Tuesday, July 31, 2012

Science and Philosophy -18 (మంత్ర పుష్పం)

ఇంతకు ముందు post లో నేను, మనం పూజలలో చదివే మంత్ర పుష్పంలో  మనిషి గురించి, ఈ విశ్వం గురించి చెప్పడం జరిగింది అన్నాను. దశావతారాలు గురించి వ్రాసే ముందే  మంత్రపుష్పం యొక్క టీకా, తాత్పర్యాలు type చెయ్యడం complete చేశాను. దానితో మంత్రపుష్పం గురించే ముందు post చేస్తున్నాను. దీని తరువాత post లో ఈ మంత్రపుష్పాన్ని latest scientific discoveries తో correlate చేస్తే మనము ఇప్పుడు అర్ధం చేసుకుంటున్న ప్రపంచం ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంతే clarity తో చెప్పబడిందని అవగతమౌతుంది. మనకి మన పుణ్య భూమి ఔన్నత్యం అర్ధం అవుతుంది అనిపించి ఈ ప్రయత్నం.చిన్న చిన్న typing mistakes ని మన్నించగలరు. ఇది నేను బొమ్మకంటి సుబ్రమణ్య శాస్త్రి గారు వ్రాసిన పుస్తకం చదివి అర్ధం చేసుకున్నాను. ఈ post కి internet మొత్తం గాలించి ఆ భావానికి తగ్గట్టుగా photos వెతికిపెడుతున్న నా friend rk కి కృతజ్ఞ్యతలు. 


మంత్ర పుష్పం , నారాయణ సూక్తం

1.ఓం ధాతా పురస్తా ద్యముదాజహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్త్రః   
తమేవమ్ విద్వా నమృత ఇహ భవతి
నాన్యః పంథా ఆయనాయ విద్యతే
టీకా: ధాతా = ప్రజాపతి, పురస్తాద్యమ్  - పురతః+ఆద్యమ్  = ఓం ప్రధమముగా, ముదాజహార= స్తోత్రించి సుఖించేనో, శక్రః= ఇంద్రుడు, ప్రవిద్వాన్= ప్రకటించి తెలియజేసేను, ప్రదిశః= అన్నీ దిక్కుల ప్రజలకును, చతస్రః = సర్వ రక్షాకునిగా, తమ్= అట్టి వానిని, ఏవం=మాత్రమే, విద్వాన్ =తెలిసికొనుట చేత, అమృత= మరణము లేనిదిగా, ఇహ= ఈ సమస్తము, భవతి= అగును, న+అన్యః- న= లేదు, అన్యః= ఇతరమగు, పంథా= విధానము, ఆయనాయ= ఈ సందర్భమున, విద్యతే= తెలియజేయబడుచున్నది.
తా: ఓం ప్రధమముగా ప్రజాపతియగు బ్రహ్మ ఎవరిని స్తుతించుటచే సుఖ మార్గము, ఆయనను స్తోత్రించుటేయని తెలిపేనో, త్రిజగత్పాలాకుడైన ఇంద్రుడు తాను నిమిత్తమాత్రుడనని ఎరిగి సర్వ దిక్కుల యందలి ప్రజలకు ఎవనిని సంరక్షకునిగా తెలుసుకొని ప్రకటించేనో, ఆయనను( ఆ విరాట్పురుషుని) తెలుసుకొనుట చేత మాత్రమే –మృత్యుస్థలియగు ఇహమాంతయు అమృతత్వము పొందుచున్నది. అమృతత్వము నందుటకు గాను ఈ సందర్భమున  -“ఆయనను తెలియుట” –వినా మరియొక మార్గము లేనే లేదని తెలియబడెను.

2. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం   
టీకా: సహస్ర= అనేకమైన,  శీర్షం =శిరస్సులు కలవాడును, దేవం = దివ్యుడును, విశ్వ+అక్షం= అనేకమైన నేత్రములు కలవాడును, విశ్వ శంభువం = విశ్వము కొరకు శుభములను కలిగించువాడును, విశ్వం = అఖిలా జగత్తును తానే అయినవాడును, నారాయణం = జగత్కారణ భూతమున వసించువాడును, దేవం = మంగళాకారుడు లేదా పరమాత్మ, అక్షరం = నాశనము లేనివాడును, పరమం = మోక్షమునకు పదమ్ =స్థానమును(అయి ఉన్నాడు)
తా: అనేక శిరస్సులను, అనతమైన నేత్రములను కలిగి, ఈ సమస్త విశ్వమునకు శుభములను సమకూర్చుచూ, జగత్తు సమస్తము తన రూపమే అయినవాడును, జగత్కారణ భూతమునకు ఆద్యుడునూ, మంగళాకారుడగు పరమాత్మ – నాశము లేనివాడునూ, మోక్ష పథమునకు  ఆధారభూతుడునూ అయి ఉన్నాడు.

3.విశ్వతః పరమాన్నిత్యమ్ విశ్వం నారాయణగ్o హరిమ్
విశ్వమే వేదం పురుషస్త ద్విశ్వ ముపజీవతి
టీకా: విశ్వతః= ఇహము కంటెను, పరమాన్ = ఉత్కృష్టమైనవాడును, నిత్యం = శాశ్వతుడును, విశ్వం = సర్వాత్మకుడును, నారాయణగ్o =నారాయణుడును, హరిం =పాపములను హరింపచేయువాడును, పురుషః =పరమాత్ముడే, ఏ= ఈ, విశ్వం = లోకమును, వేదం =ప్రకటించేను,తత్ =ఆ పురుషునే, విశ్వం =సమస్తమును ఉపజీవతి =ఆశ్రయించి ఉన్నది.
తా: ఇహము కంటెను ఉత్కృష్టుడును, శాశ్వతుడును, సర్వాత్మకుడును, నారాయణుడును, పాపములను హరిపచేయువాడును అయిన పురుషుడే ఈ లోకములను ప్రకటించేను. లోకములా పురుషునే పరమాత్మునిగా తెలుసుకొనినవి. ఆయనను ఆశ్రయించియే ఈ సమస్తమును జీవించుచున్నది.

4.పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o శాశ్వతగ్o శివమచ్యుతమ్
నారాయణం మహాజ్ఞ్యేయమ్ విశ్వాత్మానం పరాయణం
టీకా: పతిం= భర్తయు, విశ్వస్య = ప్రపంచము యొక్క, ఆత్మ+ఈశ్వరగ్o =జీవకోటికి అధినాయకుడును, శాశ్వతగ్o = నిత్యము ఉండువాడును, శివం =మంగళప్రదుడును, అచ్యుతమ్ =తన ఉన్నతి నుండి ఏ మాత్రము దిగజారని వాడును, నారాయణ =నారాయణుడు ఒక్కడే, మహా జ్ఞేయమ్ –తెలిసికొనవలిసిన విషయములన్నిటియందు ప్రౌఢుడు, ప్రధముడు, ఉత్కృష్టమైనవాడును, విశ్వాత్మానం = ఈ సమస్తమునకు ఆత్మ అయిన వాడును, పరాయణం = ఆధారపడ తగినవాడు(అయి ఉన్నాడు)
తా: పరిపాలకుడును, ఈ సమస్త జీవ కోటికి ప్రాణప్రియుడును, నిత్యమును యుండువాడును, మంగళప్రదుడును, తన ఔన్నత్యము నుండి ఏ మాత్రము దిగజారని వాడును అయిన నారాయణుడు ఒక్కడే, తెలుసుకొనవలసిన ఉత్కృష్ట విషయమును(వేదాంతమును)తెలిసినవాడు, సృష్టి సమస్తమును ఆధారపడదగినవానికి ప్రణమిల్లెదను.

5. నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణః పరః
నారాయణ పరమ్ బ్రహ్మ తత్వం నారాయణః పరః
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
టీకా: నారాయణః  = ఆ శ్రీ మన్నారాయణుడే, పరః =ఇహాతీతమైన, జ్యోతిః =కాంతులను విరజిమ్ము జ్యోతి, ఆత్మా =ఆత్మస్వరూపమును, పరః =ఉత్కృష్టత, నారాయణః =నారాయణుడే, పరంబ్రహ్మ  =సమస్తము యొక్క మూలాధార విషయక చింతనము, పరోధ్యాతా =పరునిగా ధ్యానిoపబడువాడు
తా: నారాయణుడే పరంజ్యోతియై ఉన్నాడు. తత్పరాయణమగు ఆత్మయు, పరమాత్మయు నారాయణుడే అయి ఉన్నాడు. తాను గుణ రహితుడయ్యును, త్రిగుణగణగ్రామముగా జగత్తును సృజించి  -ఈ సర్వమునకు మూలాధారమగు కర్తృత్వము వహించిన పరబ్రహ్మము నారాయణుడే అయి ఉన్నాడు. ఈ బ్రహ్మమును తెలియుటకు ఆశ్రయింపబడు తత్వములలో ఉత్కృష్టమైన పర తత్వము తనేయై ఉన్నాడు. నారాయణుడే ధ్యానము చేయబడు ఉత్కృష్టుడగు పరముడై ఉన్నాడు. ఆ నారాయణుడే ధ్యానమునూ అయి ఉన్నాడు. ధ్యానం –ధ్యాతా –ధ్యేయం –సర్వమూ తానే అయి ఉన్న ఆ నారాయణునకు నమస్కారము.

6. యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే౭ పివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః
టీకా: దృశ్యతే=కనపడు నట్టిది, శ్రూయతే =వినబడుచున్నట్టిది, అపివా=కూడా అయినటువంటి, అకించత్ = అనల్పమైన, జగత్= నిత్యమూ మారుచుండేది లక్షణము గల ప్రపంచము, సర్వం = సమస్తమైన, యత్ చ  =ఎదైతే ఉన్నదో, తత్= ఆ యొక్క, సర్వం= సర్వ సృష్టియునూ, అంతర్= లోపాలను, బహిః+చ= వెలుపల కూడా, నారాయణః= ఆ నారాయణుడే(పరమాత్మయే), వ్యాప్య= వ్యాపించినటువంటివాడై , స్థితః = ఉన్నాడు(న్నది)
తా: కంటికి కనబడునటువంటిదినీ, కనబడకున్ననూ ఇతరుల ద్వారా చెప్పబడుటచే మనకు వినబడుచున్నదినీ అయిన అఖండమైన ఏ సువిశాలమైన జగత్తు ఉన్నదో, ఆ సమస్తమైన జగత్తుకూ, బాహ్యాభ్యంతరములు అనగా – లోపలా, వెలుపలా కూడా ఆ నారాయణమయమై ఉన్నది.

7. అనంతమవ్యయం కవిగ్o సముద్ద్రే౭ న్తమ్ విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగ్o హృదయం చాప్యధోముఖం
టీకా: అనంతం = అంతం లేనివాడునూ, అవ్యయం =వ్యయము కానివాడునూ అనగా నాశనము లేనివాడునూ, కవిగ్o = సర్వజ్ఞ్యుడు, సముద్రే+అంతం = సంసార సముద్రమునకు చివరినుండువాడునూ, విశ్వ శంభువం = సమస్త జగత్తుకు సుఖదాయియును, హృదయం=జీవకోటికి హృదయం అనునది, పద్మకోశ = తామరమొగ్గవలే, ప్రతీకాశగ్o =ప్రకాశవంతమై, అధోముఖం చ =అధోముఖముగా అంటే కాడ పైకీ పూవు దిగువకూ ఉన్నట్టుగా ఉన్నది.
తా: పరమాత్మ –అంతము లేనివాడునూ, వ్యయము కానీ వాడునూ, కులమత జాతి, లింగ, దేశ, కాల విభేదం లేశం అంతయూ లేనివాడునూ, సర్వజ్ఞ్యూడునూ, భావుకుడునూ, కల్పనా సమర్ధుడునూ, స్రష్ట యును, ఈ సంసార సముద్రమును అంతము చేయువాడునూ, సమస్త జగత్తుకూ సుఖప్రదాతయై ఉన్నాడు. “పూర్వ శ్లోకమున ఆయన, లోపల, బయట ఉన్నాడనినారు కదా, వెలుపలయనగా విశ్వమంతటా అని అర్ధం. జీవకోటియందు ఏ జీవికి ఆ జీవికే వ్యష్టిగా హృదయము అనునది ఒకటి ఉండును. అది ఎట్లుండును అనగా – తలక్రిందులైన తామరమొగ్గవలే బంగారు వెలుగులు విరజిమ్ముచూ ఉండును.

8. అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యా ముపరి తిష్ఠతి
జ్వాలామాలాకులం భాతి విశ్వాస్యా౭యతనం మహత్
టీకా: అధో = దిగువగా, నిష్ఠ్యా =మెడకు లేదా కంఠమునకు, వితస్త్యాంతే = వితస్తి+అంతే =జానెడు దూరమున, నాభ్యాం =బొడ్డునకు, ఉపరి =పై భాగమునందు, తిష్ఠతి =ఉండును, జ్వాలామాలా = మాలికావలెనున్న అగ్నుల, కులం= తెగ, భాతి =వలె, విశ్వస్వ= సమస్త సృష్టి యొక్క, ఆయతనం =స్థానము, మహత్= పురుషత అయి ఉన్నది  
తా: ఈ అనువాకమందు దేహామందు ఆ హృదయము యొక్క తావును ధృవీకరించుచున్నారు. కంఠమునకు దిగువ, బొడ్డునకు జానెడు పైన హృదయము ఉండును.


9. సంతతగ్o శిలాభిస్తు లమ్బత్యా కోశ సన్నిభమ్
తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్
టీకా: సంతతగ్o = నిత్యమును,  శిలాభిస్తు  = నాదులచే, లమ్బత్యా  = లంబాకృతిని వ్రేలాడు, కోశ  = కుంజము యొక్క , సన్నిభమ్  =సమానముగా ఉండు, తస్యాంతే  = ఆ హృదయమునకు నడుమ,  సుషిరగ్o =రంధ్రము, సూక్ష్మం =అతి స్వల్పమైనది కలదు, తస్మిన్ =దానియందే, సర్వం =సంస్తమూనూ, ప్రతిష్ఠితమ్ = ఉంది ఉన్నది.
తా: హృదయము యొక్క ఆకారము, స్థానము పైన తెలుపబడినవి. ఇప్పుడు ఈ అనువాకమందు దాని గుణము, గొప్పతనమునకు కారణము తెలుపబడుచున్నది. జ్వల జ్వలాయమానమైన అనేక నాడీ సమూహంతో నుండు ఆ హృదయ కమలం మీదే అతి సూక్ష్మమైన రంధ్రమొకటి కలదు. ఈ సర్వస్వమును ఆ రంధ్రమునందే ప్రతిష్ఠితమై ఉన్నది.

10. తస్యమధ్యే మహానగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః
సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్ధ్వ మధశ్శాయీ రశ్మయస్తన్య సన్తతా
టీకా: తస్య = ఆ రంధ్రమునకు,  మధ్యే  = నడిమి భాగమునందు, మహానగ్ని =దట్టమైన, ప్రౌఢమైన, మహత్వ  పూర్వకమైన అగ్ని,   విశ్వార్చిహ్ =అనంతమైన జ్వాలలతో, విశ్వతో ముఖః  =విశ్వమునకు అభిముఖమై ప్రకాశించును. సో ౭ గ్రభుక్ – సః+అగ్రభుక్  - సః =ఆ అగ్ని అగ్రభుక్ =(తనకు)ముందున్న ఆహారమును భుజించునది, విభజంతిష్ఠ న్నాహారం  - విభజన్+తిష్ఠన్+ఆహారం  - విభజన్ = విభజించుచూ, తిష్ఠన్ = ఉండును,ఆహారం =ఆహారమును, తిర్యక్ =అన్నీ దిక్కులకీ ఊర్ద్వమ్ =ఎగువకూ, అధః =దిగువకూ, శాయీ = పరచబడిన, రశ్మయః = వెలుగులు, తస్య = ఆ అగ్ని యొక్క, సన్తతా =సంతానములై ఉన్నవి.
తా: ఆ హృదయ మధ్యమున అత్యంతము చిన్నదియగు ఒక రంధ్రము కలదు. ఈ సర్వమును ఆ రంధ్రమునందే  కలదు. ఆ రంధ్రమునకు మధ్య భాగమందు సర్వే సర్వత్రా వెలుగులను విరజిమ్ము అనంతములగు జ్వాలలతో కూడిన మహత్వా పూర్ణమగు అగ్ని ఉన్నది. ఆ అగ్ని తన ఎదుట ఉన్న ఆహార పదార్ధములను భుజించును. ఇతరములను విభజించుచూ ఉండును. ఆ అగ్ని నుండి ప్రభవించు –వెలుగు కిరణములు –పైకిని, క్రిందకును, అడ్డము మరియూ ఏటవాలులుగాను సర్వత్రా ప్రసరింపబడుచుండును. తన ఉపాసకులకు తన వంటి తేజమునిచ్చి ముసలితనము లేని స్థితిని –సర్వజ్ఞ్యతను అనుగ్రహించును.

11. సంతాపయతి స్వం దేహ మాపాద తల మస్తకః  
తస్య మధ్యే వహ్ని శిఖా అణీ యోర్ధ్వా వ్యవస్థితః
టీకా: సంతాపయతి =కాల్చి వేయుచుండును, స్వం = తన యొక్క, దేహo =స్సరీరమును, ఆపాద తల మస్తకః = అరికాళ్ళ నుండి బ్రహ్మ రంద్రము వరకును, తస్య మధ్యే వహ్ని శిఖా =ఆ మహానగ్ని యొక్క అగ్ని చారికల నడుమ, అణీ యోర్ధ్వా =వాటి నడుమ ఇరుసువలే ఎగువలకు, వ్యవస్థితః  =వెలుగుచూ ఉండును.
తా: వైశ్వానరమనబడు ఆ మహానగ్ని తన నుండి సర్వత్రా వ్యాపించే అగ్ని కణముల వేడిమి చేత, తాను ధరించిన దేహమును అరికాళ్ళ నుండి బ్రహ్మ రంధ్రము వరకును తపింపచేయుచుండును. అట్టి మహా తాపకమైన రశ్ములు కలిగిన అగ్నుల నడుమ –ఆ అగ్ని చక్రమునకు ఇరుసు కొనయో అన్నట్లు ఒక విశిష్టాగ్ని ఊర్ద్వముఖమై వెలుగు చున్నది.

12. నీలతో యద మధ్యస్థా ద్విద్యుల్లేఖే వ భాస్వరా
నీవార సూక వత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
టీకా: నీల = నీలి రంగు , తోయద =మేఘము యొక్క, మధ్యస్థాత్ =మధ్యభాగములో ఉండునటువంటి , విద్యుల్లేఖేవ =మెరుపు తీగ వలె, భాస్వరా = ప్రకాశించుచున్నది,నీవారసూకవత్ +తన్వీ =నివ్వరి ధాన్యపు గింజ యొక్క పై ములుకంత రూపున,  పీతా =బంగారు, భాస్వత్ =వెలుగుతో, అణూపమా –అణు+ఉపమా =సూక్ష్మ తారమైన దానికి ప్రతీకగా ఉన్నది.
తా:ఆ అగ్ని చార, నీలి మబ్బు నడుమ మెరుపు తీగవలే, సూక్ష్మ తమమైన నివ్వరి ధాన్యపు గింజ యొక్క పై ములుకంత ప్రమాణమున బంగారు కాంతులు విరజిమ్ముతూ  ప్రకాశించుచున్నది.

13. తస్యా శ్సిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః
స బ్రహ్మ సశివ స్సహరి స్సేన్ద్ర స్సో౭క్షరః పరమస్స్వరాట్
టీకా: తస్యాః =దానియొక్క ,   శిఖాయ =అగ్రభాగపు,  మధ్యే =నడుమ, పరమాత్మా =భగవంతుడు, వ్యవస్థితః = వ్యవస్థితుడై ఉన్నాడు. సః =అతడే, బ్రహ్మః =సృష్టికర్త, సః =అతడే, శివః =లయకారుడగు శంకరుడు, సః =అతడే,   హరిః = స్థితికరుడగు విష్ణువు,  . సః =అతడే, ఇన్ద్రః =త్రిజగత్పాలకుడు, సః =అతడే, అక్షరః =నాశనము లేనివాడు, పరమః =పరాముడు,  స్వరాట్  =స్వయం రాజా.
తా: ఆ సూక్ష్మాగ్ని యొక్క అగ్ర భాగపు నడుమే పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు. అతడే సృష్టి కర్తయగు బ్రహ్మ, అతడే లయకారుడగు శివుడు, అతడే స్థితికరుడైన విష్ణువు, అతడే జగత్పాలకుడు ఇంద్రుడు, అతడే నాశనము లేని శాశ్వతుడు. అతడే శుద్ధ చిదానంద రూపుడైన పరముడు. అతనే స్వయంరాజా.

ఇతి శ్రీ కృష్ణ యజుర్వేదీయ, తైత్తరీయ అరణ్యక దశమ పాఠకే నారాయణోపనిషది త్రయోదశోనువాకః

14. యో ౭ పాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
చన్ద్రమావా అపాం పుష్పం, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవంవేద
టీకా: యః = ఎవడైతే, అపాం =జలమును, పుష్పం=పుష్పముగా, వేద=తెలుసుకొనుచున్నాడో,(వాడు) పుష్పవాన్=స్త్రీ లను కలిగినవాడును, ప్రజావాన్=సంతానము కలవాడును, పశుమాన్=పశు గుణ సంపత్తు కలవాడును, భవతి=అగును. యః = ఎవడైతే, చంద్రమావా=అమృత మండలాకారుడగు చంద్రుడే, అపాం పుష్పం= జల పుష్పం, ఏవ= అని ఈ విధముగా, వేద=తెలుసుకొనుచున్నాడో, ,(వాడు) పుష్పవాన్=స్త్రీ లను కలిగినవాడును, ప్రజావాన్=సంతానము కలవాడును, పశుమాన్=పశు గణ సంపత్తు కలవాడును, భవతి=అగును.
తా: ఎవడైతే జలమును పుష్పముగా తెలుసుకొనుచున్నాడో, ఎవడైతే అమృత మండలాకారుడగు చంద్రుడే ఆ జలపుష్పం అని తెలుసుకొనుచున్నాడో వాడు స్త్రీ లను కలిగినవాడును, సంతానము కలవాడును, పశు గణ సంపత్తు కలవాడునుఅగును.

15. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అగ్నిర్వా అపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
యో ౭ గ్నే రాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవా ఆగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: యః = ఎవడైతే, అపాం =జలముల, ఆయతనం = స్థానమును, వేద=తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ =అట్టి స్థానము కలవాడు, భవతి  =అగును. (అట్లే) యః = ఎవడైతే, అగ్నిర్వా =అగ్నియే, అపాం =ఉదకములకు, ఆయతనం వేద = స్థానమును తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =అట్టి ఉత్కృష్ట స్థానము కలవాడుగా అగును. యః = ఎవడైతే, అగ్నేః =అగ్ని యొక్క, ఆయతనం వేద = స్థానమును తెలుసుకొనుచున్నాడో,(వాడు), అపోవా =జలములే, అగ్నేః =అగ్ని యొక్క, ఆయతనం =స్థానము, ఏవం =అని,  వేద = తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =అట్టి ఉత్కృష్ట స్థానము కలవాడుగా అగును.
తా: ఎవడైతే జలముల స్థానము తెలుసుకొనగలుగుచున్నాడో వాడు అట్టి స్థానము కలవాడుగా అగును. ఎవడైతే అగ్నిని జలములకు ఆధార భూతముగా గుర్తిస్తున్నాడో, వాడు అగ్ని స్థానీయుడగును. అట్లే, ఎవడైతే అగ్నికి జలములే ఆధారభూతమని ఎరుగుచున్నాడో వాడు అంతటి స్థానము కలవాడుగా అగుచున్నాడు. నీటికి నిప్పును, అగ్నికి-జలములును పరస్పర ఆధారభూతములని తెలిసి కొనిన వాడే ఎరుకగలవాడు అగును.

16. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
వాయుర్వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యోవాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
అపోవై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: యః = ఎవడైతే, అపాం =జలముల, ఆయతనం = స్థానమును, వేద=తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ =అట్టి స్థానము కలవాడు, భవతి  =అగును. (అట్లే) యః = ఎవడైతే, వాయుర్వా =గాలియే అపాం= ఉదకములకు, , ఆయతనం వేద = మూల స్థానముగా తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =అట్టి ఉత్కృష్ట స్థానము కలవాడుగా అగును. యో =ఎవడైతే, వాయుః =గాలి యొక్క, ఆయతనం వేద =స్థానము తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =ఆ స్థానము కలవాడుగా అగును.
యః = ఎవడైతే, అపోవై  =ఉదకములే, వాయుః =గాలి యొక్క ఆయతనం =ఆధారభూతము, ఏవ =అని,  వేద = తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =అట్టి తావును కలవాడుగా అగును.
తా:  ఎవడు ఉదక స్థానమును ఎరుగునో, వాడు ఉన్నత స్థానము పొందును. నీటి యొక్క మూలస్థానము వాయువుగా ఎరిగినవాడును, వాయువునకు జలములే ఆధారభూతముగా గుర్తించినవాడును –అవి రెండును పరస్పర ఆధారభూతములుగా తెలిసినవాడు, అట్టి ఉత్కృష్ట పథమును అందుకొనును.

17. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అసౌవై తపన్నపామాయతనం, ఆయతనవాన్ భవతి
ఆముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవా ఆముష్య తపత ఆయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: అసౌవై =ఈ జ్వలించుచున్న తపనః =సూర్యుడే, ఆముష్యతపత =ఈ ప్రకాశ మానుడైన సూర్యుని యొక్క
తా: జలముల స్థానమునేరిగినవాడే స్థానము కలవాడగును. ప్రకాశించు సూర్యుడే ఉదకములకు ఆధారభూతుడని తెలిసినవాడే మూలకందము నొందజాలును. జ్వలించునటువంటి ఆ భాస్కరునకు సలిలములే ఆధారమని ఎరిగినవాడు ఎరుకగలవాడు అగును. సూర్యునకు, సలిలములకూ గల పరస్పర సంబంధమెరిగినవాడే ముక్తుడగును.

18. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
చన్ద్రమా వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యశ్చన్ద్ర మస  ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవై చన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: చంద్రమావా =చంద్రుడే, చంద్రమస =చంద్రుని యొక్క
తా: సలిలముల యొక్క మూలమునేరిగినవాడు స్థానము కలవాడు అగును. చంద్రుడే జలములకు మూలస్థానముగా తెలుసుకొనిన వాడు స్థానవంతుడగును. అట్లే జలములే చంద్రునకు మూలస్థానముగా గ్రహించినవాడు స్థానము పొందువాడు అగును. ఎవరైతే చంద్రునకు సలిలములు, , సలిలములకు చంద్రుడు పరస్పర స్థానములుగా తెలుసుకొనగలుగుదురో వారు అక్షయ పదము కలవారు అగుదురు.

19. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
నక్షత్రాణివా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యో నక్షత్రాణా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవై నక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: నక్షత్రాణివా =నక్షత్రములనే, నక్షత్రాణాం =నక్షత్రముల యొక్క
తా: ఉదకముల ఉనికిపట్టు నెరిగినవాడే ఉనికి గలవాడు అగును. ఎవరైతే నక్షత్రములకు సలిలములు, సలిలములకు నక్షత్రములు పరస్పర స్థానములుగా తెలుసుకొనగలుగుదురో వారు ఆయతనవంతులు అగుదురు.

20. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యః పర్జన్యస్యాయతనం, ఆయతనవాన్ భవతి
అపోవై పర్జన్యస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: ప్రజాన్యోవా =మేఘములే, పర్జన్యస్య =మేఘము యొక్క 
తా: సలిలముల యొక్క మూలమునేరిగినవాడు స్థానము కలవాడు అగును. మేఘమే నీటికి మూలాధారముగా కనుగొనిన వాడు ఆధారము కలవాడు అగును. అట్లే ఎవడు మేఘమునకు జన్మస్థానమెరుగునో వాడు సృష్టి స్థానము కలవాడు అగును. నీళ్లే మేఘములకు మూలకందము అని ఇట్లేవడు తెలియపరచబడుచున్నదో వాడు మూల కందమును అందుకొన గలవాడు అగును.

21. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
సంవత్సరో వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యస్సంవత్సరస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవై సంవత్సరస్యాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: సంవత్సరోవా =సంవత్సరమే సంవత్సరశ్య=సంవత్సరమే
తా: : సలిలముల యొక్క మూలమునేరిగినవాడు స్థానము కలవాడు అగును. సంవత్సరమే నీటికి మూలాధారముగా కనుగొనిన వాడు ఆధారము కలవాడు అగును. అట్లే ఎవడు సంవత్సరమునకు  జన్మస్థానమెరుగునో వాడు స్థానవంతుడు అగును. నీళ్లే సంవత్సరమునకు  మూలకందము అని ఇట్లెవడు  తెలియపరచబడుచున్నాడో వాడు మూల కందమును అందుకొన గలవాడు అగును.

22. యో౭ప్సునావం ప్రతిష్ఠితాం వేద, ప్రత్యేవ తిష్ఠతి
టీకా: యః =ఎవడు, అప్సు =నీటియందు, నావం =ఓడను, ప్రతిష్ఠితాం =సుస్థిరమైన దానిగా,  వేద =తెలుసుకొనునో, ప్రత్యేవ తిష్ఠతి =ప్రతిష్టితుడగును 
తా: జలములందు సుస్థిరముగా ఉన్న ఓడను, ఓడను పరివేష్ఠించిన జలములను అన్యోన్యాశ్రయములుగా ఎరిగినవాడు ముక్తుడగును.

23. కిం తద్విష్ణోర్బల మాహుః, కా దీప్తిః కిం పరాయణం
ఏకొ యధ్ధారాయ ద్దేవః రేజతీ రోదసీ ఉభౌ 
టీకా: కిం =ఎట్టి తత్ =ఆ యొక్క విష్ణోర్బల =విష్ణువు యొక్క బలము,ఆహుః=అయి ఉన్నది? కా =ఏది, దీప్తిః =ప్రకాశమును, కిం =ఎట్టి, పరాయణం =కారణము(వలన), ఏకో= ఒక్కడయ్యును, యత్= ఎవరు, ధారయత్ = ధరించుచున్నాడు, రేజతీ =భూమినీ, రోదసీ = ఆకాశమును, ఉభౌ= రెండింటినీ.
తా:ఏ దైవము తాను ఒక్కడే అయ్యును, ఇహ పరములగు భూమ్యాకాశములు రెండింటినీ ధరించుచున్నదో, ఆ దైవమగు, విష్ణువుకు అంతటి బలమెట్లు కలిగెను? ఏ తేజము వలన సాధ్యము? అందుకు కారణమేమి?

24. వాతాద్విష్ణోర్బల మాహుః అక్షరాదీప్తిః రుచ్యతే
త్రిపధా ద్దారయః ద్దేవః యద్విష్ణో రేక ముత్తమమ్
టీకా: వాతాత్ =వాయువు వలన, విష్ణోః =విష్ణువు యొక్క, బలం =శక్తి, ఆహుః =కలిగినది, అక్షరాత్ =నాశనము లేకుండుట వలన, దీప్తి =ప్రకాశమును, ఉచ్యతే =చెప్పబడుచున్నది. యత్ =ఏ యొక్క, దేవః =దైవము, త్రిపదాత్ =త్రిపాద్విభూతి చేత, ధారయత్ =(ఇహపరములు రెండిటినీ) ధరించు చున్నదో, తత్ =ఆ, విష్ణో =విష్ణువు, ఏకః =ఒక్కడే, ఉత్తమమ్ =శ్రేష్టుడై ఉన్నాడు.
తా: విష్ణువుకు వాయువు వలన బలము, శాశ్వతత్వము వలన తేజము కలుగు చున్నవి. త్రిపాద్విభూతి చేతనే ఈ ఇహపరములను ఉభయము ధరించిన దైవమెవరై ఉన్నారో –ఆ విష్ణువు ఒక్కడే సర్వ శ్రేష్టుడు.

25. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవై యం వై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామకామాయ మహ్యం, కామేశ్వరో వై శ్రావణౌ దధాతు
కుబేరాయవై శ్రవణాయ, మహారాజాయ నమః
టీకా: రాజాధిరాజాయ  =రాజులేల్లరకు రాజైన వానికి, ప్రసహ్య =పరుల లాభములను, సాహినే =ఈడ్చువానికి,  నమో =నమస్కారము, వయం =మేము,  వైశ్రవణాయ =వైశ్రవణునకు  కుర్మహే =చేయుచున్నాము, స =అతడు, మే =నా యొక్క, కామాన్ =కోరికలు, కామ =కోరబడినట్టివి, కామాయ=(అన్నీ) కోరికలను,  మహ్యం =నా కొరకు , కామేశ్వరో =సర్వ కోరికలకు యజమానుడగు, వై శ్రావణౌ =వైశ్రవణుడు  దధాతు =ఇచ్చుగాక,కుబేరాయ =అట్టి కుబేరునకు, వైశ్రవణాయ =వైశ్రవణునకు , మహారాజాయ =దొడ్డ రాజునకు, నమః  =నమస్కారము.
తా: రాజులేల్లరకు రాజైన వానికి , పరుల లాభములను ఈడ్చువానికి, వైశ్రవణునకు మేము నమస్కారము చేయుచున్నాము. సర్వ కోరికలకు యజమానుడగు వైశ్రవణుడు నా యొక్క కోరికలు సమస్త వాంఛలూ నెరవేర్చుగాక. అట్టి కుబేరునకు, వైశ్రవణునకు, దొడ్డ రాజునకు నమస్కారము.

26. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా
ఓం తత్సత్యమ్, ఓం తత్సర్వం , ఓం తత్పురోమ్ నమః
టీకా: ఓం  = ప్రణవ రూపమైన, తత్ =అదియే, బ్రహ్మ =నిత్య వృద్ధి పరిణామశీలకమగు బ్రహ్మము, ఓం తద్వాయు =అదియే సర్వ వ్యాపకమైన వాయువు, ఓం తదాత్మా  =అదియే ప్రాణము, జీవుడు, పరమాత్మ,ఓం తత్సత్యమ్ =అదియే యదార్ధము, ఓం తత్సర్వం =అదియే సర్వము చరాచర జగత్తు సమస్తము, ఓం తత్పురోమ్ =అదియే మొదటిది, సర్వాధారము, నమః =దానికి నమస్కారము.
తా: ప్రణవస్వరూపమైన అదియే బ్రహ్మము, వాయువు, జీవితము, సత్యము, సర్వము, ఆద్యము, ఆధార భూతము అయి ఉన్నది. దానికి నమస్కారము.

27. అన్తశ్చరతి భూతేషు, గుహాయామ్ విశ్వమూర్తిషు
టీకా: అన్తః =లోపల, చరతి =సంచరించు చున్నది, భూతేషు =సమస్త ప్రాణుల యొక్క, గుహాయామ్ =రహస్య స్థలములగు హృదయములు, విశ్వమూర్తిషు =సృష్టి మొట్టమే రూపముగా కలది.
తా: విశ్వమంతయు తానే అయిన ఏ బ్రహ్మము –సమస్త ప్రాణుల యొక్క హృదయముల మధ్య భాగముల చరించుచున్నదో –ఆ

28. త్వం యజ్ఞ్యస్త్వం వషట్కారస్త్వం మిన్ద్రస్తగ్o రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః
త్వం తదాప ఆపొజ్యోతీ రసో ౭ మృతం బ్రహ్మ
భూర్భువస్సువరోమ్
టీకా: త్వం  =నీవే, యజ్ఞ్యస్త్వం =యజ్ఞ్యము రూపముగా కలవాడవు,   వషట్కారః =హోమకాలమున హోతా అగ్నియందు వ్రేల్చునపుడు చర్చించు మంత్ర శబ్దమువు,  మిన్ద్రస్తగ్o =దేవేంద్రుడవు నీవే,  రుద్రస్త్వం =ఈశ్వరుడవు నీవే, విష్ణుస్త్వం =సర్వవ్యాపకూడవు నీవే,  బ్రహ్మత్వం= పరబ్రహ్మవు నీవే,  ప్రజాపతిః =ప్రజలను సృష్టించువాడవు త్వం  =నీవే , తత్ = తత్ శబ్ద వాచ్యమగు, ఆప =జలమువు,  ఆపొ =జలమగు, జ్యోతీ =తేజస్సువు,  రసః =రసమువు, అమృతం =నాశనము కలగనీయకుండు తత్వమువు,  బ్రహ్మ  =బ్రహ్మాండ రూపమువు, భూః =భూలోకము, భువః= భువర్లోకము,సువః  =సువర్లోకమును, ఓం =ఓంకారమును,
తా: తచ్చబ్ద వాచ్యుడగు పరమేశ్వరా, నీవే యజ్ఞ్య రూపుడవు, నీవే వషట్కారమువు, నీవే ఇంద్రుడవు, విష్ణువు బ్రహ్మము నీవే, సర్వాధార సలిలమువు , ఆ జలముల తేజస్సువు, రసమువు, నాశనము లేని వాడవు, నాశనము లేనట్లు చేయువాడవు, సమస్త బ్రహ్మాండ రూపుడవు, అన్నీ లోకముల ఏకాక్షర బ్రహ్మమగు ఓంకారము నీవే అయి  ఉన్నావు.

29. ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్
బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోమ్
టీకా: ఈశానః =ఈశానుడు(అను పేర) స్సర్వ విద్యానాం = అన్నీ విద్యాలకు అధిపతి, ఈశ్వరః =యజమాని, సర్వభూతానామ్ =అన్నీ ప్రాణి కోతులకు,  బ్రహ్మధిపతిర్ =బ్రహ్మకు యజమానియు,  బ్రహ్మణో ౭ ధిపతిర్ =బ్రహ్మజ్ఞ్యులకు యజమానియు, బ్రహ్మ =పరబ్రహ్మమైన,  శివః =శివుడు, మే  =నా యొక్క , అస్తు =అగు గాక,  సదా  = నిత్యము, శివోమ్ =మంగళ ప్రదుడు
తా: ఈశానుడను పేర సర్వ విద్యాలకును, వేదములలోనూ సంస్త ప్రాణికోటిపై అధికారియు, బ్రహ్మజ్ఞ్యులకు శాసకుడును అగు పరమాత్మ సదా నన్ను అనుగ్రహించుటకు గాను శాంతుడగు గాక.

30. తద్విష్ణో పరమం పదగ్o సదా పశ్యన్తి సూరయః
దివీవ చక్షు రాతతమ్
టీకా:తత్ =ఆ యొక్క, విష్ణోః= విష్ణువు యొక్క, పరమం పదగ్o  =దివ్యా నివాసమును, సదా = ఏళ్ల వేళలా,  , సూరయః  =జ్ఞ్యానులైనవారు, దివి+ఇవ =ఆకాశమందంతటను, చక్షుః =కన్నులకు, ఆతతం= వ్యాప్తముగా, పశ్యన్తి = చూచుదురు
తా: ఆ విష్ణువు యొక్క నివాస స్థానమగు వైకుంఠ పదమును –పండితులు తమ జ్ఞ్యానము వలన దివ్యములగు కన్నులకు కట్టినట్లుగా ఆకాశమందంతటనూ చూచుచున్నారు.

31. తద్విప్రాసో విపన్వవో జాగృవాం స్సమిన్దతే
విష్ణోర్య త్పరమం పదమ్
టీకా: తత్ =ఆ యొక్క, విప్రాసో =నిష్కామ కర్మిష్టులగు బ్రహ్మజ్ఞ్యులు,  విపన్వవో  =నిష్కంటక జీవులు, జాగృవాం =నిర్భయులు, స్సమిన్దతే  =ప్రదీప్తము చేయుచున్నారు, విష్ణోః =విష్ణువు యొక్క, పరమం పదమ్  =దివ్యా నివాసమగు వైకుంఠమును.
తా: విష్ణువు యొక్క శ్రేష్టమైన ఆ పరమ పదము –నిష్కామ కర్మ యోగులగు బ్రహ్మజ్ఞ్యుల చేతను, కంటక రహిత జీవనుల చేతను, నిర్భయులగు జ్ఞ్యానుల చేతను, నిత్యము ప్రదీప్తము చేయబడుచున్నది.

32. ఋతగ్o సత్యం పరమ్ బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్
ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః
టీకా: ఋతగ్o =మోక్షపదావాసము,  సత్యం =యదార్ధముగాక కలిగినటువంటిది,  పరమ్ బ్రహ్మ =వ్యవహారమున చెప్పుకునే బ్రహ్మము గాక –పారమార్ధికమైన బ్రహ్మము,  పురుషం =పురుషుడు,  కృష్ణ పింగళమ్ =నలుపు ప్రకాశవంతమైన బంగారు రంగులు కలది, ఊర్ధ్వరేతమ్ =రేతమును ఊర్ధ్వ గతికి నడుపునది,  విరూపాక్షం =బేసి కన్నులు కలది,  విశ్వరూపాయ వై =విశ్వమే రూపముగా కలిగిన దైవమునకు,  నమో నమః= పునః నమస్కారము
తా: మోక్ష పదమందు ఉండు వాడు, సత్యమే స్వరూపమైన వాడు, పారమార్ధికమైన పర బ్రహ్మము, పురుషుడు, మెరుపు గల నలుపూ మరియు ప్రకాశమానమైన బంగారు రంగుల మిశ్రవర్ణ శోభితుడు, ఊర్ధ్వ రేతస్కుడు, మూడు కన్నులు కలవాడు, సృష్టి సమస్తమూ తన రూపమే అయిన మహాదేవునకు పునః నమస్కారము.

33. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్
టీకా: నారాయణాయ =నారాయణునిగా,  విద్మహే = ప్రకటించబడిన(పరమాత్ముడగు), వాసుదేవాయ = వాసుదేవుని యొక్క,  ధీమహి = స్మరణము మా మనస్సు లందు జరుగు గాక, తన్నో = ఏతత్ స్మరణ ప్రార్ధనలందు,  విష్ణు =విష్ణువు,  ప్రచోదయాత్ =ప్రేరేపించు గాక.  
తా: పరమాత్ముడగు వాసుదేవునియందు ప్రకటించబడిన నారాయణ నామము నిత్యము స్మరింతుము గాక. అట్టి స్మరణ ప్రార్ధనలకై విష్ణువు మమ్ములను ప్రేరేపించు గాక.

34. ఆకాశ త్పతితం తోయమ్ యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవమ్ ప్రతి గచ్ఛతి
టీకా: ఆకాశత్ =ఆకాశము నుండి, పతితం =పడినటువంటి(కురిసిన), తోయమ్ =నీరు, యథా = ఏ విధముగా నైతే  సాగరం =సముద్రమున, గచ్ఛతి =చేరునో, అట్లే, సర్వదేవ నమస్కారః  =అందరి దైవములయోక్క నమస్కారములును, కేశవమ్ ప్రతి =విష్ణువునకే,  గచ్ఛతి =చెందును. 
తా: వాన నీరు ఎన్ని వాగు వంకలైనను కడలి చేరునట్లు, ఏ దైవతములకు నమస్కరించినను అది విష్ణువుకే చెందును.





Friday, July 20, 2012

Science & Philosophy -17


Geography గురించి గానీ, ద్వీపాల గురించి మాట్లాడుకునే ముందు మనం అర్ధం చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే మన వేదాలు అవీ west లో కూడా ప్రచారం చెయ్యబడ్డాయి. Exchange of Culture and Philosophy ఎన్నో వేల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. అందుకే అక్కడ గ్రీక్, రోమన్, పర్షియన్,ఈజిప్షన్ కథలకి మన పురాణాలకి చాలా links కనపడతాయి, links కాకపోయినా మన పురాణాల తాలూకు shades కనపడతాయి. మన పురాణాలు కూడా కాలం నించి కాలానికి మారుతూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు add చెయ్యబడుతూ వచ్చాయి. నాకు తెలిసి ఋగ్వేదం కూడా కొంత ప్రపంచ వర్ణన, మనిషి తాలూకు వర్ణన ముగిసిన తరువాత మిగతాది history తాలూకు వర్ణన అని నా అభిప్రాయం. నా లేఖ్ఖ ప్రకారం ఇక్కడి పురాణాలు  పేర్లు మార్చి అక్కడ కథల కింద మార్చబడ్డాయి. ఇంకా కొన్ని అక్కడి కథలు ఇక్కడ, ఇక్కడి కథలు అక్కడ వాటి తాలూకు impact value ని బట్టి exchange చేసుకోబడ్డాయి. Bluffing, updating అన్ని చోట్ల జరిగింది. కానీ అన్ని చోట్ల కంటే ఎక్కువగా ఒక రకమైన logic & reasoning base చేసుకుని సిద్ధాంత చర్చలు, scientific development జరిగింది జంబుద్వీపం లోని భరత వర్షం లోని భరత ఖండంలోనే. నాకు తెలిసిన కొంత మంది, atomic theory గురించి కణదుడు, ayurvedic medicine గురించి చెరకుడు,  medicine, surgery and plastic surgery గురించి సుశ్రుతుడు, astronomy and mathematics గురించి ఆర్యభట్టు, వరాహ మిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు, chemistry and metallurgy గురించి నాగార్జునుడు అతని అనుయాయులు, advanced trigonometry,  sine& cosine series గురించి మధ్వాచార్యులు, yoga గురించి పతంజలి – ఇలాగే ఎంతోమంది ఈ పుణ్యభూమిని తమ విజ్ఞ్యానoతో పరిపుష్టం చేశారు. అలాగే సంస్కృతం అతి ప్రాచీనమైన భాష. ఈ భాషల గురించి వేరొకసారి చెప్పుకుందాం.
నా చిన్నప్పుడు 3rd std చదివేటప్పుడు మా తాతగారి ఊరిలో మాయల ఫకీరు నాటకం చూశాను. అందులో ఫకీరు నీ ప్రాణం ఎక్కడుంది అంటే సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు దాటి వెళితే అక్కడ ఒక ద్వీపంలో, మర్రి చెట్టు తొర్రలో, చిలకలో ఉంది అని. నా 7th std geography లో oceans, continents గురించి చదువినప్పుడు దీని link దొరికింది. ఇక విషయానికి వద్దాం.
geography గురించి అదీ physical geography గురించి ఈ సంకల్పంలో ఉన్న detail మినహా ఎవరూ చెప్పినట్టు కనపడలేదు. అసలు మనవాళ్లు ఇంత ముఖ్యమైన subject ని ఎలా neglect చేశారో చాలా రోజుల పాటు అర్ధం కాలేదు. ఒక సారి tv లో భక్తి channel లో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు భారతం చెప్తూ “సప్త ద్వీపా వసుంధరా” అని మహాభారతంలో ఉంది అన్నారు. మహాభారతం లో ఉన్న ఆ ద్వీపాల పేర్లు “ జంబూ, ప్లక్ష, గోమేధక, శల్మలి, కుశా, క్రౌంచ, శాక, పుష్కర” అని. ఆ తరువాత విష్ణుపురాణం గురించి వేరెవరో వ్యాఖ్యానిస్తూ అందులో ఏడు ద్వీపాలు కాదు పదమూడు ఉన్నాయి అన్నారు అవి “భద్రశ్వ, కేటుమళ్ళ, జంబూ, ఉత్తర కురవ, ఇంద్ర ద్వీప, కశేరుమత్, తామ్రవర్ణ, గభస్తీమత్, నాగ ద్వీప, సౌమ్య, గంధర్వ, వరుణ, భరత” అని చెప్పారు. ఇదేంటి ఎవడికి తోచింది వాడు వ్రాయడమేనా అని ముందు అనుకున్నా తరువాత నేను Geography చదివేటప్పుడు continents, tectonic plates అన్నవి గుర్తుకు వచ్చాయి. ఈ భూమి తాలూకు lithosphere యొక్క motions వల్ల ఏర్పడే భూకంపాలు, పర్వతాలు, లోయలూ తద్వారా కాలం తో పాటు మారుతున్న భూమి ఉపరితలం. Alfred Wegener 1915 లో వ్రాసిన “The Origin of Continents & Oceans “లో ఈ భూభాగాల కదలికలకీ కారణమైన continental drift గురించి paleomagnetism గురించి చెప్పడం జరిగింది. ఆ తరువాత 1950 లో సముద్ర గర్భం లో ఉన్న భూమి కదలికలు నించి magnetic striping గురించి కనిపెట్టబడిన తరువాత ఇంకా నిర్ధిష్టంగా ఈ tectonic plates కదలికలు define చెయ్యబడ్డాయి. ఇప్పుడు current plates ఏవంటే African, Antarctic, Eurasian, North American, South American, Pacific, Indo-Australian. Indo Australian plate కొన్ని సార్లు Indian plate, Australian plate గా separate గా refer చేయబడతాయి. ఇంకా చిన్న చిన్న plates కూడా గుర్తించారు కానీ పెద్ద plates పైన చెప్పినవే.
ఇప్పుడు మనవాళ్లు చెప్పిన description తీసుకుంటే జంబూ ద్వీపం అంటే అవిభాజ్య Eurasian మరియు Indo-Australian ప్లేట్ అని అందులో భరతఖండం అంటే Asia భాగమని, భరతవర్షం అంటే India అని అనుకోవచ్చు.
మర్చిపోయాను, ఆ సంకల్పం చెప్పేటప్పుడు “జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖoడే, మేరో దక్షిణ దిగ్భాగే” అని కూడా ఉండేది. ఈ మేరు పర్వతం గురించి మార్కండేయ పురాణం లో,  బ్రహ్మండ పురాణం లో వర్ణన ప్రకారం జంబూ ద్వీపం నాలుగు కమలం రెక్కలలా ఉండి ఈ మేరు పర్వతం వాటి మధ్యలో ఉండేదని ఒక వర్ణన. సూర్య సిద్ధాంతం ప్రకారం మేరు పర్వతం భూగోళ మధ్యలో ఉండేదని దాని చుట్టుపక్కల మంద్రాచల, సుపసర్వ, కుముద, కైలాస పర్వతాలు ఉండేవని వర్ణన. ఈ సూర్య సిద్ధాంతం లో వివిధ గ్రహాల సంచారం తాలూకు details అలాగే గ్రహాల positions , కాలం, దూరం, దిశ, సూర్య చంద్ర గ్రహణాలు, వాటి తాలూకు ప్రభావాలు, వివిధ గ్రహాల conjunctions, సూర్య చంద్రుల చెడు ప్రభావాలు, ప్రపంచం తాలూకు ఆవిర్భావం, భూగోళ వర్ణన, ఈ విశ్వం తాలూకు కొలతలు, sundial లో ఉండే gnomon తాలూకు వర్ణన, నక్షత్రాల కదలికలు మనిషి మీద వాటి ప్రభావం అనీ చెప్పబడ్డాయి. మరి ఈ మేరు పర్వతం ఎక్కడుంది అన్నది పెద్ద question. వరాహమిహిరుడి “పంచ సిద్ధాంతిక” లో ఈ మేరు పర్వతం ఉత్తర ధ్రువం (North pole” దగ్గిర ఉంది అని description ఉన్నా, కొంత correlation తరువాత ఈ మేరు పర్వతాలు Central Asia లోని Tajikistan దగ్గిర ఉండే Pamir mountains గురించి వర్ణన అనిపిస్తుంది. Mount Everest ఎత్తు define చెయ్యక ముందు ఈ మేరు పర్వతాలని (Pamir mountains)Roof of the world” అనుకునేవారు.
Francis Wilford అనే అతను 1761 లో East India Co., తరఫున వచ్చిన Lieutenant Colonel. అతను తరువాత అతను 1786 నించి 1790 వరకు military maps తయారుచేసే Asst Surveyor క్రింద పని చేసి తరువాత Asiatic Society of Bengal లో fellow member క్రింద ఉండేవాడు. అతను ఒక దశలో ఈ European mythological కథలన్నిటి మూలం హిందూ పురాణాలే అని తేల్చాడు. అతను Jesus Christ జీవితాన్ని శాలివాహనుడి తోను Noah ని సత్యవ్రతుడి తోను, Mt. Ararat అంటే ఆర్యావర్తం అని correlate చేశాడు. Bible మూలాలు, ఇస్లాం మూలాలు, Egypt నాగరికతకి మూలాలు అన్నీ ఇక్కడి నించి వ్యాప్తి చెందినవేనని, అసలు ఇక్కడి విజ్ఞ్యానమే ప్రపంచం నలుమూలలకీ వ్యాప్తి చెందిందని అభిప్రాయపడ్డాడు. ఈ mythological connections, వాటి మీద research చెయ్యడానికి బెనారస్ లోని పండితులని నియోగించి అతను papers తయారు చేసేవాడు. అతను ఇచ్చిన description ప్రకారం ఈ పురాణాల్లో చెప్పిన జంబూ ద్వీపం అంటే India అని, మిగతా ఆరు- కుశా అంటే Persian gulf మరియు Caspian sea మధ్య భాగమని, ప్లక్ష అంటే Asia minor, Armenia మొదలైనవి అని , శల్మలి అంటే Baltic, Adriatic seas మధ్య ఉండే Eastern Europe అని , క్రౌంచ అంటే Germany, France, Italy కొంత భాగం అని , శాక అంటే British isles అని, గోమేధక అంటే లంక అని , పుష్కర అంటే Iceland అని correlate చేసి చెప్పాడు. తరువాత అతను ఒక paper లో తను నియోగించిన పండితుల చేత మోసగింపబడ్డానని ప్రకటించాడు. ఆ తదనంతరం కృష్ణుడు, వేదవ్యాసుడు కూడా British internationals అని చెప్పి, విసుగెత్తి retirement లోకి వెళ్లిపోయాడు. దీని మీద ఎవడి inferences వాడు తీసుకోవచ్చు.
దీని వలన మనకి అర్ధం అయ్యేదేంటంటే మన నిత్య సంకల్పంలో మనం ఏ సమయంలో, ఏ ప్రదేశంలో ఉన్నమో చెప్పుకుని తరువాత మనం ఏది కోరి ఆ పూజలు చేస్తున్నామో చెప్పుకోవడం. మనం చేసే పనులలో ఒక clarity, ఒక focus తీసుకురావడం. ఇంకా ఆ సంకల్పం లో శుభ యోగే, శుభ కరణే, శుభ వాసరే, శుభ తిథౌ, శుభ నక్షత్రౌ ... అన్న వాటి గురించి తరువాత చెప్పుకుందాం.
ఇదే కాదు నా అభిప్రాయం ప్రకారం దశావతారాలు అని మనం చెప్పుకునే “మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ,రామ, కృష్ణ,బుధ్ధ,కల్కి” భగవంతుని అవతారాలు up to వామన అవతారం వరకు theory of evolution గురించి చెప్పడమే అని. దీని గురించి next post లో.  

