Inflation is general rise
in the level of prices and services over a period of time. అసలు Inflation కి వేరు వేరు కాలాలలో వేరు వేరు definitions ఉండి, ఇప్పుడు ఈ ముందు చెప్పిన definition “పరిమిత కాలంలో నిత్యావసర సరుకుల, వినిమయ వస్తువుల, సేవల లేదా స్థిరాస్తుల ధరల తాలూకు పెరుగుదల” ని inflation అంటున్నారు. దీన్ని control చెయ్యడంలో economy
తాలూకు ఆరోగ్య పరిస్థితి బయట పడుతుంది. ఇది ఎంత తక్కువలో స్థిరంగా
ఉంటే అంత మంచిది. దీన్ని అదుపులో ఉంచగలిగితే రూపాయి విలువ పెరుగుతుంది. నాకు
తెలిసినవేంటంటే
1.
దిగుమతి తగ్గించి ఎగుమతి పెంచాలి – ముఖ్యంగా దిగుమతి
చేసుకునేది oil products కాబట్టి అవి తగ్గించాలంటే alternate energy
sources మీద దృష్టి పెట్టాలి –ఉదాహరణకి solar energy, wind energy ని use చేసుకోవచ్చు.
దీనికి technology improvement & implementation అవసరం. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు ఎందుకంటే alternate use చెయ్యడం మొదలెడితే ఎంతో మంది vested interests దెబ్బతింటాయి.
వాళ్ళు పడనివ్వరు.
2.
మనవాళ్లు మన దగ్గిర ఉన్న dollar reserve అమ్మేసి
తాత్కాలికంగా రూపాయి విలువ పెంచొచ్చు. కానీ తరువాత imports కి
కట్టడానికి foreign exchange reserve తగ్గిపోతే కష్టం. So
అదీ immediate గా జరగదు.
3.
ఏవైతే company లు dollar accounts maintain చేస్తున్నాయో అవి ఆ dollars ని rupees లోకి convert చేసి మన market లోకి
pump చెయ్యాలి. వాళ్ళు చెయ్యరు.
4.
Government కానీ company లు కానీ రూపాయి విలువ తగ్గినప్పుడు తీసుకున్న అప్పులు తీర్చకూడదు.
పెరిగినప్పుడు తక్కువ రూపాయిలతో ఎక్కువ అప్పు తీర్చొచ్చు. అప్పిచ్చిన వాడు
ఊరుకుంటాడా ఊరుకోడు.
5.
మన company లకి విదేశాల్లో అప్పులు చెయ్యడానికి rules
లో వెసులుబాటు కల్పించాలి. అప్పుడు వాళ్ళు ముందు అప్పు తీసుకుని
రూపాయి బలపడ్డప్పుడు అప్పు తీరిస్తే సారి. మరి రూపాయి విలువ తరువాత ఇంకా పడిపోతే ఆ
company పరిస్థితి? అది company
తాలూకు policy మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వరకు
జరుగుతుందో తెలియదు.
6.
Government విదేశీ పెట్టుబడిదారులని
ఆకర్షించి ఎక్కువ పెట్టుబడులు పెట్టించాలి. అప్పుడు కొంత ఆగుతుంది కానీ control
ఇంకోడి చేతుల్లోకి వెళ్లిపోతుంది. Already వెళ్లిపోయింది, ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే అది కూడా పోతుంది.
7.
మనవాళ్లు agriculture production పెంచి నిత్యవసర
సరుకుల ధరలు తగ్గించి, తద్వారా ప్రజలకి ఒక awareness తెచ్చి, ఇంకా మన మేధావులు వలస పోకుండా ఆపి, కొత్తగా వస్తున్న technology ప్రజల శ్రేయస్సుకి
ఉపయోగించి విదేశాలు కూడా మన technology మీద ఆధారపడేలా చేసి
మన సరుకుల నాణ్యత పెంచి etc.,
అంటే ఎవడూ రూపాయి పడిపోవడాన్ని ప్రస్తుత పరిస్థితులలో
రక్షించలేడు.
