విక్రమ్ కి ప్రస్తుతం చాలా bore కొడుతోంది.
శవాల వేటలో శ్మశానం వెళ్లినప్పుడు, భేతాళుడి కథలు
వింటూ బుర్రకి పదును పెట్టడం లో ఉన్న మజా ఇప్పుడు దొరకటం లేదు. జీవితానికి
సంబంధించి ఏదో వెలితి feeling. ఒక ధ్యేయం లేకుండా పోయిందన్న బాధ. తన Laptop
తీసి net open చేసి ఏదో చూద్దామని ప్రయత్నించాడు. కానీ అదీ
చిరాకనిపించింది. ప్రతీసారి భేతాళ కథలతో చిరాకుపడే తనకి, మొదటి
సారి భేతాళుడు తనకి ఎంత అలవాటుగా మారాడో తెలిసి వచ్చింది. ఎక్కడున్నావు భేతాళా
అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా భేతాళుడు ప్రత్యక్షం అయ్యాడు. అతన్ని చూడగానే
విక్రమ్ కి ఎంతో relief అనిపించింది. అప్పుడు భేతాళుడు “నువ్వు నాకు ఇంకేమీ explain
చేయొద్దు. నాకు నీ పరిస్థితి అర్ధం అయ్యింది. నీకు Philosopher అలౌకికానంద
కథ చెప్తాను విను” అన్నాడు. అప్పటిదాకా తన ముఖం మీద miss అయిన
చిరునవ్వుని వెనక్కి తెచ్చుకున్న విక్రమ్ మరేమీ ప్రశ్నలు వేయకుండా కథ వినడానికి ready
అయిపోయాడు. భేతాళుడు చెప్పడం మొదలెట్టాడు.
ఆశ్రమంలో జ్ఞ్యానబోధ చెయ్యడానికి ఉపక్రమించాడు ఆలౌకికానంద స్వామి .
శ్లో: హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌంతేయా యుధ్ధాయ కృతనిశ్చయః
తా: ఓ కౌంతేయా రణరంగమున మరణించినచో వీరస్వర్గం పొందేదవు. యుధ్ధమున జయించినచో
రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడివై యుధ్ధమునకు లెమ్ము.
విరక్తి చెందిన రామరావు కూడా జనాలలో ముందు వరసలో ఉన్నాడు. “Yes యుధ్ధం
ఆపకూడదు” అనుకున్నాడు. ఎలాగైనా మళ్ళీ ఆ సుఖాలన్నీ పొందాలంటే వదలకూడదు. మంచి
ఉద్యోగం సంపాదించాలి. కానీ రావటం లేదే...ఎలాగ?
శ్లో: కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా
మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగో౭స్త్వకర్మణి
తా: కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఎన్నటికీ దాని
ఫలములయందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానరాదు.
ఫలాపేక్షరహితుడవై కర్మలనాచరింపుము.
నిజమే అనిపించిది. ఇందాక వీర స్వర్గం, రాజ్య
భోగం అని అర్జునుడిని tempt చేసిన కృష్ణ పరమాత్మ ఫలాపేక్ష వదలమంటాడే. ఫలాపేక్ష వదిలేస్తే
జీవితంలో ఏదైనా ఎందుకు చెయ్యాలి అనిపించింది. పోనీ ప్రయత్నం చేస్తూ కూర్చుంటే,
ఉద్యోగం రాకపోతే, పరిస్థితులు మారవు. ఎలాగ ...?
అనిపించిందే తడవు ఈ ఆశ్రమానికి రావడానికి ముందు జరిగినవి ఆలోచనలో మెదిలాయి.
“ రామారావు కి జీవితం మీద bore కొట్టింది.
ఎంతసేపు ఉద్యోగం, పెళ్ళాం పిల్లలు, డబ్బులు,
ఆరోగ్యాలు ఇవన్నీ చూసుకుంటూ గడపడంతోనే రోజు తెల్లారిపోతుంది. చాలీ చాలని జీతం,
పెళ్ళాం కోరికలు తీర్చలేక గొడవలు, పిల్లల కోరికలు తీర్చలేక విరక్తి- జీవితం లో సుఖం
కనపడలేదు. ఇంకా ఏదో కావాలి, ఏదో జరగాలి, ఏదో variety
ఉండాలి. ఇలాగ అనుకుంటూ office కి బయలుదేరాడు.
