మా అమ్మ నా చిన్నప్పుడు ఇంట్లో జరిగే పూజలలో, వచ్చిన
బ్రాహ్మణుడికి, మాది ఋగ్వేదం అని చెప్తూ ఉండేది. నేను
అడిగాను అసలు ఎందుకు అలా చెప్తున్నావు అని. ఆవిడకి అర్ధం అయినంత మటుకు, ఆవిడ నాతో అన్నదేంటంటే మన పూజా విధానాలు వేరుగా ఉంటాయి. చేయించే తంతులు, చదివే మంత్రాలు మారతాయి అని. నాకు doubt వచ్చేది, అసలు అందరూ పూజించేది అదే దేవుడిని అయినప్పుడు ఈ వేదాల, మంత్రాల, తంతుల గోల ఏంటని. ఆ మంత్రాలు చదవడానికి
సోమశేఖరం అన్న ఆయన వచ్చేవాడు. ఆయన ఏదో సణుగుతూ చదివేవాడు. అవి అర్ధం కూడా అయ్యేవి
కావు. ఏదో ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, పువ్వులు వెయ్యండి ఇవి మాత్రం అర్ధం అయ్యేవి. అనుకునేవాడిని ఇప్పుడు అతను
చేయిస్తున్న పనులకీ ఋగ్వేదానికీ ఏమిటి సంబంధం అని. నాకు అనిపించేది ఏదో భృతి
గడవడానికి పూజలు చేయించేవాడు కానీ, అసలు అతనికి అతను
సణుగుతున్న దానికి అర్ధం తెలియదేమోనని. ఆ తరువాత ఎవరినీ అడగడం మానేశాను. కానీ నా
బుర్రలో అది ఉండిపోయింది. దాని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. దొరికిన
పుస్తకాలని చదువుతూ, నాకు నచ్చిన inferences తీసుకుంటూ, వాటి అర్ధాలు ఏమై ఉంటాయా అని అనుకుంటూ,ఆ topic పంచుకోవడానికి సరైన company లేక, అలా జరుగుతూ పోయింది. Parallel గా చదువు, ఉద్యోగం, పెళ్లి
ఇంకొన్ని social obligations వాటి మానాన అవి అవుతూనే
ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ Science & Philosophy post లో నేను చెప్పేవి నా ఆలోచనలు,నా inferences నుంచి నాకు అనిపించిన నా అభిప్రాయాలే.
దీనికి మహాత్ములెవరైన వేరే కోణం కూడా చెప్పగలిగితే నన్ను నేను update చేసుకుంటాను. ఇక విషయానికి వద్దాం.
నేను last post లో మన వాళ్ళు ప్రపంచం గురించి ఇచ్చిన analysis
అన్నాను. అసలు మన భారత దేశం లో ఎవరైతే తపస్సు చేసి జ్ఞ్యానం
సంపాదిస్తారో వాళ్ళని ఋషులు అనడం పరిపాటి. కానీ ఇప్పటి కాలానికి వాళ్ళని scientists
అంటే అందరికీ అర్ధం అవుతుందేమో. కానీ ఒక మహర్షిని scientist అంటే మహర్షి తాలూకు విలువని తగ్గించడమే. ఎందుకంటే ఒక స్థితిని
పరిపూర్ణత్వం తో చూసి చెప్పగలిగేవాడు మహర్షి. పరిస్థితి ఏదైనా దానిని సిద్ధాంతంతో
హేతుబధ్ధంగా, భౌతికంలో దాని results బట్టి
analyze చేసి చెప్పేవాడు scientist.
భౌతికమైన ఈ science తో అనుభవైకవైద్యమైన విషయాలను చాలామటుకు
విశదీకరించడం కుదరదు. మహర్షులు చెప్పే విషయాలు చాలా మటుకు సామాన్యుడికి అర్ధం
కాకుండా పోతాయి. అప్పట్లో మరి మహర్షులు తమ అనుభవాలని,
జ్ఞ్యానాన్ని పంచే ప్రయత్నంలో వాటిని
మంత్రాలుగా మార్చి, గుర్తు పెట్టుకోవడానికి సులువు చేసి, తరం నించి తరానికి అనుశ్రుతాలుగా నేర్పించారు, తాళపత్రాలు
వచ్చేవరకు.
అప్పుడు మాహర్షులు చెప్పేవి సామాన్యులకి ఎలా అర్ధం కావో అలాగే ఇప్పుడు scientists E=mc2
అంటే కొంత subject తెలిస్తే తప్పితే అది అర్ధం
కాదు. ఇప్పుడు science ఎంత advance అయిపోయిందంటే
ఆ మాత్రం ఈ మాత్రం చదువుకున్న వాడి ఊహాకి కూడా అందదు. కానీ ఆ revelations నించి వచ్చే applications & products మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి వల్ల మన environment,
జీవన విధానం కూడా మారుతూ ఉంటాయి. కానీ మనవాళ్లు చెప్పేవి ఈ ప్రకృతిని గుర్తించి, దానిని పాడుచెయ్యకుండా, దానిలో మమేకమవుతూ జీవించే
ఒక పధ్ధతి. ఇప్పటి మేధావులు మళ్ళీ తిరిగి Ecoliteracy, Sustainability
theory అని చెప్తున్నవి అవే.
మనవాళ్లు కాలమానం, , universe కి సంబంధించిన theories, theory of
evolution, geography, medicine, yoga ఇలాటి వాటి గురించే కాదు almost మనిషికి సంబంధించిన అన్ని subjects ని touch చెయ్యడం జరిగింది. అవే వేదాలు, ఉపనిషత్తులు, యోగాలు etc.,. మనవాళ్లు even ఈ మంత్రాల
ఛందస్సు, వాటి మాత్రలు, వాటిని
ఉచ్చరించే పధ్ధతులు, అవి చదవడం ద్వారా మనిషికి ఒక relaxation
కలిగించే విధానం అన్నీ పొందుపరిచి పెట్టారు. ఇంతకుముందు posts
లో ఋగ్వేద సూత్రాన్ని, భగవద్గీతనీ quote
చేస్తూ బ్రహ్మ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు నా జీవితంలో
నేను విన్నవి, చదివినవి వేరే విషయాల గురించి చర్చించుకుందాం.
మన వాళ్ళ కాలమానం, Geography
అన్న విషయం నాకు ఎక్కడ తట్టిందంటే మా ఇంట్లో జరిగే పూజలలోనే. వినాయక
చవితి కి చేసే పూజలో పూజకి ఆరంభంలో శుక్లాంబరధరం చదివిన తరువాత ప్రవర్తమానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, ...... కలియుగే,
ప్రధమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే,..... అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన.....
శుభవాసరౌ, శుభ తిధౌ...... అని చెప్పేవారు.
అప్పుడు మనం ఉన్నది కలియుగం, రాముడు త్రేతా యుగం,
కృష్ణుడు ద్వాపర యుగం మా అమ్మ చెప్పడం చిన్నప్పటి నించి వినడం వలన వాటి గురించి
గోల లేదు కానీ ఈ పరార్ధం ఏమిటి, కల్పం అంటే ఏమిటి, మన్వంతరం అంటే ఏమిటి, జంబూద్వీపం అంటే ఏమిటి అని doubt
వచ్చింది.