Tuesday, September 27, 2011

New poetry -13

బరువైన తేలిక కవిత 

మనసుదేముంది మాస్టారూ 
ఎలాగైనా మడిచేయచ్చు
మాట వినకపోతేనే వస్తుంది తంటా అంతా

అవసరానిదేముంది అబ్బాయీ
ఏదో ఒకటి చేసేయచ్చు
నిర్వచనం మారిస్తేనే అయోమయం అంతా 

బ్రతుకుదేముంది బాబ్జి 
ఎలాగైనా బ్రతికేయచ్చు 
ఇలా ఉండాలి అంటేనే కష్టం అంతా 


కవిత్వానికేముంది కాముడూ
ఏదో ఒకటి వ్రాసేయచ్చు 
చదివేవాడి ఆంతర్యం మీదే అర్ధం అంతా 


ఇది వ్రాసిన తరువాత నాకు జంధ్యాల సినిమాలో జోక్ గుర్తుకు వచ్చింది
అదేంటంటే 
" నేను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా
నేను రచయితని కానన్నవాడిని రాయెత్తి కొడతా"

Tuesday, September 6, 2011

New poetry - 12

భౌతికమైన ఈ ప్రపంచంలో
అణగారే ఆర్ధిక వ్యవస్థ 
తయారుచేసిన పరిస్థితులలో
బ్రతుకు బండి లాగడానికి
గాడిలో పడిన గానుగెద్దులా 
ఉదయం నించి సాయంత్రం వరకు 
ఊపిరి సలపని పనిలోంచి
ముంచేసే విరక్తి లోంచి
బయటపడే దారులు వెతికే
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు


ఉన్నవాటితో తృప్తి చెందక
రకరకాల ప్రయత్నాలతో
ఎగురుదామని కొందరు
ఎగరలేనివారు కొందరు
పాప భూయిష్టమైన 
ఈ ప్రపంచాన్ని చూసి 
మార్చేద్దామని కొందరు
మురిసిపోయేవారు కొందరు
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు

ఆవల ఈవల వెతుకులాటలో
అర్ధంకాని ఈ విశ్వాన్నితెరచి 
సిద్ధాంతం చెప్పేవాళ్ళు 
వేదాంతంలో మునిగేవాళ్ళు
వాళ్ళని పట్టుకు ఏడ్చేవాళ్ళు 
వీళ్ళని చూసి నవ్వేవాళ్ళు 
నాలానే మరికొందరు
నాతోనే ఇంకొందరు

నిరామయమైన జగతిలో 
నిరంతర ప్రవాహాలలో
అద్వైత భావనలో
అద్యంతరహితమైన ఆలోచనలలో 
నిత్యానంద ఝరిలో 
నిర్వికల్ప సమాధిలో 
తనువు మరచి వెలుగు పరిచే
నాలానే మరికొందరు 
నాతోనే ఇంకొందరు



Friday, September 2, 2011

ఆలోచనల స్రవంతి - 20

నేను blog ఎందుకు  వ్రాస్తున్నాను 
1 . పనీ పాట లేక
2 . ఏమీ తోచక
3 . నా లోని depression కి ఒక outlet కోసం
4. నేను ఇంత రాయగలను అని feeling కోసం
5. నా స్నేహితులు నన్ను పొగుడుతారని
6. Adsense ఏవో నాలుగు డబ్బులు సంపాదిద్దామని
7. ఈ blog తో జనాల్ని కూడేసి ధనికదేశాల నడ్డి విరుద్దామని
8 . నేనొక బాబా లాగ అవతారం ఎత్తుదామని etc ., etc
ఇందులో అన్నీ నిజం కావొచ్చు. ఏదీ నిజం కాకపోవచ్చు. కొన్ని నిజాలు ఉండొచ్చు. ఎవడికి నచ్చినట్టు, అర్ధమైనట్టు వాళ్ళు తీసుకోవచ్చు. దీనికి అంతం లేదు.

ఇదెందుకు చెప్తున్నాను అంటే దీని ముందు post లో అన్నాహజారే గురించి చెప్తూ నేను ఇది అతని అహాన్ని సంతృప్తి పరుచుకోడానికి అని అన్నాను. rk గాడు దీనికో twist ఇచ్చాడు. ఈ idea వాడిది కూడా కాదు ఇంకెవరో అన్నారో, వ్రాశారో అని, అదేంటంటే "ఇంతకుముందు ఇంకెవరో ఇలాగే corruption కి against గా నిరాహార దీక్ష చేసి చచ్చిపోయాడు -వాడి గురించి అసలు ఎవడూ పట్టించుకోలేదు - ఇప్పుడు ఈ అన్నాహజారే ని ఇంతలాగ elevate చేస్తున్నారంటే వాడి వెనక ఉన్నది ఎవరు? ఏ విదేశీ హస్తం? వాడి ఆంతర్యం ఏమిటి?
అందుకన్నమాట.
నిజంగానే భారత దేశ సమైక్యతని అస్థిరం చెయ్యడానికి ఇది కుట్ర అయ్యి ఉండొచ్చు. అన్నా హజారే ఆ కుట్ర తాలూకు tool అయ్యి ఉండొచ్చు. నిజం గానే అతను తెలిసి చేస్తూ ఉండొచ్చు. తెలియకుండా పావులా వాడబడుతూ ఉండొచ్చు.

ఏది ఏమైనా అతని ఆంతర్యం ఏదైనా చేసే పని తాలూకు result ముఖ్యం. మొత్తానికి Governament ఒప్పుకుంది. అది శుభం. Governament దీని ఆచరణ ఎంత clarity తో చేస్తుందో అందరికీ తెలుసు. కానీ ఇప్పటి ఈ result నా లాటి cynics కి ఒక చెంప పెట్టు. ఇప్పుడు అన్నా హజారే hospital ఖర్చులకి డబ్బులు ఎవడు కడతాడో చూడాలి.

ఇంతకు ముందు posts లో నేను share markets గురించి తరవాత చర్చిద్దామన్నాను. next post లో దాని గురించి నాకు తెలిసింది నాకు వచ్చిన భాషలో.