Monday, July 2, 2012

Science & philosophy -16


Last post లో చెప్పుకున్న “ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః .... భరత వర్షే.... “ దాన్ని సంకల్పం చెప్పడం అంటారు. నిత్య పూజలలో కూడా ఇది నిత్య సంకల్పం కింద చెప్పబడుతుంది. ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే “మనం ఏ  కాలం లో ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏమి చేద్దామనుకుంటున్నాము అంతే. ఇవి చెప్పాలి అంటే ముందు తెలియాలి కదా. ఏ కాలం? అవును మనము ఏ కాలం లో ఉన్నాము. 2012AD. అంటే ఇది Jesus Christ పుట్టి 2012 సంవత్సరాలు అయ్యింది. అంటే Christ కి ముందు అంతా BC. అసలు ప్రపంచం పుట్టి ఎన్నాళ్లయింది అంటే ఈ BC, AD తో సంబంధం లేకుండా big bang అని చెప్పుకుని 20 billion years క్రితం black hole నించి అని చెప్పాలి. ఈ big bang ప్రతిపాదించి ఎన్నాళ్లు అయ్యిందయ్యా అంటే అది Stephen hawking వయసంత కూడా లేని theory.అంటే మొన్న మొన్న చెప్పబడింది. నేను ఆ theory ని గానీ దాని గొప్పతనాన్ని కానీ తగ్గించటం లేదు. దాని ఉపయోగాలు తరువాత చెప్పుకుందాం. కానీ ఈ సృష్టి తాలూకు ఆయుర్దాయం గురించి మన మహర్షులు ఏనాడో చెప్పారు. ఖగోళ శాస్త్రనికి  సంబంధించి “సూర్య సిద్ధాంత గ్రంధం” ప్రపంచం లోనే అతి పురాతన గ్రంధం. ఈ సూర్య సిద్ధాంతాన్ని లంక కి చెందిన మయాసురుడు అనే వాడు వ్రాసాడట. మన పంచాంగం చెప్పే వాళ్ళు దానినే follow అవుతారుట. నేను శ్రీశైల సిద్ధాంతి గారు వ్రాసిన ఏదో పంచాంగం పుస్తకం లోనే చదివాను. ఆ లేఖ్ఖలు ఈ క్రింది విధంగా ఇచ్చారు.
6 ప్రాణ కాలాలు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ (24 mins)
60 ఘడియలు = 1 అహోరాత్రము (24 hours) = 1 రోజు
15 రోజులు = 1 పక్షము
రెండు పక్షాలు ఉన్నాయి శుక్ల పక్షము, కృష్ణ పక్షము  - అమావాస్య నించి పున్నమికి శుక్ల పక్షం, పౌర్ణమి నించి అమ్మవాస్యకి కృష్ణ పక్షం.
2 పక్షములు = 1 నెల (ఇవి చైత్రము, వైశాఖము, జ్యేష్టము ఇలాగ 12 నెలలు).
12 నెలలు= 1 సంవత్సరం (ఈ సంవత్సరాలకి ప్రభవ, విభవ  అని అరవై పేర్లు ఉన్నాయి . ఇప్పుడు మనం ఉన్నది నందన నామ సంవత్సరం.)
కృత యుగం = 17,28,000 సంIIలు
త్రేతా యుగం = 12,96,000 సంIIలు
ద్వాపర యుగం = 8,64,000 సంIIలు
కలియుగం = 4,32,000 సంIIలు
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలని కలిపి 1 మహాయుగం అంటారు. అంటే ఒక మహాయుగానికి 43,20,000 సంIIలు
1 కల్పం = 1000 మహాయుగాలు  = బ్రహ్మకు ఒక పగలు  = 432 కోట్ల సంIIలు
( ఈ బ్రహ్మ తాలూకు పగటి కాలాన్ని “ఉదయ కల్పం” అంటారు – ఆ తరువాత వచ్చే 432 కోట్ల సంIIలు “క్షయ కల్పం” అంటారు. )
2000 మహా యుగాలు = బ్రహ్మకు 1 రోజు  = 864 కోట్ల సంవత్సరాలు
30 బ్రహ్మ రోజులు = 30 కల్పాలు = 1 బ్రహ్మ నెల (ఈ కల్పాలు30 లో మొదటిది శ్వేత వరాహ కల్పం )
12 బ్రహ్మ నెలలు =1 బ్రహ్మ సంవత్సరం
50 సంIIలు = 1 పరార్ధం
100 బ్రహ్మ సంవత్సరాలు = బ్రహ్మ ఆయుర్దాయం = సృష్టి ఆయుర్దాయం = 3,11,04,000 కోట్ల సంIIలు
3,11,04,000 కోట్ల సంIIలు నిండగానే బ్రహ్మ తన బ్రహ్మాండముతో సహా లయమొందుతాడు.
ఇప్పుడు మనం ద్వితీయ పరార్ధం లో ఉన్నాము అంటే మొదటి 50 బ్రహ్మ సంIIలు గతించి రెండవ పరార్ధంలో ఉన్నాము.
తరవాత అన్నది “వైవస్వత మన్వంతరే”  -
71 మహాయుగములు  = 1 మన్వంతరం  = 30,67,20,000 సంIIలు
ఈ మన్వంతరాలు 14 – స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవస్వత (ఇప్పుడు మనం ఉన్నది) ఇలాగ భౌత్య సావర్ణి వరకు 14 మన్వంతరాలు.  ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నమో చూద్దాం.
ప్రధమ పరార్ధం = మొదటి 50 బ్రహ్మ సంIIలు = 1,55,52,000 సంIIలు ముగిశాయి రెండవ 50 సంIIలు లో ఉన్నాము.
అలాగే 14 మన్వంతరాలలో 6 ముగిశాయి  = 184,03,20,000 సంIIలు ఇప్పుడు మనం ఏడో మన్వంతరం లో ఉన్నాము. ఈ ఏడో మన్వంతరం లో 27 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం లో కృత, త్రేతా, ద్వాపర యుగాలు ముగిసి కలియుగం లో 5112 సంవత్సరంలో ఉన్నాము. అంటే ఇప్పుడు సృష్టి వయస్సు = 155521972949112 సంవత్సరంలో ఉన్నాము. ఇంకా మొత్తం బ్రహ్మ కాలం పూర్తి అవ్వడానికి 155518027050888 సంIIలు మిగిలి ఉంది.
సృష్టి లో ప్రళయాలు గురించి కూడా మనవాళ్లు చెప్పారు. అవి నాలుగు రకాలు
1.యుగ ప్రళయము 2.మను ప్రళయము 3.కల్ప ప్రళయము 4. అవాంతర ప్రళయము.
యుగం పూర్తి అయినప్పుడు యుగ ప్రళయము, మన్వంతరం పూర్తి అయినప్పుడు మను ప్రళయము, కల్పం పూర్తి అయినప్పుడు కల్ప ప్రళయము – ఇవి కాకుండా మధ్య మధ్య లో వచ్చే ప్రళయాలని అవాంతర ప్రళయాలు అంటారు. యుగ, మను ప్రళయాలలో ప్రపంచం తాలూకు స్థితి గతులలో మార్పులు వస్తాయి కానీ కల్ప ప్రళయాంతములో మొత్తం సృష్టి వినాశనం జరిగి బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభిస్తాడు.
ఇంతకు ముందు 2012AD లో ప్రపంచం ముగుస్తుంది అన్న వాదనలో, mayan calendar తాలూకు లేఖ్ఖల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రపంచం లో ఎన్నో calendars ఉన్నాయి. అన్నిటికన్నా మనం సూర్య సిద్ధాంతం ప్రకారం లేఖ్ఖ కట్టి చెప్పిన ఈ calculations కాలానికి, సిద్ధాంతానికి నిలుస్తాయి.  అలాగే ఈ ప్రపంచాన్ని, మనిషిని అర్ధం చేసుకోవడానికి చెప్పిన శ్లోకాలలో “మంత్ర పుష్పం” చాలా ఉపకరిస్తుంది.
మన మహర్షులు లేఖ్ఖలు వేసి ఇంత ఖచ్చితంగా చెప్పిన ఈ కాల మానాన్ని ఇప్పుడు NASA కూడా నిజమేనని ధృవీకరించింది అట. అంటే మనం చెప్పుకున్న లేఖ్ఖలనే వేరు వేరు పధ్ధతుల ద్వారా తిరిగి కనుక్కోవడం జరుగుతున్నది.
మనవాళ్లు నిత్యం ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం ఏ కాలం లో ఉన్నామో చెబుతారు. ఇదొక ఆలవాటు క్రింద మార్చేశారు. ఆ సంకల్పం మళ్ళీ చెప్పుకుందాం “ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే  - (ఇంత వరకు కాలమానం అయ్యింది)  - జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే –(ఇది geography related) మనం ఈ భూమ్మీద ఎక్కడ ఉన్నాము అన్నది.దీని గురించి next post లో మాట్లాడుకుందాం. 

