Friday, November 30, 2012

ఆలోచనల స్రవంతి -42


నేను ఈ భారతదేశం గురించి వ్రాసిన తరువాత “ ద్వేషానికున్న శక్తి ప్రేమకి లేదు” అన్న caption తో వ్రాద్దామనుకున్నాను. కానీ రామకృష్ణ ఇచ్చిన comments మీద నా opinion చెప్పకుండా ముందుకి పోవడం కూడా నచ్చలేదు. దీని మీద నా opinion చెప్తే ద్వేషం, ప్రేమ మీద కూడా నాకు అనిపించింది చెప్పినట్టు ఉంటుంది అనిపించింది. అయినా నేను చెప్పిన ఆ points ఎవరైనా దేశం గురించి ఏమి చేశావు, ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఎందుకు చెయ్యాలి అని అడిగే logic base చేసుకుని చెప్పిన వాదన. అది నా అభిప్రాయం కాదు. నిజంగా రామకృష్ణ criticism లో చాలా strong dose ఉంది. ఇంకా ప్రస్తుత పరిస్థితికి criticism అవసరం చాలా ఉంది. ఈ criticism వలన మనకి ఎక్కడ correction అవసరమో తెలుస్తుంది. కానీ దాని solution, corrective measure ఏమిటి అన్నది తెలుసుకుని దానిని ఉపయోగించడంలో ఉంది. ఆ corrective measure ని implement చెయ్యడానికి చాలా wisdom, commitment, పట్టుదల, సహనం అవసరం ప్రేమ లాగ. ఉదాహరణకి చరిత్రలో రామ మందిరం కూల్చి బాబ్రీ మసీదు కట్టారు అని ఒప్పుకుందాం. ఇప్పుడు మనవాళ్లు ఆ మసీదుని క్షణాలలో కూల్చేశారు. ఆ తరువాత ఏమి చెయ్యాలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు headlines లో ఆ విషయం లేదు కాబట్టి మనకి కూడా అవసరం లేదు. అది కూల్చడానికి, నాశనం చెయ్యడానికి ద్వేషం సరిపోయింది. కొన్ని లక్షల మంది పోగయ్యారు. అదీ ద్వేషానికి ఉన్న శక్తి. కానీ తిరిగి నిలబెట్టడానికి ఎవడికీ ఓపిక, interest లేదు. నేను కూడా నా జీవితంలో ఎన్నోమార్లు మా అమ్మ, నాన్నగారి తోటి ఇలాగే ప్రతీ విషయం మీద logical arguments చేసే వాడిని. వాదనలో గెలిచేవాడిని. కానీ జీవితానికి నా వాదనని ఎక్కడ అన్వయించాలో తెలిసేది కాదు. అన్వయించడం తెలిసిన తరువాత ప్రేమ విలువ అర్ధం అయ్యింది.
ఇప్పుడు నా post మీద వచ్చిన comments సంగతి చూద్దాం. నిజమే. స్వతంత్రం ఒక condition/ దశ .condition ఉన్నంతవరకు మనం మనకి నచ్చింది చేసుకోగలిగే Freedom/ స్వేచ్ఛని ఇస్తుంది. మనకి నచ్చింది మనం చేసేటప్పుడు కలిగే ఆనందాన్ని enjoy చేస్తాము. ఉదాహరణ కూడా బాగానే ఉంది. జీతాన్ని మనం direct గా enjoy చేయలేము. కానీ ఆ డబ్బు నించి వచ్చే physical comforts enjoy చేస్తాము. ఒప్పుకోవలిసిందే. కానీ ఆ స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి. ఆ దశని చేయి జారిపోకుండా ఎలా చూసుకోవాలి అన్నదానికి ఒక పధ్ధతి, ప్రణాళికా అవసరం. అందుకే స్వతంత్రం గురించి నాకు తెలిసి స్వతంత్రం అంటే విచ్చలవిడితనం తో కూడిన స్వేచ్ఛ కాదు, అది ఒక భాద్యత. అందుకే అందరికీ అదంటే భయం.” . అందరూ హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతలంటే భయం అని అన్నాను. మనిషి ఎప్పుడూ సర్వ స్వతంత్రుడే. వాడికి వాడు తన ఆలోచనల ద్వారా వేసుకునే సంకెళ్లే ఎక్కువ. వాడికి నచ్చినట్టు వాడు బ్రతకొచ్చు. కానీ ఇంకొకరితో కలిసి బ్రతకవలిసి వస్తే అప్పుడు adjustments, compromises అవసరం అవుతాయి. అలాటిది ఒక సమాజం లో, ఒక constitution based governance క్రిందన బ్రతకాలిసి వస్తే ఒక బాధ్యత అవసరం అవుతుంది. సమాజం పట్ల బాధ్యత లేనప్పుడు మనిషి ఎలాగైనా argue చెయ్యొచ్చు. వ్యక్తివాదం ఎప్పుడూ సమాజ హితం పట్ల ఉండాలి అన్నది నా అభిప్రాయం.
Reform exists. అవును పునరుధ్ధరణ జరగాల్సిందే. నేను కూడా అది జరగాలనే  కోరుకుంటున్నాను. అదే చెప్పాను కూడా. ఆ పునరుధ్ధరణ కూడా పైన చెప్పిన కారణం కోసమే జరగాలి. మారుతున్న పరిస్థితులకి, వాతావరణానికి, కాలానికి తగ్గట్టుగా ఆ reform ఉండాలి. భగవంతుడు ఈ దేశాన్ని రక్షించే ముందు మనమేమి చెయ్యగలిగితే అది చెయ్యడం ఉత్తమం. మరేమి చెయ్యాలి. దాని అవగాహనలో clarity కోసమే ఈ ప్రయత్నం అంతా. ముందు ఏమి చెయ్యాలో తెలిస్తే అప్పుడు అది ఎలా చెయ్యాలి అని decide చెయ్యొచ్చు.