తను office లో అడుగు పెట్టాడో లేదో Manager నించి
కబురు. ఈసురోమని boss room లో దూరాడు. అక్కడ వినవలసిన music విని,
వేయించుకోవలిసిన అక్షింతలు వేయించుకుని బ్రతుకు జీవుడా అని బయట పడ్డాడు.
ఇంతకీ Manager చెప్పినదేమిటంటే official tour మీద Odisha
mines కి వెళ్ళి రావాలి. ఆలోచించి చూస్తే Odisha
వెళ్ళడమే better అనిపించింది. ఈ routine నించి విముక్తి.
అలాగ Odisha వెళ్ళిన రామరావుకి అక్కడ గిరిజనుల నించి బోలెడంత గౌరవ
మర్యాదలు, కావల్సిన సేవ సత్కారాలు,
శారీరిక సుఖాలు అన్నీ లభించాయి. అక్కడ సరుకులు తెచ్చి పట్నంలో అమ్ముకొని సొమ్ము
చేసుకోవడం, ఇక్కడ office లో bore కొట్టగానే ఏదో పేరు చెప్పి mines తనిఖీ
అని వెళ్ళడం, రామారావు కి జీవితం తిరిగి వచ్చినట్టు అయ్యింది.
అలాటి సందర్భంలో రామరావు మేనేజర్, రామరావుకి
శిఖండిలా తయారు అయ్యాడు. ఆ Mines దగ్గర వాటాలు, అమ్మాయిల
గొడవల్లో ఇద్దరు ఢీ అంటే ఢీ అనే పరిస్తితి వచ్చి Manager పుణ్యమా
అని రామరావు ఉద్యోగం పోయింది. ఆ తర్వాత రామరావు ఎన్నో ఉద్యోగాలు మారాడు. మరి ఆ mines
లో ఉండే kick , సుఖం దొరకలేదు. మారుతున్న ఉద్యోగాల సంఖ్య పెరిగిపోవడం
మొదలెట్టింది. అలవాటైన సుఖం లేని, మళ్ళీ మొదటికే వచ్చిన జీవితం.
ఈ నరకం నించి పారిపోవాలా లేక చచ్చిపోవాలా? నిస్పృహతో
నడుస్తూ ఎదురుగా కనిపించిన ఆశ్రమంలోకి నడిచాడు.”
ముందు వరసలో కూర్చుని విన్న రామరావుకి కోరికలని వదిలేస్తే జీవితంలో
ఏం చెయ్యాలి అనిపించింది.
ఇంతలో ప్రవచనం ముగిసింది. భక్తులు ఒక్కొక్కరే కానుకలు
సమర్పించుకుని వెళ్తున్నారు. అందరూ అయ్యారు. రామరావు మిగిలాడు. స్వామి
ప్రశ్నార్ధకంగా చూశారు.
రా: (అయోమయంగా ఆలోచిస్తూ భక్తిగా) స్వామీ
స్వామి: (విశాలంగా చిరునవ్వుతూ) చెప్పు నాయనా
రా: ఫలాపేక్ష లేకుండా పనులు చెయ్యడం ఎలాగ స్వామి?
స్వామి: (చెదరని అదే నవ్వుతో) జరిగేది జరుగుతుంది. నీ కర్మ నువ్వు చెయ్యడమే.
రా: అలాంటప్పుడు ఏదైనా ఎందుకు చెయ్యాలి స్వామి. జరిగేది జరుగుతుంది.
స్వామి: (ఖంగుతిని మళ్ళీ సర్దుకుని) అప్పుడు నువ్వేమీ చేయకపోతే ఏం జరుగుతుందో
అదే జరుగుతుంది.
రా: జీవితం మీద విరక్తిగా ఉంది. నచ్చిందేమీ జరగదు. చావాలని ఉంది.
