అసలు ఈ Toba
catastrophe గురించి ఎందుకు చెప్పుకోవడమంటే రామకృష్ణ raise చేసిన point “ the volcanic eruptions filled the Gondwanaland with invaluable nutrients” అన్నదాని మీద clarity తీసుకోవడం కోసం.
ఈ Toba
catastrophe అంటే Toba super eruption theory. ఈ Lake Toba అన్నది
Indonesia లో ఉన్నది. 60000 నించి 70000 సంవత్సరాల
క్రితం అక్కడి అగ్ని పర్వతం బద్దలై ఒక 15 cms మందంలో volcanic ash, Indian ocean, Arabian sea, South China
sea ఇంకా వాటి మధ్యనున్న భూభాగం అంతా పరుచుకు
పోయింది. దీని వలన ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు బాగా తగ్గి ఒక volcanic
winter, Ice age లాగా
తయారు అయింది అని theory. ఇంకా దీని continuation లో Genetic
bottleneck theory అన్నది
ఒకటి ప్రచారం జరిగింది. ఈ theory ప్రకారం ఈ భూమి మీద ప్రాణి కోటి almost అంతరించి
ఒక 3000 నించి 15000 మంది Africa, South India లో జ్వాలాపురం అనే ప్రదేశాలలో మాత్రమే
మిగిలారు అని దాని conclusion. ఆ theory ప్రకారం, ఇప్పుడు మనం చూస్తున్న మనుషులు అందరూ ఈ Africa, South India నించి
పెరిగిన సంతతి అని, వాళ్ళే ఈ భూమి మీద నాలుగు మూలలకి migrate అయ్యారు అని ఒక inference. ఈ పైన చెప్పిన విషయాలు correct అని
చెప్పడానికి కావలిసినంత research జరిగి at least Eruption
అయ్యింది, volcanic ash పరుచుకుంది, temperature variations వచ్చి జనాభా
సంఖ్య గణనీయంగా పడిపోయింది అని ఒప్పుకోక తప్పదు. సరే ఇక ఈ గోండ్వానా land అంటే
ఏమిటయ్యా అంటే, నేను అర్ధం చేసుకున్న భూగోళ చరిత్ర ప్రకారం, ఈ tectonic
plates కదలికల
వల్ల ఖండాలు కలుస్తూ, విడిపోతూ అప్పుడప్పుడు ఒక super
continent (అన్ని continents లేదా majority కలిసి
ఉన్నది) గా ప్రదర్శితమై తరువాత వేరువేరుగా విడిపోతూ ఉంటాయి. ఈ రకంగా Rodinia అన్న super continent ఒక billion సంవత్సరాల
క్రితం భూమి తాలూకు అన్ని కనపడే భూభాగాలను కలిగి, తరువాత 600 million సంవత్సరాల క్రితం మళ్ళీ 8 ఖండాల క్రింద
విడిపోయి, తిరిగి ఒకటై Panagaea అనే super
continent క్రింద
ఏర్పడి, తిరిగి విడిపోయి Laurasia గా (North America
& Eurasia), మరి
మిగిలిన ఖండాలన్నీకలిపి గోండ్వానా క్రింద వ్యవహరించబడ్డాయి.
Panagaea Super Continent |
మరి అలాటిది Eurasia అనుకున్నా, గోండ్వానా అనుకున్నా అంత invaluable nutrients తో
నిండిపోయిన ఈ దేశం అన్నపూర్ణ లాగ ఎలా మారింది. దానికి ఉన్న geographical advantage ఏంటి? అన్నది అర్ధం చేసుకోవాలి. ఇక
మనకి ఘనమైన చరిత్ర ఉందని అందరూ ఒప్పుకోవలసిందే. Geographical
advantage ఉన్న
ప్రతీ చోట glorious past & great history ఉంటాయి. పశుపక్ష్యాదులు, సకల మానవాళి సుఖం కోసం అక్కడ
చేరవలసిందే.
ఉదాహరణకి ఇప్పుడు అందరూ US కానీ,Australia కానీ ఇలాటి developed countries ఎందుకు చేరుతున్నారు. అక్కడ 24 hrs power, fresh drinking water, ఇంకా ఎన్నో facilities ఉన్నాయట. తెలివైన వాళ్ళందరికీ అక్కడ మంచి మర్యాద
జరుగుతుందిట. Michio Kaku అనే ఒక leading scientist US గురించి అక్కడ US లో settle అయి చెప్పాడు కాబట్టి సరే. ఇంకో రకంగా చూద్దాం.