అవును ఈ భూమి, plate tectonics వల్ల తన తాలూకు positions మారుస్తూనే ఉంది. ఈ పర్వతాలూ, లోయలు, కనపడకుండా పోయిన నదులు అన్నీ ఆ ప్రభావమే. ఈ మట్టి తాలూకు ప్రభావం మనకే ఉందా, ఇంకెక్కడా లేదా అన్న దాని గురించి చెప్పుకునే ముందు నాకు Volcanic eruptions అంటే నాకు Toba catastrophe గుర్తుకు వచ్చింది. 
సశేషం 

Sunday, October 14, 2012

ఆలోచనల స్రవంతి -41

Contd…..
అవును ఏది భారతదేశం?
ముందు అంతా ఒకే ద్వీపంగా ఉండి tectonic plates కదలికలలో విడిపోయి భౌగోళికంగా 8°4’ -37°6’ north latitudes 68°7’-97°25’ east longitudes ఉన్నదాన్ని భారతదేశం అందామా?
లేకపోతే ప్రస్తుతం 448 articles 12 schedules ఉన్న constitution తో నడిచే ప్రభుత్వాన్ని భారతదేశం అందామా?
చరిత్ర లో British, French, Portuguese వంటి వారు, ముఘలాయిలు వంటి ముస్లింనేతల ఆద్వర్యంలో నడిచింది, అంతకంటే ముందు ఆర్యుల, ద్రావిడుల, గోండుల ఇంకా ఓపిక ఉంటే గుప్తుల, చాళుక్యుల, పల్లవుల, చోళుల, శాతవాహనుల, మౌర్యుల etc., వంటి వారు పరిపాలించింది భారతదేశమా?
పోనీ రాముడు, కృష్ణుడు, బుధ్ధుడు,ఆది శంకరుడు తిరిగిన దేశాన్నిభారతదేశం అందామా?
లేకపోతే భారతదేశం అన్నది ఒక భావనా, కవుల కల్పనా? ఎవరో కవి గొప్పగా “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నాడు. ఇక్కడి మనుషులందరూ కలిపితే భారతదేశం అనుకోవచ్చా?
అవును పైన చెప్పిన అన్నీ details భారతదేశంకి సంబంధించినవే. సరే అయితే దీని గురించి గాభరా పడటానికి ఏముంది. ఇలాగే ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి అక్షాంశాలు, రాజ్యాంగాలు, చరిత్రలు ఉన్నాయి. ఆయా దేశాలలో కూడా మనుషులు ఉన్నారు. జ్ఞ్యానులూ, గొప్పవాళ్లు పుట్టారు. అక్కడ ఉండే వాళ్ళు కూడా తమ దేశం గురించి ఇంత గొప్పగానూ అనుకుంటారు. మరి ఈ భారతదేశం గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది. ఈ రకంగా ఆలోచిస్తే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఒక రకంగా నిజమే కూడా. అప్పుడు ఇంతకు ముందు post లో నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానం చాలా సులువు.


Q. వందేమాతర గీతం ఎందుకు నన్ను ఉద్వేగానికి గురిచేస్తుందినా భారతదేశపు జెండాకి నేను వందనం చేస్తున్నప్పుడు ఎందుకు నేను ఆనందంతో కంట తడి పెడతానునేను నా భారతదేశాన్నినా సంస్కృతిని ఎందుకు ఇంతలా ప్రేమించాలిఎందుకు ఈ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటున్నానుఒక emotional middle class intellectual ని కాబట్టిజీవితం లో నిత్యం సమరం చేస్తున్నాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నానానిజంగా నా దగ్గిర నేను secured గా బ్రతకడానికి. నా విలాసాలకి కావలిసినంత సంపత్తి ఉంటే ఇలా ఆలోచించనా?
Ans. ఉద్వేగం ఎందుకంటే నాకు emotions ఎక్కువ. అది నాలోని chemistry problem. సంస్కృతి ఏముంది పదిమంది కలిసి అనుకుని పాటించేది. ఎప్పటి పరిస్థితికి తగ్గట్టు అప్పటి సంస్కృతి. అవును నిత్య సమరం చేస్తున్నాను కాబట్టి ఏదో ఒక outlet. నిజంగా నా దగ్గిర బోలెడంత డబ్బు ఉంటే నేను దేశం గురించి ఆలోచించవలిసిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఎక్కడో అక్కడ నేను సుఖంగా ఉండే చోట happy గా బ్రతికేస్తాను.
Q. నేను కేవలం నా ఆలోచనలలో నేను సృష్టించుకున్న ఒక భావాన్ని ప్రేమిస్తున్నానా?
Ans. అవును చాలామటుకు అదే. అంతకు మించి ఏమీ లేదు.
Q. కారణాలు సరే, solution కూడా సరేకానీ ఎవరైనా వాళ్ళ స్వార్ధం చంపుకోగలరాతనకంటే ఎక్కువగా తన దేశాన్ని ప్రేమించగలరా ? స్వార్ధం మాట వదిలేస్తే ఈ దేశాన్ని ప్రేమించడానికి ఎవరి దగ్గిరా కారణం లేదాఈ దేశంలో బ్రతకడానికి గత్యంతరం లేకపోవడం తప్ప ఎవరి దగ్గిరా ఒక్క reason కూడా లేదానేను నిజంగా వేరే దేశంలో ఇంతకంటే ఎక్కువ డబ్బుసుఖం దొరికితే కొత్త పాట పాడతానా?
Ans. చంపుకోవలసిన అవసరం లేదు. కారణం కూడా అఖ్ఖరలేదు. అవును గత్యంతరం లేకే ఇక్కడ బతుకుతున్నారు. మంచి అవకాశం వస్తే వదులుకొని, ఇక్కడ బ్రతకడం అంత మూర్ఖత్వం లేదు. ఖచ్చితంగా నేను సుఖంగా ఉండటం ముఖ్యమైనప్పుడు ఏది ఎలా పోతే నాకేంటి. నేనింతే.
అయినా ఇక్కడ ఎందుకు బ్రతకాలి? సుమతీ శతకకారుడు బుధ్ధి లేని వాడు కాదు. ఆయన ఏమి చెప్పాడు?
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక బారునేరున్, ద్విజుడున్,
చొప్పడిన యూరనుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ.
facilities లేని,encouragement లేని, ఏ క్రమశిక్షణ లేని ఇలాటి దేశం లో బ్రతికే కంటే ఆ మాత్రం, ఈ మాత్రం సుఖం ఉన్న చోటికి పోతే తప్పా?
Q. అసలు ఇంత మంది తమ జీవితాలని త్యాగం చేసి తెచ్చిన స్వతంత్రం కి అర్ధం ఏమిటి అని ఎవరైనా ఈ రోజు ఆలోచిస్తున్నారా?
Ans. ఆలోచించడానికి ఏముంది. అది అప్పటి problem. వాళ్ళు ఆ బానిసత్వం భరించలేక తిరగబడ్డారు. ఇప్పుడు ఎందుకు బుర్ర బాదుకోవడం. వాళ్ళు చచ్చి, మనమూ చస్తుంటే ఇంక ఈ స్వతంత్రాన్ని enjoy చేసేది ఎప్పుడు?
Q. అసలు మనం బ్రతుకుతున్న దేశాన్ని ప్రేమించడానికి ఏ కారణం కావాలి
Ans. ఏ కారణమూ అఖ్ఖరలేదు.
Q. ఈ దేశాన్ని బాగు చెయ్యడమనే అవసరం ఏముంది
Ans. ఏమీ లేదు. అయినా ఇదేమైనా వస్తువా repair చెయ్యడానికి? నేను ఇంతకు ముందు చెప్పినట్టు మంచి, చెడు అన్నవి మనం ఇచ్చుకునే definitions. చెడిపోవడం అన్నదే లేనప్పుడు బాగుచెయ్యడం అనేది ఎందుకు వస్తుంది?


