musafir of india
relentless thinker
Sunday, February 20, 2022
Tuesday, July 23, 2019
New Poetry - 30
అవస్థ
మాటలలో
చెప్పాలని నే చేసే మథనంలో
ప్రవహించే
తలపుల రసాల ఝరిలో కవినై
వినిపించే
నాదపు తీవల అలలో పవినై
ఛేదించే
వెలుగుల వలలో తేలియాడుతూ
ఆద్యంతమైన
గాంధర్వంలో, అణువుల
అల్లరి లోపల
దారులలో చంక్రమణం చేస్తూ
ఆ సచ్చిదానంద అనుసంధానంలో
కలిసి
ఓలలాడుతూ ఇలలో కలలా
మైమరపించే
నిశ్శబ్ధంలో ఘనీభవించిన
కాలంతో
కలిసిన ప్రజ్వల
నిర్వికార తన్మయత్వం
ఆవరించిన
ఆవర్తాల కలయాడుతూ
ఆ నిర్మల సురగంగా
పానం వదిలి
తలుపులు తెరిచి
వెలికివచ్చి ప్రకటితమయ్యే
రంగులలో, రాగంలో , వాసనలో, స్పర్శలో
వెతుకులాడి
వేసారే నా ఆహాన్ని బుజ్జగిస్తూ
పరిగెడుతూ నే
చేసే యుధ్ధంలో, ఇహంలో
గెలవాలని, తరగని జ్ఞ్యాపకమై
మిగలాలని
కోరికతో
ఖేదిస్తూ,
బేధించే వేదనలో బాధలో
రోదిస్తూ, చెరగని మరకల తరగల
తీరం
దాటాలని ఆరాటంతో
పోరాటం చేస్తూ
ఎదురొచ్చే
అన్నిటిలోనూ ఆ అద్భుతాన్ని
కనుగొనాలని పరిక్లమిస్తూ
పరిప్లవిస్తూ
ఒక సమతుల్యత
సాధించాలని సంకల్పిస్తూ
మాటలలో
చెప్పాలని నే చేసే మథనంలో
ప్రవహించే
తలపుల రసాల ఝరిలో కవినై
Wednesday, January 3, 2018
New Poetry - 29
New Year Poetry on 31-12-2017
అంటే అన్నీ ఒక రోజే వ్రాశానని కాదు .. రెండు మూడు రోజుల తేడాతో వదిలినవి ... maximum whatsapp కవిత్వాలే
ఇది హేవిళంబి ఆఖరి
తిధి కాదుర బాబ్జి ఛైత్రమిది కానేకా
దిది, ఆంగ్లేయులు వాడే
దిది క్రీస్తుశకము నిజముతెలిసికొనవయ్యా
ఇది హేవిళంబి ఆఖరి
తిధి కాదుర బాబ్జి ఛైత్రమిది కానేకా
దిది, ఆంగ్లేయులు వాడే
దిది క్రీస్తుశకము నిజముతెలిసికొనవయ్యా
ఎన్ని రకముల మలిన పరిచిన తిరిగి
ఎగయును మన సుధర్మము మన సుధర్మ
పుణ్యభూమిది పరిఢవిల్లును తెలిసికొ
నుముర తమ్ముడా హుంకరించుము సరిపడ
ఎగయును మన సుధర్మము మన సుధర్మ
పుణ్యభూమిది పరిఢవిల్లును తెలిసికొ
నుముర తమ్ముడా హుంకరించుము సరిపడ
హేవిళంబిని సాగనంపగలేదు పూర్తిగ, ఇంతలో
ఆ విళంబిని గూర్చి చింతలు ఏమిటో ఇది వింతగా
ఏ విలంబము లేక కాలము ఏగునే సడి లేకనే
స్వావలంబన నేర్వరాచిర శాంతికోరి మునీశ్వరా
ఆ విళంబిని గూర్చి చింతలు ఏమిటో ఇది వింతగా
ఏ విలంబము లేక కాలము ఏగునే సడి లేకనే
స్వావలంబన నేర్వరాచిర శాంతికోరి మునీశ్వరా
చల్లగ హేవిళంబి తన కాలమునంతను వెళ్లదీయుచూ
మెల్లగ ఆ విళంబి సమకెట్టి విలంబముచేయకుండనే
అల్లటలన్ని చెల్లనుచు కమ్మని మాటల తేల్చినంతనే
