Wednesday, May 30, 2012

ఆలోచనల స్రవంతి - 29

duping history contd...... 


నేను confuse అయ్యాను. ఎందుకంటే చెలం ప్రకారం గాంధీ మహాత్ముడు. మా సన్యాసిరావు మాస్టర్ ప్రకారం పనికి రాని వాడు. ఆ confusion లో నేను గాంధీ వ్రాసిన "My experiments with truth" చదివాను. చెలం చెప్పింది నిజమనిపించింది. కానీ నేను చదివిన చరిత్ర పుస్తకాల inference తో నాకు అనిపించింది ఏంటంటే 1915 నించి 1947 వరకు జరిగిన independence struggle లో రకరకాల situations లో ఆయన handle చేసిన తీరు ఆయన గొప్ప individual, గొప్ప leader అని prove చేస్తాయి కానీ మంచి administrator కాదన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నాకు ఆయన అందరినీ కలుపుకుంటూ ఎవరికీ కష్టం కలగకుండా చెయ్యాలని ప్రయత్నించడం అర్ధం లేదనిపించింది. నా ఆవేశానికి సుభాష్ చంద్ర బొస్ correct అనిపించాడు. స్వతంత్రం అన్నది ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, యుధ్ధం చేసైనా గెలిచి సంపాదించాలనే concept correct అనిపించింది. స్వతంత్రం వస్తే ఏమి చేయాలన్న agenda బొస్ అతని team తయారుచేస్తే అది approve కాకపోవడం, గాంధీ గారి మాటలతో బొస్ కూడా ఆగడం, గాంధీగారు almost నెహ్రూగారు చెప్పింది చెయ్యడం, నెహ్రూగారి political handling sequences, నాకు గాంధీగారి integrity గురించి కాదు కానీ ఆయన understanding of situations మీద అపనమ్మకం ఏర్పడింది. ఆయన vision మంచిదే కానీ ఆయన అనుయాయులు ఆయన విధానాల్ని దెబ్బతీసిన తీరు,ఖిలాఫత్ అని ముస్లిములు ఆయనకి దూరమైన తీరు, నవఖలీ లో హిందూల మీద జరిగిన అత్యాచారానికి ఆయన స్పందించిన తీరు, partition time లో ముస్లిం లీగ్ జిన్నా, Poona pact time లో అంబేద్కర్ అతని team blackmail చేసి commitments తీసుకున్న తీరు, power కోసం నెహ్రూగారు చేసిన విన్యాసాలు,  ఇలాటివన్నీ చదివిన తరువాత అప్పుడు కొంత మా మాస్టర్ గారి మాటలకి justification దొరికినట్టు అనిపించింది. కారా మాస్టరు గారు వ్రాసిన కుట్ర కథ చదివి history కి ఇంకో angle తెలుసుకున్నాను. ఇందులో history duping ఎంటయ్యా నువ్వు కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నదే కదా అంటే, వెతుక్కుని ఎవాడేవడో వ్రాసినవన్నీ చదివి కొంత ఊహించి, కొంత క్రోడీకరించి అర్ధం చేసుకుని ఓహో ఇదా అనుకోవడం తప్పిస్తే అసలేం జరిగిందో ఎవడికి తెలుసు. Result అర్ధం అవుతుంది కానీ ఏ situation నించి ఈ result వచ్చిందో ఎలా తెలుస్తుంది.


American history గురించి నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది. John.F. Kennedy quotation " Don't ask what your country can do for you, but see what you can do for your country" అనేది నా favorite quotes లో ఒకటి. Pre-Columbian, Colonization era ల గురించి మాట్లాడను కానీ ఆ తరువాత వాళ్ళు super power కింద ఎదిగిన విధానం నాకు ఆశ్చర్యం కలిగించేది, John Perkins వ్రాసిన "Confessions of an Economic hit man" చదివే వరకు.  

సశేషం 

Tuesday, May 29, 2012

ఆలోచనల స్రవంతి - 28

history duping contd....... 


