Contd…..
Germ plasm on action of heat turns into germ radicals and again on action of heat turns into cells and tissues
Food substance on action of heat turns into food constituent radicals and again on action of heat turns into cells and tissues.
అవును ఏది భారతదేశం?
ముందు అంతా ఒకే ద్వీపంగా ఉండి tectonic plates కదలికలలో విడిపోయి భౌగోళికంగా
8°4’ -37°6’
north latitudes 68°7’-97°25’ east longitudes ఉన్నదాన్ని
భారతదేశం అందామా?
లేకపోతే ప్రస్తుతం 448 articles 12 schedules ఉన్న constitution
తో నడిచే ప్రభుత్వాన్ని భారతదేశం అందామా?
చరిత్ర లో British, French, Portuguese వంటి వారు, ముఘలాయిలు వంటి ముస్లింనేతల ఆద్వర్యంలో
నడిచింది, అంతకంటే ముందు ఆర్యుల,
ద్రావిడుల, గోండుల ఇంకా ఓపిక ఉంటే గుప్తుల, చాళుక్యుల, పల్లవుల, చోళుల, శాతవాహనుల, మౌర్యుల etc., వంటి
వారు పరిపాలించింది భారతదేశమా?
పోనీ రాముడు, కృష్ణుడు, బుధ్ధుడు,ఆది శంకరుడు తిరిగిన దేశాన్నిభారతదేశం అందామా?
లేకపోతే భారతదేశం అన్నది ఒక భావనా, కవుల కల్పనా? ఎవరో
కవి గొప్పగా “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”
అన్నాడు. ఇక్కడి మనుషులందరూ కలిపితే భారతదేశం అనుకోవచ్చా?
అవును పైన చెప్పిన అన్నీ details భారతదేశంకి సంబంధించినవే. సరే అయితే
దీని గురించి గాభరా పడటానికి ఏముంది. ఇలాగే ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి
అక్షాంశాలు, రాజ్యాంగాలు, చరిత్రలు
ఉన్నాయి. ఆయా దేశాలలో కూడా మనుషులు ఉన్నారు. జ్ఞ్యానులూ,
గొప్పవాళ్లు పుట్టారు. అక్కడ ఉండే వాళ్ళు కూడా తమ దేశం గురించి ఇంత గొప్పగానూ
అనుకుంటారు. మరి ఈ భారతదేశం గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది. ఈ రకంగా
ఆలోచిస్తే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఒక రకంగా నిజమే కూడా. అప్పుడు ఇంతకు ముందు post
లో నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానం చాలా సులువు.
Q. వందేమాతర గీతం ఎందుకు నన్ను ఉద్వేగానికి గురిచేస్తుంది? నా భారతదేశపు జెండాకి నేను వందనం
చేస్తున్నప్పుడు ఎందుకు నేను ఆనందంతో కంట తడి పెడతాను? నేను నా భారతదేశాన్ని, నా సంస్కృతిని ఎందుకు ఇంతలా ప్రేమించాలి? ఎందుకు ఈ సంస్కృతిని
కాపాడుకోవాలనుకుంటున్నాను? ఒక emotional middle class
intellectual ని
కాబట్టి, జీవితం
లో నిత్యం సమరం చేస్తున్నాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నానా? నిజంగా నా దగ్గిర నేను secured గా బ్రతకడానికి. నా విలాసాలకి కావలిసినంత
సంపత్తి ఉంటే ఇలా ఆలోచించనా?
Ans.
ఉద్వేగం ఎందుకంటే నాకు emotions ఎక్కువ. అది నాలోని chemistry
problem. సంస్కృతి ఏముంది పదిమంది కలిసి అనుకుని పాటించేది. ఎప్పటి
పరిస్థితికి తగ్గట్టు అప్పటి సంస్కృతి. అవును నిత్య సమరం చేస్తున్నాను కాబట్టి ఏదో
ఒక outlet. నిజంగా నా దగ్గిర బోలెడంత డబ్బు ఉంటే నేను దేశం
గురించి ఆలోచించవలిసిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఎక్కడో అక్కడ నేను సుఖంగా ఉండే
చోట happy గా బ్రతికేస్తాను.