పల్లట సంక్రమించ వెనువచ్చెడి ఛైత్రము స్వాగతించెనే
మెల్లగ ఆ విళంబి సమకెట్టి విలంబముచేయకుండనే
అల్లటలన్ని చెల్లనుచు కమ్మని మాటల తేల్చినంతనే
పల్లట సంక్రమించ వెనువచ్చెడి ఛైత్రము స్వాగతించెనే
ఉత్పలమాల వ్రాయుటకు ఊహల మాలలు కట్టినంతనే
సత్పథ సారమై మురిసె సాధన శోధన లేకనే సదా
ఉత్పతితాన్వితాకలిత మున్నతమై రససారధారలై
సత్పవమాన రాజితము సామజమై నను బ్రోచినంతనే
సత్పథ సారమై మురిసె సాధన శోధన లేకనే సదా
ఉత్పతితాన్వితాకలిత మున్నతమై రససారధారలై
సత్పవమాన రాజితము సామజమై నను బ్రోచినంతనే
(ఇది mrv నేను వ్రాసిన ఉత్పలమాల తప్పు అన్నాడని ఆవేశంలో)
మీరే భోజులు రాజులు
మీరే మా ధైర్యమనుచు మీరే మనసున్
కోరేమా ఉత్సాహం
తీరే ప్రోత్సాహమీడునీ వ్యాఖ్యేగా (ఇది చెలరా whatsapp లో నన్ను పొగిడాడని)
మీరే మా ధైర్యమనుచు మీరే మనసున్
కోరేమా ఉత్సాహం
తీరే ప్రోత్సాహమీడునీ వ్యాఖ్యేగా (ఇది చెలరా whatsapp లో నన్ను పొగిడాడని)
నే వ్రాసే ప్రతి మాటా
పేరాలన్నీ కవిత్వమేరా వినగా
నే రమ్యమైన భావము
పేరాలన్నీ కవిత్వమేరా వినగా
నే రమ్యమైన భావము
ఆరాధన కలుగును వినరారా రామా(ఇది ఆశువు)
చెలరాగారూ, కోపం
వలదండీ, మీకు తొందరవలదు, ఏదో
సెలవివ్వాలని చెలగుచు
వలదండీ, మీకు తొందరవలదు, ఏదో
సెలవివ్వాలని చెలగుచు
ఇలాగ మమ్మల్ని చంపి చింపద్దయ్యా
జోగీ జోగీ రాసుకు
సాగీత కవిత్వములను కాల్చుచు ఛందం
లోగుచ్చుచు చెండాడే
రా గోమయ భస్మమందు గంభీరంగా (mrv)
సాగీత కవిత్వములను కాల్చుచు ఛందం
లోగుచ్చుచు చెండాడే
రా గోమయ భస్మమందు గంభీరంగా (mrv)
అక్షరములు స్వరమై తమ
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
ఆ క్షణముల ఆనంద ని
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
ఆ క్షణముల ఆనంద ని
రీక్షణమున విరియు భావమే కావ్యమయే
తొడలుండాలంతేరా
ఛడామడా పగులగొట్టు బాలై బాబూ
తొడ నీదా నాదా చూ
ఛడామడా పగులగొట్టు బాలై బాబూ
తొడ నీదా నాదా చూ
డడు, పగిలించగలడు గురుడవి ఎపుడైనా (బాక్రి గురించి)
ఆకసమే రీతి చినికి
నా, కలతనులేకయే సునాయాసంగా
వాకను గాసిలు వసుదే
వుడ్కడచిన వేళ, కృష్ణసుధ చర్చికలై
నా, కలతనులేకయే సునాయాసంగా
వాకను గాసిలు వసుదే
వుడ్కడచిన వేళ, కృష్ణసుధ చర్చికలై
(మావగారు whatsapp లో post చేసిన దత్తపదికి నా పూరణం - మేరీ, యేసు,సిలువ, చర్చి తో కృష్ణుని స్తుతి వ్రాయమంటే- వాసుదేవుడు యమునా దాటడం)
ఎన్ని రాత్రిందినాలెన్ని హృదయ బేధ
కాలెన్ని ఆలోచనలు ఇలాగ,