My friend while commenting on my post said "You have to understand the difference between happening and writing" - Accepted - My say is further we need to understand so many differences that rise in the gaps of feeling to conveying, conveying to understanding, understanding to reciprocating, reciprocating to reproducing, reproducing to publishing, publishing to campaigning, campaigning to mass feeling to again conveying and so many other differences are there which are never ending and the cycles follow.


I say "Truths, facts are absolute, happenings are contemporary, and scripted History is merely a view point"


నేను ఇంతకు ముందు media గురించిన చర్చలో power లో ఉన్నవాడు తనకు అనుకూలంగా వాడుకునే సాధనం అన్నాను. ఒక తరం నించి ఇంకో తరానికి చరిత్రని pass చేసే సాధనం కూడా media నే. ఈ మాధ్యమం ఉపయోగించుకుని పాలకవర్గం, గెలిచిన పక్షం ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు elevate చేసుకునే విధంగా ప్రచారం జరుగుతుంది. అసలు నిజం చరిత్రలో శిధిలమైపోతుంది. ఈ నిజం కూడా ఎవడికి అర్ధమైనది వాడికే నిజం. 


గత చరిత్ర గురించి ఇంకోసారి మాట్లాడుకునే ముందు latest current affairs in Andhra గురించి ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడాని arrest చేశారు. కానీ సాక్షి tv చూస్తే అతనంత ఉత్తముడు, ధీరోదాత్తుడు ఇంకోడు కనపడడు. అదే tv లో ysr గాంధీ తరువాత గాంధీ అంతటి వాడు. విజయమ్మ గారిని అడిగితే ఆవిడ బిడ్డ అంత అమాయకుడు ఇంకెవరూ లేరని, జగన్ ని అకారణంగా arrest చేశారని ఆవిడ ఆవేదన. అలాగే ఈtv చూస్తే అతనంత దారుణమైన మనిషి కనపడడు. ysr గురించి చంద్రబాబు ని చంద్రబాబు గురించి కాంగ్రెస్ నేతలనీ, వీళ్ళిద్దరి గురించి bjp ని, వాళ్ళ గురించి communists ని అడిగితే ఎవడి version వాడికి ఉంటుంది. నిజమేంటంటే అందరూ ఎవడి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. జనాలు అలవాటు పడిపోయారు. 


మా సన్యాసిరావు మాస్టర్ గాంధీగారిని తిట్టేవారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం గాంధీ వల్లే పాకిస్తాన్ వేరు పడిందని, స్వతంత్రం రావడానికి గాంధీ సత్యాగ్రహం కారణం కాదని, English వాళ్ళు ప్రపంచయుధ్ధం లో వారి దేశాన్ని వాళ్ళే కాపాడుకోవటానికి కష్టపడాల్సి వచ్చిందని, అప్పుడు భారతదేశాన్ని పరిపాలించడానికి కష్టమై వదిలి వెళ్లిపోయారని, అప్పటి వరకు వారు తయారు చేసిన Indian regiments ని కూడా యుధ్ధం లో వాడుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేవారు. ఆయన చెప్పేవరకు 9th std వరకు నాకు గాంధీ జాతిపిత. ఆయన వలనే స్వతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముడు. ఆయన చెప్పింది విని చరిత్రని వేరే కోణం లోంచి చూడొచ్చు అని తెలుసుకున్నాను. నాకు చెలం మ్యూజింగ్స్ చదివే వరకు నాకు గాంధీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయం లోనే ఉండేవాడిని. 


సశేషం 

Monday, May 28, 2012

ఆలోచనల స్రవంతి -27

Duping History contd.... 