అంతేనా ఇంకేమీ లేదా?...... ఉంది.

నిజమే ఏ దేశమైనా simple గా మట్టే. అంతకు మించి ఏమీ లేదు. ఇంతకు ముందు అన్నట్టు కవి గొప్పగా “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నాడు. అదీ నిజమే. మరి ఈ మనిషి తయారు కావడానికి కావలిసిన constituents ఏంటి? మళ్ళీ మట్టే. ఎందుకంటే పంచభూతాలైన ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి లో భూమి కూడా మట్టే. మరి ఏంటి ఈ భారతదేశం మట్టిలో గొప్పతనం. ఇది సారవంతమైన మట్టి. రకరకాల ఓషధులు పెరగగల మట్టి. మంచి పంటలు పండించగల మట్టి. తన నించి పుట్టి పెరిగిన ఓషదుల ద్వారా గాలినీ, నీటిని శుధ్ధి చేయగలదీ మట్టి. మనిషి తాలూకు ఆరోగ్యం వాడు తినే బలమైన తిండి మీద, వాడు పీల్చే స్వచ్చమైన గాలి మీద, వాడు తాగే నీటి మీద ఆధారపడి ఉంటుంది. నిప్పు వాటి రూపాలని మార్చి మనిషికి, వాడి శరీరానికి అవసరమయ్యే ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యకరమైన తీక్షణమైన ఆలోచనలని పెంచుతుంది. ఆరోగ్యకరమైన మనుషులు, వారి ఆలోచనల నించి ఆరోగ్యకరమైన సమాజం, సంస్కృతి తయారుచేయబడతాయి.
మాట్లాడుకుందికి ఇది మట్టి గోల లాగా కనపడ్డా దీనికి ఒక scientific reasoning ఉంది. అది కణదుడు ప్రశస్తపాదుడు  చెప్పిన “న్యాయవైశేషిక” లోని atomic theory ఆధారంగా మనం పరిశీలించొచ్చు. ఇది నేను latest scientific discoveries తో correlate చేసి కూడా చెప్పొచ్చు. కానీ కణదుడిని ఎందుకు ఉదహరిస్తున్నానంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ విషయం భారతదేశంలో చెప్పబడింది అని చెప్పడానికి. నాకు దీని తాలూకు article పంపించిన శ్రీ BSV Rao గారికి ఈ సందర్భంగా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను. ఇది నేను తెలుగులో కూడా చెప్పొచ్చు కానీ చదివేవాళ్ళ సౌలభ్యం గురించి English లో చెప్తే better అనిపించింది. “న్యాయవైశేషిక” లోని కొన్ని పంక్తులు.