ఏరకంగా ఇది నీ చేతులందున్న
దో తెలియదు, ఇది ఇంతయేర
తెలిసినా దీనిలో నించి తప్పించుకు
నే అవకాశము లేదు లేర
వదలలేవు, వదిలి ఎక్కడ ఉండాలి
ఎరుగవు ఇక ఇదే వాస్తవముర
కాలెన్ని ఆలోచనలు ఇలాగ,
ఏరకంగా ఇది నీ చేతులందున్న
దో తెలియదు, ఇది ఇంతయేర
తెలిసినా దీనిలో నించి తప్పించుకు
నే అవకాశము లేదు లేర
వదలలేవు, వదిలి ఎక్కడ ఉండాలి
ఎరుగవు ఇక ఇదే వాస్తవముర
సంధిలో మన సందుశివార్లో
మందులో మతి మండిపడేనూ
ఎందుకో ఇక ఎందుకనోఈ
చిందులే మరి చింతలయేనూ
మందులో మతి మండిపడేనూ
ఎందుకో ఇక ఎందుకనోఈ
చిందులే మరి చింతలయేనూ
(ఈ ఏడుపుగొట్టు కవిత్వం ఎవరికి పంపించానో కూడా గుర్తులేదు)
అవనీతలము పులకించి ఆనందముప్పిరిగొనగ
రవణీరవమెడతలచి పరగున పవముజత కూడి
అవిరళ ధూళిమేఘముల అలలతొ కడుపుల కింత
ల, వెలయించు తెరువీ పులకల నుతియించి అలోలమలరె
రవణీరవమెడతలచి పరగున పవముజత కూడి
అవిరళ ధూళిమేఘముల అలలతొ కడుపుల కింత
ల, వెలయించు తెరువీ పులకల నుతియించి అలోలమలరె
(whatsapp లో post చేసిన దత్తపదికి నా పూరణం - తల , మెడ ,కడుపు , వీపు తో కృష్ణుని స్తుతి వ్రాయమంటే- కృష్ణుని విశ్వరూపము చూసిన క్షణం)
ఈ మధ్యలో శంకరాభరణం blog లో ఉన్న సమస్యాపూరణాలు కొన్నిఈ మూడు రోజుల flow లోనే
మందు త్రాగి పొందె మరణ మతఁడు
అప్పులెక్కువయ్యె వ్యవసాయముంజేయ
బయటపడగ దారి కానలేక
పంట గూర్చి బెంగ అధికమై దిగులుతో
మందు త్రాగి పొందె మరణ మతఁడు
బయటపడగ దారి కానలేక
పంట గూర్చి బెంగ అధికమై దిగులుతో
మందు త్రాగి పొందె మరణ మతఁడు
కాపురముం గూల్చినట్టి ఘనునకు జేజే
గోపురమున
ఆ లంకిణి
మాపి, వనము జొచ్చి, సీత మానసమందున
ఆ పల్లట తరలగ, లం
కాపురముం గూల్చినట్టి -ఘనునకు జేజే
మాపి, వనము జొచ్చి, సీత మానసమందున
ఆ పల్లట తరలగ, లం
కాపురముం గూల్చినట్టి -ఘనునకు జేజే
రాముండిటు రమ్మటంచు రాధను
పిలిచెన్
రాముని
పక్కింట్లోనన్
రామం మాష్టారి పిల్ల రాధకి, చెల్లెలు
రమ్య జడగంటలిమ్మన
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
రామం మాష్టారి పిల్ల రాధకి, చెల్లెలు
రమ్య జడగంటలిమ్మన
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి
బిడ్డలందరు చదువి వెలుగగా ఒక
తండ్రి, ఆకతాయిగ
తిరుగాడు
చిన్నకొడుకుని గని చింతతో ఇట్లనె
కోకిలమ్మకు
పుట్టెను కాకి యొకటి
కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు
బాలకృష్ణ
సినేమాల బ్రాండునిదియె
ఎంత మంది విలన్లు ఏ రీతి వచ్చి
నా, భయము పడకుండ తొడగొడుతు తన
కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు
ఎంత మంది విలన్లు ఏ రీతి వచ్చి
నా, భయము పడకుండ తొడగొడుతు తన
కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు
ఇంకోరకంగా
బాలకృష్ణ
సినేమాలు ఋతమనుకొను
బాలుడొకడు, తెలివి వెర్రి తలలు వేయ
నమ్మెను తన మనసుతీర బాక్రి వలెను
కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు
బాలుడొకడు, తెలివి వెర్రి తలలు వేయ
నమ్మెను తన మనసుతీర బాక్రి వలెను
కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు
తేటగీతి (పంచ పాది) – షట్పది
బాలకృష్ణ
సినేమాలు ఋతమనుకొను
బాలుడొకడు,
తెలివి
వెర్రి తలలు వేయ
నమ్మెను
తన మనసుతీర బాక్రి వలెను
తొడలు
కొడుతు శత్రువులను ఎల్లరు తన
కంటి
చూపుతో జంపెడి ఘనులు గలరు
శవము లేచి వచ్చె సంతసమున
యండమూరి
కధలనందు
మాంత్రికులెల్ల
చేతబడులు సలిపి చెరచువారు
ఆ కథలు చదవగ, మాగన్న తూగగా
శవము లేచి వచ్చె సంతసమున
చేతబడులు సలిపి చెరచువారు
ఆ కథలు చదవగ, మాగన్న తూగగా
శవము లేచి వచ్చె సంతసమున
టంట టంట టంట టంట టంట
కోవెలన, గుడికి
పరుగిడు
బండెద్దుల
మెడన అప్పుడే వదిలిన పాఠ
శాల గంటలన్ని ఒకసారె మ్రోగంగ
టంట టంట టంట టంట టంట
మెడన అప్పుడే వదిలిన పాఠ
శాల గంటలన్ని ఒకసారె మ్రోగంగ
టంట టంట టంట టంట టంట
హంతకుఁడు దేవుఁడై పూజలందుకొనెను
రాజకీయ
హత్యలనే నడతగ
మార్చి
మంత్రి పదవిరాగా, తన గతము మరిచి
అసలు నిజము మరుగుజేసి మాయజేసి
హంతకుడు దేవుడై పూజ లందుకొనెను
మంత్రి పదవిరాగా, తన గతము మరిచి
అసలు నిజము మరుగుజేసి మాయజేసి
హంతకుడు దేవుడై పూజ లందుకొనెను
ఇంకోరకంగా
హత్యలను
చేసి అదియే నడతగ
మార్చి
మంత్రి పదవిరాగా, తన గతము మరిచి
అసలు నిజము మరుగుజేసి మాయజేసి
హంతకుడు దేవుడై పూజ లందుకొనెను
మంత్రి పదవిరాగా, తన గతము మరిచి
అసలు నిజము మరుగుజేసి మాయజేసి
హంతకుడు దేవుడై పూజ లందుకొనెను
కారమును త్యజించి ఘనత గనుము
నేను నాది
అనుట వదిలి, జీవనమున
సాగుకొలది, శాంతి సౌఖ్య శుభము
లను పడయుదురు కనుకనె నీవు నీ అహం
కారమును త్యజించి ఘనత గనుము.
సాగుకొలది, శాంతి సౌఖ్య శుభము
లను పడయుదురు కనుకనె నీవు నీ అహం
కారమును త్యజించి ఘనత గనుము.
పుస్తకం బదేల హస్తమందు
ఎచట
చూడు నీకు తెలియు, అంతర్జాల
మున చదువు పరికరములను కందు
వింక దేని కొరకు నీకు ఈ కాగిత
పుస్తకం బదేల హస్తమందు?
మున చదువు పరికరములను కందు
వింక దేని కొరకు నీకు ఈ కాగిత
పుస్తకం బదేల హస్తమందు?