నేను వాల్మీకి రామాయణం ఎలా చదవలేదో అలాగే Bible కూడా చదవలేదు. Dan Brown వ్రాసిన అన్ని పుస్తకాలు చదివాను. అందులో " The Davinci Code" , "Angels & Demons" లో Jesus Christ మీద చాలా చర్చ ఉంది. Bible మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడడానికి నా చిన్నప్పటి సంగతులు కొన్ని చెబుతాను. నా చిన్నప్పుడు RTC Complex, Vizag దగ్గిర ఉండే cemetery గోడ మీద ఇలా వ్రాసి ఉండేది. " దేముడు ఆకాశమంత పాపము చేసి ఉన్నాడు. నీవెంతటి పాపము చెయ్యగలవు" ఇంకా దాని continuation లో "పాపులారా యేసు తన రక్తముతో మిమ్మల్ని పునీతుల్ని చేయును" - ఈ quotes అప్పుడు అర్ధం కాలేదు. కొంత నవ్వు కూడా వచ్చేది. అవి ఆ తరువాత అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించ లేదు. ఎందుకంటే VT College, Sivalayam branch లో మాకు చావలి సన్యాసిరావు గారు principal ఇంకా matriculation కి English పాఠాలు చెప్పేవారు. ఆయన class లో ఏదో lesson చెప్తూ Christianity India లో ప్రచారం చేసేటప్పుడు ఆ ప్రచారకులు తెలుగు తెలియక dictionary పక్కన పెట్టుకుని మక్కీ కి మక్కీ translation నించి problem అని చెబుతూ "Our field of service extends from Visakhapatnam to Anakapalli" అనడానికి అనువాదం "మా పొలము  Visakhapatnam to Anakapalli వరకు విస్తరించి ఉన్నది" అంటారని ఎవడో "అయ్యా మధ్యలో నా పొలం ఉందా పోయిందా" అని గాభరాపడ్డాడని joke లాగా చెప్పేవారు. దానితో clarity వచ్చిన నేను ఆ quotes ని వదిలేశాను. 
నాకు Jesus గురించి తెలియడానికి ముఖ్య కారణం విశాఖలో ఉన్న కన్నెమారమ్మ కొండ. అక్కడ church లో ఏడాదికి ఒకసారి పెద్ద ఉత్సవం జరిగేది. ఒకే ఒక్కసారి వెళ్ళాను. old post office వరకు బస్సులో వెళ్ళి అక్కడి నించి నడకదారిలో కొండ ఎక్కాలి. చాలా జనసందోహం, దారిపొడుగునా దుకాణాలు చాలా సరదాగా ఉండేది. ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక muslim అతను నిలబడి pamphlets పంచుతూ "క్రీస్తు భగవంతుడు కాదు" అని అరుస్తూ నిలబడ్డాడు. వీడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని అనుమానం కలిగింది. కానీ వాడి దగ్గిరకి వెళ్లలేదు. తెలియదు కానీ ఎందుకో ఒక రకమైన భయం వేసింది. ఇక అసలు విషయానికి వద్దాం. 