స్వామి: (మళ్ళీ చిరునవ్వుతో) చావు పరిష్కారం కాదు నాయనా. పుట్టినందుకు
అనుభవించవలసిందే. చచ్చినా మళ్ళీ పుడతావు. ఇందాకా చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా
వినలేదు అనుకుంటా.(గడ్డం నిమురుకుని)
శ్లో: వాసాంసి జీర్ణాని యథా విహాయా నవాని గృహ్ణాతి నరో౭పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ
తా: మానవుడు చిరిగిన పాత బట్టలను వదిలి, కొత్త
బట్టలను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వదిలి నూతన శరీరములను పొందుతుంది.
రా: (బాధగా) అంటే చచ్చినా తప్పదా స్వామి?
స్వామి: తప్పదు నాయనా.
రా: (గాభరాగా) ఇలా ఎన్ని సార్లు పుట్టాలి స్వామి?
స్వామి: కర్మ ఫలం ముగిసే వరకు.
రా: కర్మ చేస్తే పుడతాము. పుడితే కర్మ చెయ్యాలి. ఇది తేలేలా కూడా కనిపించటం
లేదు. దీనికి అంతం ఏమిటి స్వామి?
స్వామి: ముక్తి లభించేవరకు.
రా: ముక్తి అంటే ఏంటి స్వామి?
స్వామి: జన్మ రాహిత్యం నాయనా
రా: ఏమి చేస్తే వస్తుంది స్వామి?
స్వామి: సత్కర్మలు చెయ్యాలి నాయనా.
రా: ఇప్పటిదాకా నాకు అర్ధం అయినంత వరకు అవే చేస్తున్నాను స్వామి. అయినా ఏంటి?
స్వామి: (ఆశ్చర్యంగా) ఏం చేస్తున్నావు నాయనా?
రా: నేను అడగలేదు. నా తల్లితండ్రులు కన్నారు. చదివించారు. వచ్చినంత వరకు
చదువుకున్నాను. పెళ్లి చేశారు. నేను చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నందుకు నా
భార్యా బిడ్డలని పోషిస్తున్నాను. వాళ్ళ కోరికలు తీర్చటం కోసం కష్టపడుతున్నాను.
ఇవన్నీ సత్కర్మలే కదా?
స్వామి: మరి విరక్తి ఎందుకు నాయనా?
రా: ఉన్న పరిస్థితులలో ఇమడలేక. నాకు నచ్చినట్టు బతకలేక. వాళ్ళ కోరికలు
తీర్చలేక.
స్వామి: నీకు నచ్చినట్టు అంటే?
తన కథంతా చెప్పుకొచ్చాడు రామరావు . అంతా విన్న తరువాత ...
స్వామి: నీ కోరికలు విడిచిపెట్టు నాయనా
రా: అన్నీ వదిలేస్తే ఇంకా ఏమైనా చెయ్యడమెందుకు స్వామి?
స్వామి: అంతా ఈశ్వరేచ్చ. అన్నిటిని నడిపించేది వాడే. నీ ప్రతి కదలికా
ఈశ్వరానుగ్రహమే.
రా: అంటే నేనిలా ఉండడానికి కారణం ఈశ్వరుడే అయితే నాకు ఈ ఇబ్బందులు ఎందుకు
పెట్టాడు స్వామి.
స్వామి: నీ కర్మ ఫలం.
రా: నేను కర్మ చేస్తే ఆ కర్మఫలమే నేను అనుభవిస్తే మళ్ళీ ఈశ్వరుడు నడిపించేది
ఏమిటి?
స్వామి: నువ్వే ఈశ్వరుడివి.
రామరావు కి బుర్ర తిరిగిపోయింది. ఈ జిలేబీకి అంతం కనపడలేదు. ఇంకో రకంగా
తెలుసుకుందామని అడిగాడు.
రా: (కొంచెం ఆవేశంగా) ఎన్ని జన్మల తర్వాత ముక్తి వస్తుంది స్వామి?