Atom
The Vaisheshika sutra about atoms statesThat which is existent and has no cause (i.e., an atom) is eternal. It is not perceived but is inferred from its effect.”
Atoms are the primordial infinitesimal particles of everything except space or Akasha. To a certain extent terms like atom, space, tend to give us the picture of current-day atom or space, but there are some differences.
Atoms in Vaisheshika are essentially of four kinds: Earth, Apa- Water, Tejas- Fire and
Vayu-Air. These atoms are characterized by their characteristic mass, basic molecular structure such as dyad, triad, etc, fluidity (or it’s opposite), viscosity (or its opposite), velocity (or quantity of impressed motion- Vega) and other characteristic potential color, taste, smell or touch not produced by chemical operation. It is these four kinds of atoms involved in all chemical reactions while the space remains unaffected.
Atomic reactions
A substance may change qualitatively under the influence of heat in its course of existence. The Vaiseshika’s stand on such change is
Substance on application of heat decomposes into paramanus or the basic unit with zero mass and again on application of heat paramanus recombine with anew basic unit of arrangement and order resulting in new substance.
Prasastapada gives a specific example for such reaction. He considers the fertilized ovum under the application of the animal heat or the bio motor energy.
Fertilized ovum on action of heat turns into germ or sperm substance and both are isomeric modes of earth

The fertilized ovum breaks down in to its constituents which in turn are reduced in to homogenous earth atoms. They are homogenous because they essentially belong to the same bhuta. These basic atoms of the bhuta earth re-combine under the influence of the metabolic heat to form the germ-plasm. The germ-plasm develops enriching itself through the nutrients of the body.

Germ plasm on action of heat turns into germ radicals and again on action of heat turns into cells and tissues
Food substance on action of heat turns into food constituent radicals and again on action of heat turns into cells and tissues.
As can be seen at each stage heat breaks down germ-plasm in to constituent atoms which combine with the constituent atoms of food and all these basic atoms will re-combine to form the cells and tissues. All along heat is a necessary element at the same time it is earth which is undergoing the changes.

అది ఈ మట్టి తాలూకు విశేషం. గంగ, యమునా, గోదావరి, నర్మదా, తుంగభద్రా, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది ఇలాగ ఎన్నో నదులతో, వాటి పరీవాహక ప్రాంతాలలో పీటభూములతో, సస్యశ్యామలమైన దేశం ఈ భారత దేశం. ఎంతో మంది ఈ దేశాన్ని దోచినా, దోస్తున్నా ఇంకా తన ఉనికిని నిలబెట్టుకుని, నిలువ నీడ ఇస్తున్న దేశం ఈ భారత దేశం. ప్రపంచం అంతా అనాగరికంగా బ్రతికినప్పుడు ఎన్నో శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, సిధ్ధంతాలు చెప్పిన దేశం భారత దేశం. సర్వ మానవాళి సుఖంగా బ్రతికే సంస్కృతిని అందించిన దేశం ఈ భారతదేశం. అలాటి మట్టిలో, మట్టితో పుట్టిన మనం గర్వపడాలి. అలాటి భారతదేశాన్ని కాపాడుకోవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది.

సరే స్వామి ఇదంతా బాగానే ఉంది. ఏదో మట్టి, విశేషం, సంస్కృతి అంతా సరే. మరి ఇప్పుడు ఈ భారతదేశంలో ఏ రకమైన సంస్కృతి ఉంది. తగలబడిపోయిన పాత చరిత్రలు, విశేషాలు ఎవరికి కావాలి? ఇప్పుడున్నది అదే మట్టి కాదా? మరి ఇప్పుడెందుకు ఈ రకమైన పరిస్థితి?
ఎంత మందో ఈ దేశంలోని అపారమైన సంపదలకి ఆశపడి, దండయాత్రలు చేసి, దీనిని దోచుకుని, అది సరిపోదన్నట్టు ఈ సంస్కృతిని పాపపంకిలం చేసి వదిలేశారు. ఒక తరం నించి ఇంకో తరానికి అందవలిసిన ఆ జ్ఞ్యానాన్ని అందకుండా చేశారు. కొంత మన స్వయంకృతం.ఆ రకమైన తాకిడికి గురై ఈ రోజున ఈ దేశం ఒక ఆత్మ నూన్యతతో బాధపడుతోంది. అందుకే దీనిని మనం పునరుద్ధరించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేలని, గాలిని, సంస్కృతిని పాడుచెయ్యకూడదు. ఏమో రేపు cosmological disturbances వల్ల మారిపోతే చెప్పలేను కానీ ఈ రోజుకీ ఈ నేలకి ఆ గొప్పతనం ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. 

సశేషం 




Saturday, September 29, 2012

ఆలోచనల స్రవంతి -40


"వందేమాతరం, సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం
సస్య శ్యామలాం, మాతరం, వందేమాతరం"
వందేమాతర గీతం ఎందుకు నన్ను ఉద్వేగానికి గురిచేస్తుంది? నా భారతదేశపు జెండాకి నేను వందనం చేస్తున్నప్పుడు ఎందుకు నేను ఆనందంతో కంట తడి పెడతాను? నేను కేవలం నా ఆలోచనలలో నేను సృష్టించుకున్న ఒక భావాన్ని ప్రేమిస్తున్నానా?
సరే భారతదేశం గురించి emotions పెచ్చు మీరిపోయిన నా గోల వదిలేస్తే, భారతదేశాన్ని ద్వేషించడానికి అందరూ సవా లక్ష కారణాలు చెప్తున్నారు. ద్వేషించడానికి ఉన్న కారణాలు ఏమిటని అనుకోగానే నాకు శ్రీశ్రీ వ్రాసిన ఒక పాట గుర్తుకు వచ్చింది. ఆ పాట వింటే ఈ దేశం మీద ద్వేషానికి కావలసిన అన్నీ కారణాలు చెప్పినట్టనిపించింది.
“పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ...” ఇలా అంటూనే
“అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు”...
“పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి ఒకడు మరిఒకని దోచుకొనేవాడే
తన సౌఖ్యం తన స్వార్ధం చూసుకునేవాడే
స్వార్ధమే అనర్ధదాయకం
అది చంపుకొనుటే క్షేమదాయకం”
కారణాలు సరే, solution కూడా సరే, కానీ ఎవరైనా వాళ్ళ స్వార్ధం చంపుకోగలరా? తనకంటే ఎక్కువగా తన దేశాన్ని ప్రేమించగలరా ? స్వార్ధం మాట వదిలేస్తే ఈ దేశాన్ని ప్రేమించడానికి ఎవరి దగ్గిరా కారణం లేదా? ఈ దేశంలో బ్రతకడానికి గత్యంతరం లేకపోవడం తప్ప ఎవరి దగ్గిరా ఒక్క reason కూడా లేదా? అసలు ఇంత మంది తమ జీవితాలని త్యాగం చేసి తెచ్చిన స్వతంత్రం కి అర్ధం ఏమిటి అని ఎవరైనా ఈ రోజు ఆలోచిస్తున్నారా?