Jesus ఒక మహాత్ముడు, ప్రజల మంచి కోసం నిలబడ్డాడు అని అనడానికి ఎటువంటి సంకోచం ఉండదు. కానీ అతన్ని భగవంతుడి కింద మార్చడానికి అతను ఒక కన్యకి పుట్టాడు, అద్భుతాలు చేశాడు, చావు నించి పుట్టాడు, స్వర్గం వెళ్ళాడు, తిరిగి జన్మిస్తాడు అంటే అది ఎవడిది వాడి individual నమ్మకానికి వదిలేయాలి. 
ఈ DanBrown పుస్తకం చదివిన తరువాత వాడు చెప్పిన దానితో అర్ధమైన విషయాలు ఏంటంటే Jesus అనే అతను ఒక యూదు రాజు, mary magadalene అన్న ఆవిడని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. అతన్ని శిలువ వేసిన తరువాత అతని వంశాన్ని కాపాడడానికి ఒక group అతని family ని underground కి తీసుకుపోయింది. ఇప్పటికీ jesus వంశస్థులు బతికే ఉన్నారు. ఇందులో ఇంకేమీ దైవత్వం కనపడదు. మంచి పేరు తెచ్చుకున్న యూదు రాజుని రోమన్లు, అతని కీర్తిని భరించలేక కుట్ర చేసి, arrest చేసి, విచారణ చేసి, శిలువ వేసి చంపేసి అతని అనుయాయుల్ని కొనేసి, christian విధానంలో రోమన్ ఆచారాల్ని కలిపేసి తమ ఉనికిని కాపాడుకొని Christianity flag కింద తమ power restore చేసుకున్నారని ఒక కథనం. రామాయణం గురించి last post లో rk గాడి comment లాగా అసలు క్రీస్తు ఉన్నాడా లేదా అని ఒక argument. ఇంక రామాయణం 200 varieties ఉన్నట్టు దీనిలో old testament, new testament ఎవడి ఓపికని బట్టీ వాడు చెప్పుకుంటూ పోవడమే. ఈ క్రీస్తుని messiah కింద ఇస్లాం లో గుర్తించారని ఒక కథనం. బుద్ధుడు విష్ణువు తాలూకు తొమ్మిదో అవతారం లాగా. ఈ మతాలన్నీ ఎప్పటికప్పుడు update అవుతూ latest trend కి తగ్గట్టుగా మారుతూ పోతూ ఉంటాయి.


next post లో నాకు తెలిసిన ఇంకొన్ని history duping సంగతులు 


సశేషం 



Friday, May 25, 2012

ఆలోచనల స్రవంతి - 26

Duping History contd.....


వాల్మీకి రామాయణం నేను చదవలేదు. అలాగని కంబ రామాయణం కూడా చదవలేదు. కానీ వాటి మీద వ్యాసాలు చదివాను. నార్ల వెంకటేశ్వరరావు గారి జాబాలి నాటకం చదివాను. దాని ముందు మాటలో ఆయన ప్రక్షిప్తాలు గురించి చర్చ చేశారు. ఆయన చెప్పినడాని ప్రకారం ఆదికవి అనుస్టుప్ చందంలో వ్రాసిన అసలు రామాయణం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఆరు  కాండలలో శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. అందులో రాముడు సామాన్యుడు. అతనితో ఉండే వానరగణం కూడా ఖగోళ శాస్త్రం లాటి శాస్త్రాలలో ఆరితేరినవారు కారు. కానీ కాలక్రమేణా వేరు వేరు కాలాలలో వేరు వేరు కవులు వారికి తెలిసిన, అప్పటి పరిస్తితులలో discover చేసిన, కొత్త విషయాలనన్నిటిని చేర్చి దాన్నిఉద్గ్రంధం చేసేశారు. ఈ ప్రక్షిప్తాలు చేరిన తరువాత వానర ప్రముఖుడైన నీలుడు అప్పటి వరకు అయోమయంలో ఉండి sudden గా ఖగోళశాస్త్ర వర్ణన మొదలెడతాడు అని వ్రాసారు. దాదాపు 200 రామాయణాలు ఉన్నాయిట. కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని ఎవడికి తోచిన రామాయణం వాడు చెప్పడమే. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు సీతని, చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయిన తరువాత మోహిస్తాడు. పెళ్లాడమని అడుగుతాడు. రాముడు ఎన్నో ప్రయాసలతో చివరికి రావణున్ని చంపి తిరిగి సీతని తెచ్చుకుంటాడు. ఒక hero, ఒక heroine, ఒక villain,  love, emotion, revenge formula, సుఖాంతం. ఇప్పుడు కంబ రామాయణం చూస్తే అసలు సీత రావణాసురుడి కూతురట. అడవిలో సీత పడుతున్న కష్టాలు చూసి ఓర్వలేని తండ్రి కూతురుని తిరిగి తెచ్చుకుంటే, రాముడు ఇవ్వమని అడిగితే, ఇవ్వనన్న తండ్రిని చంపి భార్యని తెచ్చుకుంటాడు. ఇదెలా ఉంది. melodrama ఉంది కానీ, రాముడికి ఆపాదించిన పురుషోత్తమ లక్షణాలన్నీమాయమయిపోతాయి. అసలు రావణాసురుడు పంచభూతాలని control చెయ్యగల బలశాలి. అలాటిది రామ బాణం తో బొడ్డు క్రింద కొట్టి చంపేస్తాడు. అసలు యుధ్ధనీతి బాహ్యమైన పని. ఇదెలా ధర్మం. ఇంకా simple గా సూక్ష్మం ఏమిటంటే వాల్మీకిది ఆర్యులు వ్రాసిన కథ, కంబ రామాయణం ద్రావిడులు వ్రాసిన కథ. ఎవడి ఓపిక బట్టీ వాడు నమ్మడమే. మనమా కాలంలో లేము. పెద్దలు ఏది చెబితే అది నమ్మడమే. రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు, ఆనవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా ఏమి జరిగిందో ఎవడికీ clarity ఉండదు. ఎవడి ఓపిక,interest బట్టి వాడు రామాయణం twist చేసేయొచ్చు. మన సినిమా వాళ్ళకైతే ఇంకా liberty. మనమిలా వాదిస్తే వేదాలు చదివిన పెద్దలు నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవని రాముడు చేసిన ప్రతీ పనికి justification ఇస్తూ రాముడు భగవంతుడి అవతారం అని confirm చేసేస్తారు. ఇన్ని చెప్పిన నాకు చిన్నప్పటి నించి వింటున్న రామాయణం అంటే ఎంతో ఇష్టం. 


