Thursday, August 25, 2011

ఆలోచనల స్రవంతి -19

ఈ మధ్య ఈ అన్నాహజారే అని చెప్పి జరుగుతున్నా హడావిడి చూసిన తరువాత రెండు రకాల ఆలోచనలు వచ్చాయి.
ఒకటి ఇంత హడావిడి అవసరమా అని, రెండు ఏదీ చెయ్యకపోవడం కంటే ఏదో ఒకటి చెయ్యడం మంచిదే కదా అని.
హడావిడి ఎందుకు అవసరం లేదనిపించిందంటే బాగుపడే ప్రపంచమే అయితే ఇన్ని యుద్ధాలు, ఇన్నికుమ్ములాటలు, ఇంత గోల అవసరం లేదు. ఇప్పటి దాక రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రపంచమంతట లెఖ్ఖ లేనన్ని అంతర్యుద్ధాలు జరిగాయి. మనిషి తాలూకు నైజం లోనే అశాంతి ఉంది. వాడు ప్రపంచం అంత సుఖంగా ఉంటే ఓర్చుకోలేడు . వినాశనం జరుగుతూ ఉండాలి, పునరుద్ధరణ జరుగుతూ ఉండాలి. ఇలా ఎంతవరకు అంటే ప్రకృతి ప్రళయంలో సృష్టి సమూలనాశనం వరకు.
ఇంతకూ ముందు posts లో మనిషి తాలూకు basic needs గురించి నాకు తోచింది వ్రాశాను. అలాగే power గురించి, nature గురించి, rudiments of human nature గురించి కూడా నాకు తోచింది వ్రాసాను. అంతకు మించి వేరే philosophy ఉందని కూడా నాకు అనిపించటం లేదు. 
అన్నాహజారే అని చెప్పి ఇంత శాఖాచంక్రమణం ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక వేళ అన్నాహజారే హడావిడితో కొంత మార్పు వచ్చినా - అది తాత్కాలికమే అని చెప్పడం కోసం.
సరే ఇలాగ వేదాంతం చెప్పడం, ఏదీ చెయ్యకుండా కూర్చోడం మంచిదా??
మనిషి స్వార్ధానికి అంతం లేదు, వాడి ఆలోచన లాగే. నాకు కష్టం కలగనంత వరకు ఎన్నైనా చెప్పొచ్చు. అవి బాగా అనిపించొచ్చు. అందరూ ఆదిశంకరుల range లో ఆలోచిస్తే అసలు గొడవే లేదు. మహాత్మా గాంధీ లాగ కొల్లాయి గుడ్డ, మేక పాలే requirement అయితే ఏ గొడవా లేదు. అలా కానప్పుడు, మనిషి ఆలోచన ఒక పరిధి దాటనప్పుడు, వాడికి కష్టం కలిగినప్పుడు - వాడు అరుస్తాడు, తిరగబడతాడు. కష్టం కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు గుంపు తయారవుతుంది. వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత పెద్ద revolution.
సరే మరి అన్నాహజారే కి ఏమిటి అవసరం?? ఈ గోల, గందరగోళం - ముక్కు మూసుకుని మునిలా ఒక మూల కూర్చోవచ్చు కదా - కొంత చుట్టూ పక్కల మనుషుల కష్టాలకి స్పందించే గుణం, అంత కంటే ఎక్కువగా నాకు అనిపించింది ఇది అతని అహాన్ని సంతృప్తి పరుచుకొనే అవసరం. 
అసలు సృష్టి లోనే differences ఉన్నాయి. చీమ, పాము, గొర్రె, గొడ్డు,పులి, సింహం,ఏనుగు, మనిషి etc.,. రకరకాల అలవాట్లు, రకరకాల పరిస్థితులు, రకరకాల requirements. జంతు న్యాయం నించి refine అయ్యి శాంతి కోసం, సుస్థిరత అవసరార్ధం society స్థాపించిన మనిషి, మళ్ళీ తన స్వార్ధం కోసం అదే society లో అలజడి సృష్టిస్తున్నాడు.
సరే ఈ సోదంతా ఎందుకు - అన్నాహజారే చేస్తున్నది అతనికి అవసరమో కాదో తరువాత, అసలు భారత ప్రజలకి అవసరమా? - అవసరమే 
కానీ ఇంత అలజడి చేస్తే, ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తే మంచిదా? - మంచిది కాదు
సరేనయ్యా బాగుంది, మరి నెమ్మదిగా చెప్తే ఇదే political line లో డబ్బు రుచి మరిగిన అధినేతలు కదులుతారా? - కదలరు 
మరేమి చెయ్యాలి???? చూస్తూ కూర్చోవాలా?? తిరగబడాలా??
అతివాదం, మితవాదం, తీవ్రవాదం అన్నీ ఉన్నాయి - ఇప్పుడు ఏ వాదం తో ఈపరిస్థితిని ఎదుర్కోవాలి ??
లేకపోతె ఈ facebook , twitter ,blogs నింపుతూ కూర్చోవాలా??


దీనికి సమాధానం చాలా simple - జరిగేది జరుగుతూ ఉంటుంది - మనకేమనిపిస్తే అది చెయ్యాలి.
rk గాడు ప్రస్థానం review రాస్తూ చిన్న కవిత ఒకటి రాసాడు
"మన అహం ఎటు నడిపిస్తే అటు
మన కోరిక తీవ్రత ఎటు నడిపిస్తే అటు"


అదన్నమాట సంగతి - సెలవ్