కానీ మనం రక్షించొచ్చు. గాంధీ గారి style. విదేశీ కంపెనీలు తయారుచేసిన సరుకులు వాడకూడదు. ఇది కొంత వరకు రూపాయి
పడిపోకుండా కాపాడుతుంది. చెయ్యొచ్చు. ఈ సలహా face book, twitter account ఉన్న ప్రతి
భారతీయుడికి తెలుసు. “If you love India please share” అని
ఎవడో అంటాడు, తెగ share చేసుకుంటారు.
ఎవడూ follow అవ్వడు. అసలు ఏంటి మన national
psychology అని ఎవడికైనా doubt వస్తుంది. ఈ history
duping గురించి నాకు తెలిసిన మరో రెండు మూడు సంగతులు చెప్పుకుని
అప్పుడు psychology మీద పడదాం.
నా inference ఏంటంటే ఏ దేశమైన ఒక limit తరువాత saturate
అయిపోతుంది. పెరుగుతున్న జనాభా కి తగ్గట్టుగా వనరుల ఉత్పత్తి
పెంచుకుంటూ పోతే, కరువు ఉండదు. జనాభా అదుపులో ఉంటే పరవాలేదు.
కానీ మన ఉత్పత్తి కంటే వాడకం ఎక్కువ అయితే అప్పుడు కష్టం. ఎప్పుడైతే మన దగ్గిర
సరుకులు అయిపోతాయో అప్పుడు పక్కవాడివి కూడా మనం తినడం మొదలెట్టాలి. Ecological
balance ఎలా maintain అవుతుందో అదే principle
economic balance కి కూడా. ఇది అమెరికా,UK,
ఆస్ట్రేలియా, జర్మని వంటి ఆగ్ర రాజ్యాలు ఎప్పుడో
గుర్తించాయి. అందుకే వారి దేశం కొంత సౌకర్యంగా ఉండడానికి మిగతా దేశాల economy
ని చప్పరించుకుని తినేస్తాయి. అన్ని రకాల bullying
techniques ఉపయోగించి USA తన ఆధిక్యం ఈ రోజు
నిలబెట్టుకుంటున్నది. మన మీద వాళ్ళ పరిస్థితి మెరుగే కానీ వాళ్ళ దగ్గిరా పూర్తి solution
లేదు. Canada వెళ్ళిన నా friend చెప్పాడు. Medical facilities USA కంటే Canada
లో బాగుంటాయి, insurance లేకపోతే USA లో ఏదైనా treatment ఖర్చులు తట్టుకోలేము అని. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వేరే దేశాలలో వాళ్ళు
జరిపే మారణకాండలు ప్రపంచమంతా తెలుసు. కానీ అందరికీ ఒక భయం. ఒక stand తీసుకోడానికి భయం. నిజం నిర్భయంగా చెప్పడానికి భయం. మన దేశం వాళ్ళు ఏమి
తక్కువ కాదు. ఈ USA example తో మనవాళ్లు శ్రీలంకలో
ప్రదర్శనకి దిగితే వాళ్ళు తరిమి కొట్టేరు, LTTE ని. మరి దీని అర్ధం ఏంటి అంతే “చీమా కుడుతుంది, పామూ
కుడుతుంది. చీమ కుడితే మనం చీమను చంపుతాము. అదే పాము కుడితే మనము చస్తాము”. ఇది
ప్రపంచం. Survival of the fittest అంతే. మరి ఇందులో duping
ఎంటయ్యా అంటే చెప్పేది ఏంటంటే, media లో ప్రచారం జరిగేది ఒకటి. అసలు ఆంతర్యం ఇంకోటి.
Russia perestroika
తరువాత ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇది కొంత వాళ్ళ స్వయంకృతం, communism లో ఉన్న loopholes, మిగిలింది వాటిని exploit చేసే sam పెద్దన్న ఆశీర్వాదమేనని నా నమ్మకం. Russian history గురించి
next post లో.
సశేషం