next post లో నాకు తెలిసిన క్రీస్తు చరిత్ర 


సశేషం 


Monday, May 21, 2012

ఆలోచనల స్రవంతి -25

నేను facebook లో post చేసిన కవిత blog లో పెట్టడానికి చాలా రోజుల తరువాత blog ఓపెన్ చేసి చూస్తే, ఎవరో ఒకరు, రోజుకో పది మంది చూస్తున్నారు అని తెలిసి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలిసి నాది చాలా చిన్న friends circle. ఈ మధ్యే facebook పుణ్యమా అని నా matriculation friends కలిశారు ఒక పదిహేను మంది. అందులో ఒకళ్ళిద్దరికి  తప్పితే మిగిలిన ఎవరికీ కనీసం ఇలాటి blogs interest ఉన్నట్టు కనపడలేదు. మిగిలింది rk &team. వాళ్ళకి నా కృతజ్ఞ్యతలు. కనీసం చదివే పదిమందికి ఏదో నా ఆలోచన పంచుకుంటే బాగుంటుందని అనిపించి at the same time వ్రాయాలనే weakness వదలక మళ్ళీ ఇదిగో ఇలా.
ఇంతకుముందు posts లో నేను మళ్ళీ మాట్లాడుకుందాం అని వదిలేసిన topics
1. Duping of history
2. Share markets
3. Human psychology గురించి నాకు తెలిసింది 
5. Hinduism, Islam , Christianity , Buddhism  వీటి పయనమెటు
6. How science advancement leads to God  -దీని మీద ఎంతో కొంత వ్రాసి Fritjof Capra చదువుకోమని వదిలేశాను.
7. Observations on the current global  affairs 
8. నేను ఇంతకు ముందు రాసిన నవల continue చెయ్యడం
9. ఏదో కవిత్వం మళ్ళీ వ్రాద్దామని ప్రయత్నం -అప్పుడప్పుడు ఏదో ప్రయత్నిస్తున్నాను 
10. Space
11. Premonition, ESP ,faith healing etc.,