Q.
నేను కేవలం నా ఆలోచనలలో నేను
సృష్టించుకున్న ఒక భావాన్ని ప్రేమిస్తున్నానా?
Ans.
అవును చాలామటుకు అదే.
అంతకు మించి ఏమీ లేదు.
Q. కారణాలు సరే, solution కూడా సరే, కానీ ఎవరైనా వాళ్ళ స్వార్ధం చంపుకోగలరా? తనకంటే ఎక్కువగా తన దేశాన్ని ప్రేమించగలరా ? స్వార్ధం మాట వదిలేస్తే ఈ దేశాన్ని
ప్రేమించడానికి ఎవరి దగ్గిరా కారణం లేదా? ఈ దేశంలో బ్రతకడానికి గత్యంతరం లేకపోవడం తప్ప
ఎవరి దగ్గిరా ఒక్క reason కూడా లేదా? నేను నిజంగా వేరే దేశంలో ఇంతకంటే ఎక్కువ
డబ్బు, సుఖం
దొరికితే కొత్త పాట పాడతానా?
Ans.
చంపుకోవలసిన అవసరం లేదు.
కారణం కూడా అఖ్ఖరలేదు. అవును గత్యంతరం లేకే ఇక్కడ బతుకుతున్నారు. మంచి అవకాశం
వస్తే వదులుకొని, ఇక్కడ బ్రతకడం అంత మూర్ఖత్వం లేదు. ఖచ్చితంగా నేను సుఖంగా ఉండటం
ముఖ్యమైనప్పుడు ఏది ఎలా పోతే నాకేంటి. నేనింతే.
అయినా ఇక్కడ ఎందుకు బ్రతకాలి? సుమతీ శతకకారుడు బుధ్ధి లేని వాడు కాదు.
ఆయన ఏమి చెప్పాడు?
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక బారునేరున్, ద్విజుడున్,
చొప్పడిన యూరనుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ.
ఏ facilities
లేని, ఏ encouragement లేని, ఏ క్రమశిక్షణ లేని ఇలాటి దేశం లో బ్రతికే కంటే ఆ మాత్రం, ఈ మాత్రం సుఖం ఉన్న చోటికి పోతే తప్పా?
Q. అసలు ఇంత మంది తమ జీవితాలని త్యాగం చేసి తెచ్చిన స్వతంత్రం
కి అర్ధం ఏమిటి అని ఎవరైనా ఈ రోజు ఆలోచిస్తున్నారా?
Ans.
ఆలోచించడానికి ఏముంది. అది
అప్పటి problem. వాళ్ళు
ఆ బానిసత్వం భరించలేక తిరగబడ్డారు. ఇప్పుడు ఎందుకు బుర్ర బాదుకోవడం. వాళ్ళు చచ్చి, మనమూ చస్తుంటే ఇంక ఈ స్వతంత్రాన్ని enjoy చేసేది
ఎప్పుడు?
Q. అసలు మనం బ్రతుకుతున్న దేశాన్ని ప్రేమించడానికి ఏ కారణం
కావాలి?
Ans.
ఏ కారణమూ అఖ్ఖరలేదు.
Q.
ఈ దేశాన్ని బాగు చెయ్యడమనే
అవసరం ఏముంది?
Ans.
ఏమీ లేదు. అయినా ఇదేమైనా
వస్తువా repair చెయ్యడానికి? నేను ఇంతకు ముందు చెప్పినట్టు మంచి, చెడు అన్నవి
మనం ఇచ్చుకునే definitions. చెడిపోవడం అన్నదే లేనప్పుడు
బాగుచెయ్యడం అనేది ఎందుకు వస్తుంది?
