నేను degree 2nd year తరువాత సెలవల్లో ఒక కథ వ్రాశాను. ఇది నేను వ్రాసిన మొదటి చిన్న కథ . ఇప్పటి దాక ఇదెవరితోను పంచుకోలేదు. ఇప్పుడెందుకో చెప్పాలనిపించింది.
అది విశాఖపట్నం. వేసంకాలం వేడెక్కిస్తే అది తట్టుకోవడానికి సాయంకాలం జనాలు బీచ్ ఒడ్డుకి చేరుకున్నారు. ఎవడి గోల వాడిది. కెరటాలతో ఆడే వాళ్ళు కొందరైతే, ఇసుకలో గూళ్ళు కట్టే వాళ్ళు కొందరు. ఐస్ ఫ్రూట్లు , బజ్జీలు మావిడికాయ ముక్కలు అమ్మేవాళ్ళు, balloons అమ్మేవాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతా సందడిగా కోలాహలంగా ఉంది. ఆ గోలలో ఎవరికీ పట్టనట్టు కూర్చున్న ఆ 50 ఏళ్ళ ముసలతని పేరు విశ్వేశ్వరరావు. AVN కాలేజీ లో ప్రొఫెసర్. ఏదో పోగొట్టుకున్న వాడిలా ముఖం. ఏమి ఆలోచిస్తున్నాడో కాని చాల సేపటి నించి కూర్చున్న position నించి కదలటం లేదు. మెల్లిగా జనాలు పల్చబడటం మొదలెట్టారు. రాత్రి పదయ్యే వరకు అక్కడే అలాగే కూర్చుని ఉన్నాడు. అప్పుడు నెమ్మదిగా లేచి ఇంటి ముఖం పట్టాడు.
విశ్వేశ్వరరావు కి పెళ్లి కాలేదు. ఎందుకో అతను పెళ్లి చేసుకోలేదు. చిన్నతనం నించి అతని ధోరణి అతనిదే. తల్లితండ్రులు చెప్పేది వినేవాడు కాదు. వాళ్ళు ఏదైనా చెప్తే అది ఎందుకు, ఇది ఎలాగా అని ప్రశ్నించేవాడు. వాళ్ళు విసుగెత్తి వీడికి వితండ వాదన ఎక్కువ అనేవారు. అయినా అతను తన పద్ధతి మార్చుకోలేదు. అలాగే జీవితంలో ఎన్నో వసంతాలు. అతను జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అతను చదవని పుస్తకం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. ఇతని నలభయ్యో పడిలో తల్లీ, తండ్రీ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు కాలం చేసారు. ఆ తరువాత అతను ఇంటిని పూర్తి స్థాయి ప్రయోగశాల లాగ మార్చేశాడు. చేసిన ప్రయోగాలనీ, వాటి results నీ అన్నీ notes వ్రాసేవాడు. ఇలాగ మరో పది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అతనికి ఏభై ఏళ్ళు.
బీచ్ నించి బయలుదేరిన అతను తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. తన diary లో last page open చేసి చూశాడు. అందులో ఉన్నది మరొక్కసారి చదువుకున్నాడు. తరువాత poison bottle తీసి మూత open చేసాడు. అది table మీద పెట్టి, diary మీద pen పెట్టి పట్టుకుని, ఆ poison bottle ఒక్క గుటకలో తాగేసాడు. విషం తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అప్పుడు diary లో ఏదో వ్రాద్దామని కొంత వ్రాసి ఆఖరి శ్వాస వదిలేసాడు. అతను ఆఖరి సారిగా diary లో వ్రాసినది -"నేను దేముణ్ణి చూ.........."- ఆ వాక్యం ముగియకుండానే అతని జీవితం ముగిసింది.
ఇంతకీ విషం తాగే ముందు అతను తన diary లో చదువుకున్న తన ఆఖరి పేజి.
" ఇన్ని చదివిన తరువాత , చూసిన తరువాత - ఎంత వెతికినా నాకు దేముడు కనిపించలేదు. ఆ దేముడిని చూడాలని, చూసింది పదిమందితో పంచుకోవాలని ఈ ప్రయోగం చేస్తున్నాను. నిజంగా చనిపోయే ముందు దేముడు కనపడితే నేను వ్రాసిన note చూసి దేముడిని నమ్మండి. లేదా నమ్మఖ్ఖరలేదు. నాకు ఈ జీవితంలో ఇంకా కావలిసింది ఏమి లేదు. నా చావుకి నేనే భాద్యుడిని."
ఇంతకీ విశ్వేశ్వరరావు దేముడిని చూశాడా, చూడలేదా అతనికే తెలుసు. చూ....తరువాత అతను ఏమి వ్రాయాలనుకున్నాడో కూడా అతనికే తెలుసు. దేముడు ఉన్నాడో లేడో ప్రపంచానికి ఇప్పటికీ, ఎప్పటికీ అది ఒక ప్రహేళికే.
నేను ఈ కథని ఆంధ్రభూమి కి single పేజి కధలకి పంపిద్దామనుకుని ఎందుకో పంపించలేదు.