Friday, June 29, 2012

Science & Philosophy - 15


మా అమ్మ నా చిన్నప్పుడు ఇంట్లో జరిగే పూజలలో, వచ్చిన బ్రాహ్మణుడికి, మాది ఋగ్వేదం అని చెప్తూ ఉండేది. నేను అడిగాను అసలు ఎందుకు అలా చెప్తున్నావు అని. ఆవిడకి అర్ధం అయినంత మటుకు, ఆవిడ నాతో అన్నదేంటంటే మన పూజా విధానాలు వేరుగా ఉంటాయి. చేయించే తంతులు, చదివే మంత్రాలు మారతాయి అని. నాకు doubt వచ్చేది, అసలు అందరూ పూజించేది అదే దేవుడిని అయినప్పుడు ఈ వేదాల, మంత్రాల, తంతుల గోల ఏంటని. ఆ మంత్రాలు చదవడానికి సోమశేఖరం అన్న ఆయన వచ్చేవాడు. ఆయన ఏదో సణుగుతూ చదివేవాడు. అవి అర్ధం కూడా అయ్యేవి కావు. ఏదో ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, పువ్వులు వెయ్యండి ఇవి మాత్రం అర్ధం అయ్యేవి. అనుకునేవాడిని ఇప్పుడు అతను చేయిస్తున్న పనులకీ ఋగ్వేదానికీ ఏమిటి సంబంధం అని. నాకు అనిపించేది ఏదో భృతి గడవడానికి పూజలు చేయించేవాడు కానీ, అసలు అతనికి అతను సణుగుతున్న దానికి అర్ధం తెలియదేమోనని. ఆ తరువాత ఎవరినీ అడగడం మానేశాను. కానీ నా బుర్రలో అది ఉండిపోయింది. దాని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. దొరికిన పుస్తకాలని చదువుతూ, నాకు నచ్చిన inferences తీసుకుంటూ, వాటి అర్ధాలు ఏమై ఉంటాయా అని అనుకుంటూ,topic పంచుకోవడానికి సరైన company లేక, అలా జరుగుతూ పోయింది. Parallel గా చదువు, ఉద్యోగం, పెళ్లి ఇంకొన్ని social obligations వాటి మానాన అవి అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ Science & Philosophy post లో నేను చెప్పేవి నా ఆలోచనలు,నా inferences నుంచి నాకు అనిపించిన నా అభిప్రాయాలే. దీనికి మహాత్ములెవరైన వేరే కోణం కూడా చెప్పగలిగితే నన్ను నేను update చేసుకుంటాను. ఇక విషయానికి వద్దాం.

నేను last post లో మన వాళ్ళు ప్రపంచం గురించి ఇచ్చిన analysis అన్నాను. అసలు మన భారత దేశం లో ఎవరైతే తపస్సు చేసి జ్ఞ్యానం సంపాదిస్తారో వాళ్ళని ఋషులు అనడం పరిపాటి. కానీ ఇప్పటి కాలానికి వాళ్ళని scientists అంటే అందరికీ అర్ధం అవుతుందేమో. కానీ ఒక మహర్షిని scientist అంటే మహర్షి తాలూకు విలువని తగ్గించడమే. ఎందుకంటే ఒక స్థితిని పరిపూర్ణత్వం తో చూసి చెప్పగలిగేవాడు మహర్షి. పరిస్థితి ఏదైనా దానిని సిద్ధాంతంతో హేతుబధ్ధంగా, భౌతికంలో దాని results బట్టి analyze చేసి చెప్పేవాడు scientist. భౌతికమైన ఈ science తో అనుభవైకవైద్యమైన విషయాలను చాలామటుకు విశదీకరించడం కుదరదు. మహర్షులు చెప్పే విషయాలు చాలా మటుకు సామాన్యుడికి అర్ధం కాకుండా పోతాయి. అప్పట్లో మరి మహర్షులు తమ అనుభవాలని, జ్ఞ్యానాన్ని పంచే  ప్రయత్నంలో వాటిని మంత్రాలుగా మార్చి, గుర్తు పెట్టుకోవడానికి సులువు చేసి, తరం నించి తరానికి అనుశ్రుతాలుగా నేర్పించారు, తాళపత్రాలు వచ్చేవరకు.
అప్పుడు మాహర్షులు చెప్పేవి సామాన్యులకి ఎలా అర్ధం కావో అలాగే ఇప్పుడు scientists E=mc2 అంటే కొంత subject తెలిస్తే తప్పితే అది అర్ధం కాదు. ఇప్పుడు science ఎంత advance అయిపోయిందంటే ఆ మాత్రం ఈ మాత్రం చదువుకున్న వాడి ఊహాకి కూడా అందదు. కానీ ఆ revelations నించి వచ్చే applications & products మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి వల్ల మన environment, జీవన విధానం కూడా మారుతూ ఉంటాయి. కానీ మనవాళ్లు చెప్పేవి ఈ ప్రకృతిని గుర్తించి, దానిని పాడుచెయ్యకుండా, దానిలో మమేకమవుతూ జీవించే ఒక పధ్ధతి. ఇప్పటి మేధావులు మళ్ళీ తిరిగి Ecoliteracy, Sustainability theory అని చెప్తున్నవి అవే.
మనవాళ్లు కాలమానం, , universe కి సంబంధించిన theories, theory of evolution, geography, medicine, yoga ఇలాటి వాటి గురించే కాదు almost మనిషికి సంబంధించిన అన్ని subjects ని touch చెయ్యడం జరిగింది. అవే వేదాలు, ఉపనిషత్తులు, యోగాలు etc.,.  మనవాళ్లు even ఈ మంత్రాల ఛందస్సు, వాటి మాత్రలు, వాటిని ఉచ్చరించే పధ్ధతులు, అవి చదవడం ద్వారా మనిషికి ఒక relaxation కలిగించే విధానం అన్నీ పొందుపరిచి పెట్టారు. ఇంతకుముందు posts లో ఋగ్వేద సూత్రాన్ని, భగవద్గీతనీ quote చేస్తూ బ్రహ్మ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు నా జీవితంలో నేను విన్నవి, చదివినవి వేరే విషయాల గురించి చర్చించుకుందాం.

మన వాళ్ళ కాలమానం,  Geography అన్న విషయం నాకు ఎక్కడ తట్టిందంటే మా ఇంట్లో జరిగే పూజలలోనే. వినాయక చవితి కి చేసే పూజలో పూజకి ఆరంభంలో శుక్లాంబరధరం చదివిన తరువాత ప్రవర్తమానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, ...... కలియుగే, ప్రధమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే,..... అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన..... శుభవాసరౌ, శుభ తిధౌ...... అని చెప్పేవారు.
అప్పుడు మనం ఉన్నది కలియుగం, రాముడు త్రేతా యుగం, కృష్ణుడు ద్వాపర యుగం మా అమ్మ చెప్పడం చిన్నప్పటి నించి వినడం వలన వాటి గురించి గోల లేదు కానీ ఈ పరార్ధం ఏమిటి, కల్పం అంటే ఏమిటి, మన్వంతరం అంటే ఏమిటి, జంబూద్వీపం అంటే ఏమిటి అని doubt వచ్చింది. 

