Purpose of life in materialistic plane
సంతోషంగా, సుఖంగా ఉండడమే purpose of life. అంతకు మించి వేరే ఏదీ definition లేదు. సుఖం, సంతోషం ఎలా వస్తాయి - నీ లోపల, బయట ఉండే nature తో నువ్వు సమత్వం పొందాలి. అప్పుడు అవి పొందగలవు.
నా reasoning ఏంటంటే కొంత ప్రకృతి పరంగా వచ్చే వారసత్వం, కొంత సమాజం - ఈ internal, external factors చేత influence అయ్యే మనిషి తన ప్రభావం చూపించే సమాజం - ఇదొక వలయం - ఈ వలయాలు మనిషిని నడిపిస్తూ ఉంటాయి.
మనిషికి ఏది సుఖం,సంతోషం అన్నది చూసే ముందు జీవితం గురించి కొంత అవగాహన కావాలి .
Spiritual గా ఎవరో ఇచ్చే definitions వదిలేస్తే జీవితం అంటే నువ్వు భౌతికంగా బ్రతికే కొన్నేళ్ళు. ఈ కొన్నేళ్లలో నువ్వు సుఖంగా ఉండాలంటే ముందు చెప్పినట్టు మూడు basics తీరాలి. అవి internal గా తీరుతూ ఉంటె నీ existence ఉన్నట్టే. ఆ తరువాత external ఉన్నది నీలాగే పదిమంది కలిసిన సమాజం. ఆ రకరకాల కలగాపులగపు సమాజంలో సమతుల్యత వచ్చి అందరూ సుఖంగా ఉండాలంటే కొంత governance అవసరం. ఈ governance ఎవడి చేతులో ఉంటె వాడు తన స్వార్ధానికి, సౌఖ్యానికి వాడుకుని అందరిని నలిపేస్తాడు. అందుకే బాగా ఆలోచించగలిగిన పెద్దలు వివేకానందుడు, బుద్ధుడు లాటి వాళ్ళు society సంతోషంగా ఉండడానికి individual reform మీద పడ్డారు.
"A generous heart, kind speech, and a life of service and compassion are the things which renew humanity." Buddha
ఇంక అసలు విషయం ఈ spiritual plane అనేది ఉందా. నాకు తెలిసి లేదు. అది ఒక భావన. ఆ భావన నీలో ఉన్న సమాజానికి హాని కలిగించే చెడుగుని ఆపుతుంది. అందుకే పెద్దలు ఆ భావనని చంప లేదు. భగవంతుడు ఉన్నాడనే అన్నారు. భయానికి, బాధకి శరణాగతి అన్నారు. విచ్చలవిడితనానికి, అహంకారానికి పగ్గాలు వెయ్యడానికి శిక్ష అన్నారు. society లోstability లేకపోతే మన civilized human race బతికేది jungle theory లోనే. అది రోజూ restless గా unstable గా indisciplined గా ఉండే జీవితాన్ని ఇస్తుంది. సౌఖ్యం ఉండదు. అందుకే morals , rules మానవ జాతిని ఒక రకంగా discipline లో పెడతాయి.
నిజంగా జీవితానికి అర్ధం లేదు. అది ఒక నిరంతర ప్రవాహం. Life is a continuous flow of energy till it dissipates. కానీ ఉన్నన్నాళ్ళు భౌతికమైన ఈ శరీరంలో ఉండే ఈ మెదడు చూపించే చమక్కులు అన్నీ చూడడమే. అంతే.