నాకు తెలిసి “స్వతంత్రం అంటే విచ్చలవిడితనం తో కూడిన స్వేచ్ఛ కాదు, అది ఒక భాద్యత. అందుకే అందరికీ అదంటే భయం.” 

హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ భాద్యత తీసుకోవాలంటే భయం. అవకాశాన్ని బట్టీ ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవడమే. అదే సులువు. స్వార్ధం కరడుగట్టిన ఇంతమంది వెధవలు ఈ దేశాన్ని దరిద్రంలోకి తోస్తుంటే వాళ్ళని ఆపలేక, నా చేతకానితనం ఒప్పుకుంటూ నేను కూడా స్వార్ధం తో పారిపోవాలా? ఆపలేకపోయినా ప్రయత్నం మానేయాలా? మన తల్లి తండ్రులకి ఎవరికైనా జబ్బు చేస్తే మనం వదిలేసి పారిపోతామా? ఇలా conflict తో కొట్టుకుంటుంటే నా భార్యతో ఒక discussion. ఆవిడ అంత analytical గా ఆలోచిస్తుందని నాకు ఇప్పటివరకు తెలియదు.
 నా భార్య, ఆవిడకి అర్ధమైన జీవితాన్ని ఆవిడకి తెలిసిన ఉదాహరణలతో అంది “ఇక్కడ hire & fire policy companies లో ఉద్యోగం చేస్తూ గుర్తింపు లేకుండా, ఇన్ని కష్టాలు పడుతూ, తక్కువ జీతం తీసుకుని ఇలాగ బ్రతికే బదులు abroad లో ఇదే పని చేస్తే కొంచం ఎక్కువ జీతం తీసుకుంటే జీవితంకి కొంత security ఉంటుంది కదా అని.”
నేను అన్నాను “ఈ దేశంలో ఉద్యోగం చేసి ఇక్కడ production ఇస్తే ఈ దేశానికి సేవ చేసినట్టు కాదా? నాకు ఇక్కడ సుఖం దొరకటంలేదని, సుఖం దొరికే చోటుకి వలస పోవాలా? పక్షులు, జంతువులు వలస ఎందుకు పోతాయి. జీవితానికి కావలిసిన తిండి నీరు దొరక్క. ఈ దేశం అంత కంటే దిగజారిపోయిందా?”
నేను ఇలా అంటే నా భార్య ఇంకో ఉదాహరణ ఇచ్చింది “బ్రతకడానికి తిండి చాలు. అది అవసరం. జిహ్వని మరపించడానికి తిండికి రుచి ఎంత అవసరమో ఆనందంగా ఉండడానికి జీవితానికి సుఖం కావాలి. ఒక physical comfort కావాలి, కొంత secured feeling కావాలి. అది డబ్బుతో వచ్చేదైతే, అది సంపాదించగలిగే అవకాశం ఉంటే దేశభక్తి అని వదులుకోవడం ఎందుకు? సంపాదించింది తీసుకుని ఈ దేశంలోనే బ్రతుకుదాం. “తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం” అంది.
Perfect logic; argue చెయ్యడానికి నా దగ్గిర logic లేకపోయింది. ఇన్నాళ్ళు ఎందుకు ఈ logic నాకు తట్టలేదు అనిపించింది. మళ్ళీ అనిపించింది నేను వెతుక్కున్నది ఆ క్షణం లో ఇది కాదు. అందుకే తట్టలేదేమో అని.
అప్పుడు అనిపించింది నేను విదేశాలు వెళ్లడానికి అవకాశాలు రాక, తెలివితేటలు సరిపోక ఇలాగ భారతదేశం అని చెప్పి నన్ను నేను మభ్యపెట్టుకుంటున్నానా? ఇంతకుముందు ఆ విదేశీ ప్రయత్నం ఆఖరి మజిలీలో వదిలేశాను దేశభక్తి అన్న భావనతో.ఇన్నాళ్ళకి నా భార్య కొట్టిన దెబ్బకి నాకు ఎవరో చెప్పిన quote గుర్తుకు వచ్చింది – “Patriotism is the last refuse of a scoundrel”. నేను నిజంగా వేరే దేశంలో ఇంతకంటే ఎక్కువ డబ్బు, సుఖం దొరికితే కొత్త పాట పాడతానా?
నేను నా భారతదేశాన్ని, నా సంస్కృతిని ఎందుకు ఇంతలా ప్రేమించాలి? ఎందుకు ఈ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటున్నాను? ఒక emotional middle class intellectual ని కాబట్టి, జీవితం లో నిత్యం సమరం చేస్తున్నాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నానా? నిజంగా నా దగ్గిర నేను secured గా బ్రతకడానికి. నా విలాసాలకి కావలిసినంత సంపత్తి ఉంటే ఇలా ఆలోచించనా?
అసలు మనం బ్రతుకుతున్న దేశాన్ని ప్రేమించడానికి ఏ కారణం కావాలి ? ఈ దేశాన్ని బాగు చెయ్యడమనే అవసరం ఏముంది? అసలు దీని కంటే ముందు అసలు ఏమిటీ “భారతదేశం” ? అసలు ఏది భారత దేశం?