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె
గరుడు
అనగ నేమి నా కొత్త
బండది
శివుడనగ నెవరుర నేను గాక
అమ్మ నన్ను తెమ్మన తినుబండారము
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె
శివుడనగ నెవరుర నేను గాక
అమ్మ నన్ను తెమ్మన తినుబండారము
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె
శునకమ్మైనట్టి హరియె శుభముల
నొసఁగున్
దునుమాడగ
అమ్మహిషిని
అనురాగము తోడ హరుడు అయ్యను చూడన్
తను మోహినియై శబరీ
శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్
అనురాగము తోడ హరుడు అయ్యను చూడన్
తను మోహినియై శబరీ
శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్
బస్సు నీటఁ దేలె పడవ వోలె
సరిగ
నడప లేని లైసెన్సులేనట్టి
వాహనములయొక్క డ్రైవరులను
చూసి చూడకుండ జూకించునప్పుడు
బస్సు నీటఁ దేలె పడవ వోలె
వాహనములయొక్క డ్రైవరులను
చూసి చూడకుండ జూకించునప్పుడు
బస్సు నీటఁ దేలె పడవ వోలె
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ
డంబిక సంతసిల్లఁగన్
భూతలమందు
ఎవ్వరు విభూతి
కలంగియునెత్త జాలరే
ఆతని చాపమున్ విరగనా శివుడే తెగ సంతసిల్లుచూ
గాదిలితోడ మోదమున వచ్చెను పెండ్లికి, రాముడా రహిన్
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్
ఆతని చాపమున్ విరగనా శివుడే తెగ సంతసిల్లుచూ
గాదిలితోడ మోదమున వచ్చెను పెండ్లికి, రాముడా రహిన్
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్
మేడపైనుండి పడినను మేలు కలిగె
ఇంటి
కెదురుగనున్న మాస్టారి
ఇంటి
పైన ఉన్నట్టి శ్రీలక్ష్మి బైట పడగ
ఆమె మనసు గ్రహించగా సౌఖ్యమయ్యె
మేడపైనుండి పడినను మేలు కలిగె
పైన ఉన్నట్టి శ్రీలక్ష్మి బైట పడగ
ఆమె మనసు గ్రహించగా సౌఖ్యమయ్యె
మేడపైనుండి పడినను మేలు కలిగె
సుకవు లెంద రున్నను మేలు కుకవి
యొకఁడు
సుకవులు
తమ కవితల సంతుష్టి
చేయ
ఎటుల ఉండతగదు అది మనకి చెప్పి
కుకవి కవిత మనకు జ్ఞానము కలిగించు
సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు
ఎటుల ఉండతగదు అది మనకి చెప్పి
కుకవి కవిత మనకు జ్ఞానము కలిగించు
సుకవు లెంద రున్నను మేలు కుకవి యొకఁడు
నిన్ను నిన్ను నిన్ను నిన్ను
నిన్ను
కన్ను
మిన్ను గానకయె
బండి నడుపుచు
క్రింద పడిన వేళ నింద వేసి
ఎదుట బండి వాడిని తెగడగా వచ్చు
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
క్రింద పడిన వేళ నింద వేసి
ఎదుట బండి వాడిని తెగడగా వచ్చు
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
సారా త్రాగుమని చెప్పి సద్గురు
వయ్యెన్
ఆరా తీయగ
స్వామిని
వీరావేశము వలదుర బిడ్డా, శ్రీ హరి
ఆరాధనామృతము మన
సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్
వీరావేశము వలదుర బిడ్డా, శ్రీ హరి
ఆరాధనామృతము మన
సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్
వాడిన పువ్వులే తగును
వారిజనేత్రుని నిత్యపూజకున్
వేడుక
తోడ పువ్వులను హేమము
కూర్చి తయారు చేయగా
వీడని భక్తితో మనము ఈశ్వరసాధనలోన అర్చనన్
వాడిన పైడి పుష్పములు మార్జన చేయుచు ప్రోవి చేసి ఆ
వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్
వీడని భక్తితో మనము ఈశ్వరసాధనలోన అర్చనన్
వాడిన పైడి పుష్పములు మార్జన చేయుచు ప్రోవి చేసి ఆ
వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్
రతము ముగియకుండ రమణి లేచె
సుముఖయై
సుదతి రసమయ
వేళలలోన
పతిని చేరి సుఖము పడయ తలువ
బిడ్డ ఏడుపు విని బెంగడిల్లుచు తల్లి
పతిని చేరి సుఖము పడయ తలువ
బిడ్డ ఏడుపు విని బెంగడిల్లుచు తల్లి
రతము
ముగియకుండ రమణి
లేచె
(మరీ rough గా పూరించడమంటే ఇదే)
ఇలా వ్రాసిన తర్వాత నాకు కొంచెం విముఖత కలిగింది, తెలిసిన తెలుగుతో ఏ మంచి పుస్తకాలు చదవకుండా ఇలా అడ్డదిడ్డంగా వ్రాసే బదులు కొంచెం మంచి పుస్తకాలు చదివి మెళకువలు నేర్చుకొని రసమయ కవిత్వం వ్రాయాలన్న నా late వయసు కోరిక
ద్విగుణిత ఉత్సాహంలో
తెగ కవితలు వ్రాసి నేను వెలిగించంగా
వగచూపగ తెల్లారెను
తెగ కవితలు వ్రాసి నేను వెలిగించంగా
వగచూపగ తెల్లారెను
పొగచూరెను నేర్చుకొనుట పొడగాంచంగా
సశేషం
Subscribe to:
Posts (Atom)