Monday, June 25, 2012

Kotta Bhetala kathalu – Tyagi the opportunist


శవం concept close అవ్వడం తో ఏమీ తోచని భేతాళుడు కాలక్షేపం కోసం కొండపూర్ లో ఉన్న విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ చాలా relaxing mood లో ఉండి “ఏంటి భేతాళా ఇలా వచ్చావు, టీ ఏమైనా తాగుతావా” అని అడిగాడు. భేతాళుడు సరే అనడంతో విక్రమ్ టీ, biscuits తెప్పించాడు. టీ తాగిన తరువాత విక్రమ్ “ఏంటి విషయాలు భేతాళా” అని అడిగాడు. “ఏముంటాయి, ఇంతకు ముందు నువ్వు శవం వెతుక్కుంటూ రావడంతో నాకు నిన్ను వెతికే అవసరం లేకపోయేది. ఇప్పుడు నువ్వు ఆ పధ్ధతి మార్చడంతో నేను నిన్ను వెతుక్కుంటూ రావలసి వస్తోంది. నా గురించి తెలిసింది నువ్వోక్కడివే. అందుకే ఇలా” అన్నాడు. దానికి విక్రమ్ “సరే బాధపడకు. అవసరం అన్నది ఎవడి చేతైనా, ఎంత పనైనా చేయిస్తుంది”. ఇప్పుడు నువ్వు కూడా exception కాదని తేలిపోయింది. సరే ఇంతకీ కథ ఏమైనా చెప్తావా, లేకపోతే మనం latest movie దేనికైనా వెళ్దామా. ఎందుకంటే ఇప్పటి సినిమాలు అన్నీ horror పుట్టిస్తున్నాయి. మనిద్దరికీ శ్మశానం feel కూడా వచ్చేస్తుంది” అన్నాడు. దానికి భేతాళుడు ”వద్దు నా మీద ఏమైనా కోపం ఉంటే, పొమ్మంటే పోతాను, శ్మశానం కంటే భయంకరమైన విషయాలు నాకు చెప్పకు”అన్నాడు.”అయితే దేని మీద కథ చెప్తావు” అని అడిగాడు విక్రమ్.” నువ్వు అవసరం అన్నావు కదా, అవసరం కోసం ఎవరినైనా వంచించగలిగే సూచిత్ త్యాగి కథ చెప్తాను విను”అని భేతాళుడు కథ చెప్పడం మొదలెట్టాడు.
Bus stop లో wait చేస్తున్న నీలమ్ కి తన boy friend వస్తున్న జాడ కనపడటం లేదు. ఎప్పుడూ late చెయ్యని అతను ఇవాళ ఎందుకు ఇంత late అవుతున్నాడో అంతు పట్టటంలేదు. నిన్న అతను ఏదో సరదా పడదాం అంటే పెళ్ళికి ముందు ఇవన్నీ తను వద్దంది. అందుకనేమో రాలేదు అనుకుంది. తనేమో bank ఉద్యోగి. మరి అతను ఇప్పుడు రికామీగా తిరుగుతున్నాడు. అతనికున్న time తనకి ఉండదు. ఇప్పటికే bank manager దృష్టిలోకి తను వెళ్లిపోయింది late comer అని. మరి ఇతనేమో అన్నీ easy గా తీసుకుంటాడు. సరే ఇంకొంతసేపు wait చేసి చూద్దాం అనుకుంది. ఆ తరవాత ఒక గంట గడిచింది. నీలమ్ కి ముందు వెనకా ఎవరూ లేరు. ఒంటరి జీవితం గడిపే ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుందో అన్నీ అనుభవించింది. కానీ ఎప్పుడూ తను గాడి తప్పలేదు. తన bank manager కూడా ఇన్నిసార్లు తనని క్షమిస్తున్నాడంటే కారణం అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్ల కాదు. కానీ ఇప్పుడున్న boy friend తన మాటలతో, చేతలతో తనని చాలా impress చేశాడు. సరే office hours అయిన తరువాత అతని ఇంటికి వెళ్ళి చూస్తే సరిపోతుందని అనుకుని auto తీసుకుని office కి బయలుదేరింది.
భర్త పోయినతరువాత కోమల్ త్యాగి తన కొడుకు మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాది. వాడు చదివినంత కాలం బాగానే ఉండేవాడు. Degree పూర్తి చేసిన తరువాత వాడు ఇంటికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో, ఏమి చేస్తున్నాడో, ఏమీ తెలియటం లేదు. ఏమైనా అడిగితే విసుక్కుంటున్నాడు. ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుండేది వీడు. భాద్యత తెలిస్తే కొంత కుదుట పడుతుంది.తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంటున్నది. వీడు వస్తే బాగుండును.  కోమల్ త్యాగి నిట్టూర్చింది
సరితా మల్హోత్రా కి నిన్న రాత్రి జరిగింది తలుచుకుంటుంటే మంచి relaxing గా అనిపించింది. తన భర్త రాకేష్ ఎప్పుడూ business పనుల మీదే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. తనకేమో ఇక్కడ local office లో in charge కింద ఉంచాడు. నిన్న interview కి వచ్చిన కుర్రాళ్లలో ఒకడు బాగా impress చేశాడు. రాత్రి office hours అవ్వగానే hotel కి వెళ్ళి అక్కడ room లో అతను తనని escort చేసిన విధానం, శారీరకంగా, మానసికంగా అతను తనతో ప్రవర్తించిన విధానం, తనకి ఎంతో నచ్చింది. అతనిని office లో పెట్టుకుంటే తనకి అన్నీ రకాలుగా ఉపయోగపడతాడు.  ఇన్నాళ్ల బట్టీ life లో ఉన్న vacuum పోతుంది అనుకుంటూ కార్ start చేసి office వైపు పోనిచ్చింది.
రాజేష్ తన friend కోసం wait చేస్తున్నాడు. వాళ్ళ వీధి కోసన ఉండే ఇంట్లో ఉండే తన ఫ్రెండ్ చాలా కాలం నించి తన చెల్లెలితో చూపుల సందేశాలు నడపడం తన దృష్టిని దాటి పోలేదు. వాడు నిన్న నాకు ఉద్యోగానికి అవసరం రా అని కొంత డబ్బులు అడిగాడు. తన చెల్లెలి పెళ్లి కోసం ఉంచిన డబ్బుఉంది అని చెప్పడంతో నీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటాను నాకు ఇప్పుడు నువ్వు సాయం చెయ్యి, ఉద్యోగం రాగానే పెళ్లి అని confident గా చెప్పడంతో ఆ డబ్బు తీసి ఇచ్చాడు. ఇవాళ వాడు ఇంకా కనపడలేదు. ఏం జరిగుంటుందో, ఎప్పుడు వస్తాడో ఏంటో అని తన ఇంటి ఎదురుగా ఉండే బడ్డీ కొట్లో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు.
సోనాలీకి గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. తన తండ్రి పెద్ద business magnet. అయనకి తెలియకుండా తను పెళ్లి చేసుకోబోతుంది. ఇవాళే registrar  office లో పెళ్లి. ఇంట్లోంచి తన నగలు, కొంత డబ్బు pack చేసుకుని బయలుదేరింది. ఇంకొద్ది గంటలు అంతే. తరువాత సినిమా లో చూపించినట్టు అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళి daddy కి పరిచయం చేస్తుంది. అతను కూడా smart. ఇన్నాళ్ళు తను అడిగినదేదీ daddy కాదనలేదు. ఇది కూడా కాదనడని తనకి తెలుసు.
Registrar office దగ్గిర నిల్చున్న సూచిత్ త్యాగి ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. ముందు నీలమ్ తో జీవితం అనుకున్నాడు. కానీ సోనాలీ కలిసిన తరువాత life లో security ఉంటుందనిపించింది. నీలమ్ తో అయితే తను middle class కిందే settle అవ్వాల్సి వస్తుంది. అదే సోనాలీ అయితే ఒక్కతే కూతురు. పెళ్లి చేసుకుంటే సోనాలీ తండ్రి కూడా కాదనడు. ఇంక సరిత తో తన setup అలా సాగుతుంది. ఒకసారి పెళ్లైతే రాజేష్ డబ్బులు తీర్చేస్తే వాడు కూడా ఏమీ అనుకోడు. వాడి చెల్లితో చూపులే తప్పిస్తే commitment ఏమీ లేదు. అప్పుడు తన తల్లి గురించి ఆలోచించొచ్చు. ఇంకొద్ది గంటలు అంతే. తను ఎవరినీ మోసం చేయలేదు. ఇవన్నీ అవసరానికి ఏర్పడ్డ సంబంధాలు. నీలమ్ కూడా ఏముంది. తరువాత ఎవరినో చూసుకుని settle అయిపోతుంది.
ఇంతవరకు కథ చెప్పి భేతాళుడు ఆగాడు. విక్రమ్ ప్రశ్నార్ధకంగా చూశాడు కథ అయిపోయిందా ఏంటి అన్నట్టు. భేతాళుడు లేదు ఇంకా ఉంది అన్నట్టు సైగ చేసి కంటిన్యూ చేశాడు.
ఆ తరువాత సంఘటనలు చాలా తొందరగా జరిగాయి. సోనాలీ ని పెళ్లి చేసుకున్న త్యాగి ని సోనాలీ తండ్రి ఇంట్లోకి రానిచ్చాడు ఇల్లరికం రావాలనే ఒక షరతుతో. కొన్ని రోజుల తరువాత ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతని ఇంటికి చేరిన నీలమ్ కి ఆ ఇంటికి తాళం వేసుండడంతో enquiry చేసుకుంటూ రాజేష్ చెల్లెలి విషయం రాజేష్ ద్వారా తెలిసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. నీలమ్ వ్యవహారంతో అనుమానం వచ్చిన రాజేష్ ఆరా తీస్తే త్యాగి వేరే పెళ్లి చేసుకున్నవిషయం తెలిసి, అతనింటికి వెళ్తే, అక్కడ సోనాలీ రాజేష్ ద్వారా త్యాగి విషయం తెలుసుకుని అతనితో తెగ తెంపులు చేసుకుంది. సోనాలీ తండ్రి త్యాగిని ఇంట్లోంచి బయటకి గెంటేశాడు. ఉన్న డబ్బులు కూడా పోయాయి అని తెలుసుకున్న రాజేష్ తన చెల్లెలికి వేరే సంబంధాలు వెతకడం మొదలెట్టాడు. తరువాత కొన్నాళ్లు సరిత దగ్గిర పనిచేసిన త్యాగిని, తన సరదా తీరడంతో, సరిత కూడా తన security ఆలోచించుకుని త్యాగిని ఉద్యోగంలోంచి తీసేసింది. ఇంటికి తిరిగి చేరిన త్యాగికి తన తల్లి కనపడకపోవటంతో ఇరుగుపొరుగు వాళ్ళని కనుక్కుని ఎట్టకేలకు తన తల్లి చేరిన old age  home చేరేసరికి తల్లి మరణించిన వార్త విని బాధపడ్డాడు. నీలమ్ ఎప్పటికప్పుడు త్యాగి గురించి కనుక్కుంటూనే ఉంది. ఇలా ఆరు నెలలు గడిచిన తరువాత తిరిగి ఉద్యోగాల వేటలో bus stop కి చేరిన త్యాగికి నీలమ్ కనపడింది. త్యాగి తననే సమీపిస్తుండడంతో అతని వైపు భావరహితంగా చూసింది.
మళ్ళీ భేతాళుడు ఆగాడు. విక్రమ్ ఇప్పుడేంటి అన్నట్టు చూశాడు. భేతాళుడు అడిగాడు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”.  విక్రమ్ నవ్వాడు – “నువ్వు త్యాగి జీవితం మీద question వేస్తావు అనుకున్నాను. నీలమ్ గురించి అడుగుతున్నావు” అన్నాడు. సరే ఏదో ఒకటి చెప్పు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”. విక్రమ్ అన్నాడు” అసలు కథలో stuff లేదు భేతాళా, ఇలాటి delusions నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నావు. నీలమ్ ఏది తోస్తే అది, ఏదైనా చెయ్యొచ్చు.ఇందులో controversy ఉన్న point ఏమీ లేదే.” అన్నాడు. భేతాళుడు సర్దుకున్నాడు. “ పోనీ త్యాగి లాటి మనుషులు ఈ society కి అవసరమా”. విక్రమ్ అన్నాడు” నేనెవడిని అది finalize చెయ్యడానికి. ఈ society నించి వచ్చిన product త్యాగి. అంటే అలాటి వాడిని తయారు చేస్తున్న ఈ society కి వాడి అవసరం ఉండే ఉంటుంది. ఇందులో నన్నేమిటి చెప్పమంటావు. ఆస్థులు పంచుకుని బాధ్యత వదిలేసే కొడుకులు,కూతుళ్ళు, చిన్న చిన్న కోరికల కోసం జీవిత భాగస్వాములని మోసం చేసే సంసారులు, జీతాలు తీసుకుని పైరాబడి కోసం ఆశపడే ఉద్యోగులు, స్వంత లాభం కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టగలిగే entrepreneurs, రాజకీయ నాయకులు, అవసరం కోసం స్నేహాలు చేసే friends, అసలు ఎవడు opportunist కాదు. అందరూ అంతే. చిన్న శృతి భేదాలు. Opportunist అనేవాడు ఎవడూ లేని కాలం అంటూ ఏమైనా ఉందా. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందన్న త్రేతా యుగంలో, రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడు నవ్వితే, అక్కడ ఉన్న విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, రాముడు మిగతా పరివార జనాలే కాదు ఆఖరికి సీత కూడా తల వంచుకుందిట. వాళ్ళల్లోని opportunist ని చూసి లక్ష్మణుడు నవ్వాడని. ఏ కాలంలో opportunist లు లేరు భేతాళా? ” “అయితే నువ్వు opportunist ని సమర్ధిస్తావా” అని అడుగుదామనుకున్న భేతాళుడు  ఆవేశంగా సాగుతున్న విక్రమ్ ఉపన్యాసం తో గాభరాపడి conclusion తీసుకోకుండా, చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు.  