అంతేనా ఇంకేమీ లేదా?...... ఉంది.
నిజమే ఏ దేశమైనా simple గా మట్టే. అంతకు మించి ఏమీ లేదు. ఇంతకు
ముందు అన్నట్టు కవి గొప్పగా “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే
మనుషులోయ్” అన్నాడు. అదీ నిజమే. మరి ఈ మనిషి తయారు కావడానికి కావలిసిన constituents
ఏంటి? మళ్ళీ మట్టే. ఎందుకంటే పంచభూతాలైన ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి లో భూమి కూడా మట్టే. మరి ఏంటి ఈ భారతదేశం మట్టిలో గొప్పతనం. ఇది
సారవంతమైన మట్టి. రకరకాల ఓషధులు పెరగగల మట్టి. మంచి పంటలు పండించగల మట్టి. తన
నించి పుట్టి పెరిగిన ఓషదుల ద్వారా గాలినీ, నీటిని శుధ్ధి చేయగలదీ మట్టి. మనిషి తాలూకు ఆరోగ్యం వాడు తినే బలమైన తిండి మీద, వాడు పీల్చే స్వచ్చమైన గాలి మీద, వాడు తాగే నీటి
మీద ఆధారపడి ఉంటుంది. నిప్పు వాటి రూపాలని మార్చి మనిషికి,
వాడి శరీరానికి అవసరమయ్యే ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం
ఆరోగ్యకరమైన తీక్షణమైన ఆలోచనలని పెంచుతుంది. ఆరోగ్యకరమైన మనుషులు, వారి ఆలోచనల నించి ఆరోగ్యకరమైన సమాజం, సంస్కృతి
తయారుచేయబడతాయి.
మాట్లాడుకుందికి ఇది మట్టి గోల లాగా కనపడ్డా దీనికి ఒక scientific
reasoning ఉంది. అది కణదుడు ప్రశస్తపాదుడు చెప్పిన “న్యాయవైశేషిక” లోని atomic theory ఆధారంగా మనం పరిశీలించొచ్చు. ఇది నేను latest scientific discoveries
తో correlate చేసి కూడా చెప్పొచ్చు. కానీ కణదుడిని
ఎందుకు ఉదహరిస్తున్నానంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ విషయం భారతదేశంలో
చెప్పబడింది అని చెప్పడానికి. నాకు దీని తాలూకు article పంపించిన
శ్రీ BSV Rao గారికి ఈ సందర్భంగా కృతజ్ఞ్యతలు
తెలుపుకుంటున్నాను. ఇది నేను తెలుగులో కూడా చెప్పొచ్చు కానీ చదివేవాళ్ళ సౌలభ్యం
గురించి English లో చెప్తే better అనిపించింది.
“న్యాయవైశేషిక” లోని కొన్ని పంక్తులు.
Atom
The Vaisheshika sutra about atoms states “That which
is existent and has no cause (i.e., an atom) is eternal. It is not perceived
but is inferred from its effect.”
Atoms are the primordial infinitesimal particles of everything except space
or Akasha. To a certain extent terms like atom, space,
tend to give us the picture of current-day atom or space,
but there are some differences.
Atoms in Vaisheshika are essentially of four kinds: Earth, Apa- Water,
Tejas- Fire and
Vayu-Air. These atoms are characterized by their characteristic mass, basic
molecular structure such as dyad, triad, etc, fluidity (or
it’s opposite), viscosity (or its opposite), velocity (or
quantity of impressed motion- Vega) and other characteristic potential color, taste, smell or touch not produced by chemical operation. It is
these four kinds of atoms involved in all chemical
reactions while the space remains unaffected.
Atomic reactions
A substance may change qualitatively under the influence of heat in its
course of existence. The Vaiseshika’s stand on such change is
Substance on application of heat decomposes into paramanus or the basic unit with zero mass and again on application of heat paramanus recombine with anew basic unit of arrangement and order resulting in new substance.