సశేషం 

Tuesday, September 25, 2012

New poetry -20


నీతుల హైకూ

అడవిలో
నీతుండునా  
ఓసామి
చీకటిన
నీడుండునా
నాసామి
మాటలే  
తినగలిగితే  
ఓసామి
కవితలిక
పరమాన్నమే
నాసామి


బాధలకి
తలవోగ్గితే
ఓసామి
నీ బండి
కదిలేదేలా
నాసామి
ఆశలే
ఆసరాగా
ఓసామి
జీవితం
గడిపేయరా
నాసామి
చీకటికి
చివరి అంకం
ఓసామి
వాకిటన
జిలుగు వెలుగే
నాసామి 

Thursday, September 20, 2012

New poetry -19


Romanticism contd.....

అందమైన సాయంకాలం 

సిరిసిరిమల్లెలు విరిసిన సాయం
వెన్నెల పాడిన చల్లని గానం
అల్లరి చేసే మనసును దోచే
మైమరపించే ఆశలు రేపే

కాటుక కన్నుల వాకిట మెరిసే
మౌనరాగాల తియ్యటి పిలుపే
ఆవిరి ఊర్పుల కావిరి కరిగే
శ్వాస వేణువై శ్రావ్య గానమై


సుమ శోభితమై వలపులు వెలిగే
తేనె జల్లులతో కాలం కలిగే
కౌగిలి భాషకి మురిసిన ప్రాయం
సరస కమనీయ సుందర కావ్యం 

Wednesday, September 19, 2012

New poetry -18

one more dose of romanticism

కలలు 

ముది దరిచేరని మానసమందున
మరుల అలరులో మాధురి సెలలో
సుమవాటికలో విరిసిన సిరులో  
నా ఊహాలలో  వసంత ఝరులో
మది తరంగమై ఎద విహంగమై
ఎగసిన తలపుల తడిసిన కలలో

Tuesday, September 18, 2012

New poetry -17

రాంబాబు flashback poetry తో పాత రోజులు గుర్తుకు తెస్తే ఏవో పాత మాటలలో నేను చంపేసిన romanticism

To Ammalu with love 

ఆమనిలో మధువనిలో
నీ తపమే ఆతపమై
తొలకరిలో హరివిల్లై
వెన్నెలలో రాధికలో
హేమంతపు కాంతులలో
శిశిరంలో రంగులలో
ఆనందపు క్రాంతులలో 
లాహిరిలో నీ తలపే 
విలసిల్లెను నా వలపే
పులకించెను ఈ మనసే
రవళించెను నా పలుకే
వికసించెను నా బ్రతుకే 

Monday, September 3, 2012

ఆలోచనల స్రవంతి -39


When you are going through a happy phase in life which gives you satisfaction the time just flies and when you are going through a rough patch in life, no logic, nothing helps. During this rough patch there will be so many quotes to read, so many formulae to apply, so many people to advice and there will be so many “so many”. You will try the analysis of your zodiac, check for the stones you need to wear, do the rituals to cool the planetary adversities. Afterwards you feel that your attitude is not allowing you to get better. Even you try yoga to get the grip. You will try to follow as many as possible of those “so many” but the situations never get better. You will be just sucked into the vortex of life. The frustrations will go beyond your limit and everything seems to be incorrigible.
Out of so many quotes you can have a quote like “Remember there are no real failures in life, only results-No true tragedies, only lessons-And there really are no problems, only opportunities waiting to be recognized as solutions by the person of wisdom” and one of the so many formulae like “Change your attitude which is 100%” and many people starting from Father, Mother, Wife, Friends, Colleagues etc., will give you counseling and advices ranging from career options to food intake. The stones you wear, the rituals you perform will just boost up your confidence that something good is going to happen which is termed as “hope”. The flow in that phase takes you to have conclusions, your own definitions on life and their applications for better or for worse. And you try to propagate those views and definitions resulting out of the experiences of this phase and your understanding, you term it as “wisdom”.
Happy phase doesn’t ask for logic but this bad phase definitely forces you to think of reasons. In normal understanding of life you cannot find the answer and if you go to saints they call it as “Karma” and modern science doesn’t have a definition for this. This karma again pulls you into a lengthy discussion on providence, free will etc., which doesn’t help.
All said and done we cannot fathom the intriguing nature of this. Somehow we get adjusted with a hue and cry because human has an inherent quality to analyze and adapt. This I am talking about a normal person with normal IQ just surfing on the waves of economy and environment.
Is there a plane skipping into which you can come out of that phase  -If you start about this then there is no end and you will end up with more scientific theories like string theory etc., and conclusions also very hypothetical, so let us not talk about the planes and dimensions.
Then is it simply changing perspectives you come to a conclusion? To some extent this seems to be OK but further let us try to think and analyze what will be the simple reasons to term it as a bad phase in life. The two simple reasons are physical ailment and mental agony. If these two are not there then there will be no bad phase which is next to impossible. But you can subside the bad phase to a maximum by following simple solutions.
The physical ailments to some extent depend upon the cycles of change in environment –If that is directly due to changes in the universe then there is nothing to say, but whatever is in our hands we can do –like not to play with the green house effect etc., to some extent safeguards our environment and can control physical ailments. We can try to create the awareness which can postpone the doom to some time.
Regarding mental agony it can be cleared to some extent if there are people with sympathy to share your grief and give solutions and help you in time of need instead of mere advices. It is more driven by society with moral construct which is in our hands.
So let me conclude that “Happiness is everybody’s prerogative and a collective responsibility”.

PS: After writing this thought line I left it for two days and again went through it –It seemed that I am telling nothing new whatever is written by me earlier same thing I felt I am repeating. Anyhow I am leaving it for the reader’s discretion of how he feels about it.