Thursday, June 21, 2012

Kotta Bhetala kathalu -Ramakrishna the Dreamer




పట్టువదలని విక్రమ్ తన laptop తీసి అందులో భేతాళ శవం తాలూకు details కోసం surfing మొదలెట్టాడు. Google search లో భేతాళ శవం అని type కొట్టగానే ఆంధ్ర communist వరవరరావు వ్రాసిన కవిత open అయ్యింది.అది చదువుతూ కాసేపు కూర్చున్నాడు. ఆ కవితలో అదేదో lockup శవం అనగానే విక్రమ్ కి అనుమానం వచ్చింది తను police stations చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని. మళ్ళీ తను శవాన్ని తీసుకుపోవడం, మళ్ళీ తనకి మౌనభంగం అవ్వగానే శవం ఏ mortuary లోకో, చెట్టు మీదకో పోవడం తో విసుగెత్తి, విక్రమ్ కి తెలియకుండా భేతాళుడు ఈ sequence break చెయ్యడానికి శవాన్ని ఎక్కడో దాచేసి ఉంటాడనిపించింది. అసలు ఇన్నాళ్ళు “ఈ శవాన్ని వెతకడం, మొయ్యడం , అది మళ్ళీ మాయమవ్వడం” ఈ confusion లో పడి అసలు తనకి శవం అవసరం ఏమిటో మర్చిపోయాడు. ఎవడికి కావాలి ఈ శవం, అసలు ఈ గొడవ అంతా ఎందుకూ? ఎంచక్కా ఏదైనా pub కి వెళ్ళి ఒక chilled beer తాగి అప్పుడు ఆలోచిద్దామని తన Toyota car తీసుకుని pub కి వెళ్ళాడు. అక్కడ beer order చేసి కూర్చున్నాడు. “Yes విక్రమ్ ఏంటి సంగతి –శవాన్ని వదిలేసి నువ్వే శవం అయిపోడానికి ఏదో తాగుతున్నట్టు ఉన్నావు –శవాల వేట మానేశావా ఏంటి” అని ఒక గొంతు వినిపించింది. విక్రమ్ కి అర్ధం అయ్యింది అది భేతాళుడి గొంతే అని. తను తాగుతున్న మందు glass మీద నుంచి దృష్టి మరల్చకుండా “ఈ శవాన్ని మోసే అవసరం నాకు లేదు, నేను ఎందుకు మోస్తున్నానో నాకే తెలియదు. నువ్వేదో కథ అంటావు, జవాబు చెప్పగానే అది మాయమైపోవడం. నాకేమో శవాన్ని మోస్తూ కథ వినడం ఎందుకు, మోత దండగ. ఇప్పటి నించి నువ్వు కథలు చెప్పు నేను జవాబులు చెప్తాను. శవం గోల వదిలేద్దాం , అవును నీకేమైనా కావాలా తాగడానికి అన్నాడు. అప్పుడు భేతాళుడు “ok so be itlet me also have one chilled” అని తన గ్లాస్ కూడా నిండగానే ఒక గుక్క తాగి కథ start చేశాడు.
రామకృష్ణ నవ్వుకున్నాడు. అతని చేతిలో ఆనాటి దినపత్రిక రెపరెపలాడింది. ప్రజలు మూర్ఖులు. వీళ్ళు ఎవరైతే తమని దోచేస్తారో వాళ్ళకే ఒట్లేసి గెలిపిస్తారు. లేకపోతే ఈ జనాలు ఒక CM కోసం చావడం ఏమిటి. వాడి కొడుకు black money మీద enquiry వేయించిన ఇంకో black money party ని ఓడించి వాడి కొడుకుని గెలిపించడమేమిటి. ఈ పత్రికల వాళ్ళు వాడిని ఆకాశానికి ఎత్తడమేమిటి. ఉన్న రాజకీయ పార్టీలన్నీ ex –CM కొడుకు party లాటివే. ఎవడిని గెలిపించాలి, గెలిపించకూడదు అని కూడా వదిలేస్తే అసలు “ఈ ప్రజలు” - వీళ్లకేమి కావాలో వీళ్లకే తెలియదు. కానీ తనకి తెలుసు. అందుకే Orissa border దగ్గర మొదలుపెట్టిన తన “ఆంధ్రా cycle యాత్ర” లో రకరకాల గ్రామాలు సందర్శించి, అక్కడి ప్రజలకి నిజాన్ని తెలియబరుస్తూ సాగుతున్నాడు. ఈ జనాలని చైతన్యపరిచి ఈ క్షుద్ర రాజకీయాల నడ్డి విరవాలి. ఈ సమాజంలో ఒక విప్లవం రావాలి. అందుకు ఈ cycle యాత్ర ఒక మైలురాయి కావాలి. దీనికి prologue లో రామకృష్ణ “The motor cycle diaries” పుస్తకం చదువుతున్నాడు. “Ernesto Che Guevara” అంటే అతనికి విపరీతమైన అభిమానం ఏర్పడింది.
విక్రమ్ కి విసుగొచ్చింది, భేతాళుడితో” నువ్వు కూర్చున్న place కి, తాగుతున్న మందుకి, ఇప్పుడు చెప్తున్న కథకి ఏమైనా match అయ్యిందా. ఉన్న mood పాడు చెయ్యడం కాకపోతే” అన్నాడు. అప్పుడు భేతాళుడు “ఏం బాబు విప్లవం కథలు bar లో వినకూడదని ఏమైనా rule ఉందా “కథ చెప్తున్నాను కదా –cool గా మందు కొడుతూ విను –లేకపోతే మళ్ళీ శవం మోస్తూ వింటావా  -అది నీ ఇష్టం” అన్నాడు . విక్రమ్ అయిష్టంగానే వినడం మొదలెట్టాడు.
ఎలాగైతే Che Guevara motorcycle మీద తిరుగుతూ జీవితానికి ఒక అర్ధం కనుక్కున్నాడో అలాగే తను cycle మీద తిరుగుతూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని బయలుదేరాడు. ఎంత వరకు సాధిస్తాడో కాలం నిర్ణయిస్తుంది. ముందుగా సోంపేట లో చిన్న బడ్డీకొట్టు meeting పెట్టాడు. అప్పుడు అక్కడ 2640 MW coal based power plant పెట్టకూడదని జనాలు ఆందోళన జరుగుతున్నది. కాకరాపల్లి, సోంపేట power plants కి environmental clearance ఎవరు ఇచ్చారు. ఆ factory లు అక్కడ పెడితే అక్కడి నీటిలో arsenic, lead లాటి విష పదార్ధాలు పెరిగిపోయి జనజీవితాలు అస్తవ్యస్తమైపోతాయని జనవాక్యం. ఆ బడ్డీకొట్టు meeting లో రామకృష్ణ government ని దాని policies ని తూర్పార బట్టాడు. జనాలు మౌనంగా విని టీ తాగడం అవ్వగానే “బాగా చెప్పావు బాబు” అని రామకృష్ణ తో అని వెళ్ళిపోయారు. రామకృష్ణ కి బోలెడంత ఉత్సాహం వచ్చింది. Yes ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అని అలా ముందుకి సాగాడు. విజయనగరం చేరగానే అక్కడ పరిస్థితి ఆరా తీశాడు. అక్కడ Centre లో ఉన్న ruling party తాలూకు ఆంధ్ర local party chief , CM ఇద్దరు liquor scam అని ఒకళ్ల మీద ఒకళ్లు బురద చల్లుకుంటూ పత్రికల ద్వారా బండబూతులు తిట్టుకుంటూ కనపడ్డారు. వెంటనే రామకృష్ణ అక్కడ cinema hall  బయట ఉండే వెరుశెనగబడ్డీ దగ్గిర తన వాక్ప్రవాహంతో జనాల్ని కట్టి పడేశాడు. అసలే NTR భీష్మ సినిమా ఆడుతోంది. మంచి ఓపిక మిగిలిపోయిన ముసిలివాళ్ళందరూ చూడటానికి వచ్చారు. అంతా విన్న ఇద్దరు మూసిలాళ్ళు మాకు వినబడటంలేదు,కొంచెం గట్టిగా చెప్పమన్నారు. రామకృష్ణ వాళ్ళ స్వార్ధరహిత కుతూహలాన్ని గమనించి మరింత ఉత్సాహంతో గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టాడు. ఇంకొక మూసిలాయన “గొంతెడిపోద్ది బాబూ, సోడా తాగు“ అని సోడా కూడా ఇప్పించాడు. అలాగ అక్కడినించి విశాఖపట్నం చేరే సరికి అక్కడ ఒక super land scam గురించిన వార్త చదివాడు. VUDA వాళ్ళు అప్పుడే ప్రపంచాన్ని చూసినట్టు” ఏమిటి ఋషికొండ, మధురవాడ, ఎండాడ, పరదేశిపాలెం, కూర్మన్నపాలెం, పేదవాల్టేర్ ఇన్ని చోట్ల భూ కబ్జానా” అని ఆశ్చర్యపోవడం –VUDA vice chairman, మినిస్టర్ అందరూ enquiry జరిపిస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ చదివి రామకృష్ణ ఉడికిపోయాడు. ఎవరి సొమ్ముని ఎవరు తినేస్తారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అని VUDA ఆఫీసు బయట బజ్జీ  తయారు చేసేవాళ్లకి, xerox shop వాళ్ళకీ హోరాహోరీ వివరించాడు. వాళ్ళు కూడా RTO office shift చెయ్యడం నించి కలిగిన సాధకబాధకాలు అవి చెప్పుకుని బాధపడ్డారు. ఇలాగే గోదావరి జిల్లాల్లో liquor scam లు,bank fraud లు వీటి మీద ఉపన్యసించి గుంటూరు చేరేసరికి అక్కడ ఇందిరమ్మ housing scam లు, దేవాదాయ భూముల scam, ఆఖరికి నీళ్ళలో కలిపే Alum కూడా scam చేసేస్తుంటే బాధ భరించలేకపోయాడు. నెల్లూరు,చిత్తూర్, కడప లో జరుగుతున్న భూ కబ్జా,  money circulation & laundering, micro financing scam లు,  మహబూబునగర్ లో counterfeit currency, mining scam లు ఇవన్నిటి మీద వేరు వేరు ప్రదేశాలలో మాట్లాడి హైదరాబాద్ చేరేసరికి ex – CM కొడుకు ఓదార్పు యాత్ర ముగించి black money scam ని handle చేస్తున్నాడు. ఇవే కాకుండా national level లో Raja spectrum scam,  Laloo fodder scam, Harshad Mehta share market scam, Telgi stamp papers, Bofors, Common wealth games scam etc., ఇవీ చాలావన్నట్టు question paper కొనేసి పరీక్షలు రాయించే schools, colleges వల్ల చదువుల్లో కూడా scam అయిపోయి భావి తరాలు నాశనమౌతుంటే  రగిలిపోయిన రామకృష్ణ టాంక్ బండ్ మీద నిలబడి తనలోని ఆవేశాన్ని, విప్లవాన్ని కలగలిపి చెప్తూ ఉంటే, ఆ ప్రవాహానికి ప్రజలు మా leader నువ్వే అని హారతి పడుతుంటే, ఇంతలో police van వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి దిగిన పోలీసులు జనాలని చెదరగొట్టి రామకృష్ణ ని jail లో పడేశారు. అప్పుడు అతని లోని Che Guevara విజృంభించి ధనమదాంధులైన బూర్జువా పాలక వర్గం కీళ్ళు విరిచే విధంగా guerilla warfare start చేశాడు.
“రామకృష్ణా” అన్న పిలుపుతో తనున్న upper primary school 8th std లో ఈ లోకం లోకి వచ్చిన రామకృష్ణ మాస్టర్ class వైపు నిర్వేదంగా చూశాడు. Principal తన వైపు తీక్షణంగా చూస్తుండడంతో, తడబడుతూ “చెప్పండి సార్ “అన్నాడు. అప్పుడు Principal “చూడు రామకృష్ణా, మీ నాన్న మంచి దేశభక్తుడు, నాకు close friend. అందుకే నువ్వేన్ని సార్లు class room లో నిద్రపోతున్నా నిన్ను క్షమిస్తున్నాను. నీ emotion నాకు తెలుసు. Class room లో నిద్రపోయి కొన్ని సార్లు నువ్వు పిచ్చి పిచ్చిగా కలవరించావు. అప్పుడు నాకు అర్ధం అయ్యింది. ప్రపంచం గోల మనకెందుకయ్యా. ముందు class ముగించి ఇంటికి నడు. ఇంట్లో కూడా రాత్రుళ్లు నిద్రలో పెద్ద పెట్టున అరుస్తున్నావట. ఎవరైనా మంచి doctor కి చూపించుకో” అని ఒక ఉచిత సలహా పారేశాడు. రామకృష్ణ తన చూపులతోనే “మనం బ్రతుకుతున్నది ఈ ప్రపంచం లో కాదా, ప్రపంచం గోల మనకెందుకంటావు, నీకు అసలు social awareness ఉందా” అన్నట్టు చూశాడు. Principal” చూసింది చాలు, నేను చెప్పింది చెయ్యి ”అని వెళ్లిపోయాడు.
ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమ్ వైపు చూశాడు. అప్పుడు విక్రమ్ “కథ బాగుంది ఇంతకీ నీ question ఏంటి అది చెప్పి తగలడు” అన్నాడు.భేతాళుడు “రామకృష్ణ ఏమి చేస్తే correct” అని అడిగాడు. దానికి విక్రమ్ “ఏడ్చినట్టే ఉంది నీ question. రామకృష్ణ దేశభక్తుడి కొడుకు, బడిపంతులు కాబట్టి కలలు కంటున్నాడు. అదే businessman అయితే ఇలాటి కలలు కంటాడా. వాడికి పని తప్పితే ఆలోచించడానికి కూడా తీరిక ఉండదు. కలలు కనే outlet కూడా లేకపోతే రామకృష్ణ కి పిచ్చి ఎక్కుతుంది. మనిషి ఆశాజీవి కాబట్టి రామకృష్ణ కలలు కనడమే ఉత్తమం. ఇప్పుడున్న ప్రపంచంలో విప్లవాలు రావాలంటే ఇంకా పాకం బాగా ముదరాలి. అప్పుడు రామకృష్ణ కి జీవితం నిత్యసమరమైపోయి కలలు కనే అలవాటు, ఆలోచించే ఓపిక రెండూ పోతాయి. ఇంతేనా ఇంకేమైనా ఉందా” అన్నాడు. విక్రమ్ మందు పూర్తి చేసేలోపల భేతాళుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు.

Tuesday, June 19, 2012

New Poetry - 16

Catharsis



ఒకసారి ప్రపంచమంటావు ఒకసారి మనుష్యులంటావు
వేదాంతం ఒకసారైతే ఒకసారి సంగతులంటావు
కనపడేది, వినపడేది కనపడకుండా కదిలించేది
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు

అంతరంగాన్ని అంతరిక్షాన్ని కలిపి శోధించానంటావు
విడదీసి  పెనవేసి రెండిటిపై పట్టు సాధించేనంటావు
ఎందుకీ ఎగురుడు సామీ నీకేమి రహస్యం తెలుసని
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు

ఇంతమంది, ఇంత మేధ, ఇంత క్రాంతి, ఇన్ని వెలుగులు
అంత సులువుగా తేలేదైతే ఇన్నాళ్ళు ఎందుకాగిందంటావు
ప్రపంచ పరిణాహంలో ప్రస్థానమెటో తెలియని జీవుల కథ
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు

ఎందుకయ్యా అంత తపన అందరూ గుర్తించాలనా
కవ్వించి ఊరించే ఘనకీర్తికాంత నిన్నే వరించాలనా