భువిలో, బూడిదలో రాసుకునే
పేరుని, నిర్వచించే సదాశయంతో
అంతులేని తీరాల జ్వలించే
ఆలోచనలలో ప్రవహించే
అనంతంలో పరిభ్రమిస్తూ
నాదపు తీవల ప్రతిధ్వనిస్తూ
పరిక్రమిస్తూ, పరిప్లవిస్తూ
కలలోనూ, కలలాంటి మెలకువలోనూ,
అంతరంగాల అగాథంలోనూ
ప్రకటింపబడే విచిత్ర చిత్రాల వెనక
సంచలించే అనంత విశ్వంలో
సంచరించే పరివ్రాజకుడిని... హరిని