Thursday, August 23, 2012

ఆలోచనల స్రవంతి -38

Dear Papa,

This is in answer to your letter about my transgression. Yes, my first rank skipped to the second. You advise that I should think before studying, before answering the papers. Yes, the operating word “think” did make me muse and these are the results of those musings.

Father, we’ve never really been close and I can’t rightly say, you’ve been my friend, philosopher, guide etc. Yet, I would like you to be aware of my musings. They are very important to me. You are highly educated and you provide very well for the family. But in your departmental store, do you apply Pythagoras Theorem or Newton’s Law of Gravity? For that matter, does your doctor friend? Or your lawyer brother?

Papa, my grandfather speaks of a carefree and beautiful childhood. Of days spent in plucking mangoes and guavas from their “jameen,” of picnics on the banks of the rivers where the men cooked mouth-watering food, of playing marbles and gilli danda. From his talk, it seems, studies were an ancillary subject, and living and experiencing, the major subject. Father, is he fibbing? Or is it possible that the world turned topsy-turvy in just about 70 years?

Papa, my grandmother is semi-illiterate. Yet she is at peace with her pots, pans, her flowers and garden, her Bhagavad Gita and scriptures. My mother, highly qualified, is highly strung, tense and nervy. Do you think, literacy is a harbinger of restlessness, fear, and frustration? Is it Adam and Eve eating of the Tree of knowledge all over again?

Oh Papa, last week, my rose plant almost died. Some pests. I asked my Biology teacher what I should do to save it. And she was cross. She said go ask the guy who keeps gardening things. He’ll tell you. We learn about pesticides but we do not know to use them. Oh father, it matters not to me why the apple does not fall upwards, nor do I care what Archimedes did. What matters to me is that my rose plants remain healthy; when there’s a fuse in my house, I should know to do something about it. I should know to make a desk for myself from my carpenter’s tools. Instead I learn about hypotenuse relational square roots.

Papa, once I asked grandmother how she got; to be so wise. Do you know what she said? By living and experiencing. And she laughed as though I had asked something, which was so obvious. Are we living, Papa? Or is life bypassing us? What I fear is that if I were to meet Newton face to face, I would fail to recognize him, so busy am I learning about him. You know just like the boy, Vinu, in that award winning film. He prattles on – The Hibiscus is red – a hundred times, but in his book he colors it yellow. Are we missing out on the essence of life? –Papa, that’s what happens in my craft and drawing class. My imagination wants to soar like a rocket to Jupiter and Mars. To traverse new world, new fields.

Anyway, Papa, do you know where I lost that quarter mark that brought about my fall? It was a fill-in-the-blanks.

I held that I was invited to tea and my teacher was adamant that he was invited for tea. A matter of grammer. And, Papa, if he says George Bush is the President of India; it will have to be so. If he says the sun rises in the West, so be it; and if he says the earth is flat, it will be, it will be, my Papa. At least on my answer papers. My first rank is at stake, you see. Still, my dearest Papa, I shall keep your advice in mind and strive not to lose any quarter marks..

As always
Your ever-obedient son
Rahul

P.S: - Your eyes will not see this anguished plea, my father. This was only to lighten my over-burdened hear. It is not all arteries and muscles, it feels too.

BY RAJ KINGER



The above story was posted by mother as a comment to the “ideal “posts. And let us see what the story or the letter by son to his father emphasizes? After reading the story my observations are as below.
1.    The son is having a good relationship with his father where he can express his opinion to the advices given by father. The father is giving healthy advices to the son where he can develop his personality and individuality. The son cares for his father and feels that he owes an explanation to his father for he has skipped to second rank.
2.    The son is asking question about ”where the knowledge acquired can be put to application to gain wisdom” and this is an analytical thought based on his understanding of the surroundings where his father and uncle are located and what they have studied whether it is helping them in their day to day life.
3.    Then the son speaks of his grandfather’s childhood where it is not scarred by the economy and how life used to be in the olden days where there is ample space for the individual to have simple pleasures of life which not only gives  relaxation but leaves rich experiences which one can cherish in after life and make one’s life worth mentioning to remember.
4.    Then he writes about the grandmother’s complacency, where she was happy with herself ,irrespective of literacy, by living normal life which throws light that happiness can be derived by simply adjusting to one’s own environment and having good relations with your inner self.
5.    Next para is again about lack of apathy and non application of knowledge to what is required, which is a real challenge to the education system, of what is being thought at schools by teachers and how far the thing is applicable in practical life and in the present education system how teachers are behaving.
6.    In the further paras the emphasis is on the dogmatic approach of today’s schools and teachers, where instead of enlightening the children and showing a practical approach to life for which imparting knowledge is meant, is being not met with.
Now the questions are as follows
1.    Are we providing a healthy environment to the children and whether grooming is so done that a child is having an emotional bonding with his parents, and whether the child can freely express his doubts and does the parents are having a vision, time etc., regarding what the child needs?
2.    Whether the economy is supporting to give chance to such a healthy environment? Who has to govern this economy? Is it the people, government, entrepreneurs or combined effort is required? Why so much restlessness in the present society where happiness is a myth?
3.    Where are we heading, where simple pleasures are lost, complacency is lost and everybody is engaged in a rat race which leads to imbalance of inner as well as outer nature?
And above all
4.    Why knowledge is not converting into wisdom which helps to have a complacent living and why our education system is not supporting such process?
I request for everybody’s participation whoever reading this blog in expressing their views before I express myself. 

Tuesday, August 14, 2012

ఆలోచనల స్రవంతి -37

దశావతారాలు vs.  Theory of Evolution అని వ్రాద్దామని మొదలెట్టి ఈ క్రింద రెండు పేరాలు వ్రాసి ఆపేశాను. 

