకున్నాడు 
అంతా తెలిసిపోయింది అని అనుకున్న తరువాత  పెళ్లి అయింది 
పెళ్ళానికి అప్పారావు కి ఇన్ని తెలుసని తెలియదు 
కాబట్టి మామూలుగానే  ఏ  పని అయిన ఆవిడకి తెలిసినంతలో చెయ్యడానికి ప్రయత్నించింది
కానీ అప్పారావు ఆలోచనా పరిధి అనంతం  - కానీ రోజువారీ జీవితం లో తనకన్నా తక్కువ పరిధి ఆలోచనలు ఉన్నవాళ్ళతో బ్రతకాలి
అప్పారావు ఈ ఖాళీని నింపడానికి ప్రయత్నించినాడు - తనే మామూలు మనిషిలా (ఎందుకంటే ఆయన వేదాంతి కదా) మారడానికి ప్రయత్నించినాడు 
కాని అయన లోని ఆ వేదాంతి ఆయన్ని క్షమించలేదు  - ఈ అంతస్సంఘర్షణలో ఆయన తప్ప తాగాడు  (మనసుకి శాంతి కలుగుతుందేమోనని)
అందులో దొరకలేదు కాని మందు అలవాటు అయిపోయింది
పరస్త్రీ పొందు లో ప్రయత్నించాడు - కొంత శరీరానికి సుఖం అనిపించింది
ఇదే మనసు కి శాంతి అనుకుని అందులోనే ప్రయత్నించాడు
కాని అందులో లేదని తెలిసే లోపే అది కూడా అలవాటు అయిపొయింది
ఇక ఈ అలవాట్లన్నిటికి డబ్బు కావాలి
వేదాంతం లో బ్రతికి ఇప్పుడు జీవితం లో ఇన్ని అవసరాలకి ఎలా సమకూర్చుకోవాలి
ఇప్పుడు అప్పారావు జీవితం తో దొమ్మరి ఆట (సర్కస్) మొదలెట్టాడు 
(సశేషం)