స్వామి: ఎన్ని సత్కర్మలు చేస్తే అంత వేగంగా వస్తుంది నాయనా
రా: మరి నేను నా బుధ్ధిని అనుసరించి చేస్తున్నానే. నా
బుధ్ధి కూడా ఈశ్వరుడే అయి, నేను కూడా ఈశ్వరుడినే అయితే మరి నాకు వెంటనే జన్మరాహిత్యం
రావాలి కదా?
స్వామి: (విసుగు కనపడనీయకుండా) ఈశ్వరేచ్చ
రా: అంటే నేను ఈశ్వరేచ్చ ప్రకారం ఎన్నో జన్మలు ఎత్తి, ఎత్తి
ఎప్పటికో ఒకప్పటికి ముక్తి పొందేస్తాను. మరి ఏం చేస్తే ఏంటి స్వామి?
స్వామి: (కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి, దాన్ని
మించిపోయేలా చిరునవ్వు నవ్వి) పరమేశ్వరనుగ్రహ ప్రాప్తిరస్తు.
రామరావు కళ్ళు పొరలు లేచిపోయాయి. ఒకటే విషయం అర్ధం అయ్యింది. ఎలా కొట్టుకున్నా
తన కష్టం తానే తీర్చుకోవాలి. ఎవడూ తీర్చలేడు. చావో, బ్రతుకో
తానే తేల్చుకోవాలి. ఒక నమస్కారం పెట్టి తిరిగి పోయాడు.
ఈ discussion అయిన తరువాత ఎంతో చిరాకుతో కూర్చున్నాడు స్వామి అలౌకికానంద .
పేరులో తప్పితే అలౌకికంగా, లౌకికంగా జీవితంలో అతనికి ఆనందం దొరికినట్టు కనపడటం లేదు. ఎప్పుడూ
ఇంతే తను ఉపదేశించే దానికి, తన జీవితంలో జరిగే దానికి చుక్కెదురు. మొన్ననే ఏదో tv
channel లో interview కి వెళ్లినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పలేక
కోపం కూడా వచ్చింది. తనేమో పరిపూర్ణమైన జ్ఞ్యానం ఈ జనాలకి అందించాలని ప్రయత్నం, వీళ్ళు
తన జీవితంలో జరిగిపోయిన వాటిని తీసుకుని ప్రశ్నలు. మొన్నటకి మొన్న కామ, క్రోధ, మద,
మాత్సర్యాలు విడవాలి అని చెప్తే తన గత జీవితంలో వదిలేసిన పంకజం గురించి,
ప్రస్తుతం ఆశ్రమం పేరు మీద ఉన్న భూముల గురించి, తన competitor
స్వామి అభేదానంద గురించి అడిగితే మరి కోపం రాదా. ఇవాళ Christian
missionaries’ అని చెప్పి బొల్డు డబ్బు పెట్టి జనాలని పోగేసి కళ్ళు
వచ్చాయి, asthma తగ్గింది, రక్షకుడు కరుణామయుడు అని చెప్పి ఎంత ప్రచారం చేసినా ఎవడూ comment
చేయడు. డబ్బు మహిమ అలాటిది. వాళ్లెమో కోట్లకి పడగలెట్టడం. తను ఎంత local,
indigenous స్వామి అయితే మాత్రం తనకేమో harassment. అసలు
ప్రజలకి వేదాలు, ధర్మం అంటే గౌరవం పోయింది. తను కూడా కొద్దిగా foreigners
ని పోగేసి art of living, level of thinking అని కొద్దిగా political
propaganda కలిపితే తప్పితే ఇది కుదుటపడేలాగా కనపడటం లేదు. ఇది కాకుండా
ఈ మధ్య పురాణాల మీద టీకా, తాత్పర్యాలు చెప్పే బ్రహ్మశ్రీ లు ఎక్కువై తనకి అక్కడి
నించి కూడా stiff competition. ఈ next generation
కి అసలివేమీ పట్టటం లేదు. వీళ్ళు computers, dollars, abroad అని, అదే
తాపత్రయం. ఇలాటి conditions లో ఎలాగైనా తన సత్తా నిరూపించుకోవాలి. ఎలా?.....
ఆలోచిస్తూ కూర్చున్నాడు.