మనకి Theory of Evolution అనగానే ఇప్పటి modern age లో గుర్తుకు వచ్చేది Charles Darwin గురించి. అతను చెప్పిన theory ప్రస్తుతం అందరికీ తెలిసిన theory. అందుకే ముందు దీని గురించి ఇంకా geology గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటే కానీ దశావతారాల్లో మత్స్యావతారం నించి వామనావతారం వరకు ఉన్న దశలు ఈ theory నే మనవాళ్లు చెప్పారన్న దానిని విశదీకరించడం కుదరదు. ఎందుకంటే ఈ దశలన్నీ మనకి విష్ణుమూర్తి అవతారాలు. ధర్మ సంస్థాపనార్ధాయా సంభావామి యుగే యుగేఅన్న భగవద్గీత లోని lines దీనినే బలపరుస్తాయి. మన ఆలోచనలలో ఇవి పురాణాలు అని ఎంత గట్టిగా ముద్రింపబడ్డవి అంటే మనకి ఊహాల్లో కూడా ఇవి Theory of Evolution గురించి మనవాళ్లు చెప్పినవి అని అనిపించదు.
అసలు ఈ theory of evolution ఏం చెప్తుంది అని తెలుసుకునే ముందు అసలు ఈ geology link check చేద్దాం. ఈ geology లో మనం చదివే Geological time scale అన్నది మన భూమి తాలూకు chronological history. దీని ప్రకారం వేరు వేరు కాలాలలో మన భూమి పరిస్థితి ఏమిటి? రకరకాల కాలాలలో వేరు వేరు పరిస్థితులలో-------  
1859 లో Charles DarwinOn the origin of species” అనే పుస్తకం వ్రాశాడు. అందులో “theory of natural selection” ని ప్రతిపాదించాడు. ఈ natural selection అన్నది evolution కి key mechanism. అంటే ఏమిటో చూద్దాం. “Natural selection is a gradual non-random, process by which biological traits become either more or less common in a population of differential reproduction of their bearers.”

ఇది continue చేద్దామనుకుంటూనే పని వత్తిడిలో పడి కుదరలేదు. ఇంతలో lucky గా rk గాడు internet లో "decodehindumythology.blogspot.in "అని ఒక site బాగుంది చూడు అన్నాడు. నిజంగానే నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఆ blog writer చాలా చక్కగా వ్రాశాడు.  Indian mythology లో science కి సంబంధించిన విషాయాలని latest scientific discoveries తో correlate చేస్తూ, వాటికి pictures పెట్టి బాగా చెప్పడం జరిగింది. ఇంక నాకు అనిపించింది నేను మళ్ళీ type చేసి చెప్పే బదులు ఆ site చూడమని చెప్తే సరిపోతుంది అనిపించింది. ఇంతకు ముందు tao of physics గురించి నా తోడల్లుడు సందీప్ చెప్పినప్పుడు కలిగిన feeling మళ్ళీ కలిగింది. 

next post లో psychology లో నాకు తెలిసింది వ్రాయడానికి try చేస్తాను. ఈ లోపల rk దీనికి సంబంధించి మంచి site ఏదైనా చెప్పగలిగితే (no pun intended) నాకు ఈ type చేసే కష్టం తప్పిపోయి అది refer చేస్తే సరిపోతుందనుకుంటాను.


Saturday, August 11, 2012

ఆలోచనల స్రవంతి -36


In general Knowledge is theoretical or practical understanding of a subject, situation using experience or education, whereas Wisdom is having deep understanding of varied things and the power to apply knowledge with judgment coming out of experience. So this wisdom is dependent on knowledge but how to define “Knowledge” exactly nobody knows. After so much of logic we will end up with one’s own belief which is again abstract.
After all logic, reasoning, perception and communication we are left with nothing but abstract things on which we can debate for a life time. But there is a point which is definitely to be noted by everyone. For a set of common species in the gamut of common living environment in broader sense, the rules of living will be same. So the ideal thing will be, not to tamper with the ideal living conditions, which is Wisdom. Other than this I don’t find any meaning for this ideal. May be quotes by great people if analyzed will be standard operating procedures to achieve the same like Mother quoted Bertrand Russell which involves Emancipation from personal prejudice.
Then we look at the next one of having an ideal irrespective of the result. Anybody can definitely spend his life pursuing anything like Elixir of life or Philosopher’s stone whatever, as long as it is giving the individual happiness and not tampering other’s happiness even if it is considered as a waste of energy and time by majority.
Ethics again fall into the category on what the community defines and this community is formed by like minded individuals for safeguarding their interests. And now where this generation is heading in this ethical gamut? Definitely once the threat of God, heaven, hell things are found to be not happening and one finds individuals who are deriving more physical comforts disturbing the community and are scot free and treated as heroes, then rules change. Everyone will run after these heroes and they also want to become one which mother rightly identified as opportunism and it is an epidemic.
Utopia is an individual’s thought paradise and the idea of “your utopia” makes perfect sense and not absurd.
As mother said it is definitely true that the essence of life is to gain wisdom on making this world a happy place for everyone to live in and if everybody strives in the same direction it is possible also. A person who is trying to enlighten us in this direction will be the guru/master.
It was never knowledge vs. wisdom. It is the problem where knowledge is not converting into wisdom. This is where civilizations fail and crumble and revival is necessitated to reach the ideal. So to strive for ideal/equilibrium is always the key to this nature.

Regards to Mother for making me write this and I expect her blessings in the form of further comments which pave way in right direction to my thinking pattern.


ఓం అసతోమా సద్గమయా,
తమసోమా జ్యోతిర్గమయా,
మృత్యోర్మా అమృతంగమయా 
ఓం శాంతి శాంతి శాంతిః

The meaning is
"O Lord Lead me from the unreal to the real.
Lead me from the darkness to light.
Lead me from death to immortality.
May there be peace, peace, and perfect peace".