Duping History అంత సులువైన పని ఇంకోటి లేదు. దీన్నిsubstantiate చెయ్యడానికి నాకు తెలిసిన ప్రపంచ చరిత్ర కి prologue లాగా నా జీవితం లో జరిగిన సంఘటనలు కొన్ని చెబుతాను. ఈ సంఘటనలతో నా memories of life లో కూడా కొన్ని pages నింపచ్చు. 
నేను 7th std లో సుందరి టీచర్ tuition join అయ్యాను. Intermediate 1st year వరకు బాగానే జరిగింది. తరువాత ఆవిడ మిగతా students కి నాకు చూపించిన indifference తో frustrate అయ్యి tuition కి సరిగ్గా వెళ్ళడం మానేసి శివకుమార్ అని ఒక degree friend ని పట్టుకున్నాను, కలిసి చదువుకోడానికి. వాడు చదువు తక్కువ sex కబుర్లు ఎక్కువ మొదలెట్టాడు. అలాగ track నించి deviate అయ్యి ఆ disturbance లో ఎలాగో Intermediate అయ్యింది అనిపించాను. Engineering seat రాలేదు మొదటి సారి. మళ్ళీ అదో frustration. అప్పుడు నాకు నా VT College friend కిశోర్ మళ్ళీ కలిశాడు. అప్పుడు వాడు చూపించిన ప్రపంచం, philosophy నా చిరాకు నించి నన్ను దూరం చేశాయి. వాడి Hindi tuition friend రాంబాబు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. మేము ముగ్గురం బాగా thick friends అయిన తరువాత మా మధ్య నడిచే ప్రధానమైన topic love. కిశోరన్న style కానీ, వాడి attitude కానీ, అమ్మాయిలతో మాట్లాడటానికి బెరుకు లేకపోవడం కానీ, ఏదైనా కానీ వాడికి చాలా మంది girl friends ఉండేవారు. రాంబాబు కి అప్పటికి వాడిని reject చేసిన ఒక case తో బాధపడేవాడు. నేను నా frustration నించి బయటపడటానికి వీళ్ళిద్దరి fancy catch చెయ్యడానికి నేనూ capable అని prove  చేసుకోవడానికి ఎలాగ అని మధనపడుతూ ఉండేవాడిని. అలాటి సందర్భంలో నేను ఒక మంచి కథ చెప్పాను. నాకు ఒక girlfriend ఉందని ఎన్నో సంఘటనలు జోడించి మంచి అద్భుతంగా చెప్పాను. వాళ్ళు నమ్మారో, నమ్మలేదో తెలియదు కానీ ఆ imaginary  love affair మీద చాలా discussions నడిచాయి, చివరికి ఆ మోత భరించలేక నేను రాంబాబు దగ్గిర confess అయ్యేవరకు. నిజంగా నేను confess అవ్వకపోయినట్టయితే వాళ్ళు నిజంగానే నా జీవితంలో జరిగాయి అనుకునేవారు. అదే కథ పిట్టకథలుగా మారి అవసరం వచ్చినప్పుడు వందమంది నోట్లో వందరకాలుగా వినపడుతుంది. ఇంతకీ అది ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ అఖ్ఖరలేదు. నలుగురు friends మధ్యన జరిగే history duping ఇంతలా ఉంటే media network లేని రోజుల్లో ఇంకెంత మార్చి రాయొచ్చు. History గెలిచినవాడు వ్రాసుకునే autobiography అన్నాడు ఒక జ్ఞ్యాని. 

నిజమో , అబధ్ధమో మనకు తెలియదు కానీ history duping లో నాకు నచ్చిన stories రామాయణం, క్రీస్తు చరిత్ర. ఇవే కాకుండా నాకు తెలిసిన History next post లో .

సశేషం 



Saturday, May 12, 2012

New poetry -15




मेरा दोस्त तिवारीजी facebook मे लिखी कविता 




मोहब्बत अब मोहब्बत हो चली है,
तुझे कुछ भूलता सा जा रहा हूं
ये सन्नाटा है मेरे पांव की चाप
'फ़िराक़' कुछ अपनी आहट पा रहा हूं




मेरा जवाब facebook मे 



आहट जब होगी दिल की
मोहब्बत जवान होती है
सच की गली से गुजरे जब जिंदगी
खाक की पहचान होती है
खुद की फितरत से गले मिलकर
खामोशी की अरमान होती है