Substance on application of heat decomposes into paramanus or the basic unit with zero mass and again on application of heat paramanus recombine with anew basic unit of arrangement and order resulting in new substance.
Prasastapada gives a specific example for such reaction. He considers the
fertilized ovum under the application of the animal heat or the bio motor
energy.
Fertilized ovum on action of heat turns into germ or sperm substance and both are isomeric modes of earth
The fertilized ovum breaks down in to its constituents which in turn are
reduced in to homogenous earth atoms. They are homogenous because they
essentially belong to the same bhuta. These basic atoms of the bhuta earth
re-combine under the influence of the metabolic heat to form the germ-plasm.
The germ-plasm develops enriching itself through the nutrients of the body.
Germ plasm on action of heat turns into germ radicals and again on action of heat turns into cells and tissues
Food substance on action of heat turns into food constituent radicals and again on action of heat turns into cells and tissues.
As can be seen at each stage heat breaks down germ-plasm in to constituent
atoms which combine with the constituent atoms of food and all these basic
atoms will re-combine to form the cells and tissues. All along heat is a
necessary element at the same time it is earth which is undergoing the changes.
అది ఈ మట్టి తాలూకు విశేషం. గంగ, యమునా, గోదావరి, నర్మదా, తుంగభద్రా, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది ఇలాగ ఎన్నో నదులతో, వాటి పరీవాహక ప్రాంతాలలో పీటభూములతో, సస్యశ్యామలమైన దేశం ఈ భారత దేశం. ఎంతో మంది ఈ దేశాన్ని దోచినా, దోస్తున్నా ఇంకా తన ఉనికిని నిలబెట్టుకుని, నిలువ
నీడ ఇస్తున్న దేశం ఈ భారత దేశం. ప్రపంచం అంతా అనాగరికంగా బ్రతికినప్పుడు ఎన్నో
శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, సిధ్ధంతాలు చెప్పిన దేశం భారత దేశం. సర్వ
మానవాళి సుఖంగా బ్రతికే సంస్కృతిని అందించిన దేశం ఈ భారతదేశం. అలాటి మట్టిలో, మట్టితో పుట్టిన మనం గర్వపడాలి. అలాటి భారతదేశాన్ని కాపాడుకోవలసిన అవసరం మనకి
ఎంతైనా ఉంది.
సరే స్వామి ఇదంతా బాగానే ఉంది. ఏదో మట్టి, విశేషం, సంస్కృతి అంతా సరే. మరి ఇప్పుడు ఈ భారతదేశంలో ఏ రకమైన సంస్కృతి ఉంది.
తగలబడిపోయిన పాత చరిత్రలు, విశేషాలు ఎవరికి కావాలి? ఇప్పుడున్నది అదే మట్టి కాదా? మరి ఇప్పుడెందుకు ఈ రకమైన
పరిస్థితి?
ఎంత మందో ఈ దేశంలోని అపారమైన సంపదలకి ఆశపడి, దండయాత్రలు
చేసి, దీనిని దోచుకుని, అది
సరిపోదన్నట్టు ఈ సంస్కృతిని పాపపంకిలం చేసి వదిలేశారు. ఒక తరం నించి ఇంకో తరానికి
అందవలిసిన ఆ జ్ఞ్యానాన్ని అందకుండా చేశారు. కొంత మన స్వయంకృతం.ఆ రకమైన తాకిడికి
గురై ఈ రోజున ఈ దేశం ఒక ఆత్మ నూన్యతతో బాధపడుతోంది. అందుకే దీనిని మనం
పునరుద్ధరించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేలని, గాలిని, సంస్కృతిని పాడుచెయ్యకూడదు. ఏమో రేపు cosmological disturbances వల్ల మారిపోతే చెప్పలేను కానీ ఈ రోజుకీ ఈ నేలకి ఆ గొప్పతనం ఉంది అని నేను విశ్వసిస్తున్నాను.
సశేషం
సశేషం